31, జనవరి 2015, శనివారం

మీరు తెలుగులో మాట్లాడితే అవతలి వాళ్లకి ఇంగ్లీషులో విన్పించాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TtqRbKPAHvs

మీ ఫ్రెండ్‌తో మీరు Skypeలో వాయిస్, వీడియో ఛాట్ చేస్తుంటే.. మీకు తెలిసిన లాంగ్వేజ్ అవతలి వాళ్లకు తెలీకపోతే కష్టం కదా.. ఉదా.కు.. మనకు తెలుగు వచ్చు.. అవతలి వాళ్లకు హిందీ మాత్రమే వచ్చనుకుందాం.. అలాంటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే అది ఆటోమేటిక్‌గా హిందీలో అవతలి వాళ్లకు విన్పించబడితే లాంగ్వేజ్ ప్రాబ్లెం పూర్తిగా పోతుంది కదా. ప్రపంచంలో ఎవరితో అయినా ఈజీగా మాట్లాడుకోవచ్చు కదా.

సరిగ్గా ఈ సదుపాయాన్ని కొన్ని గంటల క్రితమే రిలీజైన Skype Translator సర్వీస్ మనకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్, స్పానిష్ భాషల మధ్య వాయిస్ ట్రాన్స్‌‌లేషన్ అందిస్తోంది. అది ఎలా పనిచేస్తోందో ప్రాక్టికల్‌గా నేను ఓ skype కాల్ ద్వారా ఈ వీడియోలో చూపించాను. ఎంత అద్భుతంగా పనిచేస్తోందో మీరే స్వయంగా చూడండి. దటీజ్ టెక్నాలజీ!!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TtqRbKPAHvs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

29, జనవరి 2015, గురువారం

ఫోన్‌లో తెలుగు టైపింగ్ ఇంతకుముందు కన్నా మరింత ఈజీ ఇప్పుడు.. కొత్త టెక్నిక్! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vQe3is81CKI

ఫోన్లలో తెలుగులో టైప్ చేసుకోవడం ఎలాగో మొట్టమొదటిసారి 2012 సమయంలోనే వీడియో ద్వారా చూపించడం జరిగింది. అయితే ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న పద్ధతులన్నీ కష్టమైన కీబోర్డ్‌లో ఏ అక్షరం ఎక్కడ ఉందో వెదికి పట్టుకుని చాలా శ్రమపడి తెలుగులో టైప్ చేయాల్సి వస్తుంటుంది..

దాంతో చాలామందికి ఫోన్‌లో తెలుగు టైప్ చేయాలంటే చిరాకు వస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ అద్భుతమైంది. మీకు బాగా అలవాటు ఉన్న ఫొనెటిక్ స్టైల్‌లో తెలుగులో టైప్ చేసుకోవచ్చు.

అంటే "Meeru elaa unnaaru" అని ఇంగ్లీషులో టైప్ చేస్తే అది వెంటనే తెలుగులో వస్తుందన్నమాట. సో ఇక అందరూ తెలుగులో మాట్లాడుకోవచ్చు.

గమనిక: తెలుగు వారందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vQe3is81CKI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

28, జనవరి 2015, బుధవారం

WhatsAppని కంప్యూటర్ నుండి వాడడం ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=y4fboqEb3iE

ఎక్కువసేపు పిసి, లాప్‌టాప్‌ల మీద స్పెండ్ చేసేవారు మొబైల్‌లో చిన్న స్క్రీన్ మీద whatsappలో ఛాట్ చేసుకోవడం కష్టంగా ఉందా? WhatsAppని పిసి నుండి ఎలా వాడుకోవచ్చో గతంలో 2-3 టెక్నిక్‌లు వీడియోల రూపంలో చూపించాను. ప్రస్తుతం whatsapp అధికారికంగా పిసి నుండి whatsappని వాడుకునే వీలు కల్పించిన నేపధ్యంలో అదెలాగో ప్రాక్టికల్‌గా ఈ వీడియో డెమోలో చూపించడం జరిగింది.

ఇప్పటికే ఇది వాడుతున్న వారు "ఇది మాకు తెలుసు" అనాల్సిన పనిలేదు. మీలాంటి వాళ్ల కోసం కాదు ఇది తయారు చేస్తున్నది, తెలియని వాళ్లు, కొత్తవి తెలుసుకోవాలన్న కోరిక మీకన్నా బలంగా ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు.. అలాంటి వాళ్ల కోసం ప్రిపేర్ చెయ్యబడే వీడియోల్లో ఇదొకటి.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=y4fboqEb3iE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

27, జనవరి 2015, మంగళవారం

బయట తిరిగే మీ ఫ్యామిలీ మెంబర్ల బాగోగులు ఇలా తెలుసుకోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sINxcpBSMaA

బయటికెళ్లిన మనిషి ఇంటికి తిరిగి వచ్చేటంత వరకూ భయమే. సొసైటీలో రకరకాల రిస్కులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మహిళల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలో ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లిన మన ఫ్యామిలీ మెంబర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో map ద్వారా తెలుసుకుంటూ వారికి టచ్‌లో ఉండే ఓ అద్భుతమైన అప్లికేషన్‌ని ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా demo చూపించాను.

సో దీన్ని ఫాలో అవడం ద్వారా టెక్నాలజీ సాయంతో ఫ్యామిలీ వీలైనంత సురక్షితంగా ఉండే అవకాశముంది.

గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sINxcpBSMaA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

20, జనవరి 2015, మంగళవారం

మీకు నచ్చిన ఫొటోలతో మీ ఇంటికే కాలెండర్ తెప్పించుకోవాలా? ఇది ట్రై చేయండి.. Must Watch & Share

మీకు నచ్చిన ఫొటోలతో మీ ఇంటికే కాలెండర్ తెప్పించుకోవాలా? ఇది ట్రై చేయండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IsvHdfJIzvs

న్యూఇయర్‌లో మనకు చాలామంది కాలెండర్లు ఇస్తుంటారు.. వాటిలో వారి సంస్థ లోగోలూ, పేర్లూ కన్పిస్తుంటాయి, అలా కాకుండా మీకు నచ్చిన ఫొటోలతో ఓ స్వంత కాలెండర్ తయారు చేయించుకోగలిగితే ఎలా ఉంటుంది? మీ సెల్‌ఫోన్‌లోనో, మీ కంప్యూటర్లోనో ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేసి తగిన అమౌంట్ పే చేస్తే 2-3 రోజుల్లో కాలెండర్ మీ ఇంటికే వచ్చే ఓ అద్భుతమైన సర్వీస్‌ ఉంది. జస్ట్ ఎక్స్‌పెరిమెంటల్‌గా నేను నాకున్న కూపన్స్ ఆధారంగా తెప్పించుకున్న ఆ కాలెండర్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

కేవలం కాలెండర్లే కాదు.. మీ ఫొటోల్నీ క్వాలిటీ పేపర్‌పై ప్రింటింగ్ చేయించుకోవచ్చు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IsvHdfJIzvs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

అతి శక్తివంతమైన టాబ్లెట్ Microsoft Surface Pro 3 రివ్యూ.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iMaymIsRlJY

ఏళ్ల తరబడి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ వచ్చిన వాళ్లు Android బేస్డ్ టాబ్లెట్లు ఎందుకూ పనికిరావన్న విషయం ఈపాటికే అర్థం చేసుకుని ఉంటారు. Windowsలో కోట్ల కొద్దీ అప్లికేషన్లు లభిస్తాయి. మనం తెలుగు టైపింగ్‌కి వాడే అనూ ఫాంట్లు మొదలుకుని పేజ్ మేకర్, ఫొటోషాప్, autocad, adobe after effects వంటి శక్తివంతమైనవేమీ Androidలో సాధ్యపడవు.

మీరు ఓ చిన్న టాబ్లెట్ రూపంలో Windows ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విశ్వరూపం చూడాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న Microsoft Surface Pro 3కి మించింది లేదు. లాప్‌టాప్‌లకు బదులు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=iMaymIsRlJY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

10, జనవరి 2015, శనివారం

Samsung Galaxy Note 4 అన్ ప్యాకింగ్, రివ్యూ.. తెలుగులో.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=FVoKOzTKOCs

ఇప్పుడు ప్రపంచంలో top రెండు ఫోన్ మోడళ్ల పేర్లు చెప్పాలంటే ఉన్నవి రెండే మోడళ్లు Samsung Galaxy Note 4 మరియు iPhone 6 Plus. వీటిలో iPhone 6 Plusని గతంలోనే https://www.youtube.com/watch?v=vRi781tr03w అనే లింకులో పరిచయం చేశాను.

ఇదే విధంగా Samsung Galaxy Note 4ని ఇప్పుడు చూద్దాం. చాలా పవర్‌పుల్ ఫోన్. కెమెరా క్వాలిటీ దగ్గర్నుండి, fingerprint scanner, health sensor వంటి అనేకం దీనిలో ప్రత్యేకం.

అంతేకాదు దీనిలో ప్రవేశపెట్టబడిన fast charging సదుపాయం ద్వారా కేవలం 30 నిముషాల్లో బ్యాటరీని full charge చేసేయొచ్చు. Ultra Power Saving Mode ద్వారా బ్యాటరీ ఐదారు రోజులు వచ్చేలా బ్యాకప్ పొందొచ్చు.

ఇంత అద్భుతమైన డివైజ్‌ ఎలా ఉందో మీరే ప్రాక్టికల్‌గా చూడండి. కొత్త సీల్డ్ పీస్ unpack చేస్తూ తయారు చెయ్యబడిన వీడియో ఇది.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=FVoKOzTKOCs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

4, జనవరి 2015, ఆదివారం

OnePlus One ఫోన్ Unboxing & Review తెలుగులో.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sUfC8juVc6A

3 GB RAM, Quad Core Processor, Full HD Display కలిగిన పవర్‌ఫుల్ ఫోన్ కొనాలంటే రూ. 35000లకు పైబడి ఖర్చుపెట్టాలన్నది ఒకప్పటి మాట.

OnePlus బ్రాండ్ విడుదల చేసిన One ఫోన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫోన్ unboxing, reviewలను "కంప్యూటర్ ఎరా" మేగజైన్ మీ కోసం తెలుగులో అందిస్తోంది ఈ వీడియోలో! చూసేయండి మరి!

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=sUfC8juVc6A

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu