3, ఆగస్టు 2007, శుక్రవారం

హెల్ప్ ఫైళ్ల వివరాలువివిధ సాప్ట్ వేర్లలో వాటిని ఎలా ఉపయోగించాలో తెలియజేస్తూ Help పొందుపరచబడి ఉంటుంది కదా! సాధారణంగా అధికశాతం సాప్ట్ వర్ల యొక్క హెల్ప్ ఫైళ్లు .hlp అనే ఎక్స్ టెన్షన్ నేం ని కలిగి ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని Notepad, Paint వంటి వివిధ ప్రోగ్రాముల యొక్క హెల్ప్ ఫైళ్లతో పాటే మనం ఇన్ స్టాల్ చేసే దాదాపు అధికశాతం థర్డ్ పార్టీ సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు కూడా డీఫాల్ట్గ్ గా వాటి ఇన్ స్టలేషన్ సమయంలోనే Windows>Help ఫోల్డర్లోకి కాపీ చేయబడతాయి. కొన్ని సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు మాత్రం వాటి ప్రోగ్రాం EXE ఫైల్ ఏ ఫోల్డర్లో భద్రపరచబడి ఉందో అదే లొకేషన్లో స్టోర్ చేయబడతాయి. కొన్ని సాప్ట్ వేర్ల హెల్ప్ ఫైళ్లు .hlp ఎక్స్ టెన్షన్ నేంకి బదులుగా .chm అనే ఎక్స్ టెన్షన్ నేంని కలిగి ఉంటాయి. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా ప్రోగ్రాం యొక్క Help ఫైల్ని ఓపెన్ చేయగానే మనకు తెలియకుండానే హార్డ్ డిస్క్ల్ లో కొత్తగా .GID ఎక్స్ టెన్షన్ నేం గల ఒక ఫైల్ ఏదో ఒక లొకేషన్లో క్రియేట్ చేయబడుతుంది. ఆ ఫైల్ మనం ఓపెన్ చేసిన హెల్ప్ ఫైల్ కి పాయింటర్ గా పనిచేస్తుంది. అంటే మరోమారు అదే హెల్ప్ ఫైల్ ని ఓపెన్ చేయబోయేటప్పుడు అది వేగంగా ఓపెన్ చేయబడేలా ఈ పాయింటర్ ఫైల్ ఉపయోగపడుతుందన్న మాట. కొన్ని ఫైళ్లని ఓపెన్ చేసినప్పుడు Documents and Settings\\Local Settings\Temp అనే ఫోల్డర్లో .tmp అనే ఎక్స్ టెన్షన్ నేంతో స్టోర్ అవుతాయి.

1 కామెంట్‌:

Dileep.M చెప్పారు...

.chm అంటే Compiled Html.