12, ఆగస్టు 2007, ఆదివారం

స్పీచ్ రికగ్నిషన్ తో జాగ్రత్త



Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం మైక్రోఫోన్ ద్వారా ఆదేశించే కమాండ్లకు ఆపరేటింగ్ సిస్టం ఆటోమేటిక్‌గా ప్రతిస్పందించేలా స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అంటే సింపుల్‌గా మీరు పిసి ముందు కూర్చుని Shutdown అని పలకడం ఆలస్యం పెట్టే బేడా సర్దుకుని విండోస్ షట్‌డౌన్‌కి ఉపక్రమిస్తుందన్నమాట. అలాగే ఫైళ్ళని డిలీట్ చేయాలంటే డిలీట్ ఆని ఆదేశం జారీ చేస్తే చాలు. అంతా బాగానే ఉంది. Dragon Naturally Speaking వంటి ధర్డ్‌పార్టీ స్పీచ్ రికగ్నిషన్ సాప్ట్ వేర్ల స్థాయిలో ఇది పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ వల్ల కొత్త తంటా వచ్చే ప్రమాదం ఉంది. ఎవరైనా హ్యాకర్లు ఈ కమాండ్లతో కూడిన ఆడియో ఫైల్‌ని మీ సిస్టమ్‌కి పంపించారనుకోండి, అదేదో మంచి మ్యూజిక్ ఆల్బం అని మీరు వెంటనే వినడం మొదలుపెడితే.. అందులో ఆ హ్యాకర్లు ఇచ్చిన స్పీచ్ రికగ్నిషన్ ఆదేశాలు మొత్తం ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవడం మొదలుపెడతాయి కదా! అలాగే YahooChat వంటి సర్వర్లలో ఎవరెవరితోనో వాయిస్ చాట్ చేస్తుంటాం. వారు ఇచ్చే ఆదేశాలను స్పీకర్ల నుండి మైక్రోఫోన్ స్వీకరించి ఎగ్జిక్యూట్ చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అవసరం అయినప్పుడు తప్ప ఇతర సమయాల్లో స్పీచ్ రికగ్నిషన్‌ని ఆఫ్ చేయడం ఉత్తమం.

కామెంట్‌లు లేవు: