14, ఆగస్టు 2007, మంగళవారం

కొత్త పదాలు

ఇప్పటినుండి ప్రతినెల ఈ బ్లాగులో ఇంగ్లీషులోని రెండు పదాలు తెలుగు పదాలతో రాయబడతాయి. ఆ తర్వాత ఆ తెలుగు పదమే వాడబడుతుంది. అలవాటు చేసుకోండి తెలుగు పదాలు. ఇది చాలా సులువు. ఈ బ్లాగులో కుడిచేతి వైపు ఈ నెల పదాలు పేరిట వాటిని పొందుపరిచాం చూడండి.

3 కామెంట్‌లు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీధర్ గారూ ! ఆంత్రాలు అనే పదం వాడ్డం పట్ల నా అభ్యంతరాల్ని ఇదివరకే తెలుగుపదం గుంపులో తెలియజేశాను. బహుశా మీరు చూసి ఉండరు. అర్థం తెలుసుకోకుండా ఫలానా పదం నచ్చిందని ఎడాపెడా వాడెయ్యడం సరికాదు. ఇంగ్లీషులో పదాలు కూడా ఇంత అరాచకంగా పుట్టినవి కావని గమనించండి. ఆంత్రాలంటే పేగులు. అది ఏ విధంగానూ ware కి సంబంధించినది కాదు.అసభ్యంగా కూడా ఉంది.

కాని మీకు ఆ పదం అంతగా నచ్చి వాడ్డం మానలేని పక్షంలో ఒక పని చెయ్యండి. మృదులాంత్రాలు అనడం మానేసి "మృదులాంతరాలు" అనండి. కొంత అర్థవంతంగా ఉంటుంది. మృదువైన వస్తువులు/విషయం లోపల ఉన్నవి అనే అర్థమైనా వస్తుంది.

జ్యోతి చెప్పారు...

మృదుః + యంత్రం = మృదులాంత్రం

తాడేపల్లిగారు తెలుగుపదం గుంపులో జరిగిన చర్చ ఆధారంగా చూస్తే ఇసి సరియైన పదమని ఆలోచించి వాడడం జరిగింది.

http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/2b28e25f74722ba1

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

ఎప్పుడైనా యంత్రం ఆంత్రం అవుతుందా ? ఏ భాష వ్యాకరణం ప్రకారం ? ఎవరు నిర్ణయించారు ? ఎవరికి వారనుకుంటే సరిపోయిందా ?