27, ఫిబ్రవరి 2008, బుధవారం

అంతరంగం - ఫిబ్రవరి 2008


"బ్లాగరు నవ్వాలి" అనుకోకుండానే అసంకల్పితంగా బ్లాగరైన బ్లాగరు శ్రీ చరసాల రేణుకాప్రసాద్‍గారు. ఆయన బ్లాగు "అంతరంగం’ అనే పేరుతో సుప్రసిద్ధం. ఇది 2006 జూన్ నెలనుండి అంతర్జాలంలో ప్రకటితమౌతూ ఉంది. శ్రీ చరసాల కడప జిల్లాకు చెందినవారు. ఆయన ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్, భీమవరంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఇండియాలో కొంత కాలంపాటు పనిచేసారు. తర్వాత 1997-98ప్రాంతంలో అమెరికా వెళ్ళారు. అక్కడ Verizon కంపెనీలో కొంతకాలం ఉండి , ఆ దేశపు రవాణాశాఖలో పని చేసి ప్రస్తుతం Morgan Stanley కంపెనీలో పని చేస్తున్నారు. చరసాలగారి బ్లాగు ముక్కుసూటిదనానికి, విషయస్పృష్టతకు, నిర్దుష్టమైన తెలుగు వ్యావహారిక శైలికి పేరెన్నిక గన్నది. ఆయన conclusionsతో విభేదించేవారు ఉండొచ్చునేమో గాని ఆయన విశ్లేషణతో విభేదించేవారెవరూ లేరు. అనుభవాలు, ఆధ్యాత్మికం, కవితలు, చరిత్ర మొదలైన 10 వర్గాలుగా అంతరంగం బ్లాగులోని తపాలు వింగడించబడ్డాయి. ఈ అన్ని వర్గాల కిందా కలిపి 200కు పై చిలుకు వ్యాసాలున్నాయి.

భౌతికవాదం : శ్రీ చరసాల ప్రసాద్ నాస్తికుణ్ణని ఎక్కడా సూటిగా చెప్పకపోయినా, దేవుడిని, మత గ్రంధాల్ని విమర్శించకపోయినా ఆయన రచనలు భౌతికవాదం వైపే పూర్తిగా మొగ్గుచూపుతాయి. ప్రకృతిలో ఉన్నది రకరకాల భౌతిక శక్తులు మాత్రమేనని పేర్కొంటూ "ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడు అంతే " అంటారు "నమ్మకం" అనే టపాలో. అంతరాత్మ ఒకటుందని కూడా ఆయన విశ్వసించరు. "మనకు తెలియనిదేది అంతరాత్మకూ తెలియదనే చెప్పాలి" అంటారు అంతరాత్మ అనే టపాలో !. "నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఈ విశ్వమంతా కొన్ని భౌతిక సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఆ సూత్రాలే దేవుడనుకుంటాను." అని కుండబద్దలు కొట్టారు పాఠకుల కోరికపై "దేవుడి పుట్టుక" అనే టపా రాస్తూ.

అమెరికా జీవితం : అమెరికావాసి అయినప్పటికీ చరసాలగారిలొ మాతృదేశాభిమానం పదిలంగానే ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆయన ఒక కంట నిశితంగా గమనిస్తూనే ఉన్నారనడానికి దాదాపు ప్రతి టపా నిలువెత్తు సాక్ష్యమే. తాను జన్మించిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఇటీవల పునర్విభజన కసరత్తుకు గురికావడం గుఱించి "అది నా కళ్లముందర పుట్టింది, పోనూపోయింది" అన్నారు. అమెరికన్ పౌరసత్వం గుఱించి రాస్తూ "పుట్టినచోటును బట్టి పౌరసత్వ విధేయత వస్తుందేమో గాని వారసత్వం వస్తుందా?" అని ప్రశ్నిస్తారు "పౌరసత్వ విధేయత" అనే టపాలొ! "అమెరికా ప్రజాస్వామ్యం మన రిగ్గింగుకు సామ్యం " అనే టపాలో "వీళ్ళ (అధ్యక్ష) ఎన్నికల తతంగం చూస్తే మా రాయలసీమలో చాలా పల్లెల్లో జరిగే ఎన్నికల తంతుకి దీనికీ పెద్ద తేడా లేదేమో అనిపించిం" దంటు మేడిపండు పొట్టవిప్పి చూపించారు.

సామాజిక చింతనాధార: నలుగురూ నడవగా నలిగిన బాట వెంటే పరుగులు తీయడం చరసాల గారి పద్ధతి కాదు. పాతచింతకాయ పచ్చళ్ళకు ఇష్టమైనా కష్టమైనా తనకు స్పురించిన ఒక క్రొత్త సత్యాన్ని నిర్భీతిగా వెల్లడించడమే ఆయనకు అభీష్టం. అందుకు వచ్చే వ్యాఖ్యలకు, విమర్శలకూ పేరుపేరునా ఓపికగా సమాధానం చెప్పడం ఆయన విశిష్టత. "భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడుచేస్తున్నాం" అంటారు "చదువుల్లో పోటీ -బాల్యం లూటీ" అనే టపాలో ! అమెరికా జీవనశైలిలో జరిగే ప్రకృతి వనర్ల దుర్వినియోగం గుఱించి రాస్తూ " ఈ భూమిని చెత్త కింద మార్చేసి మళ్ళి అదే చెత్తవాసన అంటకుండా ఎ.సి.రూముల్లో కలుగుల్లో ఎలుకల్లా అవసరమా ఈ జీవితాలు?" అని అంతర్మధనం చేస్తారు "ఉత్తమజీవితమా x వ్యర్ధ జీవితమా?" అనే టపాలో! శ్రీచరసాల ప్రసాద్ గారి బ్లాగు తొలి తెలుగు బ్లాగుల్లో ఒకటి మాత్రమే కాదు. తొలి తెలివైన బ్లాగుల్లో కూడా ఒకటి అంటే తప్పులేదేమో !!..


