31, జనవరి 2008, గురువారం

కొత్తపాళీ …. నవంబర్ 2007


http://kottapali.blogspot.com

ముచ్చటగా మూడు వసంతాలు కూడ నిండని తెలుగు బ్లాగ్మయంలో ఒక యేడాదిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలాంటి టపాలతో చదువరులను అలరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. సరిగ్గా అలాంటి అరుదైన విలక్షణత్వాన్ని సొంతం చేసుకున్నదే కొత్తపాళీ గారి బ్లాగు కొత్తపాళీగారి అసలు పేరు నారాయణస్వామి. కొత్తపాళిగారు ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ రాష్టంలో ఉంటున్నారు. కొత్తపాళిగారు నిర్వహిస్తున్న నాలుగు బ్లాగులలో ఇక్కడ మనం సమీక్షిస్తున్న "కొత్తపాళి" ఒకటి మాత్రమే. మిగతా బ్లాగులు విన్నవీ కన్నవీ , Classical Telugu Poetry in Translation, Classical Telugu Poetry . కొత్తపాళి బ్లాగు గత ఏడాది అక్టోబర్ నెలలో మొదలైంది. రచయిత తన బ్లాగులో తాను చెదురుమదురుగా వ్రాస్తున్న టపాలని, విషయాన్ని బట్టి గుర్తుంచుకోవడానికి వీలుగా 12 వర్గాలుగా విభజించారు. అవి. 1.మాటలు, 2.వ్యక్తులు, 3.కవిత్వం, 4.సంగీతం, 5.నీతి, 6.(అ)సాధారణ వ్యక్తులు, 7.జ్ఞాపకాలు, 8.నా గొంతు, 9.పుస్తకాలు, 10.ప్రకృతి, 11.భక్తి, 12.సంస్కృతం. ఈ అన్ని వర్గాల క్రింద పలు రచనలున్నాయి.

కొత్తపాళిగారి రచనలకు ప్రేరణ : "నేనూ నా కుటుంబం అనే స్వార్ధపరిధిని దాటి ఒక్క అడుగన్నా బయటికి వెయ్యాలి. ఊరికే మట్టిబొమ్మలా పెట్టినచోటే కూర్చుంటే ఎవరికి ప్రయోజనం .. ’కలుగ నేటికి? తల్లుల కడుపు చేటు’.. మీకిష్టమైన మీకు తృప్తి నిచ్చే పని కాబట్టి చెయ్యాల్సిన వ్యక్తి మీరే.. ఎందుకంటే ఇంకెవ్వరూ చెయ్యరు కాబట్టి, చెయ్యాల్సిన సమయం ఇప్పుడే" అంటారు రచయిత ’మనిషై పుట్టినందుకు’ అనే టపాలొ.

ఆయన ఇప్పటివరకు చేసిన టపాలన్నీ ఈ ప్రవచిత ఆశయానికి అనుగుణంగానే ఉండడం గమనార్హం. పైకి మాటామంతీలా కనపడే టపాల్లో సైతం ఏదో అంతర్లీన సందేశం మనల్ని అలవోకగా స్పృశిస్తుంది. " కదిలేది కదిలించేదీ పెను నిద్దుర వదిలించేది " అని కవిత్వం గురించి శ్రీశ్రీ చెప్పినది గుర్తొస్తుంది కొత్తపాళిగారి బ్లాగు చదివినప్పుడు. విభిన్న లక్ష్యాలకు అంకితమైన మహామనీషుల గురించి టూకీగా ఆయన రాసిన స్కెచ్‍లు తెలుగు బ్లాగు లోకంలో ఒక కొత్త ఒరవడిని దిద్దాయి. ఆ విధంగా ఆయన రచన అనే సంఘసేవకురాలి గురించి, కుర్ట్ వానగట్ అనే రచయిత గురించి, మేడసాని మోహన్‍గారి కృషి గురించి, నవోదయ పబ్లిషర్స్ అధినేత శ్రీ అట్లూరి రామమోహనరావుగారి గురించి, అమెరికాలో తెలుగు భాషాభోధనకై కృషి చేస్తున్న శ్రీ వేమూరి వేంకటేశ్వరరావుగారి గురించి విపులంగా నెజ్జనులకు తెలియజేసారు.

తెలుగు భాషాభిమానం : ఈ విషయంలో నివాసాంధ్రులు ప్రవాసాంధ్రుల నుంచి నేర్చుకోదగినది ఎంతైనా ఉంది. కొత్తపాళిగారి ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నప్పటికీ ఆయనలో తెలుగు భాషాభిమానమూ, మాతృదేశాభిమానమూ ఇనుమడించాయే గాని మసకబారలేదు. "సీసపద్యం అంటే ఏంటి? అని అడిగేవాళ్ళు లక్షణ పద్యాన్ని వందసార్లు ఇంపోజిషన్ రాయాల్సి ఉంటుంది." అంటారు చలోక్తిగా "మీకిష్టమైన సీసపద్యం" అనే టపాలో!

సామాన్యత్వంలో అసామాన్యత్వం : "రొటీన్ అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది" అనే భావం స్పురిస్తుంది.. నా మట్టుకు నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు రచయితల్ని, కళాకారుల్ని చూసి అసూయపడతారు.. వాళ్లకు రొటీను లేదని. అది పొరబాటు.. పేరుపొందిన ఏ కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యడం కనిపిస్తుంది. " అంటారు కొత్తపాళి ఒక చోట. తెలుగు బ్లాగింగులో నూతన ప్రమాణాల్ని నెలకొల్పి అనతికాలంలోనే అనల్పమైన ప్రాచుర్యాన్ని ఆర్జించుకున్న కొత్తపాళి బ్లాగు అవశ్యం, పఠనీయం, పాఠనీయం..

సమీక్ష : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

27, జనవరి 2008, ఆదివారం

కంప్యూటర్ ఎరా రెండవ పాఠకుల సమావేశ నివేదిక

"కంప్యూటర్ ఎరా" రెండవ సమావేశ నివేదిక
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటలు.

హాజరైన సభ్యులు:

1. జి.పి. జాకబ్
2. ఎన్. కృష్ణ కిషోర్
3. మున్నా కాల్పనిక్
4. డి. శశి భూషణ్
5. సి.హెచ్. శివరామ ప్రసాద్ (విజయవాడ)
6. జి. చైతన్య
7. సి.హెచ్. సత్యనారాయణ
8. కె. నాగభూషణం (వరంగల్)
9. పి. శ్రీనివాస్
10. పి. శ్రీకర్
11. నల్లమోతు శ్రీధర్
శ్రీనివాస్ (పర్చూరు), నవీన్ రెడ్డి చివరి నిముషంలో అర్జెంటు పని పడడం వల్ల రాలేకపోయారు. టి. రామచంద్రరావు గారు (కర్నూలు) ప్రయాణ సదుపాయం కారణంగా హాజరుకాలేకపోయారు. రవీంద్ర కాట్రగడ్డ, వినయ్ గార్లు కూడా అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. మౌర్య, అభిరామ్, మురళి తదితరులు దూరప్రాంతాల నుండి రావడం వీలుపడక హాజరు కాలేకపోయారు. జాకబ్ గారి మిత్రులు ఒకరు మీటింగ్ తుదిదశలో కలవగలిగారు.

అందరి పరిచయాలూ అయ్యాక పలు పలు అంశాలపై చర్చ జరిగింది. చాలా మంచి ఆలోచనలు వచ్చాయి. పాత ఫోరంలోని ముఖ్యమైన పోస్ట్ లను కొత్త ఫోరంకి తీసుకువచ్చి మార్చి నెలాఖరు నాటికి పాత ఫోరంని పూర్తిగా క్లోజ్ చేయాలన్నది ఆలోచన. దానికి గాను కొంతమంది ఉత్సాహవంతులు పాత ఫోరంలోని పోస్టులను కొత్త ఫోరంలోకి బదిలీ చేసే ప్రక్రియను బాధ్యతగా స్వీకరించాలన్న ప్రతిపాదనకు చైతన్య గారు, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రసాద్ గారు, శ్రీనివాస్ కర, జ్యోతి గారు, జాకబ్, మౌర్య, వర్మ దాట్ల, నల్లమోతు శ్రీధర్ వంటి వారు ఇదే పనిలో కొంత ప్రోగ్రెస్ సాధించారు. చైతన్య, నాగభూషణం గార్లు కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల త్వరగా కంటెంట్ ని ట్రాన్స్ ఫర్ చేయగలుగుతాం.

ఇకపోతే కొత్త ఫోరమ్ ని ఇప్పుడే మొదలుపెట్టాం కాబట్టి దానిలో స్పామ్ పోస్టులు, ఇల్లీగల్ కంటెంట్ లేకుండా ఇప్పటినుండే జాగ్రత్తగా నిర్వహించుకోవడం ఎలా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైతే అనధికారిక పోస్టులు చేస్తారో ఆ పోస్ట్ చేసిన వారికి PM, Email చేసి ఎడ్యుకేట్ చేయడంతోపాటు, పోస్ట్ లోని సమాచారాన్ని తీసేసి.. ఆ సమాచారం ఎందుకు తీసివేయబడిందో కారణం తెలిపితే బాగుంటుంది అనే సూచనలు వచ్చాయి. దయచేసి ఇకపై మోడరేటర్లందరూ ఈ విధంగా చేయగలరు.

