30, సెప్టెంబర్ 2007, ఆదివారం

ప్లాష్ ఏనిమేషన్లని అడ్డుకోవడానికి


ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో మనం ఏ వెబ్ సైట్ ని ఓపెన్ చేస్తున్నా ప్రతీ పేజీలోనూ తప్పనిసరిగా కొన్ని ఫ్లాష్ ఏనిమేషన్లు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఇవన్నీ అడ్వర్ టైజ్ మెంట్లు కావడం గమనార్హం. ఇలాంటి మనకు ఏమాత్రం అవసరం లేని ఫ్లాష్ అడ్వర్ టైజ్ మెంట్లు సిస్టంలోకి ప్రవేశించడానికి ఎక్కువ నెట్ బ్యాండ్ విడ్త్ ని ఉపయోగించుకుంటాయి. మనం ఏ సమాచారాన్నయితే కోరుకుంటామో దానికి ప్రాధాన్యత

ఇవ్వబడకపోగా ఉన్న బ్యాండ్ విడ్త్ మొత్తాన్నీ ఈ ప్రకటనలే హరిస్తుంటాయి. ఈ నేపధ్యంలో నెట్ కి కనెక్ట్ అయినప్పుడు వెబ్ పేజీల్లో ఫ్లాష్ పైళ్లనేవే చూపించబడకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే Start>Run కమాండ్ బాక్స్ల్ లోకి వెళ్లి.. regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx/u అని టైప్ చేసి (IE7లో swflash.ocx బదులు flash9c.ocx అనే ఫైల్ పేరు టైప్ చేయాలి) OK బటన్ ప్రెస్ చేయండి. దీంతో ఇకపై వెబ్ పేజీల్లో ఏ విధమైన ఫ్లాష్ ఏనిమేషన్లూ చూపించబడవు. భవిష్యత్సులో ఎప్పుడైనా తిరిగి ఫ్లాష్ ఏనిమేషన్లు చూపించబడేలా ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ Start>Run కమాండ్ బాక్స్ లోనే regsvr32 c:\windows\system32\macromed\Flash\swflash.ocx అని టైప్ చేసి OK బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.

27, సెప్టెంబర్ 2007, గురువారం

రిజిస్ట్రీ టిప్స్ వీడియో సిడి

తెలుగులో మొట్టమొదటిసారిగా "కంప్యూటర్ ఎరా" మాసపత్రిక ఆడియో వివరణతో కూడిన వీడియో సిడిలను రూపొందించడానికి పూనుకున్నది. ఈ నేపధ్యంలో మీ అభిమాన పత్రిక నుండి మొదటి వీడియో సిడిగా విండోస్ "REGISTRY TIPS" విడుదల చేయడం జరిగింది. దాదాపు 4 గంటల నిడివి గల ఆడియో వివరణ కలిగిన అత్యద్భుతమైన దృశ్య నాణ్యత కలిగిన వీడియో ఫైళ్లని ఇందులో పొందుపరిచాం. ఈ సిడి ధర రూ. 300/-. చక్కని నాలెడ్జ్ పాఠకులకు అందించాలన్న సదాశయంతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సిడి కావాలనుకునే వారు ఈ క్రింది అడ్రస్ కు రూ. 300/- (కేవలం మనియార్డర్ ద్వారా మాత్రమే) పంపించి సిడిని కొరియర్ ద్వారా తెప్పించుకోగలరు. మనియార్డర్ ఫారంలో మీ పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబర్, సిడి పేరు (Registry Tips సిడి కోసం అని రాయాలి) వివరంగా రాయాలి. మనియార్డర్ పంపించవలసిన చిరునామా:

N. Sridhar,
303, Sai Pavan Nivas,
Daieerguda, Near Rao's High School,
Kukatpalli, Hyderabad.
Ph: 9848227008
గమనిక: మేగజైన్ రూపకల్పనలో ఉన్నప్పుడు ఫోన్ ఆఫ్ చేసి ఉంచబడుతుంది.

SATA - ఇంటర్‌ఫేస్ ఎందుకు?SATA - అధునాతన మదర్‌బోర్డ్ లన్నింటిలో పొందుపరచబడుతున్న కనెక్టివిటీ ఇంటర్‌ఫేస్! Serial ATA అనే పదాన్ని సంక్షిప్తంగా SATA అని పిలుస్తుంటారు. ఇంతకుముందు ఉపయోగించబడిన Parallel ATA అనే ఇంటర్‌ఫేస్ స్థానంలో ప్రవేశించిందీ కొత్త టెక్నాలజీ. మదర్‌బోర్డ్ లపై SATA సపోర్ట్ ని అందిస్తుండడంతో ప్రస్తుతం ఈ హార్డ్ డిస్కులు, సిడి/డివిడి రైటర్లు కూడా SATA వి లభిస్తున్నాయి. SATA డిస్కులను మామూలు PATA డిస్క్ ల మాదిరిగా Master, Slave అని జంపర్ సెట్టింగులని కాన్ఫిగర్ చేయవలసిన అవసరం లేదు. SATA డిస్క్ లు తమకి తాము ప్రత్యేకమైన చానెల్‌ని వినియోగించుకుంటాయి. కాబట్టి మామూలు డ్రైవ్‌లలో మాదిరిగా జంపర్ సెట్టింగుల పనిలేదు.

SATA ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ అంత అవసరమా?

భారీ స్టోరేజ్ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ లు విడుదల అవుతుండడం, మరోవైపు క్రమేపీ పవర్‌ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్ ప్రొగ్రాములు, గేమ్‌లు మార్కెట్లో ప్రవేశిస్తుండడంతో SATA ఇంటర్‌ఫేస్ రూపం సంతరించుకుంది. SATA 1 ఇంటర్‌ఫేస్ ద్వారా సెకనుకి 150MB డేటానీ, SATA 2 ఇంటర్‌ఫేస్ ద్వారా 300MB ట్రాన్స్ ఫర్ రేట్‌ని సాధించవచ్చు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. SATA ఇంటర్‌ఫేస్‌కి సంబంధించిన సామర్ధ్యం మాత్రమే ఇది. SATA హార్డ్‌డిస్క్ ని మీ కంప్యూటర్‌లో పెట్టుకుని .. 'సార్, మీరు చెప్పినంత స్పీడ్ రావట్లేదు ' అనకండి. కేవలం ఇంటర్‌ఫేస్ బాగా స్పీడై ఉన్నంత మాత్రాన సరిపోదు. హార్డ్‌డిస్క్ ల యొక్క RPM(నిమిషానికి తిరిగే చుట్ల సంఖ్య), బఫర్ సైజ్ పరిమితంగా ఉన్నంత కాలం మీరు SATA ఇంటర్‌ఫేస్ ఉన్న సిస్టమ్‌ని వాడుతున్నా ఉపయోగంలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హార్డ్‌డిస్క్ లు గరిష్టంగా 10000 RPM తో తిరిగేవి లభిస్తున్నాయి. వీటిని SATA ఇంటర్‌ఫేస్‌కి కనెక్ట్ చెయ్యడం వల్ల సెకనుకు 80MB మేరకు సమాచారాన్ని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వీలవుతుంది.

ఏయే కేబుళ్ళు అవసరం అవుతాయి…

మీ మదర్‌బోర్డ్ పై SATA సపోర్ట్ ఉంటే మదర్‌బోర్డ్ తో పాటు 7-pin డేటా కేబుల్ అందించబడుతుంది. దానిని ఒక వైపు మదర్‌బోర్డ్ పై కనెక్ట్ చేసి రెండవ చివర్న SATA హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి. డిస్క్కి పవర్‌సప్లై ఇవ్వడానికి 15-pin పవర్ కేబుల్‌ని ఉపయోగించాలి. అధికశాతం SATA డ్రైవ్‌లు తమకు కావలసిన విద్యుత్ కోసం 15-pin పవర్ కేబుళ్ళపైన గానీ , లేదా మన సిస్టమ్‌లలో సాధారణంగా కనిపించే 4-pin పవర్ కేబుళ్ళపై గానీ ఆధారపడతాయి. రెండింటిలో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే పవర్ సప్లై అందించాలి. 25-pin కేబుల్ లేకపోతే 43-pin to 15-pin పవర్ అడాప్టర్‌ని వాడవచ్చు.