సమీక్ష తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం

24, ఫిబ్రవరి 2008, ఆదివారం

ఫిబ్రవరి 24, 2008 మీటింగ్ రిపోర్ట్

ఫిబ్రవరి 24, 2008 సమావేశ నివేదిక
ప్రదేశం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకూ.
హాజరైన సభ్యుల వివరాలు:
1. ఎం. భాస్కర్
2. ఎల్. రాము (మిర్యాలగూడ)
3. బి. పట్టాభిరాం
4. ఎన్. కృష్ణకిషోర్
5. ఆర్. శ్రీనివాస్
6. పి. శ్రీనివాస్
7. రవీంద్ర కాట్రగడ్డ
8. సాయిచరణ్
9. సి.పి.ఆర్. దీక్షితులు (రాము)
10. ఆర్. ఎల్. నాయక్
11. ఎ.వి.యం. రావు (మల్లిఖార్జునరావు)
12. బి. రఘురాం
13. బి.వై. శివరాం
14. జి. చైతన్య
15. సిహెచ్. సత్యనారాయణ
16. కె. నాగభూషణం (వరంగల్)
17. నల్లమోతు శ్రీధర్
18. గణపతి (రైతేరాజు బ్లాగు)
19. గణపతి గారి స్నేహితులు

మున్నాకాల్పనిక్ టైఫాయిడ్ ఫీవర్ వల్ల రాలేకపోయారు. నవీన్ రెడ్డి గారు ముఖ్యమైన ఆఫీస్ పనుల వల్ల, శ్రీనివాస్ (Mr. Srinu) బెంగుళూరులో ఉండడం వల్ల, గోవర్థన్ కుమార్ (కర్నూల్)లో ఉండడం వల్ల మరికొంతమంది సభ్యులు సన్నిహితుల పెళ్లిళ్లు ఉండడం వల్ల ఈ సమావేశానికి రాలేకపోయారు.
సరిగ్గా 2.55 నిముషాలకు నేను కృష్ణకాంత్ పార్క్ వద్దకు చేరుకునేసరికి ఆ సరికే అక్కడకు వచ్చిన పట్టాభిరాం గారు వాళ్ల అబ్బాయిచే కృష్ణకాంత్ పార్క్ టికెట్ కౌంటర్ వద్ద వినైల్ పెయింటింగ్ బ్యానర్ కట్టిస్తూ కన్పించారు. నేను ఆశ్చర్యపడి ఇంత ఆర్భాటం ఎందుకు సర్.. అంటే సమావేశానికి హాజరయ్యే వారు కన్ ఫ్యూజ్ కాకుండా అంటూ బదులిచ్చారు. 3.10 వరకూ చూసినా ఐదారుగురం మాత్రమే ఉన్నాం.. సరే పెళ్లిళ్ల తాకిడి కదా ఇంకా ఎవరూ రారులే అన్న ఉద్దేశ్యంతో లోపలికి వెళ్లాం. ఒకరొకరిగా వచ్చి కలుస్తూ మొత్తం 19 మందిమి అయ్యాం.

1

టికెట్ గేట్ వద్ద పట్టాభిరాం గారు ఏర్పాటు చేసిన వినైల్ ప్రింట్

 

ఫోరమ్ విషయమై చర్చించిన అంశాలు:


http://computerera.co.in/forum అనే మన ఫోరంలో అందరినీ ఇబ్బందిపెట్టే వైరస్ లకు పరిష్కారాలు, చిట్కాలు, ఆసక్తికరమైన వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్లు వంటి సమగ్ర సమాచారాన్ని పొందుపరచడానికి కమిటెడ్ సభ్యులందరూ కనీసం రోజుకి ఒకటి రెండు పోస్టులైనా చేయాలన్న ప్రతిపాదనకు అందరి నుండి సుముఖత వ్యక్తమైంది. రవీంద్ర కాట్రగడ్డ వంటి కొంతమంది సభ్యులు తమ వద్ద కంటెంట్ ఉండీ దానిని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పలేమోమో అన్న సందేహంతో రాయడం లేదని అభిప్రాయం వ్యక్తపరిచారు. కంటెంట్ ముఖ్యం కానీ, దానిని ఎలా వ్యక్తపరిచినా అందరికీ ఉపయోగపడుతుందని, అంతగా అవసరం అయితే తర్వాత మోడరేటర్లు ఎడిట్ చేస్తారని చెప్పాం. ఫోరంలో తెలియక రాంగ్ సెక్షన్లలో పోస్టులు చేసేవారిని ఎడ్యుకేట్ చెయ్యడం ఎలా.. అన్న అంశం చర్చకు వచ్చినప్పుడు. ప్రతీ విభాగంలో Sticky పోస్టులు పెట్టి ఆ విభాగంలో ఎలాంటి అంశాలు పోస్టు చేయాలన్నది వివరంగా రాసిపెడితే బాగుంటుంది అని రాము (మిర్యాలగూడ) సూచించారు.

2

ఎడమ నుండి కుడికి వరుసగా: పట్టాభిరాం, భాస్కర్, రాము (మిర్యాలగూడ), నల్లమోతు శ్రీధర్, శ్రీనివాస్

 

ఇంతమంది కమిటెడ్ గా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుల గురించి మరింత మంది దృష్టికి తీసుకువెళ్లడం ఎలా అనే అంశం చర్చకు వచ్చినప్పుడు.. Friends Listలోకి వారికి లింకులు ఫార్వార్డ్ చేయడంతోపాటు Orkutలోని వివిధ కమ్యూనిటీలను విజిట్ చేసే మన సభ్యులే వాటిలో మన కార్యకలాపాల గురించి లింకులు పోస్ట్ చేయడం, అలాగే తాము విజిట్ చేసే ఇతర ఫోరంలలోనూ వీటి గురించి పోస్టులు చేయడం ద్వారా మరింతమంది వీటి ద్వారా ప్రయోజనం పొందవచ్చనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. అలాగే ఫోరంలో ప్రతీ పోస్ట్ యొక్క పేజీ క్రింద Send to a friend వంటి లింకు పొందుపరిస్తే తమకు నచ్చిన వ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు పంపించి తద్వారా వారూ ఇటువైపు చూసేలా చేయవచ్చనే సూచనా వచ్చింది. చాలా మంచి సూచన. దీని సాధ్యాసాధ్యాలు వీలైనంత త్వరగా పరిశీలించాలి. అలాగే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు చాలావరకూ స్వంత వెబ్ సైట్లు ఉన్న కారణంగా ఆయా కాలేజీల మెయిల్ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు సేకరించి మన కార్యకలాపాల గురించి వివరంగా ఓ note ప్రిపేర్ చేసి వారికి పంపించడం ద్వారా వారి సైట్లలో మన లింకులు పెట్టేలా.. లేదా కనీసం వారి నోటీస్ బోర్డ్ లో ఒక్కసారైనా మన లింకులు పొందుపరిచేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని నాగభూషణం గారు (వరంగల్) ప్రస్తావించడం జరిగింది. నిజంగా చాలా మంచి ఆలోచన ఇది. కానీ సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. వీలైనంతవరకూ ప్రయత్నిస్తే తప్పేముంది అన్పిస్తోంది, మన ప్రయత్నం చేయకుండా ఏమీ సాధ్యం కాదుగా!

3

ఎడమ నుండి కుడికి వరుసగా: ఆర్. ఎల్. నాయక్ (సగభాగమే ఫొటోలో వచ్చారు), రవీంద్ర కాట్రగడ్డ, సాయిచరణ్, భాస్కర్, నాగభూషణం (వరంగల్), నల్లమోతు శ్రీధర్, రాము (మిర్యాలగూడ), దీక్షితులు (రాము)

 

4

ఎడమ నుండి కుడికి వరుసగా: నల్లమోతు శ్రీధర్, రాము, దీక్షితులు, నాయక్, మల్లిఖార్జునరావు, పట్టాభిరాం

 

8

ఎడమ నుండి కుడికి వరుసగా: దీక్షితులు, నాయక్, మల్లిఖార్జునరావు, పట్టాభిరాం,  శివరాం, కృష్ణకిషోర్ (నువ్వుశెట్టి సోదరులు)

ఛాట్ రూమ్ గురించి జరిగిన చర్చ సారాంశం:
ఛాట్ రూమ్ లో ప్రశ్నలు అడిగేవారు ఎక్కువయ్యారు, సమాధానాలు చెప్పేవారు తక్కువయ్యారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఓ విచిత్రమైన సమస్య బయటపడింది. ఛాట్ రూమ్ లో రెగ్యులర్ గా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న కొంతమంది కూడా నేను (నల్లమోతు శ్రీధర్), ప్రసాద్ గారు, సాయిపోతూరి గారు వంటి వారు ఉన్నప్పుడు... తాము చెప్పే సమాధానం కరెక్టో కాదో ఎందుకు చెప్పడం.. పెద్దవాళ్లు ఉన్నారు కదా, వాళ్లే చూసుకుంటారు అన్న తరహా ఆలోచనతో కొంతమంది తమకు ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉన్నా ఆగిపోతున్నారని ఈ మీటింగ్ లో తెలిసింది. "ఇక్కడ ఎవరమూ నాలెడ్జ్ విషయంలో మాస్టర్లం కాదు.. అందరికీ తెలిసింది కొద్దోగొప్పో కాబట్టి నిస్సంకోచంగా మీకు తెలిసిన నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోండని" చెప్పడం జరిగింది. అలాగే ఫోరంని మోడరేట్ చెయ్యడానికి నాగభూషణం గారు (వరంగల్), రవీంద్ర కాట్రగడ్డ గారు, రాము గారు (మిర్యాలగూడ), చైతన్య గారు ఉత్సుకత చూపించారు. ఇకపోతే శ్రీనివాస్ గారు, పట్టాభిరాం గారు తెలుగు చదవడం విషయమై (అక్షరాలు విడిపోయి కన్పించడం వల్ల) చాలా ఇబ్బంది పడుతూ ఫోరం, ఛాట్ రూమ్ లకు రాలేకపోతున్నామని చెప్పారు. ఇలాంటి సమస్యని అధిగమించడం ఎలాగన్నది కొద్దిగా ఆలోచించాలి. కేవలం మనలను నేరుగా అప్రోచ్ అయేవారికే మనం తెలుగులో వచ్చే సందేహాలను గైడ్ చెయ్యగలుగుతున్నాం తప్ప మనల్ని అప్రోచ్ అవని వారు విసుగుచెంది వెళ్లిపోయే ప్రమాదం ఉంది కదా! అలాగే ఫోరం యొక్క ఇంటర్ ఫేస్ మరింత ఆకర్షణీయంగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారు. దానిని ప్రయత్నించాలి.

 

సరదా సరదా డిస్కషన్లు మధ్యలో కృష్ణకాంత్ పార్క్ వాళ్ల కళ్లుగప్పి దొంగచాటుగా తీసుకువెళ్లిన తినుబండారాలు ఆరగిస్తూ చాలా ఉత్సాహంగా జరిగింది సమావేశం. కృష్ణకిషోర్ గారు, పట్టాభిరాం గారు తీసిన ఫొటోలు.. నేను సెల్ లో రికార్డ్ చేసిన కొద్ది నిడివి గల ఆడియో ఈ సమావేశపు జ్ఞాపకాలుగా నిలిచాయి.

- నల్లమోతు శ్రీధర్
24-02-2008
10.49 PM

లక్షల కొద్ది పాటలు వినడానికి సిద్ధంగా


మీ కంప్యూటర్లో మీకు బాగా నచ్చిన పాటలను ఎక్కడినుండైనా వినాలనుకుంటే Anywhere FM అనే వెబ్ పేజిలోకి వెళ్లి కొత్తగా ఒక అకౌంట్‍ని క్రియేట్ చేసుకుని మీ పాటలను అప్‍లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పాటలని ప్రపంచంలో ఏ ఇతర పిసి నుండైనా ఈ సైట్‍కి కనెక్ట్ అయి వినవచ్చు. అలాగే ఇతర పిసి యూజర్లు అప్‍లోడ్ చేసిన పాటలను సైతం మీరు ఈ సైట్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన MP3 ఫార్మేట్‍లో వినవచ్చు. ఇప్పటివరకూ 17 లక్షలకు పైగా పాటలు ఇక్కడ వినడానికి సిద్ధంగా ఉన్నాయి. సో…. మీరు సింపుల్‍గా ఈ సైట్‍కి కనెక్ట్ అయి మీకు నచ్చిన పాటలని నేరుగా వినేయవచ్చు.

గూగుల్లో సురక్షితంగా సెర్చ్ చేయడానికి


గుగుల్ సెర్చ్ ఇంజిన్‍లో మీరు ఏ పదం వెదికినా మీకు తెలియకుండానే మీ IP అడ్రస్, ఏ పదం కోసం వెదికారు, సమయం తదితర వివరాలు గూగుల్ యొక్క డేటాబేస్‍లో భద్రపరచబడతాయి. దీనివల్ల మీ ప్రవసీకి ఇబ్బంది కలగవచ్చు. మీ వివరాలు రికార్డ్ చేయబడకుండా నిరోధించడానికి googlonymous ద్వారా వెదకండి. గూగుల్ లోనే మీ వివరాలేమీ రికార్డ్ అవకుండా ఇది సెర్చ్ చేసి పెడుతుంది.

23, ఫిబ్రవరి 2008, శనివారం

అబ్దుల్ కలాం ప్రసంగం

నా మెయిల్ కి ఈరోజు ఫణికుమార్ అనే మిత్రుని నుండి ఓ ఫార్వార్డెడ్ మెసేజ్ వచ్చింది. ఎంతోకాలంగా నా మనసులో పేరుకుపోయిన ప్రశ్నలను కలాం ప్రసంగం సూటిగా వేలెత్తి చూపిన వైనం నా మనసుని ఆకట్టుకుంది. అందుకే అది టెక్నికల్ అంశం కాకపోయినా ఈ సాంకేతికాలు బ్లాగులో పోస్టు చేయడానికి నిశ్చయించుకున్నాను. దాని సారాంశం ఇది.

Please read this article by sparing 10 minutes from your busy life. Its
about us, after all...

The President of India DR. A. P. J. Abdul Kalam 's Speech in Hyderabad
..

Why is the media here so negative?
Why are we in India so embarrassed to recognize our own strengths, our
achievements? We are such a great nation. We have so many amazing
success stories but we refuse to acknowledge them. Why?
We are the first in milk production.
We are number one in Remote sensing satellites.
We are the second largest producer of wheat.
We are the second largest producer of rice.
Look at Dr. Sudarshan , he has transferred the tribal village into a
self-sustaining, self-driving unit. There are millions of such
achievements but our media is only obsessed in the bad news and failures
and disasters. I was in Tel Aviv once and I was reading the Israeli
newspaper. It was the day after a lot of attacks and bombardments and
deaths had taken place. The Hamas had struck. But the front page of the
newspaper had the picture of a Jewish gentleman who in five years had
transformed his desert into an orchid and a granary. It was this
inspiring picture that everyone woke up to. The gory details of
killings, bombardments, deaths, were inside in the newspaper, buried
among other news.

In India we only read about death, sickness, terrorism, crime. Why are
we so NEGATIVE? Another question: Why are we, as a nation so obsessed
with foreign things? We want foreign T. Vs, we want foreign shirts. We
want foreign technology.

Why this obsession with everything imported. Do we not realize that
self-respect comes with self-reliance? I was in Hyderabad giving this
lecture, when a 14 year old girl asked me for my autograph. I asked her
what her goal in life is. She replied: I want to live in a developed
India .. For her, you and I will have to build this developed India ..
You must proclaim. India is not an under-developed nation; it is a
highly developed nation. Do you have 10 minutes? Allow me to come back
with a vengeance.

Got 10 minutes for your country? If yes, then read; otherwise, choice is
yours.
YOU say that our government is inefficient.
YOU say that our laws are too old.
YOU say that the municipality does not pick up the garbage.
YOU say that the phones don't work, the railways are a joke,
The airline is the worst in the world, mails never reach their
destination.
YOU say that our country has been fed to the dogs and is the absolute
pits.

YOU say, say and say. What do YOU do about it?
Take a person on his way to Singapore .. Give him a name - YOURS. Give
him a face - YOURS. YOU walk out of the airport and you are at your
International best. In Singapore you don't throw cigarette butts on the
roads or eat in the stores. YOU are as proud of their Underground links
as they are. You pay $5 (approx. Rs. 60) to drive through Orchard Road
(equivalent of Mahim Causeway or Pedder Road) between 5 PM and 8 PM. YOU
come back to the parking lot to punch your parking ticket if you have
over stayed in a restaurant or a shopping mall irrespective of your
status identity... In Singapore you don't say anything, DO YOU? YOU
wouldn't dare to eat in public during Ramadan, in Dubai . YOU would not
dare to go out without your head covered in Jeddah. YOU would not dare
to buy an employee of the telephone exchange in London at 10 pounds (
Rs.650) a month to, 'see to it that my STD and ISD calls are billed to
someone else.'YOU would not dare to speed beyond 55 mph (88 km/h) in
Washington and then tell the traffic cop,
'Jaanta hai main kaun hoon (Do you know who I am?). I am so and so's
son.
Take your two bucks and get lost.' YOU wouldn't chuck an empty coconut
shell anywhere other than the garbage pail on the beaches in Australia
and New Zealand .
Why don't YOU spit Paan on the streets of Tokyo ? Why don't YOU use
examination jockeys or buy fake certificates in Boston ??? We are still
talking of the same YOU. YOU who can respect and conform to a foreign
system in other countries but cannot in your own. You who will throw
papers and cigarettes on the road the moment you touch Indian ground. If
you can be an involved and appreciative citizen in an alien country, why
cannot you be the same here in India ?

Once in an interview, the famous Ex-municipal commissioner of Bombay ,
Mr. Tinaikar , had a point to make. 'Rich people's dogs are walked on
the streets to leave their affluent droppings all over the place,' he
said. 'And then the same people turn around to criticize and blame the
authorities for inefficiency and dirty pavements. What do they expect
the officers to do? Go down with a broom every time their dog feels the
pressure in his bowels?
In America every dog owner has to clean up after his pet has done the
job. Same in Japan . Will the Indian citizen do that here?' He's right.
We go to the polls to choose a government and after that forfeit all
responsibility. We sit back wanting to be pampered and expect the
government to do everything for us whilst our contribution is totally
negative. We expect the government to clean up but we are not going to
stop chucking garbage all over the place nor are we going to stop to
pick a up a stray piece of paper and throw it in the bin. We expect the
railways to provide clean bathrooms but we are not going to learn the
proper use of bathrooms.
We want Indian Airlines and Air India to provide the best of food and
toiletries but we are not going to stop pilfering at the least
opportunity.
This applies even to the staff who is known not to pass on the service
to the public. When it comes to burning social issues like those related
to women, dowry, girl child! and others, we make loud drawing room
protestations and continue to do the reverse at home. Our excuse? 'It's
the whole system which has to change, how will it matter if I alone
forego my sons' rights to a dowry.' So who's going to change the system?

What does a system consist of ? Very conveniently for us it consists of
our neighbours, other households, other cities, other communities and
the government. But definitely not me and YOU. When it comes to us
actually making a positive contribution to the system we lock ourselves
along with our families into a safe cocoon and look into the distance at
countries far away and wait for a Mr.Clean to come along & work miracles
for us with a majestic sweep of his hand or we leave the country and run
away.
Like lazy cowards hounded by our fears we run to America to bask in
their glory and praise their system. When New York becomes insecure we
run to England .. When England experiences unemployment, we take the
next flight out to the Gulf. When the Gulf is war struck, we demand to
be rescued and brought home by the Indian government. Everybody is out
to abuse the country. Nobody thinks of feeding the system. Our
conscience is mortgaged to money.

Dear Indians, The article is highly thought inductive, calls for a great
deal of introspection and pricks one's conscience too.... I am echoing
J. F. Kennedy 's words to his fellow Americans to relate to Indians.....

'ASK WHAT WE CAN DO FOR INDIA
AND DO WHAT HAS TO BE DONE TO MAKE INDIA
WHAT AMERICA AND OTHER WESTERN COUNTRIES ARE TODAY'

Lets do what India needs from us.

Forward this mail to each Indian for a change instead of sending Jokes
or junk mails.

