7, ఆగస్టు 2007, మంగళవారం

ఇమేజ్ ఎడిటింగ్ కి పనికి వచ్చే ప్రోగ్రామ్





మీరు డిజిటల్ కెమెరా సాయంతో భారీ మొత్తంలో ఫోటోలను సిస్టమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారనుకుందాం. అయితే లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అన్ని ఫోటోలు ఆశించిన స్థాయిలో రాలేదనుకుందాం. అలాంటప్పుడు అందరూ చేసే పని ప్రతీ ఫోటోని ఫోటోషాఫ్ వంటి సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసుకోవడం. ఈ ఇబ్బందేమీ లేకుండా భారీ మొత్తంలో ఉన్న ఇమేజ్‌లకు Gamma, Brightness/Contrast, Blur, Colorize, DropShadow, Mosaic, Negative, Sharpen, Despeckle, Emboss, Vibration వంటి రకరకాల ఫిల్టర్లని, ఎఫెక్ట్‌లనీ అప్లై చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామ్ ఒకటుంది. అదే 'EyeBatch'. మనం ప్రాసెస్ చెయ్యదలుచుకున్న ఫోటోలను, వాటికి అప్లై చెయ్యవలసిన ఫిల్టర్‌లను ఈ సాఫ్ట్‌వేర్‌లో ఎంచుకుని ఔట్‌పుట్ ఫోల్డర్‌ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అన్ని ఫోటోలూ ప్రాసెస్ చెయ్యబడి ఆ ఫోల్డర్లో స్టోర్ అయిపోతాయి. ఇందులో పొందుపరచబడిన ప్రతీ ఫిల్టర్‌కూ దాని ఇంటెన్సిటీని స్పెసిఫై చేయడానికి ఆప్షన్లు సైతం లభ్యమవుతున్నాయి. బ్యాచ్ ప్రాసెసింగ్ కి ఉపకరించే ఈ ప్రోగ్రాం ని http://www.atalasoft.com/eyebatch/download/ebinstall.exe అనే వెబ్ పేజీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: