2, ఆగస్టు 2007, గురువారం

డూప్లికేట్ ఫొటోలు పేరుకుపోయాయా?


నెట్లో వివిధ వెబ్ సైట్లలో ఒకే ఫొటో వేర్వేరు పేర్లతో పొందుపరచబడి ఉంటుంది. ఆల్రెడీ ఒక సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోనే తిరిగి వేరే సైట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు కొత్త ఇమేజ్ గా పొరబడి మళ్లీ డౌన్ లోడ్ చేసుకుంటుంటాం. అలాగే డిజిటల్ కెమెరా, స్కానర్ల నుండి స్కాన్ చేసుకున్న ఫొటోలను కూడా హడావుడిగా చాలామంది ఆల్రెడీ సేవ్ చేసిన కాపీనే మళ్లీ హార్డ్ డిస్క్ల్ లో సేవ్ చేస్తుంటారు. ఇలాంటి చర్యల వలన తెలియకుండానే డూప్లికేట్ ఫొటోలు పెరిగిపోతుంటాయి. వందల కొద్దీ ఫొటోలు ఉన్నప్పుడు ప్రతీ దాన్నీ నిశితంగా పరిశీలించి డూప్లికేట్లను ఏరివేయడం చాలా కష్టమైన వ్యవహారం. దీనికి పరిష్కారమే..Unique Filer అనే సాప్ట్ వేర్. ఇది ఫైల్ నేంలను కాకుండా రియల్ గా డిస్క్ లోని వివిధ ఇమేజ్ ఫైళ్లను ఒకదానితో ఒకటి పోల్చి చూసి వాటిలోని ప్రతీ పిక్సెల్ నీ కంపేర్ చేసి ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లు ఒకే కంటెంట్ ని కలిగి ఉన్నట్లయితే వాటిని స్ర్కీన్ పై చూపిస్తుంది. మనం రెండింటినీ పరిశీలించి అవసరం లేని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. కేవలం ఫొటోలను మాత్రమే కాకుండా ఈ సాప్ట్ వేర్ MP3 సాంగ్స్ యొక్క డూప్లికేట్లనీ చాలా వేగంగా వెదికి పట్టుకోగలదు. వీడియో ఫైళ్ల డూప్లికేట్లను కూడా ఇది వెదుకుతోంది. దీన్ని http://www.uniquefiler.com/download.htm అనే వెబ్ పేజీ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

3 కామెంట్‌లు:

...... చెప్పారు...

శ్రీధర్ గారికి నమస్కారం,
నేను ఇంతకు ముందు మీ ఆర్టికిల్స్ చాలా చదవాను(ముఖ్యంగా కంప్యుతర్ ఎరా పుస్తకంలొ ).అవి నిజంగా చాల వుపయుక్తంగా వుంటాయి. ఇప్పుడు ఈ ఫ్లాష్ ప్రెసెంటేషన్ కూద చాలా ఇంఫర్మెటివ్ గా బాగుంది. మీకు ధన్యవాదాలు.
sateesharv@gmail.com

అజ్ఞాత చెప్పారు...

సతీష్ గారూ మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్

Niranjan Pulipati చెప్పారు...

హాయ్ .. చాలా మంచి విషయం చెప్పారు. నా దగ్గర వున్న 30 GB పాటలలో చాలా డూప్లికేట్ వున్నాయి. ఇంకా ఫోటోలు కూడా. దీనిద్వారా ఆ డూప్లికేట్ ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు. థాంక్స్