వీడియోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వీడియోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, నవంబర్ 2013, సోమవారం

మీ విండోస్ సీరియల్ నెంబర్ మర్చిపోయారా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=g6dCT0r98tE

మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs

అనుకోకుండా ఫార్మేట్ చేసి Windows ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తే.. మీ పిసిలో అప్పటివరకూ ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ తెలీకపోతే ఎలా?

ఈ సమస్య కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు వాడే చాలామందికి తరచూ వస్తుంటుంది. అందుకే Serial Number చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలంటారు.

సరే.. ఇంతకీ ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ అయినా మీరు రాసి పెట్టుకున్నారా?

లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా దాన్ని తెలుసుకుని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. విండోస్ మళ్లీ మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా అవసరం.

గమనిక:  పిసి వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=g6dCT0r98tE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

#computerera #telugu

26, అక్టోబర్ 2013, శనివారం

బ్లూ స్క్రీన్ ఎర్రర్లు వస్తున్నాయా? సిస్టమ్ బాగా స్లో అయిపోతోందా? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

సీరియస్‌గా ఏదో పనిలో ఉంటే కంప్యూటర్ ఉన్న ఫళంగా రీస్టార్ట్ అయిపోతే అప్పటిదాకా చేసిన పనేం కావాలి? ఎంత బాధగా ఉంటుందో కదా!

అలాగే చాలా పవర్‌ఫుల్ కంప్యూటర్ వాడుతూ కూడా సిస్టమ్ చాలా స్లో అయిపోతే ఆ బాధ ఎవరితో చెప్పుకుంటాం.. చాలామంది ఇలా స్లో అవడానికి కారణాలు తెలుసుకోక అలాగే నెట్టుకొస్తుంటారు.

కంప్యూటర్లోని RAMలో లోపాలు పిసి స్లో అవడానికీ, కొన్ని క్షణాలు ఫ్రీజ్ అవడానికీ, బ్లూ స్క్రీన్లు వచ్చి పిసి రీస్టార్ట్ అవడానికీ కారణం అవుతుంటాయి.

ఈ నేపధ్యంలో RAMలోని లోపాలు గుర్తించడం ఎలాగో తెలుసుకోవాలి. ఇలా ఛెక్ చేశాక మీ కంప్యూటర్లో RAMలో లోపం ఉంటే దాన్ని వారెంటీలో ఉంటే ఉచితంగా రీప్లేస్‌మెంట్ కోరవచ్చు. చాలామందికి ఈ విషయాలు తెలియదు.

ఈ వీడియోలో మీ RAMలోని లోపాలను ఎలా గుర్తించాలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: కంప్యూటర్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=FIFy9zebeZo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

24, అక్టోబర్ 2013, గురువారం

వందలూ, వేల కొద్దీ SMSలు పంపించడం ఎలా ? Must Watch & Share




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM

5 నిమిషాల్లో కొన్ని వందల నుండి వేల మందికి SMSలు పంపాలనుకుంటున్నారా?

రకరకాల సర్వీసుల నుండి మనకు వచ్చే Bulk SMSలు అస్సలు ఎలా పనిచేస్తాయి.. మీరూ ఓ బెస్ట్ పద్ధతిని ఎంచుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

పండగలప్పుడూ మీ ఆత్మీయులందరికీ విషెస్ తెలపడానికీ.. మీ వ్యాపార అవసరాలకు కస్టమర్లతో టచ్‌లో ఉండడానికీ, ఇంకా పలు రకాలుగా ఉపయోగపడే Bulk SMS Gatewayల గురించి వివరంగా ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో చూపించడం జరిగింది.

SMSలు పొందడమే తప్ప అంత భారీ మొత్తంలో ఎలా పంపుతారో తెలీని వారికి ఈ వీడియో అవగాహన కలిగిస్తుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=d9xOzkrA3kM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

2, జనవరి 2008, బుధవారం

బరహతో వర్డ్ లో తెలుగు రావట్లేదా?

తెలుగుని టైప్ చేయడానికి మనం ఉపయోగించే బరహ సాఫ్ట్ వేర్ తో MS-Wordలో తెలుగు టైప్ చేస్తుంటే సమాచారం బాక్సులుగా వస్తోందని చాలామంది చెబుతుంటారు. ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో ఈ క్రింది ఆడియో వివరణతో కూడిన వీడియో ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. ఇక్కడ నేను వివరించిన పద్ధతి కన్నా మెరుగైన విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు. అయితే ఈ పద్ధతి ద్వారా ప్రతీసారీ ఫాంట్ ని మార్చుకోవలసి ఉంటుంది. ఈ సమస్యపై వీవెన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మరో పరిష్కారం లభించింది. Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెట్ చేసుకోవాలి. చివరిగా ఆ New Style డైలాగ్ బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన ప్రకారం ప్రతీసారీ మార్చుకోనవసరం లేదు.

31, డిసెంబర్ 2007, సోమవారం

డ్రైవ్ పై డబుల్ క్లిక్ చేస్తే Search వస్తోందా?

My Computerలో ఏదైనా డ్రైవ్ పై మౌస్ తో డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ డ్రైవ్ లోపల ఫోల్డర్లు, ఫైళ్లు చూపించబడడానికి బదులు Search ఆప్షన్ వస్తోందా? అయితే క్రింది వీడియోలో ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో చిన్న టెక్నిక్ ని ఆడియోతో సహా తెలుగులో వివరించడం జరిగింది. మీరే చూడండి:

స్కాన్ చేసినా స్పైవేర్లు పోవడం లేదా.. ఇలా చేయండి! (వీడియో ఆడియో వివరణ)

27, అక్టోబర్ 2007, శనివారం

రెండు ఎకౌంట్లనూ ఒకే Gmail ID నుండి వాడుకోవడం ఇలా.. (వీడియో)

మీ వద్ద రెండు GMail ఐడిలు ఉన్నప్పుడు దేని నుండి మెసేజ్ పంపించాలంటే దానిలోకి లాగిన్ అవ్వాల్సిన పనిలేకుండా రెండు IDలను ఒకే GMail ఐడిలోకి లాగిన్ అయి.. మనం కోరుకున్న ఐడి నుండి మెసేజ్ ని కంపోజ్ చేసే మార్గాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

26, అక్టోబర్ 2007, శుక్రవారం

మీ IP, DNS, MAC అడ్రసులు తెలుసుకోవాలా? (వీడియో)

మీ కంప్యూటర్ల యొక్క నెట్ వర్క్ కనెక్షన్ల యొక్క IP అడ్రస్లు, MAC, DNS సర్వర్ అడ్రసులు వంటి సకల సమాచారం తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది. బిగినర్స్ కి మాత్రమే ఉద్దేశించబడిన వీడియో ఇది. అడ్వాన్స్ డ్ యూజర్లు టైం వృధా చేసుకోవలసిన పనిలేదు.

25, అక్టోబర్ 2007, గురువారం

IDEA GPRS నెట్ ని పిసి/లాప్ టాప్ పై పొందలేకపోతున్నారా?



IDEA GPRS ద్వారా ఫోన్లో ఇంటర్నెట్ వస్తూ బ్లూటూత్/డేటా కేబుల్ ద్వారా పిసి/లాప్ టాప్ కి కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఫోన్ డయలప్ కనెక్షన్ IDEA సర్వర్ కి కనెక్ట్ అయి కూడా ఏ వెబ్ పేజీ ఓపెన్ అవని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. దీనికి పరిష్కారంగా మోడెం ప్రాపర్టీలలో AT+CGDCONT=1, "IP", "INTERNET" అనే ఇనీషయలైజేషన్ విలువను ఇవ్వాలి. అదెలాగో ఈ వీడియోలో వివరంగా చూద్దాం.తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది, స్పీకర్లు ఆన్ చేసుకోండి.

23, అక్టోబర్ 2007, మంగళవారం

ఫొటోషాప్ లో ఒకే బ్యాక్ గ్రౌండ్లో పలు ఇమేజ్ లు మెర్జ్ చేయడం (వీడియో)

అడోబ్ ఫొటోషాప్ లో పలు ఒకే బ్యాక్ గ్రౌండ్ లో అనేక ఇమేజ్ లను ఇలా మెర్జ్ చేస్తారో ప్రాధమిక స్థాయిలో ఈ వీడియోలో వివరించాను. వీడియో పరిమాణం పెరిగిపోతుండడం వల్ల మరింత వివరంగా అందించలేకపోతున్నాను.

22, అక్టోబర్ 2007, సోమవారం

తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం

తెలుగు వికీపీడియాలో మనకు కావలసిన సమాచారం పొందడం ఎలాగో క్రింది వీడియోలో వివరించడం జరిగింది. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!

ప్రతీ గ్రామానికీ ఒక చరిత్ర ఉంటుంది, సంస్క్దృతి, ఆచారాలు, పండగలు ఉంటాయి. మీరు పుట్టిపెరిగిన గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పే గురుతర బాధ్యతని మీరే ఎందుకు తీసుకోకూడదు? మీకు ఆసక్తి ఉంటే తెలుగు వికీపీడియాలో మీ గ్రామం యొక్క వివరాలను పొందుపరచడం ఎలాగో ఈ క్రింది వీడియోలో (తెలుగు ఆడియో వివరణ సైతం ఉంటుంది) చూసి ఆ ప్రకారం మీ ఊరి వివరాలు పొందుపరచండి.

21, అక్టోబర్ 2007, ఆదివారం

స్ట్ర్రీమింగ్ సైట్ల నుండి పాటలను ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు (వీడియో)

ఆంధ్రావిలాస్.కాం, తెలుగుఎఫ్ ఎం.కాం వంటి సైట్లలో ప్లే అయ్యే పాటలను క్రింది వీడియోలో సూచించిన పద్ధతిలో మీ హార్డ్ డిస్క్ లోకి నిక్షేపంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీడియోలో తెలుగు ఆడియో వివరణ కూడా ఉంటుంది.