రిజిస్ట్రీ టిప్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రిజిస్ట్రీ టిప్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2007, సోమవారం

IE లో వెబ్ పేజీ సోర్స్ కోడ్ చూడకుండా.


నెట్ ద్వారా ఏదైనా వెబ్‌పేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు వెబ్‌పేజ్‌లో మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి
View Source అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ వెబ్‌పేజ్ యొక్క
సోర్స్‌కోడ్ ఓ Notepad విండోలో ఓపెన్ అవుతుంది. Windows XP
ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇలా రైట్‌క్లిక్ కాంటెక్స్ట్ మెనూలో ViewSource అనే
ఆప్షన్ కనిపించకుండా చేయాలంటే రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్‌లో
HKEY_CURRENT_USER\Software\Policies\Microsoft\InternetExplorer\Restrictions
అనే విభాగంలో NoViewSource పేరిట ఓ DWORD ఎంట్రీని క్రియేట్ చేసి
దానికి 1 అనే విలువను ఇస్తే సరిపోతుంది. Browseui.dll, Shdocvw.dll పైళ్లల్లో ఉన్న లోపాల కారణంగా కొన్ని సిస్టం లలో ఈ చిట్కా పనిచేయడం లేదు. మీ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ కి సర్వీస్ ప్యాక్ లభిస్తే దాన్ని ఇన్ స్టాల్ చేసుకున్నాక ప్రయత్నించండి.

ఆటోమాటిక్ క్లోజ్


రన్నింగ్ ప్రాసెస్లు ఆటోమేటిక్‌గా క్లోజ్ చెయ్యబడేలా..

విండోస్‌ని షట్‌డౌన్ చేసేటప్పుడు ఒక్కోసారి మెమరీలో ఏవైనా ప్రోగ్రాములు రన్
అవుతున్నట్లయితే "ఫలానా ప్రోగ్రామ్ రన్ అవుతోంది.దాన్ని క్లోజ్ చెయ్యమంటారా"
అనే వార్నింగ్ మెసేజ్ చూపించబడుతుంది.అన్ని ప్రోగ్రాములు క్లోస్ చెయబడిన
తర్వాతే సిస్టం షట్‌డౌన్ అవుతుందని మనకు తెలిసిందే. అలాంటప్పుడు ఫలానా
ప్రోగ్రాంని క్లోజ్ చెయ్యమంటారా అని Windows మన ముందు క్వశ్చన్‌మార్క్
పెట్టకుండా ఆటోమేటిక్‌గా రన్ అవుతున్న టాస్క్‌లను క్లోజ్ చెయ్యడానికి రిజిస్ట్రీలో..
HKEY_USERS\.DEFAULT\Control Panel\Desktop అనే విభాగంలో
AutoEndTasks పేరిట ఓ DWORD ఎంట్రీని క్రియేట్ చేసి దానికి 1 అనే విలువను ఇస్తే సరిపోతుంది.