Thank you,

Dr. Abdul Kalaam

ఫిబ్రవరి 24న సమావేశానికి అహ్వానం

మనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పదిమందికీ పంచాలన్న లక్ష్యంతో.. అదే తరహా ఆలోచనావిధానం కలిగిన వ్యక్తులందరం కలిసి సమావేశమై మన లక్ష్యసాధన దిశగా కొన్ని మంచి ఆలోచనలు చేస్తే బాగుంటుందన్న తలంపుతో "కంప్యూటర్ ఎరా" మాసపత్రిక డిసెంబర్ నుండి ప్రతీనెలా లైక్ మైండెడ్ పీపుల్ తో సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల సమావేశం  ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. మీటింగ్ దాదాపు 5-5.30 గంటల వరకూ జరుగుతుంది. సమయం వీలుపడి అన్నింటికన్నా ముఖ్యంగా నిజంగా ఆసక్తి ఉన్నవాళ్లు రేపటి సమావేశానికి హాజరుకాగలరు.

సమావేశ వివరాలు:

తేదీ: ఫిబ్రవరి 24, ఆదివారం, 3 గంటలకు.

స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర. (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ రోడ్ లో ఉంటుంది ఇది)

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9848227008

కంప్యూటర్ నాలెడ్జ్ ని పదిమందికీ పంచాలన్న ఉత్సుకత ఉన్నవారు ఎవరైనా ఈ సమావేశానికి హాజరు కావచ్చు. వయస్సు, అర్హతలతో నిమిత్తం లేకుండా! కావలసింది హెల్పింగ్ నేచర్ మాత్రమే!

మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణకాంత్ పార్క్ టికెట్లు ఇచ్చే గేట్ వద్ద గుమికూడి అందరం కలసి లోపలికి వెళదాం.

22, ఫిబ్రవరి 2008, శుక్రవారం

Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??


చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది దానికన్నా అడ్వాన్స్ డ్‍గా ఉండే రెండవ తరం ప్రాసెసర్. Core Duoలో 2MB Cache మెమరీ ఉంటే Core2Duoలో 4 MB ఉంటుంది. అంతే తప్ప DualCoreకి Core2Duoకి ముడిపెట్టి గందరగోళపడవలసిన అవసరం లేదు. డ్యూయల్ కోర్‍కి చెందినదే Core2Duo మోడల్.

ఇక అశ్రద్ధ చేయవద్దుతమ కంఫ్యూటర్ సెక్యూరిటి పట్ల చాలామంది ఉదాసీనత కనబరుస్తుంటారు. ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్‍గా వాడే అప్లికేషన్ ప్రోగ్రాములకు సంబంధించి సెక్యూరిటీ ఫిక్స్ లు లభిస్తున్నా అవేమి తమకు అవసరం లేవన్నట్లు నెట్‍లో ఏ సైట్లని బడితే వాటిని స్వేచ్చగా ఓపెన్ చేస్తుంటారు. Mpack పేరిట ఇటీవల రష్యన్ హ్యాకర్లు, ఓ హ్యాకింగ్ ప్యాకేజిని రూపొందించి, అనేక ఆన్‍లైన్ సైట్లని హైజాక్ చేసారు. అలాగే ఈ ప్యాక్‍ని ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈప్యాక్‍ని కొనుగోలు చేసినవారు దీని సహాయంతో వివిధ వెబ్ సైట్లని హైజాక్ చేయడంతో పాటు, Internet Explorer 6, 7, Windows XP SP2, Vista IE7, Windows 2000 SP4 వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‍లు, అప్లికేషన్ ప్రోగ్రాముల్లోని సెక్యూరిటీ లోపాల ఆధారంగా ఇతర కంప్యూటర్లపై సులభంగా నియంత్రణ పొందగలుగుతున్నారు. ఈ తరహ అటాక్‍ల ప్రమాదాన్ని గుర్తించి మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ లోపాలని పూడ్చే విధంగా Fixలను, అప్‍డేట్లని అందిస్తోంది. ఆన్‍లైన్‍లో స్నేహితులుగా మారిన పలువురు కలిసి Mpack రూపకల్పనలో భాగం పంచుకున్నారు. మీరు ఇంతకుముందు చెప్పుకున్న అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగించకపోయినా ఒక్క చెత్త సైట్‍ని విజిట్ చేస్తే చాలు Mpack అటాక్ బారిన పడే ప్రమాదం ఉంది. Windows Xp SP2 సిస్టమ్‍లు Secure Sockets Layer and Transport Level Security ఆధారంగా ఎన్‍క్రిప్టెడ్ కనెక్షన్లని కలపడంలో సమస్యాత్మకంగా ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని హ్యాకర్ మన సిస్టమ్‍లోకి ప్రవేశించగలుగుతున్నారు. ఈ Mpack హ్యాకింగ్ సెట్‍ని మొదట్లో రష్యన్ హ్యాకర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత వివిధ ఫోరమ్‍లు, న్యూస్ గ్రూపుల నుండి భారీ స్పందన రావడంతో దానిని రూపొందించిన ఒరిజినల్ ప్రోగ్రామర్లు ఆ ప్యాక్‍ని 700-1000 డాలర్లకు విక్రయించడం మొదలుపెట్టారు. అంత ఎక్కువ ధర నిర్ణయించినా దాదాపు అధికశాతం సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని అది రిమోట్ కంప్యూటర్‍పై ఆధిపత్యం సంపాదించగలగడం వల్ల దానిని కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఓ వెబ్‍సైట్ ఆ Mpack రూపకర్తలలొ ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాంటి పలు విషయాలు వెలుగు చూశాయి. సో… అసలు ఫైర్‍వాల్ అంటే ఏమిటో తెలియకుండా, ఏంటీవైరస్ లేకుండా, Windowsని, అప్లికేషన్ ప్రోగ్రాములనూ అప్‍డేట్ చేసుకోకుండా మనం ఎన్ని చిక్కులు తెచ్చుకుంటున్నామో చూడండి...

వేరే ప్రదేశంలో పిసిని మోనిటర్ చేయడానికి


వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్లో కీబోర్డ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసి ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా మనకు తెలిపే సాఫ్ట్ వేరే Data Doctor Advanced Keylogger. ఈ ప్రోగ్రామ్ రిమోట్ కంఫ్యూటర్‍ప్జై ఇన్‍స్టాల్ అయిన తర్వాత ఆ సిస్టమ్‍లో దాగి ఉండి, ఆ పిసిపై పని చేస్తున్న యూజర్ టైప్ చేసే ప్రతి కీని, పాస్ వర్డ్ లను, చాటింగ్ సంభాషణలను, ఓపెన్ చేసే వెబ్ పేజీల వివరాలను రికార్డ్ చేసి మనకు పంపిస్తుంటుంది. వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇది పనికొస్తుంది.

21, ఫిబ్రవరి 2008, గురువారం

హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా

stellar-wipe-data-cleanup-and-file-eraser-utility

మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్  వేర్‌ని ఉపయోగించినా ఇతరులు ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. హార్డ్ డిస్క్ లో ఇంతకుముందు డిలీట్ చేసిన డేటాని ఏయే సమయాల్లో wipe చెయ్యడానికి పూనుకోవాలో కూడా ఇందులో షెడ్యూల్ చేసుకోవచ్చు.

20, ఫిబ్రవరి 2008, బుధవారం

మ్యూజిక్‍కి కంటెంట్ ప్రొటెక్షన్ వద్దనుకుంటే…WInXP తో పాటు పొందుపరచబడిన విండోస్ మీడియా ప్లేయర్‍లో మ్యూజిక్ సిడిలను కాపీ చేసుకునే సదుపాయం కూడా అందించబడింది. అయితే ఎవరు బడితే వారు ఆ సిడిలోని మ్యూజిక్‍ని కాపీ చేయడానికి వీల్లేకుండా ’లైసెన్సింగ్’సదుపాయం సైతం అందించబడింది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు మీడియాప్లేయర్ Tools మెనూలో ఉండే Copy Music అనే విభాగంలో Copy Settings క్రింద Protect Content అనే బటన్‍ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

Read - only ఫైళ్ళుగా మారితే సేవ్ చేయడం…

హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళని ఎప్పుడైనా నిరభ్యంతరంగా వివిధ అప్లికేషన్ ప్రోగ్రాముల ద్వారా ఓపెన్ చేసుకుని ఎడిట్/సేవ్ చేసుకోవచ్చు. అయితే హార్డ్ డిస్క్ స్పేస్ ని ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో డిస్క్ లోని ఫైళ్లని సిడి రైటర్ ద్వారా సిడిల్లోకి రికార్డ్ చేసినప్పుడు ఆ ఫైళ్లని తిరిగి సిడి నుండి సిస్టమ్ లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేసి సేవ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు cannot save అని ఎర్రర్ చూపించబడుతుంది. దీనికి కారణం. CD_ROM డిస్క్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ మాత్రమే. దానినుండి కాపీ చేశాం కనుకే ఆ ఫైళ్ళని సేవ్ చెయ్యలేము. ఈ నేపధ్యంలో సిడి నుండి హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకున్న వెంటనే ఫైల్‍పై రైట్‍క్లిక్ చేసి Propertiesలో Read-only ఆప్షన్‍ని డిసేబుల్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్‍ని ఎడిట్ చేయండి.

ఏ DLL ఫైల్ ఏ ప్రోగ్రాముకి సంబంధించిందీ ?వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములు, డివైజ్ డ్రైవర్లు వందలకొద్ది DLL ఫైళ్ళని మన సిస్టమ్‍లోకి కాపీ చేస్తుంటాయి. DLL file missing అంటు ఎప్పుడైనా ఎర్రర్ మెసేజ్ కనిపించిందంటే ఆ DLL ఫైల్ ఏ ప్రోగ్రామ్‍కి సంబంధించిందో అర్ధం కాక సతమతమవుతుంటాం. ఈ నేపధ్యంలో DLL Informant అనే ప్రోగ్రామ్‍ని మన సిస్టమ్‍లో ఇన్‍స్టాల్ చేసుకుని రన్ చేస్తే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని DLL ఫైళ్లని, వాటి ఆధారంగా పనిచేసే ప్రోగ్రాముల్ని గుర్తించి సమగ్ర సమాచారం అందిస్తుంది. రిజిస్టి పాత్‍లతో సహా ఇది వివరాలు తెలియజేస్తుంది.

16, ఫిబ్రవరి 2008, శనివారం

వ్యక్తుల కదలికలను రికార్డ్ చేసే ప్రోగ్రామ్


పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టవలసి వచ్చినప్పుడు కెమెరాలను అమర్చుతుంటారు. ఇలాంటి కెమెరాల నుండి లభించిన వీడియోని 24 గంటలూ రికార్డ్ చేసే ప్రోగ్రామ్ Xtra Surveillance. ఇది మొత్తం 16 కెమెరాలను, 8 సెన్సార్లను సపోర్ట్ చేస్తుంది. రిమోట్ సర్వర్‌కి FTP ద్వారా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడం, ఆటోమేటిక్‌గా మెయిల్, SMSల ద్వరా అలారమ్ నోటీఫికేషన్లకి చేరవేయడం.. వంటి పవర్‌ఫుల్ సదుపాయాలెన్నో ఈ ప్రోగ్రామ్‌లో లభిస్తున్నాయి. వీడియో స్టోరేజ్‌కి ఎంత డిస్క్ స్పేస్ కేటాయించాలన్నది కూడా డిఫైన్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం గుర్తుంచుకోవడానికి


ఫోన్ నెంబర్లు, అడ్రస్, అపాయింట్‌మెంట్లు, బిల్లుల గడువుతేదీలు ఇలా వివిధ సందర్భాల్లో పలు అంశాలను గుర్తుంచుకోవడానికి పేపర్‌పై నోట్ చేసుకుంటుంటారు. Automatic Robot అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సింపుల్‌గా ముఖ్యమైన సమాచారాన్ని ఆ ప్రోగ్రాంలో టైప్ చేసి save అనే బటన్ క్లిక్ చేస్తే అది మొత్తం డేటా బేస్‌లో స్టోర్ అవుతుంది. తర్వతా ఎప్పుడైనా ఆ సమాచారం అవసరమైతే సింపుల్‌గా ఆ డేటాలోని ఏదో ఒక పదాన్ని కీవర్డ్‌గా టైప్ చేసి, search బటన్ క్లిక్ చేస్తే ఆ సమాచారం తిరిగి స్క్రీన్‌పై చూపించబడుతుంది. ఇది చాల ఉపయోగకరమైన ప్రోగ్రామ్.

12, ఫిబ్రవరి 2008, మంగళవారం

Hibernation అవసరం లేదనుకుంటే..ప్రస్తుతం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్థితిలొ ఉందో ( ఏయే ప్రోగ్రాములు, సర్వీసులు రన్ అవుతున్నాయన్నది) ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే Hibernation అనే సదుపాయం పెద్దగా ఉపయోగించనివారు దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్‍లో C డ్రైవ్‍లో hiberfil.sys అనే హిడెన్ ఫైల్ గనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్‍లో Hibernation ఎనేబుల్ చేసి ఉన్నట్లు భావించాలి. దీన్ని డిసేబుల్ చెయ్యడానికి Control Panel>Performance and Maintainance ఆప్షన్‍ని ఎంచుకుని అందులో Power Options> Hibernate అనే విభాగంలోకి వెళ్ళి Enable hibernation అనే ఆప్శన్ వద్ద ఉన్న టిక్ తీసేయాలి. సహజంగా మన సిస్టమ్‍లో ఎంత RAM ఉందో అంత స్థలాన్ని hibernate ఆక్రమించుకుంటుంది.

ఉచితంగా పోడ్‍కేస్ట్ అందిస్తున్న సర్వీసులుఫ్రీ ఫైల్ హోస్టింగ్, ఇమేజ్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్, వీడియో సర్వీసులు ఎలాగైతే ఇంటర్నెట్‍ని ముంచెత్తుతున్నాయో ఈ మధ్య మీ స్వంత Podcastలను ఏ మాత్రం ఖర్చు లేకుండా ఉచితంగా హోస్ట్ చెయ్యడానికి కూడా కొన్ని వెబ్‍సైట్లు ముందుకు వస్తున్నాయి. వాటిలో www.blip.TV అనే వెబ్‍సైట్ ఒకటి. దీనికి MP3 ఫైళ్లని అప్‍లోడ్ చేసుకోవచ్చు. చక్కని ఇంటర్‍ఫేస్ కలిగిన ఈ వెబ్‍సైట్ RSS feeds ని కూడా అందిస్తుంది. ఈ సైట్‍ని విజిట్ చేసిన వారు ఉచితంగా మీరు అప్‍లోడ్ చేసిన MP3 ఫైళ్ళని డౌన్‍లోడ్ చేసుకోగలుగుతారు. అలాగే www.divshare.com అనే వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు. ఈ వెబ్‍సైట్‍లోకి మీరు అప్‍లోడ్ చేసుకున్న MP3 ఫైళ్ళని వెబ్‍పేజిల్లోకి ఎంబెడ్ చేసుకుని మీ RSS ఫీల్‍లను విజిట్ చేసే యూజర్లు నేరుగా ఆ వెబ్‍పేజీ‍లోనే ప్లే అవగలిగే Flash MP3 Player ద్వారా, మీరు అప్‍లోడ్ చేసిన పాటలను వినగలిగే సదుపాయాన్ని ఈ వెబ్‍సైట్ కల్పిస్తోంది అన్నమాట. అంటే ఈ సైట్‍కి అప్‍లోడ్ చేసిన పాటలు అక్కడే వినవచ్చు తప్ప డౌన్‍లోడ్ చేసుకోవడానికి వీలుపడదు. ఇకపోతే www.ourmedia.org అనే వెబ్‍సైట్ అపరిమితమైన స్టోరేజ్ స్పేస్‍ని, బ్యాండ్‍విడ్త్ ని అందిస్తోంది. మీ స్వంత పోడ్‍కాస్ట్ సృష్టించుకోవడానికి ఈ వెబ్‍సైట్‍ని ఎంచుకోవచ్చు.

10, ఫిబ్రవరి 2008, ఆదివారం

Wordpress లో బ్లాగు మొదలుపెట్టడం ఎలా ...

1. www.wordpress.com కి వెళ్ళి కొత్త అకౌంట్ తెరవండి.2. అక్కడ మీ వివరాలు ఇచ్చి అకౌంట్ మొదలుపెట్టండి.3.ఇలా మీ పేరు , మెయిల్ అడ్రస్ ఇవ్వండి.4. మీ బ్లాగు మొదలైంది. ఇక దానికి పేరు పెట్టండి.


5. ఇక మీ బ్లాగు ఇలా ఉంటుంది. దీనికి కాస్త మెరుగులు దిద్దాలి.


6.dashboard > presentation లోమీకు నచ్చిన template ఎంచుకోండి.


7. template మార్చాక మీ బ్లాగు ఇలా ఉంటుంది.8.write new post లో మీ టపా టైటిల్, టపా లేదా వ్యాసం, దానికి తగిన వర్గం (label)ఇవ్వండి.9. బ్లాగు టపా రాసిన తర్వాత మీకు నచ్చిన చిత్రాన్ని upload సెలెక్ట్ చేసుకుని అప్‍లోడ్ చేయండి.


10. చిత్రం అప్‍లోడ్ చేసాక ఇలా ఉంటుంది.11.dashboard > blog status లో ప్రతి రోజు మీ బ్లాగుకు వచ్చే విజిటర్స్ వివరాలు చూడొచ్చు.12. dashboard > presentation > custom image header క్లిక్ చేసి మీకు నచ్చిన చిత్రాన్ని మీ బ్లాగు శీర్షిక (హెడర్) లా పెట్టుకోవచ్చు ..13. ఆ చిత్రం పెట్టాక ఇలా ఉంటుంది.14. dashboard > presentation > widgets క్లిక్ చేసి మీకు కావల్సిన వివరాలు మీ బ్లాగుకు చేర్చండి.15. అన్ని హంగులతో తయారైన wordpress బ్లాగు ఇలా ఉంటుంది.


కొన్ని అందమైన బ్లాగులు

దీపిక

వీవెనుడి టెక్నిక్కులు

9, ఫిబ్రవరి 2008, శనివారం

Blogger లో బ్లాగు మొదలు పెట్టడం ఎలా???

1.బ్లాగు మొదలు పెట్టాలంటే ముందుగా http://www.blogger.com కి వెళ్ళండి.2. ఇక్కడ మీ జిమెయిల్ ఐడి ఇచ్చి మొదలు పెట్టండి. ఒకవేళ మీ వద్ద యాహూ మెయిల్ ID మాత్రమే ఉంటే దానినైనా వాడవచ్చు.3. మీ బ్లాగుకు టైటిల్ , చిరునామా ఇవ్వండి. ఒకవేళ మీరిచ్చిన పేరు ఒప్పుకోకపోతే వేరేది ఇవ్వండి.


4. హుర్రే !! మీ బ్లాగు మొదలైంది ...5. ఇక్కడి బాక్సులలో మీరు రాయాలనుకున్నది టైటీల్, విభాగం, వ్యాసం ,లేఖిని కాని, బరహ కాని ఉపయోగించి రాయండి.6. అది ఇలాగ కనిపిస్తుంది.7. ఈ టపాకి చిత్రాలు చేర్చడం. add image క్లిక్ చేసి మీ సిస్టమ్ లోఉన్న చిత్రాలను upload చేయండి.


8. అది ఇలా కనిపిస్తుంది.


9. ఇప్పుడు మీ బ్లాగు మొదటి టపాతో ఇలా కనిపిస్తుంది. ఇంకా దీనికి మెరుగులు దిద్దాలి.10. pick new template తో మీకు నచ్చిన బ్లాగు ముఖచిత్రాన్ని సెలెక్ట్ చేసుకోండి.11. dashboard నుండి layout సెలెక్ట్ చేసుకోండి.12.page elements సెలెక్ట్ చేసుకుని మీకు కావల్సిన లింకులు, లేబిల్స్, సైట్ మీటర్ జావా కోడ్‍లు, చిత్రాలు చేర్చుకోవచ్చు.13. Fonts and Colours లో మీకు నచ్చిన విధంగ పేజిలోని ప్రతి అంశాన్ని మార్చుకోవచ్చు.14. dashboard లో Settings సెలెక్ట్ చేసుకోండి.15.ఇక్కడ వివిధ సెట్టింగులను మీ ఇష్టానుసారం అమర్చుకోండి.
16. మీ బ్లాగుకు సంగీతంకూడా పెట్టుకోవచ్చు. esnips లో upload చేసి ఆ కోడ్ ఇలా edit HTML లో పెట్టాలి.


