30, సెప్టెంబర్ 2014, మంగళవారం

మీకు వచ్చిన SMSలూ, కాల్ Log వివరాలూ మీ Gmailలోకి ఇలా బ్యాకప్ తీసుకోండి Must Watch

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7MeYMIugHbk

మీ ఫోన్‌కి ఎవరు ఎప్పుడు ఏం SMS చేశారో, ఏ సమయంలో కాల్ చేశారో, ఎన్ని నిముషాలు మాట్లాడారో మొత్తం వివరాలూ శాశ్వతంగా స్టోర్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

కొన్నేళ్ల తర్వాత అయినా వీటి అవసరం వచ్చినప్పుడు ఈ SMS, Call Log డీటైల్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. వినడానికి బానే ఉంది.. మరి బ్యాకప్ తీసుకోవడం ఎలా?

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని sms, call logs మొత్తాన్నీ మీ Gmail అకౌంట్‌లోకి బ్యాకప్ తీసేసుకోవచ్చు ఈజీగా! సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7MeYMIugHbk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

29, సెప్టెంబర్ 2014, సోమవారం

Busy Tone వచ్చే నెంబర్లకీ, కట్ చేసే నెంబర్లకీ ఆటోమేటిక్‌గా రీడయల్ చేయడం ఇలా .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QRvmJTRJUtg

అతి ముఖ్యమైన ఫోన్.. అవతలి వాళ్లు లిఫ్ట్ చెయ్యకపోతేనో, బిజీ టోన్ వస్తుంటేనో కట్ చేసి మళ్లీ నెంబర్ manualగా call బటన్ నొక్కడం అనేది కొంత టైమ్ వృధా చేస్తుంది. ఆ చిన్న గ్యాప్‌లో అవతలి వారికి మరో కాల్ రావచ్చు.

కొంతమంది కావాలనే ఫోన్ కట్ చేస్తుంటారు, లిఫ్ట్ చెయ్యరు.. అలాంటప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో రిపీటెడ్‌గా డయల్ చేయగలిగే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా?

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఫోన్ పక్కన పడేసి.. తాపీగా కూర్చోవచ్చు. ఫోన్ కలిసే వరకూ అదే రీ డయల్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా సందర్భాల్లో ఉపయోగపడే ఈ టెక్నిక్‌ని మీరే చూసేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QRvmJTRJUtg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మెడిసిన్స్ టైమ్ మిస్ అవకుండా రిమైండ్ చేయబడాలా?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko

ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా తీసుకునే మల్టీ విటమిన్ టాబ్లెట్ల నుండి అప్పుడప్పుడు జలుబు వంటివి వచ్చినప్పుడు వాడే ఏంటీబయాటిక్స్ లాంటివీ, చివరకు క్రానిక్ డిసీజెస్‌ ఉన్నవారు తరచూ వాడాల్సి వచ్చే వివిధ రకాల మందులను టైమ్ టు టైమ్ సరిగ్గా తీసుకోపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

అయితే మనం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ మెడిసిన్స్‌ని కొన్నిసార్లు వేసుకోవడం మర్చిపోతుంటాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వీడియోలో ఓ మంచి టెక్నిక్ పరిచయం చేస్తున్నాను. దీన్ని ఫాలో అయితే మీరు ఏ మెడిసిన్ అయినా మిస్ అవకుండా అది పూర్తయ్యేవరకూ సకాలంలో వేసుకోగలుగుతారు. రిమైండర్లు ఫోన్‌ స్క్రీన్ మీద వస్తుంటాయి టాబ్లెట్ ఫొటోతో సహా! సో ప్రయత్నించండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=Fkca8ByQ_Ko

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

మీ పిల్లల ఫోన్‌ని ఇలా కంట్రోల్ చేయొచ్చు....! Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=loKw-OsGVM0

పిల్లలు గొడవ చేస్తున్నారని చాలామంది ఈ మధ్య ఫోన్లు కొనిపెడుతూ ఉన్నారు. దాంతో పిల్లలు స్టడీస్ వంటివన్నీ పక్కన పెట్టేసి గంటల తరబడి ఫోన్ గేమ్స్ వంటి వాటితో గడిపేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మీరు ఆఫీసులో ఉన్నా మీ ఇంట్లో ఉన్న పిల్లల ఫోన్‌ని లాక్ చేయడం, ఓ టైమ్ సెట్ చేసి ఆ టైమ్‌లోనే ఫోన్ పనిచేసేలా చేయడం, వాళ్లేం అప్లికేషన్లు, గేమ్‌లు డౌన్‌లోడ్ చేస్తున్నారో గమనించడం, వాళ్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో లొకేషన్‌తో సహా చూడడం వంటివి కావాలంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చూపించిన ప్రొసీజర్ ఫాలో అవండి.

చిన్న పిల్లలు, మధ్య వయస్సు పిల్లలు ఉన్న ఇళ్లల్లో వాళ్ల చదువులు పాడవకుండా కాపాడడానికి ఈ టెక్నిక్ చాలా పనికొస్తుంది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=loKw-OsGVM0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

27, సెప్టెంబర్ 2014, శనివారం

ఏ మోడల్ ఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఇక ఆ కన్‌ఫ్యూజన్ అవసరం లేదు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=km9S-lC0Jo0

కొత్తగా ఓ ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్, డిజిటల్ కెమెరా, టివిలను కొనాలన్నా ఏ మోడల్ తీసుకుంటే బెటరో అర్థం కాక తెలిసీ తెలియక ఎవరో ఒకరు చెప్పే వాటిని నమ్మేసి రాంగ్ ఛాయిస్‌ ఫోన్‌ని కొనేస్తుంటారు.

ఈ వీడియో చూస్తే ఇక ఇలాంటి విషయాలకు ఎవరిపై ఆధారపడరు. మీకు మీరే అన్ని రకాల మోడల్స్‌లో ప్లస్ పాయింట్స్ ఏమిటో, మైనస్ పాయింట్స్ ఏమిటో ప్రాక్టికల్‌గా క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. వాటి ఆధారంగా కరెక్ట్ డివైజ్ కొనేసుకోవచ్చు.

సో వేలకువేలు పెట్టే డబ్బు వృధా కాకుండా కాపాడే ఈ పద్ధతేమిటో మీరే చూడండి.

గమనిక: తరచూ రకరకాల gadgets కొనే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=km9S-lC0Jo0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in

http://youtube.com/nallamothu

http://nallamothusridhar.com

‪#‎computerera‬ ‪#‎telugu‬

25, సెప్టెంబర్ 2014, గురువారం

మీ Facebook Friends బర్త్‌డేలకు ఆటోమేటిక్‌గా విషెస్ ఇలా పంపండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=hXBaJ3C7aVk

Facebookలో ఉన్న ఫ్రెండ్స్ బర్త్‌డేలకు ప్రతీరోజూ ఛెక్ చేసుకుని ఏదో ఒక టైమ్‌లో విషెస్ పంపడం కన్నా, సరిగ్గా వారి బర్త్‌డే రోజు అర్థరాత్రి 12 గంటలకు వారికి విషెస్ తెలియజేస్తే బాగుంటుంది కదా! వారూ చాలా హాపీ ఫీల్ అవుతారు.

ఇలా FB స్నేహితులకు ఆటోమేటిక్‌గా విషెస్ పంపడానికి నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. సో ప్రయత్నించండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=hXBaJ3C7aVk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m/

24, సెప్టెంబర్ 2014, బుధవారం

మీ iPhone, iPadల్లో Control Centerలో అన్ని ఆప్షన్లూ ఇలా ఈజీగా యాక్సెస్ చేసుకోండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6yLOsxapiF0

iPhoneలో గానీ, iPadలో గానీ క్రింద వైపు నుండి వేలుని slide చేసినప్పుడు వచ్చే Control Centerలో WiFi, Bluetooth వంటి కేవలం నాలుగు ఆప్షన్లు మాత్రమే కన్పిస్తాయి.

మిగతా ఆప్షన్లు కావాలంటే కష్టపడి లోపల Settingsలోకి వెళ్లాల్సి ఉంటుంది.  ఇంత ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా...

Do Not Disturb, Shutdown, Restart, Sleep, GPS, 3G, VPN, Siri, Multi Tasking, Hotshop, Rotation, Home Screen వంటి ముఖ్యమైన సెట్టింగులు అన్నీ Control Centerలోనే పొందాలనుకుంటున్నారా?

అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఓ చిన్న అప్లికేషన్‌తో ఇవన్నీ ఇకపై ఈజీగా అందుబాటులో పొందొచ్చు.

గమనిక:  ఐఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=6yLOsxapiF0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

17, సెప్టెంబర్ 2014, బుధవారం

మీ ఫోన్ కెమెరాని మీ పిసి Webcamగా ఇలా వాడుకోవచ్చు..

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=hi_b-qH5zhc

మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్‌తో వీడియో ఛాట్ చేసుకోవడానికి మీ పిసికి Webcam లేదా?

మీ దగ్గర ఎటూ కెమెరా ఫోన్ ఉంది కదా.. ఆ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుంటే పోలా.. :)

వినడానికి ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ.. :) అయితే ఈ వీడియో చూడండి అది ఎంత ఈజీ పనో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపించడం జరిగింది.

ఈ టెక్నిక్‌తో మీ ఫోన్ కెమెరాని మీ పిసి యొక్క Webcamగా వాడేసుకుని Skype, Google+ వంటి అన్ని చోట్లా వీడియో ఛాటింగ్ చేసేసుకోవచ్చు.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=hi_b-qH5zhc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా? అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు. కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock  చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా "రూటింగ్‌"ని పేర్కొనవచ్చు.

ఇప్పటికి అనేక మంది "కంప్యూటర్ ఎరా" మేగజైన్ రీడర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లని రూట్ చేయడం గురించి వీడియో చేయమని అడుగుతూ వచ్చారు..

మిగతా వీడియోల్లా ఇది ఒక్కడినే షూట్ చేసుకోవడం కుదరని పని కావడం వల్ల, చాలా శ్రమతో కూడిన వ్యవహారం అవడం వల్ల వాయిదా వేస్తూ వచ్చాను. ఇన్నాళ్లకు చాలా శ్రమించి ఈ వీడియో చేశాను.

ఇప్పుడు ఈ వీడియోలో ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి సైతం అర్థమయ్యేలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఫోన్లని రూట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది.

తదుపరి వీడియోల్లో root చేసిన ఫోన్‌ని unroot చేయడం ఎలాగో, అలాగే వాటిలో custom ROM వేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపిస్తాను.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఫోన్, టాబ్లెట్, డిజిటల్ కెమెరా మెమరీ కార్డులు ఎప్పుడైనా కరప్ట్ అయ్యే ప్రమాదముంది Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=NwUCc3FGFU0

ప్రస్తుతం మనం భారీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన మెమరీ కార్డుల్ని మనం వాడుతున్నాం.

మీరు ఈ వీడియోలో చర్చించిన జాగ్రత్తలు తీసుకోపోతే వాటిలోని డేటా ఏ మూమెంట్ అయినా కరప్ట్ అయిపోవచ్చు..  ఏకంగా మెమరీ కార్డ్ పనిచేయకుండానూ పోవచ్చు.

సడన్‌గా మెమరీకార్డ్ పనిచెయ్యట్లేదనీ, చాలా ఇంపార్టెంట్ ఫొటోలన్నీ పోయాయనీ.. కనీసం ఫొటోలు వెనక్కి వచ్చినా హాపీనే అని  నాకు తెలిసిన చాలామంది కంప్లయిట్లు తరచూ చేస్తుంటారు....

