6, ఆగస్టు 2007, సోమవారం

Yahoo Mail Betaలో పనిచేసే చిట్కాలు


Yahoo Mail Beta లో అనేక అధునాతనమైన సదుపాయాలు పొందుపరచబడ్డాయి. Yahoo Mail Betaలో ఉన్నపుడు కొన్ని చిట్కాలను పాటించవచ్చు. Inbox లోని ఏదైనా మెసేజ్‌ని స్క్రీన్‌పై కనిపించే contacts అనే లింక్‌పైకి డ్రాగ్ చేస్తే ఆ మెసేజ్‌ని పంపించిన యూజర్ ID క్షణాల్లో మన అడ్రస్ బుక్‌కి జతచేయబడుతుంది. అలాగే ఒకే ఫోల్డర్‌లో ఒకే సబ్జెక్ట్ లైన్‌తో ఉన్న మెసేజ్‌ల వద్దకు వెళ్ళాలంటే Ctrl+Shift+Up, Ctrl+Shift+Down Arrow కీలని ఉపయోగిస్తే సరిపోతుంది. Inboxలో ఉన్న చదవవలసిన అవసరం లేని మెసేజ్‌లను చదివినట్లు మార్క్ చేసుకోవాలంటే పై భాగంలో కుడిచేతి వైపు ఉండే Options అనే లింక్‌లోకి వెళ్ళి Mail Options సెలెక్ట్ చేసుకుని Mark messages as read అనే డ్రాప్‌డౌన్ లిస్ట్ వద్ద immediately అని సెట్ చేస్తే సరిపోతుంది. ఫోల్డర్లని ఒక క్రమపద్దతిలో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మెసేజ్‌లతో కూడిన విభాగం తాత్కాలికంగా దాచి పెట్టబడి మరింత స్థలం కనిపించాలంటే కీబోర్డ్‌పై ఉండే v కీని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇదే కీని ప్రెస్ చేస్తే మెసేజ్ ప్రివ్యూ తిరిగి స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. విండోలో ఉండగా కీబోర్డ్‌పై ఉండే N అనే కీని ప్రెస్ చేసామంటే compose విండో స్క్రీన్ పై వస్తుంది. కొత్త మెసేజ్‌ని కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలంటే R కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: