21, ఆగస్టు 2007, మంగళవారం

MP3 ఫైళ్ళ కటింగ్‍కి ఓ సాఫ్ట్ వేర్..



మీరొక పాట వింటున్నారనుకుందాం. అందులో చాలా బాగా నచ్చిన బీజియమో,
మ్యూజిక్ సీక్వెన్సో మాత్రమే సాంగ్ నుండి సపరేట్‍ ఫైల్‍గా తీసుకోగలిగితే బాగుణ్ణు
అని అనిపించవచ్చు. లేదా మీరు వింటున్న MP3 సాంగ్స్ల్ లో, సాంగ్ మొదటా,
చివర్లలో ఉండే సైలెన్స్ ని తొలగించి కేవలం సాంగ్‍ని మాత్రమే సేవ్ చేసుకోదలుచు
కున్నపుడు MPEG Audio Scissors అనే మృదులాంత్రం(Software)
ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. VCD cutter మాదిరిగానే ఈ మృదులాంత్రంలోనూ
MP3 ఫైలులో ఎక్కడి నుండి మనకు కావాలో ఆ ప్రదేశాన్ని Start Frame గానూ,
ఎక్కడివరకైతే పాట కావాలో ఆ భాగాన్ని End Frame గానూ డిఫైన్ చేసి, Start
Processing/Save to file అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకేసారి పలు ఫైళ్ళనూ క్లిప్ చేయవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Nice tool, I am enjoying. Thanks for the inititave.