ఫోన్లలోని మెమరీ కార్డుల విషయంలో ఇలాంటి వందల కొద్దీ కంప్లయింట్లు!

వీటన్నింటికీ పరిష్కారం ఈ వీడియో. ఇది చూశాక మీ మెమరీ కార్డు వాడకంపై మీకు సరైన అవగాహన కలుగుతుంది.

గమనిక: సెల్‌ఫోన్లూ, టాబ్లెట్లూ, డిజిటల్ కెమెరాలూ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=NwUCc3FGFU0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

15, సెప్టెంబర్ 2014, సోమవారం

లాప్‌టాప్ కొనాలా? డెస్క్‌టాప్ కొనాలా? ఏది బెస్ట్? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ

కొత్తగా కంప్యూటర్ కొనాలనుకుంటున్నారా?

అయితే "లాప్‌టాప్ కొనాలా? Desktop కొనాలా? వీటిలో ఏది బెస్ట్? ఎలాంటి వాళ్లకు ఏది సూటబుల్ అవుతుంది.." వంటి విషయాలు తెలుసుకోకుండా వేలాది రూపాయలు వేస్ట్ చెయ్యకండి.

ఈ వీడియోలో లాప్‌టాప్‌లకూ, డెస్క్‌టాప్‌లకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం గురించి చాలామందికి తెలీని అనేక విషయాల్ని డిస్కస్ చెయ్యడం జరిగింది.

కొత్త కంప్యూటర్ కొనేముందు ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ ఇది చూస్తే మీ డబ్బు వృధా కాదు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ Friendsతోనూ షేర్ చెయ్యగలరు.ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=nKtqiiIM6JQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

11, సెప్టెంబర్ 2014, గురువారం

మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడిపోతాడు…. నమ్మబుద్ధి కావట్లేదా…? Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7dhBYj19-SE

మీ ఫోన్‌ని కాపాడుకోవడానికి మీరు జీవితంలో రకరకాల సాఫ్ట్‌వేర్లు వాడి చూసుంటారు…..

ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించినంత టెక్నిక్‌ని మించినది మాత్రం ఏం ఉండదు….

ఈ వీడియో చూసి నేను చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ దొంగిలించినందుకు దొంగే బాధపడాలి :P

ఫోన్ పోయినప్పటి నుండి ఆ ఫోన్ సరిగ్గా ఎక్కడుందో, దొంగ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో కనిపెట్టేయొచ్చు…

అతను ఏ నెంబర్లకి ఫోన్లు చేస్తున్నాడో, SMSలు చేస్తున్నాడో ఆ మెసేజ్‌ల వివరాలతో సహా మీ కంప్యూటర్ స్క్రీన్ మీదే చూసేయొచ్చు.

దొంగ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని ఖుషీ చేసుకుంటుంటే… అతనికి తెలీకుండా వారందరి ఫొటోలూ తీయొచ్చు…. వీడియో తీయొచ్చు…. వాళ్లేం మాట్లాడుకుంటున్నదీ ఆడియో రికార్డ్ చేసి వెంటనే మన మెయిల్‌కి పొందొచ్చు….

వాళ్ల ఫ్రెండ్స నెంబర్లు మనకు తెలుస్తుంటే… అతనెక్కడ తిరుగుతున్నాడో క్షణం క్షణం మనకు తెలుస్తుంటే… సిమ్‌ మార్చేసినా ఉపయోగం లేకపోతే… చివరకు దొంగ ఫొటో, వీడియో, మాటలూ, SMS మెసేజ్‌లూ కూడా మనకు వచ్చేస్తుంటే….. ఇంకా పోలీస్ కంప్లయింట్లెందుకు…? నేరుగా మనమే ఓ అరగంటలో పట్టుకోలేమా….?

నేనైతే గత ఏడాదిన్నరగా ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను… ఎక్కడైనా ఫోన్ మర్చిపోయి వచ్చినా అస్సలు భయం లేదు…. నాకెందుకు భయం…. దొంగ భయపడాలి గానీ :P

ఖరీదైనవీ, మామూలువీ రకరకాల ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని “ఖచ్చితంగా” మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చేసి వారి ఫోన్లనీ కాపాడండి…

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7dhBYj19-SE

గమనిక: ఈ సాఫ్ట్‌వేర్‌ని uninstall చెయ్యకుండానూ, Factory Reset చేసినా పోకుండానూ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని కోసం ఫోన్ రూట్ చేయాల్సి ఉంటుంది.

– నల్లమోతు శ్రీధర్

ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

మీ ఫోన్‌లో కంపెనీ updates రావట్లేదా? TWRP రికవరీని ఇలా వాడి ఫ్లాష్ చేసుకోవచ్చు .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

సహజంగా మనం ఫోన్లు కొన్నప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్ తప్పించి ఆ తర్వాత ఆయా ఫోన్లకి కొత్త updates ఇవ్వడంలో కంపెనీలు అశ్రద్ధ చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో కొద్దిపాటి అవగాహన ఉన్న వారు చాలామంది తమ ఫోన్ మోడల్ కోసం తయారు చెయ్యబడిన ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ల custom ROMలను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటారు.

ఇలా custom romలను ఫ్లాష్ చెయ్యడానికి ఎక్కువమంది ఉపయోగించే పద్ధతి Clockwork Mod. ఇది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకన్నా పవర్‌ఫుల్‌గా, టచ్‌తో ఆపరేట్ చెయ్యగలిగేలా TWRP రికవరీ ఇటీవల విరివిగా వాడబడుతోంది.

ఈ నేపధ్యంలో TWRP రికవరీని ఎలా వాడాలో, దాని ద్వారా ఫోన్‌లోకి కొత్త updatesలను ఎలా ఫ్లాష్ చేయాలో, ఫోన్‌ని ఉన్నది ఉన్నట్లు ఎలా బ్యాకప్ తీయాలో దానిలోని ఆప్షన్లు మొత్తాన్నీ వివరంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: కేవలం రూటింగ్, ఫ్లాషింగ్‌లపై ఇప్పటికే అవగాహన ఉన్న వారికి మాత్రమే ఇది కొంతవరకూ అర్థమవుతుంది. ఒక ఫోన్‌ని ఎలా రూట్ చెయ్యాలో కూడా గతంలో నేను ఈ లింకులో చూపించడం జరిగింది. మీ అవగాహన కోసం https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw  అనే రూటింగ్ లింక్ చూడండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=aGU4MSUnaq8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

ఏ సాఫ్ట్‌వేర్ పిసిలో వేసుకోకుండా ఫోన్‌లో ఉన్న WhatsApp అకౌంట్‌ని నేరుగా పిసి నుండి ఇలా ఆపరేట్ చేయండి .. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8s2F3Rgxvuw

మీ ఫోన్‌లో WhatsApp అలాగే ఉంటుంది. టైప్ చేసే ఓపిక ఉన్నప్పుడు ఫోన్ నుండి టైప్ చేసుకోవచ్చు.. మీరు పిసికి దగ్గరగా ఉంటే కంప్యూటర్ మీద టైప్ చేసుకోవచ్చు.. అంటే ఫోన్ ఎక్కడో వేరే రూమ్‌లోనో, లేదా మీ ఫోన్ మీ ఫ్రెండ్ దగ్గర వేరేచోటో ఉంటే నేరుగా మీ పిసి నుండే ఆ ఫోన్ ద్వారా మీ ఫ్రెండ్స్‌తో రిమోట్ కంట్రోల్ రూపంలో ఛాట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే.

ఇది WhatsAppని పిసిలో ఇన్‌స్టాల్ చేసుకునే ఇంతకుముందు చెప్పుకున్న ప్రొసీజర్లు కాదు. అస్సలు దీని కోసం పిసిలో ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేదు. సో ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8s2F3Rgxvuw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

మీ WhatApp ఫొటోల్ని ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చెయ్యకుండా ఇలా ఆపండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PuxhhbLfn9g

WhatsAppలో మన ఫ్రెండ్స్ ఏమైనా ఫొటోల్ని పంపినప్పుడు అవి ఆటోమేటిక్‌గా మన ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయి వాటంతట అవే సేవ్ అయిపోతాయి. దీనివల్ల ఫోన్ స్టోరేజ్ నిండిపోవడమే కాకుండా.. కొంతమంది తెలీని వారు పంపించే ఫొటోల వల్ల చిక్కులు ఏర్పడుతూ కూడా ఉంటాయి.

ఈ నేపధ్యంలో ఇకపై ఎవరు ఫొటోలు పంపించినా మనం blurగా ఉండే ఆ ఫొటోపై మనం ఇష్టపడి tap చేస్తే తప్పించి ఆ ఫొటోలు మన ఫోన్‌లోకి రాకుండా అడ్డుకోవాలంటే ఈ వీడియోలో చూపించినట్లు చేయండి. దీంతో ఫోన్ స్టోరేజ్ సేవ్ అవుతుంది, ఇతర తలనొప్పులూ తగ్గిపోతాయి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PuxhhbLfn9g

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

మీ స్క్రీన్‌పై కన్పిస్తున్న ఏ వెబ్‌సైట్‌లోనైనా రకరకాల weaponsతో ఇలా విధ్వంసం సృష్టించొచ్చు.. (Just for Fun) Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=usWYmBqF5pg

మీరు చూస్తున్న స్క్రీన్ మీద గ్రెనేడ్ పేలితే ఎలా ఉంటుంది? అలాగే ఆటమ్ బాంబ్‌నో, లేదా సుత్తితో కొడితేనే ఎలా ఉంటుంది? ఇలా రకరకాల వెపన్లని ఉపయోగించి మీరు చూస్తున్న సైట్‌పై విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా..

మీ ఇంట్లో ఉన్న పిల్లల్నీ, మీ ఫ్రెండ్స్‌నీ ఆటపట్టించడం కోసం ఇది భలే ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్లు మీరూ ట్రై చేయొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=usWYmBqF5pg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

6, సెప్టెంబర్ 2014, శనివారం

Facebookలో ఊరికే Tag చేస్తున్నారా? అన్ని Tags ఒక్క క్లిక్‌తో ఇలా తీసేసుకోండి?.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QYnVCt98jQU

మనం ఎంత మొత్తుకున్నా వాళ్లు మారరు. మనల్ని తమ ఫొటోల్లో ఇతరులతో కలిపి tag చేసి చంపేస్తూనే ఉంటారు. ఇలా మీకు సంబంధం లేని ఫొటోల్లో మీరు tag చెయ్యబడుతూ ఆ tagsని విడివిడిగా తొలగించుకోవడం కష్టంగా భావిస్తున్నారా?

అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీకు తగిలించబడిన అన్ని photo tagsని ఒకే దెబ్బతో తొలగించుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QYnVCt98jQU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోతోందా? మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆటోమేటిక్‌గా ఇలా అలర్ట్ చేయండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YP3g0EraCxc

పని మీద మీరు బయటకు వెళ్లినప్పుడు ఏ క్షణమైనా మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోవచ్చు. ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి.. కాల్ రీచ్ అవకా ఏం జరిగిందో తెలీక టెన్షన్ పడుతుంటారు.