మనం చేస్తున్న కార్యకలాపాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉపయోగపడేలా చేయడంతోపాటు వారినీ భాగస్వాములను చేయడం ఎలా అనే విషయమై స్కూల్, కాలేజీ యాజమాన్యాల సహకారంతో రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో సెమినార్లు నిర్వహిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన ప్రసాద్ గారు చేశారు. దీనికి వెంటనే ప్రతిస్పందనగా చైతన్య సత్తుపల్లి (ఖమ్మం జిల్లా)లో తమ కాలేజీల్లో వీలైనంత త్వరలో సెమినార్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇతర పాఠకులు కూడా తమకు అవకాశం ఉంటే, మీకు పరిచయం ఉన్న స్కూల్, కాలేజీల యాజమాన్వాలతో మాట్లాడి ఐ.టి ట్రెండ్స్, ఐ.టి. రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎలా, ఐ.టి. రంగంలోకి ప్రవేశించేవారి మైండ్ సెట్ ఎలా ఉండాలి వంటి విషయాలపై సెమినార్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తే ఆయా విషయాలపై అవగాహన ఉన్నవారు హాజరై (వీవెన్, సుధాకర్, కిరణ్ కుమార్ చావా, వెంకటరమణ, దాట్ల శ్రీనివాసరాజు వంటి నిపుణులతోనూ ఈ విషయం ప్రస్తావిస్తాను) విద్యార్థులను గైడ్ చెయ్యడానికి వీలుపడుతుంది.

అలాగే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పాఠకుల సమాచారం ఒకచోట చేర్చడం తద్వారా ఆయా ఊళ్లలో ఉండే పాఠకులు అక్కడికక్కడే సమావేశాలు నిర్వహించుకుని, సాంకేతికపరమైన చర్చలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం విషయమై ప్రసాద్ గారు ఓ టేబుల్ ఫోరంలో క్రియేట్ చేసి ఎవరైనా అందులో తమ వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాటు చేద్దామన్నారు. త్వరలో ఆ పద్ధతి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే పరిచయస్థులకు way2sms.com వంటి వెబ్ సైట్ల ద్వారా http://computerera.co.in/forum, http://computerera.co.in/chat సైట్ల గురించి పరిచయం చేయడం, Orkutలోని స్నేహితులకు స్ర్కాప్ లు పంపించడం, పాంప్లెట్లు ప్రచురించి విద్యాసంస్థల్లో పంపిణీ చేయడం వంటి చక్కని సూచనలు వచ్చాయి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని మీవంతు సహకారంగా ఈ మీటింగ్ కి హాజరు కాలేని పాఠకులు కూడా తమకు తెలిసిన స్నేహితులకు, పరిచయస్థులకు SMSలు (మంచి అనేక కొటేషన్లని SMSల రూపంలో ఫార్వార్డ్ చేస్తుంటాం. అవి జనాలను మోటివేట్ చేస్తాయో లేదో తెలియదు కానీ, కనీసం అందరికి సహాయపడడానికి రూపొందించబడిన పై వెబ్ సైట్ల గురించి ఒక్క మెసేజ్ మీకు తెలిసిన వారికి పంపించగలరు), Orkut Scraps రూపంలో పరిచయం చెయ్యగలరు.

అలాగే ఫోరంలోని సమాచారం ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. ఒక పోస్ట్ రాశామంటే అది ఎంతోమందికి అలా ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే ఛాట్ రూమ్ లో ఒకరికి సందేహం తీర్చామంటే అది ఆ ఒక్కరికి, లేదా మరో ఇద్దరు ముగ్గురకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలో తరచూ ఛాట్ రూమ్ లో తీర్చే సందేహాలను ఫోరంలో వివరంగా పోస్టులను రాయడం ద్వారా.. ఇకపై అవే సందేహాలు ఛాట్ రూమ్ లో మళ్లీ మళ్లీ అడగబడుతుంటే ఫోరంలోని సంబంధింత లింక్ ని ఇస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన వచ్చింది. అదే సమయంలో అలా తరచూ అడగబడే సందేహాలను ఫోరంలో ఓ థ్రెడ్ లో ప్రచురించి, ఛాట్ రూమ్ లోనే లింకుల వద్ద FAQల పేరిట ఆ థ్రెడ్ యొక్క లింక్ ఇస్తే మరీ బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది.

ఇకపోతే ఫోరంలో ఎవరైనా ఏదైనా సందేహం అడిగినప్పుడు దానికి ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల పరిష్కారం లభించినప్పుడు ఆ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ లో "Solved" అనే పదం చేర్చడం ద్వారా మరింత మంది ఆ పోస్టు ద్వారా ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచన జాకబ్ గారు వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలో సందేహాలు అడిగేవారు ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల తమ సందేహం పరిష్కరించబడితే దయచేసి తమ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ ని edit చేసి Solved అనే పదాన్ని చేర్చండి. అలాగే అనేక ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పిన వారికి పాయింట్లు ఇచ్చే పద్ధతిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అదీ మొదలుపెట్టాలి.

మాతృభాష విషయమై మనం చేసే పోస్టులలో వీలైతే పూర్తిగానూ, లేదా పాక్షికంగానూ లేదా కనీసం సబ్జెక్ట్ లైన్ వరకూ అయినా తెలుగులో టైప్ చేస్తే బాగుంటుంది అని ప్రతిపాదించడం జరిగింది. దయచేసి వీలైన వారందరూ దీనిని పాటించగలరు.

నిరంతరం ఫోరంని పరిశీలిస్తుండే మోడరేటర్లుగా వ్యవహరించడానికి చైతన్య, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. అలాగే ఇక్కడ మరో విషయమూ చర్చలోకి వచ్చింది. ఫోరంలోని వేర్వేరు విభాగాలను వేర్వేరు వ్యక్తులు మోడరేట్ చేయాలన్నది. ఉదా.కు.. సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్స్ అనే విభాగానికి ప్రసాద్ గారు మోడరేట్ చేస్తే పిసి చిట్కాలు అనే విభాగానికి చైతన్య, మరో విభాగానికి మౌర్య, అభిరామ్, శ్రీనివాస్ ఇలా బాధ్యతలు పంచుకుంటే పని సులువు అవుతుంది అన్న ప్రతిపాదన ప్రసాద్ గారు చేశారు. వీలైనంత త్వరలో ఆయా బాధ్యతల విభజన చేసుకుందాం. మోడరేటింగ్ పై ఆసక్తి ఉండి, మన లక్ష్యాల పట్ల చిత్తశుద్ది కలిగిన వ్యక్తులు ముందుకు రాగలరు. అలాగే మోడరేటర్ల మధ్య సరైన
సమన్వయం ఉండాలి. ఒకరికొకరు తరచూ సంప్రదించుకుంటూ తమ మధ్య అభిప్రాయ బేధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదు, అందరం సమానమే. కలిసి కష్టపడదాం, కలిసి నాలెడ్జ్ ని షేర్ చేద్దాం.

http://computerera.co.in/chat అనే "సాంకేతిక సహాయం" ఛాట్ రూమ్ లో ప్రశ్నలు అడిగేవారు ఎక్కువయ్యారు, సమాధానాలు చెప్పేవారు తక్కువయ్యారు అన్న ప్రస్తావన వచ్చి, వీలైన వారందరూ రోజులో కొద్దో గొప్పో సమయం అక్కడ స్పెండ్ చేస్తూ ఇతరులకు సాయపడదామని నిర్ణయించుకోవడం జరిగింది. మీటింగ్ కి హాజరు అవలేకపోయిన మిగిలిన పాఠకులు కూడా మీకు వీలైన సమయాల్లో ఆ ఛాట్ రూమ్ లో గడుపుతూ మీ సందేహాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకు కాస్త సాయపడండి. మనం ఎంత సాయపడితే మనకు అంత సాయం లభిస్తుంది. అలాగే ఛాట్ రూమ్ ని సందర్శించే సభ్యులకు ఇల్లీగల్ సమాచారం, హ్యాకింగ్ వంటి పద్ధతుల గురించి అడగవద్దని, ఒకే మెసేజ్ ని పలుమార్లు కాపీ పేస్ట్ చేసి స్పామ్ చేయవద్దని, ఇలా పలు అంశాల విషయమై ఓపికగా గైడ్ చేయవలసి ఉంటుంది. అందరినీ మనలో కలుపుకుపోవాలి కానీ విసుక్కుని ఎవరినీ దూరం చేసుకోకూడదు.

అలాగే ఛాట్ రూమ్ లో ఇప్పటికే పరిష్కరించబడిన సమాధానాలను గిరిచంద్ గారు (అహ్మదాబాద్) ఛాట్ లాగ్ ల ఆధారంగా ప్రశ్న, సమాధానాలను ఓ క్రమపద్ధతిలో అమర్చుతున్నారు. దానిని అటు ఫోరంలో FAQలుగా ప్రచురించడంతోపాటు ఛాట్ లో ఇతరుల సమస్యలను పరిష్కరించే ప్రతీ వ్యక్తీ వద్ద ఓ కాపీ ఉంచుకునేలా ఏర్పాటు చేయాలి.

నాగభూషణం (వరంగల్) గారు Free Software Foundation వంటి సంస్థలతో వాటి నిర్వాహకులు కిరణ్ చంద్ర వంటి వారిని కలవడం ద్వారా అవగాహన కుదుర్చుకుంటే నాలెడ్జ్ ని అందరికీ చేరవేసే మన లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించవచ్చని సూచించారు. ఈ విషయమై మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఉచిత సాఫ్ట్ వేర్ల వాడకం విషయమై మనం మన సర్కిల్ లో మోటివేషన్ తీసుకురావడం ద్వారా వారి ఉద్యమానికి మన వంతు సాయపడుతూ.. మనం చేస్తున్న ప్రయత్నాలకు వారి సహకారాన్ని ఆసరాగా తీసుకోవచ్చు.

ఇంకా ఎన్నో అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ.. చీకట్లు ముసురుకోవడం, వణికించే చలితో మాటలు రాకపోవడం, అప్పటికే 7 గంటలు అవడం వల్ల ఎవరికీ వెళ్లాలని అన్పించకపోయినా కదలక తప్పలేదు. మెల్లగా ముచ్చట్లు చెప్పుకుంటూ క్యాంటీన్ వరకూ వెళ్లి మిర్చి బజ్జీ, టీలతో కొద్దిగా శరీరాన్ని వెచ్చబరుచుకుని ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం.

ఆడియో నివేదిక:

ఈ సమావేశానికి డిజిటల్ కెమెరా అందుబాటులో లేకపోవడం వల్ల ఫొటోలు తీయడానికి వీలుపడలేదు. అలాగే సెల్ కెమెరాతో వీడియో తీద్దామన్న ఆలోచన వచ్చేసరికి చీకటి పడిపోయింది. లాప్ టాప్ లో రికార్డ్ చేసిన ఆడియో ఏ కారణం చేతనో ఓవర్ లాప్ అయిపోయి ఒకేసారి రెండు వాయిస్ లు వస్తున్నాయి. అందుకే ఇంత వివరంగా మీటింగ్ రిపోర్ట్ ని రాయడం జరిగింది. దాదాపు ఓ ముప్పావు గంట వరకూ ఆడియో రికార్డ్ చేయగలిగాం. దానిని ఒకటి రెండు రోజుల్లో ఇదే పోస్ట్ లో ప్రచురించడం జరుగుతుంది.

గమనిక: ఈ సమావేశం గురించి, ఇందులో చర్చించబడిన అంశాల గురించి మీ అభిప్రాయాలను, సూచనలను సైతం ఇక్కడ పంచుకోగలరు.

- నల్లమోతు శ్రీధర్

21, జనవరి 2008, సోమవారం

సిస్టమ్ క్రాష్ ...మనం కంప్యూటర్లో ఎప్పటికప్పుడు అత్యంత విలువైన సమాచారం స్టోర్ చేస్తుంటాము.ఈ నేపధ్యంలో దాన్ని బ్యాకప్ తీసుకోవడం మరిచిపోయినప్పుడు ఒక్కసారిగా హార్డ్ డిస్క్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి? కనీసం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి వెళ్ళగలిగితే... Recover my files, GetDataback వంటి సాఫ్ట్ వేర్లని ఉపయోగించి డిలీట్ అయిన ఫైళ్ళని/పార్టీషన్లని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అయిటే విండోస్ కూడా బూట్ అవని విధంగా సిస్టం క్రాష్ అయినప్పుడు ప్రత్యామ్నాయమార్గం చూసుకోవలసిందే కదా!!సిస్టం ఎందుకు క్రాష్ అవుతుంది...

సహజంగా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కరెంట్ పోవడం వంటి సందర్భాల్లో హార్డ్ డిస్క్ క్రాష్ అయి కనీసం ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి కూడా బూట్ అవని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో యూజర్ హార్డ్ డిస్క్‌లో తాను స్టోర్ చేసుకున్న ముఖ్యమైన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయలేకపోతాడు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. హార్డ్ డిస్క్/ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయినంతమాత్రాన "మనం డేటాని నష్టపోయాము, ఇక అది తిరిగిరాదు" అని భయపడాల్సిన పని లేదు. వాస్తవానికి డిస్కుపై డేటా సురక్షితంగానే ఉంటుంది. కేవలం ఆ డేటాని యాక్సెస్ చేయడానికి కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్‌ని మాత్రమే మనం నష్టపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేకమైన క్రాష్ రికవరీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిలేకుండా మీ హార్డ్ డిస్క్ నుండి డేటాని రికవర్ చేసుకోవచ్చు.


RecoverSoft Data Rescue

సిస్టమ్ క్రాష్ అయి కనీసం విండోస్ కూడా బూట్ అవనప్పుడు డేటాని రికవర్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ Recovery Soft Data Rescue PC.Win XP, 2003లపై మాత్రమే పనిచేసే ఈ సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే సిడి రైటర్‌లో ఖాళీ సిడిని ఇన్‌సర్ట్ చేయమని కోరుతుంది. ఇన్‌సర్ట్ చేసిన వెంటనే ఒక బూటబుల్ సిడిని ఈ సాఫ్ట్ వేర్ తయారు చేస్తుంది.ఇక మన సిస్టమ్ క్రాష్ అయినప్పుడు సింపుల్‌గా ఆ బూటబుల్ సిడితో సిస్టమ్‌ని బూట్ చేయవలసి ఉంటుంది.హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసేలా మనం ఆప్షన్‌ని ఎంచుకున్న వెంటనే ఈ ప్రోగ్రామ్ హార్డ్ దిస్క్‌లోని అన్ని ఫైళ్ళ వివరాలనూ జాబితాగా చూపిస్తూ ప్రతీ ఫైల్‌కీ Excellent, Good, Possible, Poor అనే విధంగా రేటింగులు ఇస్తుంది. Excellent కండీషన్‌లో ఉన్న ఫైళ్ళు తప్పకుండా రికవర్ అవుతాయి. Good,Poossible కండిషన్‌లో ఉన్న ఫైళ్ళపై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఎటొచ్చి మీ ఫైళ్ళు Poor కండీషన్‌లో ఉంటే అవి రికవర్ అవడం కష్టం! రికవర్ చెయ్యదలుచుకున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఫైల్‌ని ఏ పార్టీషన్ పైకి రికవర్ చేయాలో ఎంచుకోవాలి. ఒకవేళ మీ వద్ద USB Flash మెమరీ కార్డ్‌లు ఉంటే వాటిపైకి డేటా రిజ్కవర్ అయ్యే విధంగా కూడా ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్ వేర్‌తో ఉన్న ప్రధానమైన సమస్య రికవర్ చేసిన డేటాని NTFS ఫైల్ సిస్టమ్‌లో ఉన్న పార్టీషన్లపైకి రికవర్ చెయ్యడానికి వీలుపడదు.

Ontrack EasyRecovery Lite
ఈ సాఫ్ట్ వేర్ కూడా సిస్టమ్‌ని బూట్ చేసి, హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసి రికవర్ అవగలిగిన ఫైళ్లని G (Good) అనే రేటింగుతోను, రికవర్ అవడానికి వీలుపడని ఫైళ్లని D(Deleted) అనే రేటింగుతోనూ చూపిస్తుంది. ఫ్లాపీ,జిప్ డ్రైవ్ వంటి అన్ని రకాల మీడియాపైకి రికవర్ చేసిన డేటాని కాపీ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలుకల్పిస్తుంది. అయితే ఇంటర్‌నెట్‌పై ఫ్రీగా లభించే ఈ Lite వెర్షన్ ఒకసారికి కేవలం 25 ఫైళ్ళని మాత్రమే రికవర్ చేయగలుగుతుంది. క్రాష్ రికవరీ సదుపాయంతో పాటు పొరబాటున మనం డిలీట్ చేసిన ఫైళ్ళని రికవర్ చేసుకోవడానికి అలాగే ఫార్మేట్ చేయబడిన పార్టీషన్ల నుండి డేటాని రికవర్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్‌లో ఆప్షన్లు లభిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ RSS ఫీడ్‌కి సబ్‌స్క్రైబ్ చేయండి.చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. Microsoft Download Center వేరు.. Microsoft Update వేరు అన్నది కొంతమందికే తెలుసు. మనం Windows Automatic Updates సర్వీస్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేయ్యడానికి ప్రయత్నించినప్పుడు అది Microsoft UPdates సైట్‌కి కనెక్ట్ అయి మన సిస్టమ్‌లో లేని సెక్యూరిటీ ప్యాచ్‌లు, hot fixలు ఏవైనా ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది. అయితే మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ ఎప్పటికప్పుడూ వేర్వేరు సాఫ్ట్ వేర్లని విడుదల చేస్తుంటుంది. అలాంటి కొత్త సాఫ్ట్ వేర్లు అన్నింటిని Microsoft Download Center వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటూంది. ఈ నేపధ్యంలో ఎప్పటికప్పుడూ ఏయే కొత్త సాఫ్ట్ వేర్లు మైక్రోసాఫ్ట్ నుండి విడుదల చేయబడుతున్నాయో తెలుసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ RSS ఫీడ్‌కి మీ ఇ-మెయిల్ అడ్రస్‌తో సబ్‌స్క్రైబ్ చేస్తే తాజాగా విడుదలయ్యే సాఫ్ట్ వేర్ల వివరాలు మెయిల్‌కి వచ్చేస్తాయి.

19, జనవరి 2008, శనివారం

Mouse ఎలా పని చేస్తుంది...మన చేతి యొక్క కదలికను సిగ్నళ్ళుగా మార్చి కంప్యూటర్ ఆ సిగ్నళ్లని ఉపయోగించుకునే విధంగా పని చేసేదే మౌస్! మౌస్‌లలొ Normal, Optical మౌస్‌లని రెండు రకాలున్నాయి. Normal మౌస్ పనితీరు ఇలా ఉంటుంది.మౌస్ లోపల ఉండే బాల్ టేబుల్ ఉపరితలాన్ని తగులుతూ మనం మౌస్ ఏ దిశలో మూవ్ చేస్తామో ఆ దిశలో తిరుగుతుంటుంది. మౌస్ లోపల ఉండే రెండు రోలర్స్ బాల్‌ని తాకుతూ ఉంటాయి. Xదిసలో కదలికను గుర్తించిన్ అవెంటనే వాటిలో ఒక రోలర్ తిరుగుతుంది. అలాగే Y దిశలో కదలిక కనిపించినప్పుడు మొదటి రోలర్‌కి 90 డిగ్రీల దిశలో ఆ రోలర్ తిరుగుతుంటుంది. ప్రతీ రోలర్ shaftకి కనెక్ట్ చెయ్యబడి ఆ shaft రంధ్రాలను కలిగిఉండే డిస్క్ ని తిప్పుతుంటుంది. డిస్క్‌కి ఒక వైపు infrared LED మరోవైపు infrared sensor ఉంటాయి. LED నుండి వెలువడే కాంతి కిరణాన్ని డిస్క్ పై ఉండే holes సాయంతో సెన్సార్ గుర్తిస్తుంది.ఈ కాంతి యొక్క pulse మౌస్ స్పీడ్, అది ప్రయాణించే దూరాన్ని బట్టి మారుతుంటుంది. మౌస్‌లోనే ఉండే ఓ చిన్న ప్రాసెసర్ చిప్ infrared sensors నుండి వెలువడిన pulses ని చదివి కంప్యూటర్ అర్ధం చేసుకోగలిగే బైనరీ డేటాగా వాటిని కన్వర్ట్ చేస్తుంది. మౌస్ కేబుల్ ద్వారా ఆ బైనరీ డేటాని మౌస్ ప్రాసెసర్ కంప్యూటర్‌కి చేరవేస్తుంది. Normal మౌస్‌కి ప్రత్యామ్యాయంగా 1999 వ సంవత్సరంలో కనుగొనబడిన ఆప్టీకల్ మౌస్ ఓ చిన్న కెమెరాని ఉపయోగిస్తూ సెకనుకు 1500 ఫోటోలను తీస్తుంటుంది. ఏ ఉపరితలంపై అయినా పని చేస్తుందిది.


ఆప్టికల్ మౌస్‌లో ఉండే ఎర్రని LED ప్రస్తుతపు ఉపరితలపు యొక్క సమాచారాన్ని మౌస్‌లోని CMOS Sensorకి చేరవేస్తుంది. ఇలా తన వద్దకు చేరిన ప్రతీ ఇమేజ్‌ని CMOS SEnsor మళ్ళీ Digital Signal Processor (DSP) అనే ప్రదేశానికి విశ్లేషణ నిమిత్తం పంపిస్తుంది.సెకనుకు 18 మిలియన్ ఇన్‌స్ట్రక్‌షన్లని ప్రాసెస్ చేయగలిగే ఈ DSP తన వద్దకు చేరిన ఇమేజ్‌లను ఒకదానితో మరొకటి సరిపోల్చడం ద్వారా మౌస్ ఏ దిశగా ఎంత దూరం కదిలించబడిందో నిర్ధారించి అ సమాచారాన్ని కంప్యూటర్‌కి అందిస్తుంది. ఈ తతంగం అంతా ఒక్కో సెకనుకు కొన్ని వందల పర్యాయాలు కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నంతసేపూ జరుగుతూనే ఉంటుంది. Normal మౌస్‌లతో పోలిస్తే ఆప్టికల్ మౌస్‌లు ఫెయిలయ్యే అవకాశాలు చాలా తక్కువ. Normal మౌస్‌లలో మాదిరిగా మౌస్ లోపలికి మురికి చేరుకుని సెన్సార్లకి అడ్డుపడే ఇబ్బంది ఆప్టికల్ మౌస్‌లలో ఉండదు. అలగే Normal మౌస్‌ల మాదిరిగా తప్పనిసరిగా మౌస్ ప్యాడ్ ఉండాల్సిన పని ఆప్టికల్ మౌస్‌లకు ఉండదు.

3D ఎఫెక్టులతో సెర్చింగ్ చేసుకోండి.


Google, Yahoo వంటి సెర్చ్ ఇంజిన్లలో ఏదైనా కీవర్డ్‌ని టైప్ చేసి వెదికినప్పుడు పేజీల కొద్ది లింకులు ప్రత్యక్షమవుతాయి కదా! వాటిలొ దేనిని ఓపెన్ చేయాలని మనం తలగోక్కోవలసి వస్తుంది. ఇక ఆ బాధ లేదు. 3D Web Search టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ టూల్ ద్వారా Google, Yahoo, Ebay, Flickr వంటి సెర్చ్ ఇంజిన్లలో మీరు ఏ కీవర్డ్ కోసం సెర్చ్ చేసినా అన్ని సెర్చ్ రిజల్ట్స్ యొక్క టెక్స్ట్ లింకులు కాకుండా వాటి పేజీల ప్రివ్యూలు ఆకర్షణీయంగా కనిపించే పద్ధతిలో అమర్చబడి స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

16, జనవరి 2008, బుధవారం

ప్రతీ పదానికి సంబంధించి 200 పనులు


నెట్‍లో ప్రతీ వెబ్‍పేజీలోనూ వందలకొద్ది పదాలు పొందుపరచబడి ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకుని దానిని google వంటి సెర్చ్ ఇంజిన్లలో వెదకాలనుకోవచ్చు. దానికి సంబంధించిన రిఫరెన్సులు చూడాలనుకోవచ్చు. దాన్ని వేరే భాషలోకి అనువదించాలనుకోవచ్చు. లేదా లాప్‍టాప్ వంటి పదాలను సెలెక్ట్ చేసుకుని వాటిని ఆన్‍లైన్‍లో కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా ఆ పదాన్ని మీ స్నేహితునికి మెయిల్ చేయాలనుకోవచ్చు. ఇలా ఒక పదాన్ని పట్టుకుని దాదాపు 200లకు పైగా వేర్వేరు పనులను నెరవేర్చిపెట్టే addon నే Make every word interactive with HyperWords.

మీ వెబ్‍సైట్ నెమ్మదిగా లోడ్ అవుతుందా?


మీ వెబ్‍సైట్ ఎంత వేగంగా లోడ్ అయితే సందర్శకులు అంత సంతోషిస్తారు. ఈవాళ్టి రోజుల్లో ఎంత గొప్ప వెబ్‌సైట్ కోసమైనా ఐదు, పది సెకండ్లకు మించి వేచి చూసే ఓపిక ఎవరికీ ఉండడం లేదు.ఈ నేపధ్యంలో మీ వెబ్‌సైట్ బాగా నెమ్మదిగా ఓపెనవుతోందంటే దానికి గల కారణాలను అన్వేషించి సరిచేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఆకర్షణ కోసం మనం వెబ్‌పేజీల్లో పొందుపరిచే CSS, Iframes, Flash, JavaScript, ఫోటోలు వంటివి లోడ్ అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.వాటికితోడు మనం Google Adsense ప్రకటనల్ని మన సైట్‌లో పొందుపరుచుకున్నట్లయితే ఆ ప్రకటనలు మన సైట్‌కి వచ్చి చేరడానికి కూడా కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే Youtube,Flash వంటి వీడియో లింకులు వంటివి సైట్ నెమ్మదిగా లోడ్ అవడానికి దారితీసే అంశాలే. అలాగే Imageshack, Flickr వంటి వెబ్‌సైట్లలొ హోస్ట్ చేయబడి మన వెబ్‌సైట్‌లో అక్కడి నుండి డిస్‌ప్లే చేయబడవలసిన ఫోటోలూ సైట్ ఓపెనింగ్ నెమ్మదించడానికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో Pingdom అనే టూల్‍ని ఉపయోగించడం ద్వారా మీ సైట్ నెమ్మదించడానికి ఏయే అంశాలు కారణం అవుతున్నాయన్నది వివరంగా ఒక గ్రాఫ్ రూపంలో తెలుసుకుని వాటిని సరిచేసుకోవచ్చు.

12, జనవరి 2008, శనివారం

రోజువారీ కార్యకలాపాలు రికార్డ్ చేసేలాకంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మనం రకరకాల ప్రోగ్రాములను రన్ చేస్తుంటాం, పలు వెబ్ సైట్లని వి జిట్ చేస్తుంటాం, డాక్యుమెంట్లని టైప్ చేస్తుంటాం, ఇలా మనం సిస్టమ్ ఆన్ చేసినప్పటి నుండి తిరిగి కట్టేసేటంతవరకు మనము చేసే పనులన్నీ రికార్డ్ చేయబడి ఒక వీడియో రూపంలో మార్చబడితే ఎలా ఉంటుంది? snaplogger అనే ప్రోగ్రాం ఈ పనిని నిజం చేసి పెడుతుంది. ఇది మనం పిసిని ఆన్ చేసిన క్షణం నుండి నిరంతరాయంగా మొత్తం కంప్యూటర్ స్క్రీన్ లేదా మనం ఎంచుకున్న విండోని పలు ఫోటోలుగా కేప్చర్ చెస్తుంటుంది. కొన్ని సెకండ్లకు ఓ ఫోటో చొప్పున మీకు తెలియకుండానే రికార్డ్ చేయబడుతుంది. ఈ ఫోటోలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే వీడియో మాదిరిగా కన్వర్ట్ చేస్తుంది.

మీ మేధస్సుకు పదును పెట్టే ప్రశ్నలు కావాలా?మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా... ఎంత సేపు ఆ క్లాసు పుస్తకాలనే ఏమి చదువుతారు.. కొద్దిగా జనరల్ నాలెడ్జ్‌ని పెంచే ప్రయత్నాన్ని చేయండి. మీరు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ని వాడుతుంటే https://addons.mozilla.org /en-US/firefox/addon/1311 అనే వెబ్ పేజ్‌లో లభించే Quiz Addicts Toolbar అనే చిన్న టూల్ బార్ addon ని మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రతీ పది నిముషాలకు ఓ సారి ఓ చక్కని ప్రశ్నని ఆన్సర్ చేయమని కోరుతుంది.తర్వాత సమాధానమూ చూపిస్తుందనుకోండి. మీ మేధస్సుని పెంచే వేలకొద్ది ప్రశ్నలు మీ ఫైర్‌ఫాక్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటాయి.

10, జనవరి 2008, గురువారం

గదిలో పరిమళాలు వెదజల్లే USB పరికరం

sridhar

రూమ్ రిఫ్రెషనర్లకు బదులుగా నేరుగా కంప్యూటర్ నుండే పరిమళాలను వెదజల్లే AromaUSB అనే USB పరికరం ఒకటి ప్రస్తుతం మార్కెట్లో విడుదలైంది. ఇందులో పెర్ ఫ్యూమ్ నింపబడి ఉంటుంది. మనం ఈ పరికరాన్ని మన కంప్యూటర్ యొక్క USB పోర్టుకి కనెక్ట్ చేసిన తక్షణం అది ఉత్తేజభరితమైన పరిమళాన్ని వెదజల్లడం ప్రారంభిస్తుంది. వేర్వేరు ఫ్లేవర్లు, రంగుల్లో లభిస్తున్న ఈ పరికరం ధర రూ. 8,500 వరకూ ఉంది. లోపల పెర్ ఫ్యూమ్ ఖాళీ అయితే కొన్ని మోడళ్లలో మళ్లీ నింపుకోవచ్చు. http://www.aromausb.com/?action=product_productpage అనే పేజీలో ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు జరిపి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Windows XP సర్వీస్ ప్యాక్ 3

SNAG-0000

Windows XP వినియోగదారులు Service Pack 3ని ఈ క్రింది లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోండి. 336 MB పరిమాణం గల ఈ సర్వీస్ ప్యాక్ ని http://download.microsoft.com/download/a/e/4/ae43e777-d69b-4b96-b554-d1a2a0f40fac/windowsxp-kb936929-sp3-x86-enu.exe అనే సైట్ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేక సెక్యూరిటీ లోపాలు ఈ సర్వీస్ ప్యాక్ ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇంటర్నెట్లో ఇంతకాలం అనధికారిక SP3ల పేరిట చలామణి అయిన ప్రోగ్రాముల్లో అనేక ప్రమాదకరమైన స్క్రిప్ట్ లు పొందుపరచబడి ఉండి అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నేరుగా మైక్రోసాఫ్ట్ సైట్ నుండి పై లింకు ద్వారా సర్వీస్ ప్యాక్ 3ని డౌన్ లోడ్ చేసుకోండి. అలాగే ఈ SP3కి సంబంధించిన అదనపు వివరాల కోసం PDF డాక్యుమెంటేషన్ (కొత్తగా ఇందులో ఏమేమి పొందుపరిచారు అన్న సమాచారం ఉన్నది) కోసం http://www.microsoft.com/downloads/details.aspx?FamilyID=68c48dad-bc34-40be-8d85-6bb4f56f5110&displaylang=en అనే సైట్ ని సందర్శించండి.

9, జనవరి 2008, బుధవారం

Start బటన్ పేరుని మార్చడం ఇలా!

SNAG-0001

ఈ చిట్కా కేవలం అడ్వాన్స్డ్ యూజర్లకు మాత్రమే ఉద్దేశించినది. వాస్తవానికి ఇది ఇక్కడ రాయకూడదు, కానీ చాలామంది మా కంప్యూటర్ లో వేరే సాఫ్ట్ వేర్ పని లేకుండా మేమే స్వయంగా స్టార్ట్ బటన్ పేరు మార్చుకోవడం ఎలా అని అడుగుతున్నారు కాబట్టి రాయడం జరుగుతోంది.  స్టార్ట్ బటన్ పేరు మార్చాలంటే explorer.exe ఫైల్ ని Hex Editor వంటి ప్రోగ్రామ్ తో ఎడిట్ చేయాలి. ఒకవేళ మీరు ఏమాత్రం తప్పు ఎడిట్ చేసినా అసలు విండోసే లోడ్ అవదు, దానికి బదులు WinBoost వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రాముల సాయంతో స్టార్ట్ బటన్ పేరుని మార్చుకోండి.  స్టెప్1: http://delphi.icm.edu.pl/ftp/tools/ResHack.zip సైట్ నుండి రిసోర్స్ హ్యాకర్ డౌన్ లోడ్ చేసుకోండి.. స్టెప్ 2: ఆ తర్వాత C:Windows అనే లొకేషన్ లో ఉండే explorer అనే ఫైల్ ని బ్యాకప్ తీసుకోండి. స్టెప్ 3: ఆ తర్వాత C:Windows లొకేషన్ లో ఉండే ఒరిజినల్ explorer ఫైల్ ని రిసోర్స్ హ్యాకర్ తో ఓపెన్ చేయండి. స్టెప్ 4: ఇప్పుడు స్ర్టింగ్ టేబుల్ లో 37 అనే విభాగంలో 1033 అనే ఎంట్రీ వద్దకు వెళ్లండి. ఇప్పుడు అక్కడ కుడిచేతి వైపు 578 అనే స్ర్టింగ్ గా Start అనే పేరు ఉంటుంది. ఆ స్ర్టింగ్ ని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. ఒకవేళ మీరు XPలో Classic Layoutలో ఉన్నట్లయితే స్ర్టింగ్ టేబుల్ లో 38 అనే విభాగంలోని 1033 అనే ఎంట్రీ వద్దకు వెళ్లి, కుడిచేతి వైపు కన్పించే 595 అనే విలువను మీకు నచ్చిన పేరుతో మార్చాలి. కేవలం "Start" అని కన్పించే పేరులో కొటేషన్ మార్కులను అలాగే ఉంచి మధ్యలోని Start అనే పేరుకి బదులుగా మీ పేరుని ఇవ్వాలి. ఇలా పేరుని మార్చిన తర్వాత Compile Script అనే బటన్ ని ప్రెస్ చేయండి. స్టెప్ 5:ఆ తర్వాత అలా మోడిఫై చేసుకున్న  ఫైల్ ని C:Windows ఫోల్డర్ లోనే cera.exe పేరిట సేవ్ చేయండి. స్టెప్ 6:ఆ తర్వాత విండోస్ రిజిస్ర్టీలో  HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\ Windows NT\ CurrentVersion Winlogon అనే విభాగంలోకి వెళ్లి Shell అనే స్ర్టింగ్ వేల్యూని డబుల్ క్లిక్ చేసి.. దానికి cera.exe అనే పేరుని (మీరు ఏ పేరుతో సేవ్ చేసి ఉంటే ఆ పేరుని) ఇవ్వండి, ఇలా చేయడం వల్ల తర్వాత లాగిన్ అయ్యే సమయంలో ఆ కొత్త ఫైల్ ని రిజిస్ర్టీ గుర్తించే విధంగా ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఇక సిస్టమ్ ని రీస్టార్ట్ చేస్తే మీ పేరు వస్తుంది.. అయితే ఒక్క విషయం... మీరు ఏమాత్రం పొరబాటు చేసినా... మీ సిస్టమ్ ఖరాబు అయితే నాది ఎలాంటి బాధ్యత లేదని గ్రహించండి.. ఇలాంటి వాటికన్నా సులువైన మార్గాలు అనుసరించండి, రిస్క్ వద్దనుకుంటే!

Windows Live Writerని కాన్ఫిగర్ చేసేటప్పుడు

SNAG-0000

బ్లాగర్లు తమ బ్లాగులను సులభంగా ప్రచురించుకోవడానికి Windows Live Writer అనే సాఫ్ట్ వేర్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీని ద్వారా బ్లాగులకు ఫొటోలు, వీడియోలు, టేబుళ్లు, మ్యాప్ లు వంటివన్నీ జతచేసుకోవచ్చు. అలాగే పోస్టులను మన హార్డ్ డిస్క్ మీదనే సేవ్ చేసి అవసరం అయినప్పుడు పోస్టు చేసుకోవచ్చు. బ్లాగర్ల పనిని చాలా సులభతరం చేసే ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో windows live spaces, blogger, wordpress వంటి వేర్వేరు బ్లాగు హోస్టింగ్ సర్వర్లలో తమ బ్లాగులు ఉన్న ఎవరైనా పోస్టులను చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టలేషన్ సమయంలో మన బ్లాగు చిరునామా, యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు ఇచ్చిన తర్వాత తర్వాత వచ్చే స్ర్కీన్ లో Type of weblog that you are using అనే ప్రదేశం వద్ద Bloggerలో మీ బ్లాగు ఉంటే దాన్ని ఎంచుకోవాలి, వర్డ్ ప్రెస్ లో ఉంటే Wordpressని ఎంచుకోవాలి. అంతా బాగానే ఉంది కానీ, ఆ క్రిందనే ఉండే Remote posting URL for your weblog: అనే బాక్సులో ఏమి ఇవ్వాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి దీన్ని ఇలాగే పక్కనబెట్టి Internet Explorer బ్రౌజర్లో మీ బ్లాగు ఎకౌంట్ లోకి లాగిన్ అయి New Post లేదా Posts లేదా Settings లేదా Layout అనే లింకులపై మౌస్ ని ఉంచినప్పుడు ఏ లింకు అడ్రస్ కన్పిస్తోందో అందులో Blog ID= అనే పదం తర్వాత కన్పించే సంఖ్యే మీ ఫీడ్ అడ్రస్ అన్నమాట. దాన్ని కాపీ చేసుకుని వచ్చి కేవలం ఆ సంఖ్యని మాత్రమే పై చిత్రంలో blue కలర్ తో హైలైట్ చేయబడిన విధంగా పేస్ట్ చేయండి. ఇక Next బటన్ ప్రెస్ చేస్తే సరి! అనేక సందర్భాల్లో ఇలా ఫీడ్ అడ్రస్ ని తెలియజేయమని విసిగించకుండానే Live Writer నేరుగా పనిచేస్తుంది.

8, జనవరి 2008, మంగళవారం

కావలసిన సమాచారం కోసం వికీపీడియా సెర్చ్..


సమస్త విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో Search ఆప్షన్‌ని వెదికి పట్టుకోవడం కొద్దిగా కష్టం. మీరు ఎక్కువగా వికీపీడియాని వాడుతున్నట్లయితే ఆ వెబ్ సైట్‌లోని అన్ని వెబ్ పేజీల్లో Wikiseek పేరిట ఓ బాక్స్ పొందుపరచాడానికి Wikisearch Search Extension for Wikipedia అనే ఫైర్‌ఫాక్స్ addon ని https://addons.mozilla.org/en-US/firefox/addon/4355 సైడ్ నుండీ ఇన్‌స్టాల్ చేసుకోండి.

రీడ్ అవని డిస్క్ ల్లో డేటా రికవరింగ్‌కి...


సిడిలపై బాగా గీతలు పడడం వల్ల , ఇతరత్రా కారణాల వల్ల అందులోని డేటా రీడ్ అవని సిడిల నుండి సమాచారాన్ని ర్జికవర్ చెయ్యడానికి BadCopy Pro అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ ల్లోని డేటాని కూడా రికవర్ చేసే ఈ సాఫ్ట్ వేర్ డిస్కుల్లోని చిన్న చిన్న బ్లాక్‌లుగా విశ్లేషించి అందులో సాధ్యమైనంత సమాచారాన్ని వెలికితీయడానికి ప్రయత్నిస్తుంది. సాధారణ విండోస్ కమాండ్లు Copy, Paste వంటివి చేతులెత్తేసే డిస్క్ ల నుండి సైతం ఇది విజయవంతంగా సమాచారాన్ని రికవర్ చెయ్యగలుగుతుంది. అయితే డేటా బాగా డామేజ్ అయి ఉంటే, ఫైల్‌ని రికవర్ చెయ్యగలిగినా అది ఏమాత్రమూ ఉపయోగపడదు. దీనికి కారణం వీలైనన్ని డేటా బ్లాక్‌లని రికవర్ చేయగలదే తప్ప మొత్తం బాగా డామేజ్ అయిన డేటాని ఏ సాఫ్ట్ వేరైనా ఏం చెయ్యగలుగుతుంది చెప్పండి.

7, జనవరి 2008, సోమవారం

Orkut స్క్రాప్‌లు సులభంగా పంపడానికిఈ మధ్య కాలంలో చాలామంది Orkut Scrap ల రూపంలో ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వేరే టాబ్‌లో orkutని ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా ఇతరుల స్క్రాప్ బుక్‌కి స్క్రాప్‌లను పోస్ట్ చేయడానికి OrkutScrapEasy అనే add on ఉపయోగపడుతుంది. దీనిని http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి నుండి పొందవచ్చు.

స్పీడ్‌ని ప్రభావితం చేసే అంశాలు

సిడి డ్రైవ్ ఎంత వేగంగా డేటాని రీడ్ చెయ్యగలుగుతుందన్నది దాని రోటేషనల్ స్పీడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రోటేషనల్ స్పీడ్ 48x, 52x వంటి ప్రమాణంలో వ్యవహరించబడుతుంది. పిసి పెర్‌ఫార్మెన్స్ స్లోగా ఉన్నా సిడి-డ్రైవ్ నుండి డేటాని యాక్సెస్ చెయ్యడం నెమ్మదిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిస్టమ్‌ని టాప్ కండీషన్‌లో ఉంచుకోవడం మంచిది. అలగే సిడి-డ్రైవ్ క్యాచే కూడా సిడి డ్రైవ్ పెర్‌ఫార్మెన్స్ ని ప్రభావితం చేస్తుంది. ControlPanel>System>Performance>CD-ROM అనే విభాగంలో Supplemental Cache Size అనే స్లైడర్ బార్‌ని Large దిశగా డ్రాగ్ చెయ్యడం ద్వారా సిడి డ్రైవ్ యొక్క క్యాచే గరిష్టంగా ఉండేటట్లు సెట్ చేసుకోవచ్చు. అలాగే System>Device Manager>CD-ROM అనే విభాగంలోకి వెళ్ళి Properties>Settings అనే పేజీలో DMA మోడ్‌ని ఎంచుకోవడం వల్ల సిడి-రాం డ్రైవ్ ప్రాసెసర్‌పై ఎక్కువ ఆధారపడకుండా నేరుగా మెమరీని వినియోగించుకునేటట్లు, తద్వారా పెర్‌ఫార్మెన్స్ పెరిగేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సాధ్యమైననత వరకూ, సిడి-రామ్ డ్రైవ్‌ని ప్రత్యేకంగా ఒక IDE కేబుల్‌కి కనెక్ట్ చేస్త్తే డేటా ట్రాన్శ్ ఫర్ రేట్ మెరుగుపడుతుంది. అలగే మదర్ బోర్డ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ డ్రైవర్లని అప్‌డేట్ చేసుకోవడం వల్ల సిడి-డ్రైవ్‌కి, పిసిలోని ఇతర హార్డ్ వేర్ కాంపొనెంట్లకు మధ్య బాండ్‌విడ్త్ మెరుగుపడుతుంది.

6, జనవరి 2008, ఆదివారం

ప్రింటర్ రక్షణ…


ప్రింటర్‍ని బాగా గాలి వెలుతురు తగిలే ప్రదేశంలో అమర్చుకోవాలి. మరీ తేమగానూ, బాగా వేడిగానూ ఉన్న ప్రదేశాల్లో ఉంచవద్దు. ప్రింటర్ పై భాగాన్ని కొద్దిగా నీటిలో ముంచిన గుడ్డతో క్లీన్ చెయ్యవచ్చు. కానీ, టోనర్ కాట్రిడ్జ్, రోలర్లు వంటి అంతర్గత భాగాలను క్లీన్ చేసేటప్పుడు మాత్రం పొడిగా పీచులు లేని గుడ్డతోనే క్లీన్ చెయ్యాలి. టోనర్ కాట్రిడ్జ్ లో ఇంక్ నిండుకుంటున్నప్పుడు…ప్రింటింగ్ సక్రమంగా జరగదు. అలాంటప్పుడు కాట్రిడ్జ్ ని బయటకు తీసి కాట్రిడ్జ్ లోపల గోడలకు అంటుకున్న పౌడర్ వినియోగంలోకి తీసుకురాబడేలా మెల్లగా షేక్ చేస్తే మరికొన్ని ప్రింటౌట్లను పొందవచ్చు. టోనర్‍ని షేక్ చేసేటప్పుడు లెఫ్ట్, రైట్ కాకుండా.. పైకీ క్రిందికీ షేక్ చెయ్యాలి. ఎప్పటికప్పుడు మీ ప్రింటర్ మేన్యుఫేక్చరర్ వెబ్‍సైట్‍కి వెళ్ళి మీ ప్రింటర్ మోడల్‍కి సంబంధించిన తాజా డ్రైవర్లని డౌన్‍లోడ్ చేసుకోవడం మంచిది. లేటెస్ట్ డ్రైవర్ల మూలంగా ప్రింటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా, సరికొత్త ఫాంట్స్ లభిస్తాయి. అలాగే ఇన్ కంపాటబిలిటీలేమైనా ఉంటే తొలగిపోతాయి.

హార్డ్ డిస్క్ స్పేస్ ఎంతో కీలకమైనది….


హార్డ్ డిస్క్ ఎంత వేగంగా పనిచేస్తే కంప్యూటర్ పెర్‍ఫార్మెన్స్ అంత మెరుగ్గా ఉంటుంది. హార్డ్ డిస్క్ స్పీడ్ పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది హార్డ్ డిస్క్ లోఉండే Platters యొక్క రోటేషనల్ స్పీడ్. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే హార్డ్ డిస్క్ నుండి సమాచారం అంత స్పీడుగా రీడ్/రైట్ చెయ్యబడుతుంది. నిముషానికి 7,200చుట్లు (దీన్నే rpm గా చెబుతుంటారు.) తిరిగే హర్డ్ డిస్క్ మెరుగైన పెర్‍ఫార్మెన్స్ అందిస్తుంది. అలాగే హర్డ్ డిస్క్ పనితీరుపై Seek Time కూడా విశేష ప్రభావం చూపిస్తుంది. మనం ఒక ఫైల్ ఏ లొకేషన్‍లో ఉందో వెదకడానికి పట్టే సమయాన్ని SeekTime అంటారు. అదే విధంగా హర్డ్ డిస్క్ లోని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సమాచారం తరలించబడడానికి పట్టే సమయం లేదా డిస్క్ నుండి ఫ్లాపీ, సిడి, జిప్ డ్రైవ్‍ల వంటి రిమూవబుల్ మీడియాలకు సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చెయ్యడానికి పట్టే సమయం Disk Transfer Rateగా వ్యవహరించబడుతుంది. ఈ ట్రాన్స్ ఫర్ రేట్ కూడా హర్డ్ డ్జిస్క్ పెర్‍ఫార్మెన్స్ పైనా, అదే సమయంలో పిసి పనితీరుపైనా విశేషమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్ని గరిష్ట స్థాయిలో ఉంటేనే సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. లేదంటే p4 సిస్టమ్ అయినా ఆశించినంత వేగంగా ఉండదు.

5, జనవరి 2008, శనివారం

Cable Select గురించి తెలుసా మీకు?

SNAG-0001

ఇప్పుడైతే SATA హార్డ్ డిస్కులు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కానీ ఇప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం పాత కంప్యూటర్లు వాడేవారు IDE హార్డ్ డిస్క్ లు, సిడిరామ్ డ్రైవ్ లు, సిడి రైటర్లు వాడేవారు. వాస్తవానికి ఇప్పుడు మనం వాడుతున్న సిడి, డివిడి రైటర్లు కూడా అధికభాగం IDE వే ఉంటున్నాయి.  కేవలం హార్డ్ డిస్కుల విషయంలోనే SATA ఇంటర్ ఫేస్ కలిగిన వాటి వినియోగం పెరిగింది. IDE హార్డ్ డిస్క్/ సిడి రైటర్/డివిడి రైటర్ వంటి వాటిపై సహజంగా Master, Slave, Cable Select (కొన్ని మోడల్ హార్డ్ డిస్క్ లలో Limited Mode అనేదీ మరొకటి ఉంటుంది) అనే మూడు జంపర్ పిన్నులు పొందుపరచబడి ఉంటాయి. ఒక IDE కేబుల్ కి హార్డ్ డిస్క్ ని కానీ, సిడి రైటర్ ని గానీ Master డివైజ్ గా కనెక్ట్ చేయదలుచుకున్నట్లయితే జంపర్ ని పై చిత్రంలో విధంగా  Master అనే ప్రదేశం వద్ద గుచ్చాలి. ఒకవేళ అదే IDE కేబుల్ కి హార్డ్ డిస్క్/సిడి/డివిడి రైటర్ లను స్లేవ్ డిస్కులుగా అమర్చదలుచుకున్నట్లయితే Slave అనే ప్రదేశంలో జంపర్ ని సెట్ చేయాలి. అసలు మనం ఆ మూడు పిన్ లకు దేనికీ జంపర్ ని గుచ్చకపోయినా ఆ డివైజ్ స్లేవ్ క్రిందే పరిగణించబడుతుంది. ఇకపోతే మూడవ ఆప్షన్ అయిన Cable Select అనే సదుపాయం పలు సందర్భాల్లో ఉపయోగపడుతుంది. IDE కేబుల్ కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న రెండవ డివైజ్ ఏ స్థితిలో ఉందో గుర్తించి దానికి భిన్నమైన స్థితిలో ఈ జంపర్ సెట్టింగ్ డిస్క్ ని కాన్ఫిగర్ చేస్తుంది. ఉదాహరణకు అదే కేబుల్ కి Master డిస్క్ గా హార్డ్ డిస్క్ కనెక్ట్  చేయబడి ఉండి, డివిడి రైటర్ అదే కేబుల్ కి రెండవ డివైజ్ గా కనెక్ట్ చేయబడి, దానికి Cable Select స్థానంలో జంపర్ గుచ్చబడి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా డివిడి రైటర్ Slave డివైజ్ గా పరిగణించబడుతుందన్నమాట.

ఎక్సెల్ వర్క్ షీట్లని షేర్ చేయదలుచుకుంటే..

SNAG-0000

మీ ఆఫీసులో ఒకే ఎక్సెల్ వర్క్ షీట్ ని వేర్వేరు విభాగాల్లోని వేర్వేరు ఉద్యోగులు ఎడిట్ చేయగలిగేలా అవకాశం కల్పించాలనుకోండి. Excelలోని Tools మెనూలో ఉండే Share Workbook అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే స్ర్కీన్ పై ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Editing టాబ్ ని క్లిక్ చేసి "Allow changes by more than one user at the same time" అనే ఆప్షన్ ని టిక్ చేసి OK బటన్ ని క్లిక్ చేయండి. వెంటనే ఆ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. పాత్ ని పేర్కొనండి. సేవ్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏయే యూజర్లకైతే ఆ వర్క్ బుక్ ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్లకి అందుబాటులో ఉండే నెట్ వర్క్ లొకేషన్లలో మాత్రమే వర్క్ బుక్ ని సేవ్ చేయాలి. Shared Network ఫోల్డర్ ని ఉపయోగించుకోండి. అలాగే Excel ఫైళ్లకు కూడా Comments జత చేసుకోవచ్చు. ఒక Cellలో కామెంట్ జతచేయదలుచుకుంటే ఆ సెల్ పై రైట్ క్లిక్ చేసి Insert Comment అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

4, జనవరి 2008, శుక్రవారం

ఓపెన్ చేయకముందే లింక్‌ల ప్రివ్యూ


మీరొక వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తున్నారనుకుందాం. అందులో వేరే వెబ్‌పేజికి ఒక లింక్ ఉంటే అందులో ఏముందో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తేనే అర్ధమవుతుంది. అయితే లింక్‌ని ప్రత్యేకంగా ఓపెన్ చేయనవసరం లేకుండా సింపుల్‌గా లింక్‌పై మౌస్ పాయింటర్‌ని పెట్టిన వెంటనే ఆ లింక్ యొక్క ప్రివ్యూ చూపించబడేలా ఏదైనా సదుపాయం ఉంటే బాగుంటుంది కదూ! ఈ పనిని నెరవేర్చి పెట్టడానికి https://addons.mozilla.org/en-US/firefox/addon/2207 అనే వెబ్ పేజీలో Coolris Previews అనే add on లభిస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే లింక్‌పై మౌస్‌ని ఉంచినప్పుడు ప్రక్కనే బ్లూ బాక్స్ కనిపిస్తుంది. దానిపై మౌస్‌ని ఉంచితే ఆ లింక్ ప్రివ్యూ అక్కడే కనిపిస్తుంది.

మీ మొహమే మీ పిసికి పాస్‌వర్డ్


మామూలు పాస్‌వర్డ్ లు ఇతరులు తెలుసుకున్నా మన కంప్యూటర్లోకి దర్జాగా ప్రవేశించగలుగుతారు. అదే వెబ్‌కామ్ ద్వారా మన మొహాన్ని రికార్డ్ చేసుకుని  ఇకపై వెబ్‌కాం ముందు కూర్చుని ఇంతకు ముందు రికార్డ్ చేసుకున్న మొహం ప్రస్తుతం ఉన్నదీ ఇంతకుముందు రికార్డ్ చేసినదీ టేలీ అయితేనే పిసిలోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించే బనానా సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కల్పిస్తోంది. బనానా సెక్యూరిటీ అనే వెబ్‌సైట్లోని బనానా స్క్రీన్ సాఫ్ట్ వేర్‌ని ఉపయోగించండి, ఇక సెక్యూరిటీ పరంగా దిగులే ఉండదు. అయితే ప్రస్తుతం బనానా అనే పదం విషయమై ట్రేడ్ మార్క్ గొడవల కారణంగా ఆ సాఫ్ట్ వేర్ లెమన్ స్ర్కీన్ పేరిట కొత్త పేరు మార్చుకుంది. అలాగే ఓ వారం రోజుల తర్వాత డౌన్ లోడ్ కి వీలుపడుతుందని ఆ సైట్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అంతవరకూ వేచి చూడక తప్పదు. కొన్ని లాప్ టాప్ లలో పొందుపరచబడి ఉండే బయోమెట్రిక్ విధానం ఈ సాఫ్ట్ వేర్ మాదిరిగానే పనిచేస్తుంది.

3, జనవరి 2008, గురువారం

రెండున్నర గంటల ఆడియో రిపోర్ట్

SNAG-0000

కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం డిసెంబర్ 24 ఆదివారం కృష్ణకాంత్ పార్క్ లో జరిగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన మీటింగ్ రిపోర్ట్, చిన్న వీడియో క్లిప్ ని కొద్దిరోజుల క్రితం పోస్ట్ చేయడం జరిగింది. మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఆరోజు తీసిన ఫొటోలు పొందలేకపోయాం. అలాగే ఆరోజు 2.30 గంటల ఆడియో రికార్డ్ చేయడం జరిగింది. అది 132MB వచ్చింది. ఐపాడ్ లో రికార్డ్ చేయడం వల్ల అది పలు విధాలా ప్రయత్నించినా కుదించలేకపోయాం. చివరకు 23MB సైజ్ గల ఫ్లాష్ ఫైల్ గా మార్చగలిగాం. ఈ ఫైల్ ని ప్లే చేయడానికి ఎలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. సింపుల్ గా ఈ క్రింది లింకుల నుండి RAR ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని లోపల ఉండే మూడు ఫైళ్లని డెస్క్ టాప్ మీదకు extract చేసుకుని V00005.htm అనే వెబ్ పేజీని ఓపెన్ చేయాలి. ఆ వెబ్ పేజీని ఓపెన్ చేసిన వెంటనే To help protect your security, internet exporer has restricted అనే మెసేజ్ ఒకటి పైన వస్తుంది. దానిపై మౌస్ తో క్లిక్ చేసి Allow Blocked Content అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు అదే వెబ్ పేజీలో ప్లేయర్ వచ్చి ఆడియో ప్లే అవుతుంది. రెండున్నర గంటల ఆడియో ఉంది ఇందులో!

ఫైల్ లింక్: V0005.player.rar ఇది రేపిడ్ షేర్ లింక్. ఇదే ఫైల్ వేరే హోస్టింగ్ సైట్లో లింకు కొద్దిసేపట్లో పెడతాను. వారం రోజులుగా కష్టపడి ఆడియోని ఓ కొలిక్కి తెచ్చిన అభిరామ్ గారికి ధన్యవాదాలు.

నేరుగా ఆడియో వినాలంటే http://www.esnips.com/doc/eb13455e-9947-423b-b9f1-efbb56e867aa/V0005 అనే లింక్ క్లిక్ చేయండి.

2, జనవరి 2008, బుధవారం

ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్‌లకు..వ్యాపార, విద్యారంగాలలో ఎంతో నాణ్యతతో తక్కువ పరిమాణంలో ఇమిడిపోయే ఫ్లాష్ ప్రజంటేషన్లకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది. అయితే Flash MX ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం సులభంగా సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపధ్యంలో PowerBullet అనే సాఫ్ట్ వేర్ సాయంతో PNG, GIF, JPEG వంటి ఇమేజ్ ఫార్మేట్లు, MP3, WAV వంటి ఆడియో ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళ ఆధారంగా మనకు నచ్చిన విధంగా ఆటోమేటీక్‌గా ప్లే అయ్యే ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్లని చాలా సులభంగా రూపొందించుకోవచ్చు. ప్రజంటేషన్‌లో ప్లే అయ్యే ప్రతీ పేజీకి ట్రాన్షిషన్ ఎఫెక్టులు జత చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌లను పుల్ స్క్రీన్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌తో పాటు అందులోని సౌండ్ సింక్రనైజ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌ని EXE ఫైల్‌గా కూడా సేవ్ చేసుకోగలము.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.

బరహతో వర్డ్ లో తెలుగు రావట్లేదా?

తెలుగుని టైప్ చేయడానికి మనం ఉపయోగించే బరహ సాఫ్ట్ వేర్ తో MS-Wordలో తెలుగు టైప్ చేస్తుంటే సమాచారం బాక్సులుగా వస్తోందని చాలామంది చెబుతుంటారు. ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో ఈ క్రింది ఆడియో వివరణతో కూడిన వీడియో ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. ఇక్కడ నేను వివరించిన పద్ధతి కన్నా మెరుగైన విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు. అయితే ఈ పద్ధతి ద్వారా ప్రతీసారీ ఫాంట్ ని మార్చుకోవలసి ఉంటుంది. ఈ సమస్యపై వీవెన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మరో పరిష్కారం లభించింది. Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెట్ చేసుకోవాలి. చివరిగా ఆ New Style డైలాగ్ బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన ప్రకారం ప్రతీసారీ మార్చుకోనవసరం లేదు.

1, జనవరి 2008, మంగళవారం

ఓవర్ క్లాకింగ్ అంటే ఏమిటంటే..

మీరు ఓవర్ క్లాకింగ్ అనే పదాన్ని వినే ఉంటారు.. ఓవర్ క్లాకింగ్ అంటే ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను! ప్రాసెసర్ నే ఉదాహరణగా తీసుకుని చెబుతాను.. ఇంటెల్ Core2Duo 1.82GHz ప్రాసెసర్ ఉందనుకుందాం మీ దగ్గర. వాస్తవానికి ఇంటెల్ సంస్థ ఆ ప్రాసెసర్ ని 2GHz సామర్థ్యంతో పనిచేసేలా రూపొందించి ఉంటుంది.. కానీ బాక్స్ పై మాత్రం 1.82GHz అనే ముద్రిస్తుంది.. కారణం ప్రాసెసర్ పూర్తి కెపాసిటీలో పనిచేయించినప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంటుంది. లాగే BIOSలోనూ 1.82GHz క్లాక్ స్పీడ్ లో మాత్రమే పనిచేసేలా సెట్ చేయబడి ఉంటుంది.. ఓవర్ క్లాకింగ్ అంటే మన స్వంత రిస్క్ మీద 2GHzలో పనిచేసేలా ఏర్పాటు చేసుకోవడం.. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ప్రాసెసర్లు, గ్రాఫిక్ కార్డులు వంటి స్వంత ప్రాసెసింగ్ ఏర్పాట్లు కలిగిన అనేక హార్డ్ వేర్ పరికరాలు ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు.. క్లాక్ స్పీడ్ ని గరిష్ట స్థాయికి పెంచుకోవడమే ఓవర్ క్లాకింగ్, ఇది క్షేమం కాదు.