అలా సంగీతం పెట్టిన ఒక బ్లాగు..
నైమిశారణ్యం

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కొన్ని అందంగా ముస్తాబైన తెలుగు బ్లాగులు

గీతలహరి

జాగృతి

విశాఖతీరాన

అభినయని

5, ఫిబ్రవరి 2008, మంగళవారం

జ్యోతి ... జనవరి 2008


http://vjyothi.wordpress.com


తెలుగు బ్లాగ్లోకం "జ్యోతక్క" అని ప్రేమగా, కించిత్ గౌరవంగా పిల్చుకునే శ్రీమతి వలబోజు జ్యోతిగారు ఏకకాలంలో ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తూ పనిలోపనిగా పొద్దు వెబ్జీన్లో సరదా శీర్షికను కూడా నిర్వహిస్తున్నారు. జ్యోతిగారి ఆసక్తి, చొరవ, అనుకున్న విషయాన్ని సాధించాలనే పట్టుదల నిజంగా మెచ్చుకోదగినవి. పిన్నలకి, పెద్దలకి కూడా అనుసరణీయమైనవి. బ్లాగు మొదలుపెట్టేనాటికి కంఫ్యూటర్ వాడకం పెద్దగా తెలియకపోయినా ("సాధారణ" గృహిణి అనే పదబంధం నాకు అస్సలు నచ్చదు. గృహిణులు ఎవ్వరూ సాధారణం కాదు!) ఓపిగ్గా అడిగి తెలుసుకుంటూ, కొండొకచో తన పిల్లలనే గురువులుగా స్వికరించి, అనేక చిట్కాలని సొంతం చేసుకుని తన బ్లాగుల్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతుంటారు.

తన బ్లాగు చూసినప్పుడల్లా ఆమె ప్రవేశపెట్టే వింత ఫీచర్లు నన్ను విస్మయ పరుస్తుంటాయి. కనుమరుగై పోతున్న ఓణీల గురించి ఒక టపా రాస్తూ ఒక స్లైడ్ షో పెట్టారు. ఓణీధారిణులైన అమ్మాయిల చక్కటి బొమ్మలతో ! బ్లాగులో ప్రవేశించగానే కనిపించే బేనరు ఆ రోజుకి సందర్భోచితమైన చిత్రంతో, సందేశంతో నిత్యనూతనంగా స్వాగతిస్తుంది. తన షడ్రుచులు బ్లాగులో కూడా వంటకాల చక్కని వర్ణచిత్రాలతో ఒక రోలింగ్ బేనరు చదువరులని ఆకర్షిస్తుంది. అంతర్జాలంలో ఎక్కడెక్కణ్ణించో తమాషాలని వెతికి పట్టుకుని తన బ్లాగులో పరిచయం చేస్తుంటారు. కంఫ్యూటర్ తెరమీద ఎక్కడ నొక్కినా అక్కడొక చిన్ని పువ్వు పూసే ఒక సైటు నాకెంతో నచ్చింది.

జ్యోతి హాస్యప్రియత్వం బ్లాగ్జగద్విదితం. తన టపాల్లో రాసుకునే జోకులే కాదు, వేరే బ్లాగుల్లో జ్యోతి రాసే వ్యాఖ్యలు కూడా చదువరుల ముఖాల మీద చిర్నవ్వు మొలిపించక మానవు. ఒకసారి తను రాసిన ఎలుకా సింహం జోకు అర్ధం కాలేదని జనాలు తిక్క కామెంట్లు రాస్తే… అంతే కదా, వొదిలెయ్యండి అనెయ్యగలిగిన హుందాతనం జ్యోతిగారిది. వింతలూ, జోకులే కాకుండా జ్యోతి రాసే టపాలు ఎక్కువగా తనకి ఆత్మీయులైన బ్లాక్కుటుంబ సభ్యులతో చెప్పేసుకునే ఒక అమాయకత్వం కనిపిస్తుంది ఈ రచనల్లొ. " పడ్డానండీ ప్రేమలో మరి", "పెళ్ళైనవారికి మాత్రమే " మంచి ఉదాహరణలు. షడ్రుచులు బ్లాగులో వంటకాల వర్గీకరణ, హడావుడిగా వెతుక్కునే వినియోగదారులకు ఉపకరిస్తుంది.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా మనిషి తనని తాను కొంత మార్చుకోగలడు కానీ పుట్టిపెరిగిన ఇంటి భోజనపు అలవాట్లని ఒక పట్టాన మార్చుకోలేడు. మాతృభూమిలోనే ఉన్నా ఈ రోజుల్లో సుపుత్రులూ, సుపుత్రికలూ వంటగదిలో అడుగుపెట్టకుండానే పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. ఇటువంటి వారందరికి కోరిన రుచులిచ్చే కల్పతరువు, కామధేనువు జ్యోతిగారి వంటల బ్లాగు "షడ్రుచులు" ౩౦౦ లకు పైగా శాకాహార (శాఖాహారం కాదు , గమనించండి !), మాంసాహార వంటలు, అల్పాహారాలు, పొడులు, పచ్చళ్ళతో, ఔత్సాహికులకే కాదు, ఆరితేరినవారికీ కాసిని కొత్త రుచులు దొరుతాయందులో !

జ్యోతి తాను రాయడమే కాకుండా తన స్నేహితులకి, పరిచయస్తులకి తెలుగు బ్లాగుల్ని పరిచయం చేసి వాళ్ళని కూడా బ్లాగులు రాయడానికి ప్రోత్సహింస్తుంటారు. నేడు లబ్ధ ప్రతిష్టులైన కంఫ్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్, ప్రసిద్ధ కథా రచయిత వింజమూరి విజయ్‍కుమార్ ప్రబృతులు జ్యోతి ప్రోద్బలంతో బ్లాగులు ప్రారంభించినవారే. తొలి బ్లాగు మొదలెట్టిన అనతి కాలంలోనే అన్ని బ్లాగుల్లోనూ కలిపి 1500 టపాలు వెలువరించిన ఘనత జ్యోతిగారిది. తెలుగు బ్లాగుల్లో ఖచ్చితంగా ఇది అపూర్వం !

సమీక్ష : ఎస్. నారాయణస్వామి