ఈ నేపధ్యంలో మీ ఫో‌న్‌లో బ్యాటరీ అయిపోయిందన్న విషయం ఆటోమేటిక్‌గా వాళ్లకు ఓ SMS వెళ్లిపోగలిగితే వాళ్లూ హాపీగా ఉంటారు, మీరూ హాపీగా ఉంటారు కదా.. సో ఈ అద్భుతమైన టెక్నిక్‌ని ఈ వీడియోలో చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YP3g0EraCxc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మీ ఫోన్ స్క్రీన్ as it isగా మీ టివి మీద కన్పించాలా.. ? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vfeY-J8WoeI

మీరు ఫోన్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏ గేమ్స్ ఆడినా, స్క్రీన్ మీద ఏం చేస్తున్నా అవన్నీ ఉన్నవి ఉన్నట్లు మీ టివి స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా? అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

మీరు ఫోన్ ఓరియంటేషన్ మార్చినా దానికి తగ్గట్లే టివి స్క్రీన్‌లోనూ నిలువుగానూ, అడ్డంగానూ మారిపోతుంది. ఇది ఎంత సింపులో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vfeY-J8WoeI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

4, సెప్టెంబర్ 2014, గురువారం

మీరు తెలుగు Anu Fonts వాడుతున్నారా? అయితే అనూ Modular కీబోర్డ్‌ లేఅవుట్‌తో Facebook, Mailsలో ఇలా టైప్ చేసుకోండి

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=FXw2MqY76cE

పత్రికల్లోనూ, టివిల్లోనూ, డిటిపి సెంటర్లలోనూ పనిచేసి అనూ ఫాంట్లతో చాలా వేగంగా టైప్ చెయ్యగల నేర్పు ఉన్న వారు Facebook, Mails, ఇతర ఆన్‌లైన్ సైట్లు, Notepad, Word వంటి అప్లికేషన్లలో యూనీకోడ్‌లో టైప్ చేయాలంటే కష్టంగా భావిస్తున్నారా?

దాని కోసం మళ్లీ ఫొనెటిక్‌లో ఇతర సాఫ్ట్‌వేర్లని వాడడం వల్ల అనూ ఓ పక్కా, ఫొనెటిక్ కీబోర్డ్ మరోపక్కా కన్‌ప్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీ కోసమే తయారు చేయడం జరిగింది.

మీరు Anu Modular కీబోర్డ్ లేఅవుట్‌ బాగా అలవాటు అయి ఉంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీకు వచ్చిన Modular Layoutలోనే అన్నిచోట్లా తెలుగులో వేగంగా టైప్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి.

ఇదే విధంగా Anu Apple లేఅవుట్‌తో యూనీకోడ్‌లో ఎలా టైప్ చేయాలో కూడా మరో వీడియోలో వివరిస్తాను.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=FXw2MqY76cE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో ఒక అప్లికేషన్‌ నుండి నేరుగా మరో appలోకి వెళ్లాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU

మీ ఫోన్‌లో Facebookలో ఉన్నారనుకుందాం. అంతలో ఏదైనా ఫోన్ చేయాలని గుర్తొస్తే Back బటన్ గానీ, Home బటన్ గానీ ప్రెస్ చేసి బయటకు వచ్చిన తర్వాతే Call అప్లికేషన్‌లోకి వెళ్లవలసి ఉంటుంది.

ఇలా ప్రతీసారీ Home, Back బటన్లు ప్రెస్ చేయాల్సిన పనిలేకుండా, అలాగే Android Task Manager మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ప్రస్తుతం మీరు games ఆడుతున్నా, ఇంకో appలో ఉన్నా మీకు కావలసిన మరో appలోకి వేగంగా చిటికెలో వెళ్లాలనుకుంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

లేటెస్ట్ తెలుగు, హిందీ స్ట్రీమింగ్ పాటలు ఇలా రికార్డ్ చేసుకోవచ్చు.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LMHibK_biR8

మీకు పాటలంటే చాలా ఇష్టమా.. లేటెస్ట్‌వి మొదలుకుని మీకు నచ్చిన పాత పాటల వరకూ నెట్‌లో రకరకాల స్ట్రీమింగ్ సైట్లలో ఉన్న వాటిని ఆన్‌లైన్‌లో వినడంతోనే సరిపెట్టుకోవాల్సిన పనిలేదు.

ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీకు నచ్చిన పాతా, కొత్తా పాటల్ని మీ పిసిలోకి రికార్డ్ చేసుకుని MP3 పాటలుగా సేవ్ చేసుకోవచ్చు. ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్లు సైతం ఈ వీడియో చూసి చాలా ఈజీగా నచ్చిన పాటలు పొందొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=LMHibK_biR8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

3, సెప్టెంబర్ 2014, బుధవారం

Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసే ఫొటోలు ఎక్కడ నుండి కాపీ చెయ్యబడ్డాయో ఇలా తెలుసుకోండి.. ! Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=k69g21yN22U

చాలామంది ఫ్రెండ్స్ నెట్‌లో Google Searchలో ఫొటోల్ని వెదికేసి వాటిని Facebookలో షేర్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో మీ Facebook News Feedలో కన్పించే ఏ ఫొటో అయినా నెట్‌లో ఎక్కడి నుండి కాపీ చెయ్యబడిందో వివిధ sources తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది.

మీరు చూస్తున్న ఫొటో ఇంకా ఏయే సైట్లలో వాడబడుతోందో కూడా ఈ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=k69g21yN22U

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

Airtel కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ సర్వీస్ వాడడం ఇలా.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=abv46SZ2WEY

పాటలు బాగా ఇష్టపడే వాళ్ల కోసం Airtel సంస్థ నిన్నటి నుండి కొత్త సర్వీస్‌ని మొదలుపెట్టింది.

తెలుగు, హిందీ, తమిళ్ వంటి వివిధ భాషలకు చెందిన పాటలను కేవలం Airtel వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల వాళ్లూ Subscribe చేసుకోవచ్చు. అతి తక్కువ మొత్తంతో లేటెస్ట్ పాటలు అన్నింటినీ అందించే ఈ సర్వీస్‌ గురించి ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=abv46SZ2WEY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

500 వీడియోల MileStoneకి చేరుకోవడం జరిగింది.

.milestone
తెలుగు వారందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో పూర్తిగా తెలుగులో "కంప్యూటర్ ఎరా" పత్రిక అందిస్తున్న టెక్నికల్ వీడియోలు ఈరోజుతో 500లకు చేరుకోవడం జరిగింది.

ప్రొఫెషనల్‌గా వీడియోలు ఉండడం కోసం వీటిలో ఒక్కో వీడియో తయారీకి 3-4 గంటల సమయం వెచ్చించడం జరిగింది. వీటి తయారీ వెనుక పడిన శ్రమ మాకే తెలుసు. ఇప్పటికీ వీటిని చాలామంది సద్వినియోగం చేసుకోవలసి ఉంది.

ఓ లక్ష్యం కోసం చాలా పట్టుదలతో తయారు చేస్తున్న ఈ వీడియోలను మీ మిత్రులకూ షేర్ చేస్తుండడం ద్వారా టెక్నాలజీని తెలుగు ప్రజలందరికీ చేర్చాలన్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించగలరు.

ఈ ఛానెల్‌కి మీరు ఇప్పటికి Subscribe చేసుకోపోయి ఉంటే http://youtube.com/nallamothu అనే లింకుకి వెళ్లి Subscribe కొట్టండి.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

మీ కంప్యూటర్లోని సాఫ్ట్‌వేర్లన్నింటికీ ఒకేసారి లేటెస్ట్ updates ఇలా పొందండి.. ! Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=JihlRpW0UrA

మన కంప్యూటర్లో రకరకాల సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం. అయితే వాటికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ updates విడుదల చేయబడుతూ ఉంటాయి. ప్రతీ సాఫ్ట్‌వేర్‌నీ విడిగా update check చెయ్యడం కష్టంగా ఉన్నట్లయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీ పిసిలో ఉన్న అన్ని softwarresకీ లేటెస్ట్ updates ఏం ఉన్నాయో క్షణాల్లో ఛెక్ చేసుకోవచ్చు.

సో మిస్ అవకుండా ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=JihlRpW0UrA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu