11, ఆగస్టు 2007, శనివారం

డిలీట్ చేయబడిన YouTube వీడియోలను చూడడం


www.youtube.com అనే వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది తమ వద్ద ఉన్న వీడియో క్లిప్‌లను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి క్లిప్‌లలో కొన్ని చట్టవిరుద్దమైనవి ఉన్నవన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు YouTube సంస్థ ఆయా క్లిప్‌లను తొలగించినట్లు x గుర్తుని ఆయా క్లిప్‌ల వద్ద చూపిస్తుంది. అంటే ఆ క్లిప్‌లను అక్కడి నుండి చూడడం వీలుపడదన్నమాట. అయితే వాస్తవానికి YouTube ఆయా చట్ట విరుద్ధమైన వీడియోలను కొన్నాళ్ళపాటు తన సర్వర్‌లోనే ఉంచుకుంటుంది. కేవలం యూజర్లు యాక్సెస్ చేయకుండా వాటి రిఫరెన్సులను వెబ్‌పేజీల నుండి మాత్రమే తొలగిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన కొంత మంది డిలీట్ చేయబడిన YouTube వీడియోలను కూడా వీక్షించగలిగేలా ప్రత్యేకమైన ఏర్పాటు చేసారు. http://youtube.infamousx.com/index.php అనే వెబ్ సైట్ ద్వారా ఇలా డిలీట్ చేయబడిన YouTube వీడియోలను వీక్షించవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

oh manchi chituka chapa ru ielanti chituka ienka chaputha ru kadhu