డ్రైవ్ గుర్తించబడలేదా?

మీ మదర్‌బోర్డ్ కి డీఫాల్ట్ గా SATA సపోర్ట్ ఉంటే సమస్యే లేదు. ఒకవేళ మీరు కొత్తగా కొన్ని SATA హార్డ్ డిస్క్ని వాడడం కోసం, మీ మదర్‌బో్ర్డ్ పై SATA సపోర్ట్ లేకపోయినా థర్డ్ పార్టీ SATA కంట్రోల్లర్‌ని అమర్చుకున్నట్లయితే ఆ కంట్రోలర్‌కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయకపోతే ఆ కంట్రోలర్‌కి మీరు కనెక్ట్ చెసిన SATA హార్డ్ డిస్క్ గుర్తించబడదు. ఇకపోతే మదర్‌బోర్డ్ పైనే SATA సపోర్ట్ ఉన్నట్లయితే మీ మదర్‌బోర్డ్ సిడిలోనే SATA కంట్రోలర్‌కి సంబంధించిన డ్రైవర్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని మదర్‌బోర్డ్ ల విషయంలో ఫ్లాపీ్‌డిస్క్ ల్లో డ్రైవర్లు అందించబడుతుంటాయి. వాటిని తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకుంటేనే సపోర్ట్ లభిస్తుంది.

డ్రైవర్లు ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

మదర్‌బోర్డ్ తో పాటు ఫ్లాపీలో SATA కంట్రోలర్ డ్రైవర్లు అందించబడితే ఓ.కే. మదర్‌బోర్డ్ సిడిలో డ్రైవర్లు ఇవ్వబడినట్లయితే ముందు వేరే కంప్యూటర్‌లో ఆ సిడిని పెట్టి అందులోని Drivers అనే ఫోల్డర్‌లో ఉండే MakeDisk.exe అనే ప్రోగ్రామ్‌ని రన్ చేయడం ద్వారా ఒక ఖాళీ ఫ్లాపీలోకి SATA డ్రైవర్లని కాపీ చేసుకోండి. ఇప్పుడు Windows XP Setup సిడితో సిస్టమ్‌ని బూట్ చేసి కొద్ది క్షణాల తర్వాత స్క్రీన్‌పై Press F6 if you need to install a third party SCSI drivers అనే మెసేజ్ కనిపించినపుడు F6 కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు S కీని ప్రెస్ చేసి SATA కంట్రోలర్ డ్రైవర్లు ఉన్న ఫ్లాపీ డిస్క్ ని డ్రైవ్‌లో ఇన్‌సర్ట్ చేసి డివైజ్‌ని పేర్కొంటే డ్రైవర్లు ఇన్‌స్టాల్ అవుతాయి.

26, సెప్టెంబర్ 2007, బుధవారం

చిట్కాలు

ప్రస్తుతం లభిస్తోన్న అన్ని గ్రాఫిక్స్ కార్డులలోకి Nvidia GeForce 7950 GX2 అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

నెట్‍వర్క్ లోని ఇంటర్నెల్ పిసిలకు ప్రైవేట్ అడ్రస్‍ని ఇవ్వడం ద్వారా ఫైర్‍వాల్ మాదిరిగా రక్షించే సర్వీసే.. Network Address Translation

Printer Spooler అనే ఫోల్డర్ కరప్ట్ అయితే మనమ్ ప్రింట్ చేసే డాక్యుమెంట్లు Junk Characters తో వస్తాయి.

www.rapidshare.de అనే ఉచిత ఫైల్ హోస్టింగ్ వెబ్‍సైట్ ఎప్పటికప్పుడు టైమర్, వర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్‍లను మారుస్తుంది.

.NET ఆధారంగా డెవలప్ చేయబడిన అప్లికేషన్లు మన సిస్టమ్‍లో రన్ అవాలంటే .NET Framework సిస్టమ్‍లో ఉండి తీరాలి.

CMOS బ్యాటరీ లేకపోతే మామూలు కన్నా విండోస్ బూటింగ్ స్లో అవుతుంది. BIOS OS కి ట్రాన్స్ ఫర్ అయ్యే సమయం ఎక్కువవుతుంది.

DDR2 రామ్ స్లాట్ ఉన్న మదర్‍బోర్డ్ లలో 1GB సామర్ధ్యం కలిగిన మెమరీ మాడ్యూల్‍ని వాడడం ద్వారా పెర్‍ఫార్మెన్స్ బాగుంటుంది.

Thunderbird మన మెయిళ్ళని సర్వర్‍లో ఒక్క కాపీ కూడా మిగల్చకుండా అన్నీ మన సిస్టమ్‍లోకి ఆఫ్‍లైన్‍లోకి డౌన్‍లోడ్ చేస్తుంది

Dual Core Processor ప్రొసెసర్‍ని అమర్చుకోదలుచుకున్న వారు E6400 మోడళ్ళని నిరభ్యంతరకరంగా ఎంపిక చేసుకోవచ్చు.

మన నెట్‍వర్క్ లోని సెక్యూరిటీ లోపాలను గుర్తించడానికి www.xfocus.org సైట్‍లో లభించే X-Scan అనే ప్రోగ్రామ్ పనికొస్తుంది.

Visual Route అనే మృదులాంత్రం (software) ఉపయోగించి నెట్ ద్వారా మన సిస్టమ్‍కి ఎవరెవరు కనెక్ట్ అయ్యారన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

ఎలాంటి స్క్రీన్‍సేవర్‍ని ఉపయోగించకుండా LCD మోనిటర్‍ని నిరంతరం ఆన్ చేసి ఖాళీగా ఉంచితే 50% వరకూ బ్రైట్‍నెస్ తగ్గుతుంది.

అంతర్జాలం(Internet) పై ఏదైనా వెబ్‍సైట్‍ని చూడదలుచుకుంటే www.altavista.com అనే ఆన్లైన్ ట్రాన్స్ల్ లేషన్ సర్వీసు సాయం తీసుకోండి.

LCD మోనిటర్‍ని క్లీన్ చేసే మార్గంLCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే
గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల
స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని
ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా
మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో
అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ
(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్
స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

ప్లే అయ్యే పాటలు మధ్యలో కొద్ది క్షణాలు ఆగడానికి కారణం

C, D వంటి డిస్క్ద్ డ్రైవ్ లలో మనం భద్రపరుచుకున్న MP3 ఫైళ్లు Winamp వంటి మీడియా ప్లేయింగ్ సాప్ట్ వేర్ల ద్వారా ప్లే అయ్యేటప్పుడు కొన్నిసార్లు అప్పటివరకూ బాగానే ప్లే అయిన ఆడియో కొన్ని క్షణాలపాటు నిలిచిపోతున్నట్లు కొందరు చెబుతుంటారు. ఇదే విధంగా పినాకిల్ వంటి కేప్చరింగ్ కార్డ్ ల సాయంతో వీడియోని కేప్చర్ చేసేటప్పుడు అన్ని ఫ్రేములూ డిస్క్ లో స్టోర్ చేయబడక కొన్ని ఫ్రేములు డ్రాప్ చేయబడడం

కొంతమంది గమనించే ఉంటారు. దీనికి కొంతవరకూ హార్డ్ డిస్క్ మెకానిజం కారణమవుతుంది. హార్డ్ డిస్క్ లో ఉండే ప్లాటర్లు, డిస్క్ లోని Servo-Motorsకీ మధ్య ఎలైన్ మెంట్ స్థిరంగా ఉండాలి. ఐతే ఉష్ణోగ్రతలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఒక్కోసారి ఈ ఎలైన్ మెంట్ గతి తప్పుతుంటుంది. ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి హార్డ్ డిస్క్ నిరంతరాయంగా ధర్మల్ కాలిబ్రేషన్ అనబడే ప్రక్రియ ద్వారా Servo-Motorsకీ, ప్లాటర్లకూ మధ్య ఎలైన్ మెంట్ ని తనిఖీ చేస్తుంటుంది. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఎలైన్ మెంట్ తిరిగి కుదుర్చుకునేటప్పుడు ఆడియో విషయంలో ప్లే అవుతున్నది కాస్తా కొద్ది క్షణాలపాటు ఆగిపోవడం జరుగుతుంటుంది. దీని గురించి ఆందోళన చెందనవసరం లేదు.

25, సెప్టెంబర్ 2007, మంగళవారం

అక్టోబర్ 2007 సంచిక రెండు రోజుల్లో విడుదల అవుతుంది!

ఈ సంచికతో కంప్యూటర్ ఎరా 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ ఆరేళ్లలో స్పృశించిన కొన్ని అద్భుతమైన వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. మిస్ అవకుండా చదవవలసిన సంచిక ఇది.

సమాచారానికి స్పెషల్ ఎఫెక్టులు

కొంత సమాచారాన్ని టైప్ చేసి అది చుట్టచుట్టబడిన విధంగా క్రింది చిత్రంలోని మాదిరిగా మార్చాలంటే మల్టీమీడియాపై ఎంతో అవగాహన కలిగి ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. వాస్తవానికి Adobe Photoshop, Illustrator వంటి పవర్ ఫుల్ ప్రోగ్రాంలకు మాత్రమే ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను సాధించే ప్రత్యేకమైన ఫిల్టర్లు లభిస్తుంటాయి. అయితే ఆయా సాప్ట్ వేర్లు మీ వద్ద లేకపోయినా, లేదా

వాటిని ఉపయోగించడం ఎలాగో మీకు తెలియకపోయినా దిగులుపడవలసిన పనిలేదు. ఇంటర్నెట్ పై http://www.dotsphinx.com/partyprinter.en/ అనే వెబ్ సైట్ ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను అందిస్తోంది. ఈ వెబ్ సైట్లో కావలసిన షేప్ ని టెక్ట్స్ బాక్స్ లో మీకు కావలసిన సమాచారాన్ని టైప్ చేసి ఫాంట్ సైజ్ ని ఎంచుకుంటే సరిపోతుంది.

24, సెప్టెంబర్ 2007, సోమవారం

Norton సాప్ట్ వేర్లు సరిగ్గా అన్ ఇన్ స్టాల్ అవకపోతుంటే..www.symantec.com/symnrt అనే వెబ్ పేజీ నుండి రిమూవల్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని మీ పిసిలో వాడండి.

22, సెప్టెంబర్ 2007, శనివారం

టాస్క్ పై ఎంత సమయం వెచ్చించారన్నది:వృత్తి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు, సంవత్సరానికి, రోజుకి, గంటకు ఇంత అని సంపాదిస్తుంటారు. పేరున్న కన్సల్టెంట్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారు ఓ ప్రాజెక్ట్ పై తాము ఎంత కాలం సేవలను వెచ్చించామన్న అంశం ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తాము పనిచేసిన గంటలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంటుంది. దీనికోసం ఎక్కువగా క్యాలెండర్లు, PIM లపై ఆధారపడుతుంటారు. దానికి బదులు TaskBlaze అనే ప్రోగ్రామ్‍ని ఓ సారి ఉపయోగించి చూడండి. ఈ ఉచిత మృదులాంత్రము(software) ఏ task మీదైనా మనం వెచ్చించే సమయాన్ని ఖచ్చితంగా లెక్కిస్తూ ఉంటుంది. Taskని ప్రారంభించగానే ఈ ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసి Timer ని క్లిక్ చేయండి. పని పూర్తవగానే టైమర్‍ని ఆపేయండి. ఇప్పుడు ఆ Task పై మీరు వెచ్చించిన మొత్తం సమయం Outlook Schedule గా Export చేయబడుతుంది. ఈ సమాచారం ఆధారంగా మీ కస్టమర్ల నుండి ఫీజు వసూలు చేయవచ్చు. నిరంతరం బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.

Ipod ని డీఫ్రాగ్ చేసుకోవచ్చు…
2GB, 4GB మేరకు భారీ మొత్తంలో పాటల్ని స్టోర్ చేసుకోగలిగే Ipodలకు ఇటీవలి కాలంలో గిరాకీ పెరుగుతోంది. పాటలని స్టోర్ చేయడానికి మన కంప్యూటర్లో మాదిరిగానే Ipod లోనూ ఓ హార్డ్ డిస్క్ పొందుపరచబడి ఉంటుంది. సుదీర్ఘకాలం వినియోగించిన మీదట హార్డ్ డిస్క్ లోని సమాచారం మొత్తం చెల్లాచెదురై పోతుందని మనకు తెలుసు. దానిని తిరిగి క్రమపద్ధతిలో అమర్చడానికి Defragmenter అనే ప్రోగ్రామ్‍ని ఎలాగైతే ఉపయోగిస్తామో Ipod పై కూడా ఆ ప్రోగ్రామ్‍ని వాడే టెక్నిక్ ఒకటి ఉంది. మీ వద్ద ఉన్న Ipod ని మీ కంప్యూటర్‍కి కనెక్ట్ చేయండి. అది తప్పనిసరిగా Disk Modeలో ఉండాలి. Preferences మెనూ ద్వారా దీన్ని సెట్ చేయవచ్చు. ఇప్పుడు మామూలు డ్రైవ్‍ల మాదిరిగా డీఫ్రాగ్‍మెంటేషన్ చేయవచ్చు.

21, సెప్టెంబర్ 2007, శుక్రవారం

MP3 ఫైల్‍ని GIF పిక్చర్‍లో దాచిపెట్టడంమైక్రోఫోన్ ద్వారా మీ మాటలని MP3 ఫార్మేట్‍లో రికార్డ్ చేసి ఆ MP3 ఫైల్‍ని ఏదైనా GIF ఇమేజ్‍లో గోప్యంగా దాచిపెట్టి మీ స్నేహితులకు పంపించుకోవచ్చు. వారు ఆ ఫైల్‍‍ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చెస్తే కేవలం ఫోటో కన్పిస్తుంది తప్ప ఆడియో వినిపించబడదు. అదెలాగో చూద్దాం. మన వద్ద picture.gif మరియు audio.mp3 అని రెండు ఫైళ్ళు ఉన్నాయనుకుందాం. Start>Run బాక్స్ లో CMD అని టైప్ చేసి కమాండ్ ప్రామ్ట్ లోకి వెళ్ళి…copy picture.gif /b + audio.mp3 /b combined.gif అనే కమాండ్‍ని టైప్ చేయండి ఆ రెండు ఫైళ్ళ పాత్‍లని సరిగ్గా స్పెసిఫై చేయాలి సుమా! దీనితో audio.mp3 అనే ఫైల్ picture.gif అనే ఫైల్‍లో దాచివేయబడి కొత్తగా combined.gif అనే ఫైల్ రూపొందించబడుతుంది. ఇప్పుడు ఈ ఫైల్‍ని ఎవరికైనా పంపిస్తే కేవలం picture.gif ఫైల్‍‍లో ఉండే ఫోటోని చూడగలుగుతారు తప్ప audio.mp3 అనే ఫైల్‍లోని ఆడియో మాత్రం వారికి విన్పించబడదు. ఆడియో వినిపించాలంటే ఓ చిట్కా ఉంది. WinAmp ప్రోగ్రామ్‍లో ఆ combined.gif ఫైల్‍ని ఓపెన్ చేస్తే సరిపోతుంది.

డివిడి విలువని పెంచే లేబుళ్ళు
డిజిటల్ కామ్‍కోడర్, సెల్‍ఫోన్ కెమెరాల ద్వారా మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలను వీడియోగా తీసుకుని MPEG to DVD Converter వంటి మృదులాంత్రముల(Software) సాయంతో DVD ఫార్మేట్‍లోకి కన్వర్ట్ చేసుకుని చివరిగా ఖాళీ డివిడి డిస్క్ లో రైట్ చేసుకున్నారనుకుందాం. అంతా బానే ఉంది. ఈ డివిడిలపై డిస్క్ లో పొందుపరిచిన ఏదైనా దృశ్యాన్ని లేబుల్‍గా పొందుపరిస్తే ఇంకాస్త రిచ్ లుక్ వస్తుంది కదూ! మీ డివిడిలను ప్రొఫెషనల్‍గా తీర్చిదిద్దుకోవడమెలాగో తెలుసుకుందాం.

లేబులింగ్‍కి కావలసిన వస్తువులు.

ఒక ఖాళీ డివిడి బాక్స్, ఇంక్ జెట్ ప్రింటర్, ఫోటోపేపర్, లేబుళ్ళని రూపొందించడానికి ఓ మృదులాంత్రము(software) మనకు అవసరం అవుతాయి. ఇప్పుడు మీ డివిడి డిస్క్ పై లేబుల్‍గానూ, Jewel Case యొక్క లేబుల్‍గానూ ప్రింట్ చేయడానికి మన వద్ద ఉన్న వీడియో నుండి ఓ ఆకర్షణీయమైన ఫోటోని కేప్చర్ చేసుకోవాలి. దానికిగాను Windows Movie Maker లో మీ వీడియో ప్లె చేస్తూ నచ్చిన ఫ్రేమ్‍ను కేప్చర్ చేసి Adobe Photoshop వంటి ఫోటో ఎడిటింగ్ మృదులాంత్రం(software)తో ఆ ఫోటోలో ఏవైనా లోపాలు ఉంటే ఎడిట్ చేసుకోవాలి. డిస్క్ మధ్యభాగంలో hole ఉంటుంది కాబట్టి డిస్క్ కి లేబుల్‍గా ఉపయోగించదలుచుకున్న ఇమేజ్‍కి hole వచ్చే ప్రదేశంలో ముఖ్యమైన చిత్రాలు ఏమీ లేకుండా ఉంటే మంచిది. మూవీ నుండి లేబుల్‍గా ఉపయోగించదలుచుకున్న ఇమేజ్‍ని కేప్చర్ చేసేటప్పుడు వీలైనంత స్పష్టమైన ఫ్రేమ్‍ని ఎంచుకోండి. దీనివల్ల లేబుల్ చూడటానికి బాగుంటుంది. కేప్చర్ చేసిన ఫోటోని BMP, TIFF వంటి అన్‍కంప్రెస్డ్ ఫార్మేట్‍లో సేవ్ చేయడం వల్ల నాణ్యత లోపించకుండా ఉంటుంది.

డివిడి లేబుల్ డీజైనింగ్

ఇప్పుడు మనం డివిడి లేబుళ్ళని డిజైన్ చెయ్యడానికి CD Label Designer అనే మృదులాంత్రమును (software) ఉపయోగిద్దాం. www.datalandsoftware.com అనే వెబ్‍సైట్ నుండి దీని ట్రయల్ వెర్షన్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‍లో ఎడమచేతివైపు కనిపించే Labels అనే లిస్ట్ వద్ద Disk అనే అంశాన్ని ఎంచుకోండి. వెంటనే మెయిన్ విండోలో డిస్క్ రూపంలో గుండ్రని చిత్రం ప్రత్యక్షమవుతుంది. ఆ డిస్క్ బొమ్మ వద్ద మౌస్‍తో రైట్‍క్లిక్ చేసి Insert > Picture అనే ఆప్షన్‍ని ఎంచుకోండి. డిస్క్ పై ఏ ఇమేజ్‍ని లేబుల్‍గా అతికించదలుచుకున్నారో ఆ ఇమేజ్‍ని ఎంచుకోండి. ఒకవేళ మనం ఎంచుకున్న పిక్చర్ లేబుల్ కన్నా పెద్దదిగా ఉంటే దానిని Resize, Crop లలో ఏం చేయమంటారని అడుగుతుంది. Resize (keep aspect ratio) ఆప్షన్‍ని ఎంచుకోండి. Object మెనూలో ఉండే Arrange, Rotate వంటి ఆప్షన్లని ఉపయోగించి డిస్క్ పై లేబుల్ మనకు నచ్చిన విధంగా అమర్చబడేలా జాగ్రత్త వహించవచ్చు. డిస్క్ పై లేబుల్ మనకు నచ్చిన విధంగా అమర్చబడేలా జాగ్రత్త వహించవచ్చు. డిస్క్ పై ఏమైనా మేటర్ టైప్ చేయాలంటే Object > Insert > Text లేదా Circled Text అనే ఆప్షన్లని ఉపయోగించి పొందుపరచవచ్చు. ఇదే విధంగా Labels అనే విభాగంలో DVD Box అనే ఆప్షన్‍ని ఎంచుకుని బాక్స్ల్ల్ లో అమర్చదలుచుకున్న లేబుల్‍ని సైతం డిజైన్ చేసుకోండి. చివరిగా File > Print అనే ఆప్షన్ ద్వారా మీ ఇంక్‍జెట్ ప్రింటర్‍ని ఉపయోగించి లేబుళ్ళని ప్రింట్ చేసుకుని.. డిస్క్ యొక్క లేబుల్‍ని గుండ్రంగా నీట్‍గా కట్ చేసుకుని అంటించండి. అలాగే DVD Box యొక్క లేబుల్‍ని Front , Back ఇమేజ్‍్‍లకు మధ్య ఫోల్డ్ చేసి నీట్‍గా బాక్స్ ప్లాస్టిక్ కవర్ లోపల అమర్చండి. లేబుళ్ళపై సాధ్యమైనంతవరకూ దృశ్యాలు ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి అవసరం అయితేనే తప్ప text ని అదనంగా జతచేయకండి. Nero Vision Express వంటి మృదులాంత్రములతో(software) డివిడి ప్లే అయ్యేటప్పుడు మెనూ చూపించబడేలా కూడా ఆటోరన్‍లో డిజైన్ చేసుకోవచ్చు.

20, సెప్టెంబర్ 2007, గురువారం

Yahoo! Go మీడియా ప్లేయర్తన మార్కెట్‍ని విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా Yahoo సంస్థ
Yahoo!Go పేరిట ఓ కొత్త ప్రోడక్ట్ పరిచయం చేసింది. ప్రస్తుతం
Beta దశలో ఉన్న ఈ ప్రోడక్ట్ ని http://go.connect.yahoo.com/go
అనే వెబ్‍సైట్ నుండి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో వాడుకలో ఉన్న మీడియా
ప్లేయర్ మృదులాంత్రముల(software) కంటే భిన్నంగా ఈ Yahoo!Go
అనే మీడియా ప్లేయర్ మృదులాంత్రము కేవలం ఆడియో, వీడియో ప్లేయింగ్‍కి
ఉపయోగపడడమే కాకుండా DVR సిస్టమ్‍గానూ, మన సిస్టమ్‍లో ఉన్న
ఫోటోలను చూసుకోవడానికి Picture Viewerగా కూడా పనికొస్తుంది.
టివి ట్యూనర్ కార్డ్ ద్వారా ప్రసారం అయ్యే వీడియో సన్నివేశాలను కూడా ఈ
ప్రోగ్రామ్ ఉపయోగించి సిస్టమ్‍లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్‍ఫోన్లని దృష్టిలో
ఉంచుకుని ఈ ప్రోగ్రామ్‍కి మొబైల్ వెర్షన్ కూడా విడుదల చేశారు. మీ ఫోన్‍లో
వాడుకోవచ్చు.

ఏం ఫాంట్ వాడారన్నది తెలుసుకోవాలా?వార్తాపత్రికలలోనూ, ఇంటర్నెట్ మీదా అనేక వెబ్‍సైట్లలో రకరకాల ఆకర్షణీయమైన
ఫాంట్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని ఫాంట్లు మనకు బాగా నచ్చి వాటిని
మన డాక్యుమెంట్లలో ఉపయోగించాలన్న కోరిక ఉన్నా అది ఏ ఫాంట్ అన్నది
తెలియక ఊరకుండిపోతుంటాం ఈ నేపధ్యంలో న్యూస్ పేపర్‍లోని ఫాంట్ మీకు
నచ్చినట్లయితే దానిని స్కానర్ ద్వారా స్కాన్ చేసి, లేదా వెబ్‍పేజీల్లోని ఫాంట్
నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి http://www.myfonts.com/WhatTheFont/ వెబ్‍సైట్లో అప్‍లోడ్ చేస్తే ఆ ఫోటోలో ఉపయోగించిన ఫాంట్
పేరేమిటి, దాని వివరాలు, ఆ ఫాంట్ ఎక్కడైనా లభిస్తున్నట్లయితే దాని
డౌన్‍లోడ్ లింక్‍ని ఆ వెబ్‍సైట్ మనకు అందిస్తుంది. డౌన్‍లోడ్ చేసుకుని దాన్ని
వాడుకోవచ్చు.

15, సెప్టెంబర్ 2007, శనివారం

ఫోటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్ లుంటే…ఓ గార్డెన్‍లో మీ కుటుంబ సభ్యులను నిలబెట్టి మీ దగ్గర ఉన్న డిజిటల్ కెమెరాతో
ఫోటో తీస్తున్నారనుకుందాం. Snap బటన్ క్లిక్ చేసేలోపే మీ ఫ్యామిలీ మెంబర్స్
వెనుకగా ఎవరైనా వ్యక్తులు వెళుతున్నా, జంతువులు వెళుతున్నా, కార్లు
వంటివి మూవ్ అవుతున్నా ఆ ఆబ్జెక్టులు సైతం మీరు తీసే ఫోటోలోకి చేరే అవకాశం
ఉంది. కొంతమంది నేచురాలిటీ కోసం అలాంటి అదనపు ఆబ్జెక్టులను పెద్దగా
పట్టించుకోరు. మరి కొంతమంది Photoshop వంటి సాఫ్ట్ వేర్లతో ఎలాగైనా ఆ
అనవసరమైన వస్తువులను తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి
కోసమే Tourist Remover అనే ఆన్‍లైన్ సర్వీస్ ఒకటి ఉపయోగపడుతుంది. www.snapmania.com/ అనే వెబ్‍సైట్‍లో
లభిస్తున్న ఈ సర్వీస్ ఫోటోగ్రాఫర్లకి ఉపయోగపడుతుంది. అనవసరమైన అంశాలు
ఫోటోలో తారసపడిన వెంటనే ఆలస్యం చేయకుండా మరో ఫోటోని షూట్ చేయండి.
ఈ రెండు ఫోటోలని Tourist Remover ప్రోగ్రామ్‍ని ఇస్తే అది మొదటి ఫోటోని
రెండవ ఫోటోతో మిక్స్ చేయడం ద్వారా మనం ఏ అంశాలైతే ఫోటోలో
కనిపించకూడదనుకుంటున్నామో వాటిని తొలగిస్తుంది. ఇది అధికభాగం పెయిడ్ సర్వీస్ కావడం కొద్దిగా ఇబ్బంది.

14, సెప్టెంబర్ 2007, శుక్రవారం

Wikia అందిస్తున్న ఉచిత హోస్టింగ్

వికియా సంస్థ తాజాగా ఉచిత వెబ్ హోస్టింగ్ సేవలను ప్రారంభించింది. Open Serving పేరిట
అందించబడుతున్న ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసులను ఉపయోగించి ఎవరైనా తమ
స్వంత వెబ్‍సైట్లని ఇంటర్నెట్‍పై పొందుపరుచుకోవచ్చు. వెబ్‍స్పేస్, బ్యాండ్‍విడ్త్
పూర్తి ఉచితంగా అందించబడుతున్నాయి. మరో విశేషమేమిటంటే ఇతర ఫ్రీ వెబ్
హోస్టింగ్ సర్వీసులు ఉచిత బ్యాండ్‍విడ్త్ ని కల్పించిన మన వెబ్‍సైట్లలో
అడ్వర్‍టైజ్‍మెంట్లని గుప్పిస్తుంటాయి. దీని వల్ల మన సైట్‍ని విజిట్ చేయాలనుకునే
యూజర్లు వెనుకాడుతుంటారు. అయితే వికియా అందిస్తున్న
Open Serving సర్వీస్ ద్వారా మనమ్ వెబ్‍సైట్‍ని క్రియేట్ చేసుకున్నప్పుడు
మన సైట్‍లో ఎలాంటి అడ్వర్‍టైజ్‍మెంట్లు ప్రదర్శింపబడవు. నిజంగా ఇది పెద్ద విశేషమే.
YouTube సంస్థకి, Openservingకీ ఉన్న సంబంధాల దృష్ట్యా ఇది సాధ్యపడుతుంది
అని అంటున్నారు.. www.openserving.com సైట్ ద్వారా మీ సైట్‍ని
హోస్ట్ చేయండి.

Windows Vista క్రాక్‍తో డేంజర్ సుమా!
మైక్రో‍సాఫ్ట్ సంస్థ విడుదల చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Windows Vista యొక్క బీటా వెర్షన్‍ని గతంలో పలువురు యూజర్లు నెట్ నుండి డౌన్‍లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ వెర్షన్‍కి ఉన్న ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు Vista Beta వెర్షన్‍ని జీవితకాలం ఉపయోగించుకోవచ్చంటూ ఇంటర్నెట్‍పై కొని వెబ్‍సైట్లలో ఏక్టివేషన్ క్రాక్‍ని పొందుపరిచారు. Windows Vista All Versions Activation 21.11.06 పేరిట నెట్‍పై దర్శనమిస్తున్న ఈ క్రాక్ ప్రోగ్రాంని మీ కంఫ్యూటర్‍లోకి డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు.. ఇది Crack కాదు. మన సిస్టమ్‍లోని కీలకమైన సమాచారాన్నిహ్యాకర్‍కి పంపిస్తుండే Trojan ప్రోగ్రామ్. ఇలాంటి వాటి మాయలో పడి మీ సిస్టమ్‍ని ఖరాబు చేసుకోకండి. Trojan.PSW Win32.LdPinch.aze అనే ట్రోజాన్ ప్రోగ్రామ్ ఇది. లేటెస్ట్ ఏంటి వైరస్ సాఫ్ట్ వేర్లన్నీ దీనిని గుర్తించగలుగుతున్నాయి. అయితే Norton Antivirus సాఫ్ట్ వేర్ ఈ ట్రోజాన్‍ని గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరం. చాలామంది కంఫ్యూటర్లలో ఎక్కువగా ఈ ప్రోగ్రామే ఉండడంవల్ల సైలెంట్‍గా సిస్టమ్‍లోకి వచ్చేస్తోంది.

12, సెప్టెంబర్ 2007, బుధవారం

ఫ్లాష్ డ్రైవ్‍లకు మీ ఫోటో ఐకాన్ వచ్చేలా…
అధికమొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలిగి ఉండడం, ఎక్కడికైనా జేబులో
వేసుకుని తీసుకెళ్ళగలగడం వంటి కారణాల వల్ల ప్రస్తుతం పలువురు USB
Flashdrive లని వాడుతున్నారు. వీటిని USB పోర్ట్ కి గుచ్చి Windows
Explorer లో వాటి డ్రైవ్ లెటర్‍ని యాక్సెస్ చేసేటప్పుడు ఆయా డ్రైవ్‍లతో పాటు
మన ఫోటోనో, నచ్చిన చిత్రమో ఐకాన్‍గా Windows Explorerలో
చూపించబడాలంటే ఓ చిన్న టెక్నిక్‍ని ఫాలో అవవచ్చు. ఏదైనా Icon
Creator ప్రోగ్రామ్‍తోముందు మీకు నచ్చిన ఫోటోని .ICO ఎక్స్ టెన్షన్ నేమ్
కలిగిన ఐకాన్‍గా మార్చుకోండి. ఆ ఫైల్‍కి autorun.ico అని పేరు పెట్టండి.
ఇప్పుడు Notepadలో ఖాళీ ఫైల్‍లో..

[autorun]
icon=autorun.ico

అని టైప్ చేసి autorun.inf పేరుతో ఆ ఫైల్‍ని టెంపరరీగా విండోస్ డెస్క్ టాప్‍పై
సేవ్ చేయండి. ఇప్పుడు USB డ్రైవ్‍ని ఇన్‍సర్ట్ చేసి ఆ డ్రైవ్ యొక్క రూట్ డైరెక్టరీలో
ఈ autorun.inf ఫైల్‍ని కాపీ చేశారంటే సరిపోతుంది. ఇకపై డ్రైవ్‍ని ఎప్పుడు
ఇన్‍సర్ట్ చేసినా మీ ఫోటో ఐకాన్‍గా వస్తుంది.

Gmail వేగంగా ఓపెన్ అయ్యేలా…
mail.google.com అనే అడ్రస్‍ని టైప్ చేయడం ద్వారా Gmail ఓపెన్
చేస్తునపుడు Loading అనే మెసేజ్ చూపించబడి స్క్రీన్‍పై Gmail హోమ్‍పేజ్
చూపించబడడానికి కొంత సమయం పడుతుంది. ఇలా Loading అనే మెసేజ్
కన్పించినప్పుడు Ctrl+F5 కీబోర్డ్ షార్ట్ కట్‍ని ఉపయోగించండి. వెంటనే
హోమ్‍పేజి ప్రత్యక్షమవుతుంది. mail.google.com అనే అడ్రస్‍కి బదులు
http://mail.google.com/mail/h/ అనే అడ్రస్‍ని టైప్ చేసినా కూడా
అదనపు ఆకర్షణలు వీలైనంతగా తగ్గించబడి Gmail హోమ్‍పేజి వెంటనే
ప్రత్యక్షమవుతుంది. ఇంకా స్పీడ్‍గా కావాలంటే http://m.gmail.com అనే
అడ్రస్‍ని టైప్ చేయండి. ఇది Gmail యొక్క మొబైల్ వెర్షన్. చాలా వేగంగా ,
తక్కువ గ్రాఫిక్స్ తో స్క్రీన్‍పై దర్శనమిస్తుందిది.

11, సెప్టెంబర్ 2007, మంగళవారం

మీ పిసి జాగ్రత్త
అధికశాతం కంప్యూటర్ యూజర్లు క్రమం తప్పకుండా హార్డ్ డిస్క్ ని Scan , Defragmentation చేస్తూ RegCleaner, System Mechanic వంటి యుటిలిటి ప్రోగ్రాముల సాయంతో ఎప్పటికప్పుడు రిజిస్ట్రీని క్లీన్ చేసుకుంటూ తమ కంప్యూటర్ సరైన కండిషన్‍లో ఉందని మురిసిపోతుంటారు. కంప్యూటర్ వేగంగా పనిచెయ్యడానికి ఈ చర్యలన్నీ ఎంతో అవసరమైనవే. అయితే, వీటికి తోడు కొన్ని బహిర్గత అంశాల్ని సైతం పాటిస్తేనే ఎటువంటి అవాంతరాలూ లేకుండా మీ సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యగలుగుతుంది. అవేంటో వివరంగా చూద్దాం…


రూమ్ టెంపరేచర్, పిసి అరేంజ్‍మెంట్


సూర్యకిరణాలు నేరుగా ప్రసరించే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్యూటర్‍ని అమర్చకండి. అంతేకాదు. ఉష్ణోగ్రతలో ఎక్కువ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాలూ కంప్యూటర్లకు అనుకూలమైనవి కావు. కాబట్టి, ఏ.సి, కూలర్, హీటర్ వంటి ఉష్ణోగ్రతల్ని మరీ ఎక్కువగా, మరీ తక్కువగా మార్పిడి చేసే పరికరాలకు సమీపంలో కంప్యూటర్లని అమర్చకూడదు. 60-85 డిగ్రీల ఫారెన్‍హీట్ గది ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో పిసిని అమర్చడం ఉత్తమం. మీ కంప్యూటర్ లోపల అమర్చబడి ఉన్న ఫాన్ మంచి కండీషన్లో ఉన్నదైతే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఫర్వాలేదు. ప్రొసెసర్‍ని చల్లబరిచే ఫ్యాన్‍కు తోడు అదనంగా మరో చిన్న ఫ్యాన్‍ని క్యాబెనెట్ లోపల power LEDలు అమర్చబడిఉండే ప్రదేశం వద్ద అమర్చుకుంటే, మదర్‍బోర్డ్ పై ఉండే ఇతర పరికరాలు కూడా ఎప్పటికప్పుడు చల్ల బరచబడతాయి. వీలైతే క్యాబెనెట్ వెనుకభాగంలో మదర్ బోర్డ్ పై వెలువడే వేడిమిని బయటకు పంపించే exhaust fan అమర్చుకుంటే మరీ మంచిది. చాలా తక్కువ ఖర్చుకే ఇవి దొరుకుతాయి. అయితే క్యాబినెట్‍లో ఏర్పాటు ఉండాలి.


దుమ్ము విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు…


ఒక్కసారి క్యాబెనెట్ కవర్‍ని విప్పదీసి చూస్తే లోపల ఎంత దుమ్ము పెరుకుపోయి ఉంటుందో మీకు తెలుస్తుంది. చాలామంది కంప్యూటర్ క్యాబినెట్ కవర్‍ని విప్పడానికే భయపడతారు. దీనివలన ఎంత నష్టం వాటిల్లుతుందో గ్రహించరు. మదర్‍బోర్డ్ పై అమర్చబడిన వివిధ Card ల పైనా, RAM మాడ్యూళ్ళ పైనా, సిపియు ఫ్యాన్, కంప్యూటర్‍లోని భాగాలకు, విద్యుత్ సరఫరా చెసే SMPS లోని ఫ్యాన్ (ఇది క్యాబినెట్ వెనుకభాగంలో back panel నుండి బయటకే కన్పిస్తుంటుంది.
వివిధ కేబుళ్ళపై దుమ్ము అధికంగా పేరుకుపోతుంటుంది. ఎప్పటికప్పుడు ఈ దుమ్ముని తొలగించకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా Cardల అంచుల వద్ద ఉండే కాంటాక్ట్ పాయింట్స్ దెబ్బ తిని ఒక్కోసారి ఉన్న పళాన కంప్యూటర్ ఆగిపోవచ్చు. డిస్‍ప్లే నిలిచిపోవచ్చు. స్పీకర్ల నుండి సౌండ్ రాకపోవచ్చు. అలాగే సిపియు ఫ్యాన్ పనితీరు మందగించి, సిస్టమ్ త్వరగా వేడెక్కి మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. చాలామంది మదర్ బోర్డ్ పై ఉండే IDE , పవర్ కేబుళ్ళని ఇష్టానుసారం వదిలేస్తుంటారు. అవి CPU ఫ్యాన్‍కు అడ్డుపడుతున్నా పట్టించుకోరు. కేబినెట్‍ని విప్పదీసి చూస్తే లోపలంతా రకరకాల కేబుళ్ళతో, ఏ కేబుల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియక గందరగోళంగా ఉంటుంది. దీనివల్ల "మీ సిస్టమ్‍కి ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి కేబినెట్ లోపల ఉండే కేబుళ్ళని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని అవి మదర్‍బోర్డ్ పై ఉండే ఏ హార్డ్ వేర్ పరికరాలకు తగలని విధంగా విధంగా రబ్బర్‍బాండ్‍తో కట్టడం మంచిది. ఇకపోతే… కేబినెట్‍ని విప్పదీయగలిగాం కదా అని, మోనిటర్ కేస్‍ని విప్పదీయడానికి ప్రయత్నించకండి. టెక్నీషియన్ సాయం తిసుకోవడం మినహా మోనిటర్ల విశయంలో మీరు చెయ్యగలిగిందేమీ లేదు. అయితే మోనిటర్ లోపల ఎక్కువగా దుమ్ము పేరుకుపోకుండా ఉండడం కొసం పనంతా పూర్తయిన తర్వాత శుభ్రమైన కవర్‍తో దాన్ని కప్పి ఉంచండి.


కీబోర్డ్ ద్వారా ఎంతో చెత్త లోపలికి…..కీబోర్డ్ విషయంలో కూడా ఇదే మాదిరి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది యూజర్లు కీబోర్డ్ గురించి ఏ మాత్రం పట్టించుకోరు. కాఫీ, టీ, కూల్‍డ్రింక్స్ వంటి ద్రవపదార్ధాలను, ఇతర ఆహార పదార్ధాలను ఇష్టానుసారం కంప్యూటర్ వద్దే సేవిస్తుంటారు. ఇలా చేసేటప్పుడు ఆయా పదార్ధాలు పొరబాటున కీబోర్డ్ లో కీల మధ్య ఖాళీ స్థలాల్లోకి చొచ్చుకుపోతాయి మున్ముందు కొన్ని కీల కాంటాక్ట్ పాయింట్ల్లు దెబ్బ తిని వాటిని మనం ఎంత ప్రెస్ చేసినా పనిచెయ్యక ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ కంప్యూటర్ సమీపంలో ఆహారపదార్థాలను సెవించకండి. తరచుగా
కీబోర్డ్ ని బోర్లించి మెల్లగా దాని వెనుక చెత్తో కొట్టడం ద్వారా కీల మధ్య ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి ప్రయత్నించండి. ఎప్పుడు చేతులు కీబోర్డ్ పై అలాగే ఉంచడం వల్ల మన చెతులకు అంటుకున్న మురికి మొత్తం కీబోర్డ్ ని అందవిహీనంగా చేస్తుంది.కాబట్టీ దాన్ని అప్పుడప్పుడు నీట్‍గా క్లీన్ చేయడం అలవాటు చేసుకోండి.


ఇతరత్రా తీసుకోవలసిన జాగ్రత్తలు


ఇకపోతే … ప్లాపీ డ్రైవ్, సిడిరామ్ డ్రైవ్ వంటి వాటిని తొలగించవలసి వచ్చినప్పుడు వెంటనే ఆ ఖాళీస్థలాన్ని కవర్ చేసేయండి. డ్రైవ్‍ల వద్ద ఖాళీస్థలం ఉండడం మూలంగా పెద్ద మొత్తంలో దుమ్ము, చీమలు, బొద్దింకలు. వంటి కీటకాలు కూడా క్యాబినెట్ లోపలికి ప్రవేశించి హాని కలిగించవచ్చు. అలాగే మౌస్ లోపల ఉండే ball కి, రోలర్లకీ దుమ్ము పట్టడం వల్ల ఎంత జరిపినా మౌస్ పాయింటర్ జరగకుండా మొరాయిస్తుంటుంది. అలాంటప్పుడు మౌస్ కవర్‍ని తొలగించి, మౌస్‍బాల్‍ని శుభ్రంగా కడిగి, పొడిగుడ్డతో తుడిచి, లోపల ఉండే రోలర్లపై పేరుకుపోయిన మురికిని మెత్తని గుడ్డతో మెల్లగా తొలగించాలి. దాంటో మౌస్ మళ్ళీ ఊపందుకుంఉంది. విద్యుత్ సరఫారాలో చోటు చేసుకునే భారీ హెచ్చుతగ్గులు, కంప్యూటర్‍ని అమర్చిన ప్లగ్ పాయింట్ సరిగ్గాఎర్త్ చెయ్యబడి లేకపోవడం, ప్లగ్ పాయింట్ నుండీ కంప్యూటర్‍కి విద్యుత్ సరఫరా చేసే పవర్ కార్డ్ దెబ్బతినడం వంటి పలు కారణాల వల్ల సిస్టమ్ లోపల ఉండే విలువైన హార్డ్ వేర్ పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, విద్యుత్ సరఫరా విషయంలొ కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. ఒకే ప్లగ్ పాయింట్‍కి ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చెయ్యడం మానేయాలి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తే కంప్యూటర్‍ని అనేక ప్రమాదాలనుండి రక్షించవచ్చు….

Ashampoo - illuminator
ఎలా ఉపయోగించాలి?


అన్ని రకాల ఫైళ్ళని అక్కడికక్కడే ఓపెన్ చేసి చూపించడంతో పాటు వీడియో, మ్యూజిక్, ఇమేజ్‍లు, డాక్యుమెంట్ ఫైళ్ళని Ashampoo Illuminator హార్డ్ డిస్క్ నుండి వెదికి పట్టుకుంటుంది. ఇమేజ్‍లను క్వాలిటీ నష్టపోకుండా ౧౫౦ పిక్సెల్స్ వరకూ ధంబ్ నెయిల్స్‍గా చూపిస్తుందీ ప్రోగ్రామ్! Illuminator లో స్వంతంగా స్క్రీన్‍సేవర్లు తయారు చేసుకోవడానికి కావలసిన సదుపాయాలు, ఇమేజ్‍లతో పాటు మన వాయిస్ జతచేసుకుని Talking Slideshowని డిజైన్ చేసుకునే ఆప్షన్లు పొందుపరచబడి ఉన్నాయి. బ్యాచ్ ప్రొసెసింగూ చేయవచ్చు.

ఓపెనింగ్ స్క్రీన్… Illuminator ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసిన వెంటనే Windows Explorer తరహాలో క్రింది విధంగా స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది. ఎడమచేతి వైపు డ్రైవ్/ఫోల్డర్‍ని సెలెక్ట్ చేసుకోగానే అందులోని మీడియా ఫైళ్ళ ధంబ్‍నెయిల్స్, ఇతర ఫైళ్ళ పేరు కుడిచేతి వైపు చూపించబడతాయి. ఏదైనా ఇమేజ్ ఫైల్ ధంబ్‍నెయిల్‍ని మౌస్‍తో డబుల్‍క్లిక్ చేసినట్లయితే అది పుల్‍స్క్రీన్‍తో ఫైల్‍సైజ్/రిజల్యూషన్ వంటి వివరాలతో సహా చూపించబడుతుంది.

విజార్డ్ లు … Wizards మెనూలో వాల్‍పేపర్, ఇల్యుమినేటర్, స్లైడ్‍షో, కన్వర్షన్, స్క్రీన్‍సేవర్, SeeYa, బర్నిట్ అనే పలు విజార్డ్ లు దర్శనమిస్తుంటాయి. ఏదైనా ఇమేజ్‍ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే Wallpaper Wizard బటన్‍ని క్లిక్ చేసినట్లయితే మనమ్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ వాల్‍పేపర్‍గా సెట్ చెయ్యబడుతుంది. Illuminator Wizard అనే ఆప్షన్ ఏదైనా ఇమేజ్ ఫైల్ ఆల్రెడీ హార్డ్ డిస్క్‍లో ఉండీ అది ఎక్కడుందో వెదికిపట్టుకోవడానికి ఇబ్బంది అవుతున్నపుడు ఉపయోగపడుతుంది. డ్రవి‍నీ, ఫైల్‍టైప్‍ని, గుర్తుంటే సుమారు ఫైల్ సైజ్‍ని పేర్కొంటే ఆయా లక్షణాలు గల అన్నీ ఫైల్స్ వెదికిపట్టుకోబడి ఆయా ఇమేజ్‍ల ధంబ్‍నెయిల్స్ స్క్రీన్‍పై కన్పిస్తాయి.

స్లైడ్ షో తయారు చెయ్యడానికి … స్లైడ్ షో తయారు చెయ్యదలుచుకున్నప్పుడు అందులో పొందుపరచదలుచుకున్న ఇమేజ్‍లను ఎంపిక చేసుకుని SlideShow Wizard అనే ఆప్షన్‍ని క్లిక్ చేసిన వెంటనే ఒక డైలాగ్‍బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో స్లైడ్‍షో పెరు , ఫోటోలు, ఏ క్వాలిటీతో చూపించబడాలి తదితర వివరాలను ఎంచుకుని Go బటన్ ప్రెస్ చేసినట్లయితే స్లైద్‍షో తయారై Illuminator ప్రోగ్రామ్‍లోని SlideShow Paneలో ప్లే చెయ్యడానికి రెడీగా ఉంచబడుతుంది.

ఫైల్ ఫార్మేట్లని కన్వర్ట్ చెయ్యడానికి…. ఏకకాలంలో పలు ఇమేజ్‍లను సెలెక్ట్ చేసుకుని వాటన్నింటినీ JPG, TIF, PNG, BMP వంటి ఇతర ఫైల్ ఫార్మేట్లకు సులభంగా కన్వర్ట్ చెయ్యవచ్చు. ఫార్మేట్ కన్వర్షన్ చేసే సమయంలోనే ఇమేజ్‍లు రొటేట్ చెయ్యబడేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక Screen Saver Wizardని ఉపయోగించి మనమ్ సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్‍లు ఆటోమేటిక్‍గా ఒక దాని తర్వాత ఒకటి ప్లే అయ్యే స్క్రీన్ సేవర్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. పలు రకాల ట్రాన్సిషన్ ఎఫెక్ట్లు, ఇమేజ్‍కి ఇమేజ్‍కి మధ్య మనం కోరుకున్న వ్యవధి మెయింటైన్ చెయ్యబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. SeeYa Wizardని ఉపయోగించి మనమ్ ఎంపిక చేసుకున్న ఇమేజ్‍లతో పాటు మన స్వంత వాయిస్‍ని జత చేసుకుని ఆ అంశాలన్నీ కలిపి ఒకే ఒక ఫైల్‍గా కన్వర్ట్ చేసుకుని Talking SlideShowని డిజైన్ చేసుకోవచ్చు.నిర్దిష్టమైన సమయంలో షట్‍డౌన్..

www.sashazur.com అనే వెబ్‍సైట్‍లో లభించే Sleepy అనే మృదులాంత్రము(Software)ని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతీరోజూ ఫలానా టైమ్‍లో షట్‍డౌన్ చెయ్యబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ మృదులాంత్రమును డౌన్‍లోడ్ చేసుకోకపోతే మీరు ఇన్‍స్టాల్ చేసుకున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍తోపాటు Resourse Kit మీవద్దే ఉండి , AT అనే కమాండ్ గనుక ఎనేబుల్ చేయబడి ఉన్నట్లయితే ఆ కమాండ్ ద్వారా కూడా మనం పేర్కొన్న టైమ్‍కి సిస్టమ్ షట్‍డౌన్ చేయబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమాండ్‍తోపాటు,, /c అనే పారామీటర్‍ని ఉపయోగిస్తే షట్‍డౌన్ సమయంలో అన్ని ప్రోగ్రాములు క్లోజ్ అవుతాయి. /y అనే బటన్‍ని ఉపయోగించినట్లయితే షట్‍డౌన్ సమయంలో ఏమైనా ప్రామ్ట్లన్నీ క్లోజ్ చేయబడతాయి. లోకల్ పిసిని షట్‍డౌన్ చెయ్యడానికి /c అనే బటన్‍ని ఉపయోగించాలి. షట్‍డౌన్‍కి బదులు రీబూట్ చేయడానికి /r బటన్‍ని పేర్కొనాలి.

7, సెప్టెంబర్ 2007, శుక్రవారం

ఫోన్ చేస్తున్నారా.. రేడియేషన్ బారిన పడకుండా ఉండాలంటే?కొద్దిగా ఖరీదు ఎక్కువగా ఉండే ఫోన్ల విషయంలో పెద్దగా రేడియేషన్ సమస్య ఉండదు కానీండి, కొందరు సెల్ ఫోన్ ఆపరేటర్లు "రూ.999లకే హ్యాండ్ సెట్, దానితోపాటు 999 టాక్ టైం ఫ్రీ" అంటూ మనకు అంటగట్టే నాసిరకం ఫోన్లలో గంటల తరబడి మాట్లాడేటప్పుడు మాత్రం రేడియేషన్ బారిన పడడం ఖాయం. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే నాసిరకం ఫోన్లకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ మీ సన్నిహితులు అందరూ ఒక ప్యాకేజ్ గా అదే నాసిరకం ఫోన్ ని కొనుగోలు చేసినట్లయితే, ఇక మీ చేతుల్లో ఉన్నదల్లా వీలైనంత తక్కువగా ఆ ఫోన్ లో మాట్లాడడం! ప్రతీ కాల్ నీ అవసరం మేరకే మాట్లాడి క్లుప్తంగా ముగించండి. అలాగే నెంబర్ ని డయల్ చేసి వెంటనే ఫోన్ ని చెవికి ఆనించుకోవద్దు. కాల్ కనెక్ట్ అయ్యేటంత వరకూ వెయిట్ చేసి అప్పుడే చెవికి ఆనించండి. ఈ జాగ్రత్తని అందరు ఫోన్ వినియోగదారులు పాటించడం ఉత్తమం. కాల్ కనెక్ట్ అయ్యే సమయంలో ఎక్కువ మొత్తంలో రేడియేషన్ వెలువడుతుంది. అలాగే అద్దాలు మూసేసిన కార్లు, లిఫ్ట్లులు వంటి ప్రదేశాల్లో తప్పనిసరి అయితేనే ఫోన్ ని వాడండి. జేబులు, బెల్ట్ల్ లకు ఫోన్లని అమర్చడం కన్నా వీలైతే చేతుల్లో ఉంచుకోండి. డెస్క్ వద్ద ఉన్నప్పుడు జేబులో నుండి తీసేసి డెస్క్ పై ఉంచుకోవడం ఉత్తమం.

PS ఫాంట్ల ఫైళ్ల సంగతి ఇది..


మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకునే ప్రతీ PS ఫాంట్ సహజంగా PFB, PFM అనే రెండు ఫైళ్లని పిసిలో సేవ్ చేస్తుంది. Printer Font Binary అనే పదానికి సంక్షిప్త రూపమే PFB. ఫాంట్ ఎలా కనిపిస్తుందో నిర్ణయించే ఫాంట్ యొక్క outline సమాచారాన్ని ఈ ఫైల్ కలిగి ఉంటుంది. ఇక PFM విషయానికి వస్తే ఇది Printer Font Metrics అనే పదానికి సంక్షిప్త రూపం. ఫాంట్ స్పేసింగ్ కి సంబంధించిన సమాచారం ఈ PFM ఫైళ్లలో స్టోర్ అయి ఉంటుంది.

3, సెప్టెంబర్ 2007, సోమవారం

మీ ఫోటోలతో మాట్లాడించే ప్రోగ్రామ్...డిజిటల్ కెమెరా, స్కానర్ల ద్వారా స్కాన్ చేసుకుని మీరు సిస్టమ్‌లోకి కాపీ చేసుకున్న ఇమేజ్‌లతో కావలసినంత మేటర్‌ని మాట్లాడించే ప్రోగ్రామే "Crazy Talk Pro". ఈ మృదులాంత్రములో(Software) మన ఇమేజ్‌ని ఓపెన్ చేసి అందులో Mouth, Nose, Eyebrows, Eye తదితర భాగాల పాత్‌లు స్పెసిఫై చేస్తే అది ఓ మోడల్‌గా సేవ్ చెయ్యబడుతుంది. ఇప్పుడు మనం కోరుకున్న సమాచారాన్ని అందిస్తే ఆ మేటర్ మొత్తం నిజంగా మనమే మాట్లాడుతున్న భ్రమని కలిగించే విధంగా సిస్టమ్ నుండి చదివి వినిపించబడుతుంది. Word వంటి అప్లికేషన్ ప్రోగ్రాముల నుండి ఎన్ని పేజీల మేటర్‌నైనా అందించవచ్చు. ఫైనల్‌గా ఆ ఫైల్‌ని EXE ఫైల్‌గా సేవ్ చేసుకోవచ్చు.

మీరూ క్షణాల్లో స్లిమ్‌గా అవ్వొచ్చు....??"వారం రోజుల్లో 10 కేజీల బరువు తగ్గండి" అంటూ వివిధ వెయిట్ రిడక్షన్ , స్లిమ్మింగ్ సంస్థలు ఊరించే ప్రకటనల్లో ఎవరో ఒక వ్యక్తి ఫోటోలని "ట్రీట్‌మెంట్‌కి ముందు", "ట్రీట్‌మెంట్‌కి తర్వాత" అంటూ ప్రచురించడం.. వాటిని చూసి చాలామంది తామూ బరువు తగ్గాలని ఆశపడడం సహజమే. అయా వ్యక్తుల ఫోటోలని స్కాన్ చేసి Adobe Photoshop మృదులాంత్రములో (Software) Filter>Liquify అనే డైలాగ్ బాక్స్‌లోని Pucker Toolని ఉపయోగించి లావుగా ఉన్నవారి ఫోటోలని చాలా స్లిమ్‌గా అయినట్లు భ్రమ కలిగిస్తుంటారు. అయితే ఇలా ఫోటోషాప్ వంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ని ఉపయోగించవలసిన అవసరం లేకుండానే ప్రస్తుతం తాజాగా విడుదల అవుతున్న HP కంపెనీకి చెందిన డిజిటల్ కెమెరాల్లో Slimming Effect అనే సరిక్రొత్త ఫిల్టర్ పొందు పరచబడుతోంది. ఈ ఫిల్టర్‌ని ఎంచుకుని ఎవరినైనా ఫోటో తీస్తున్నప్పుడు ఒరిజినల్ ఫోటో ఒక ప్రక్కా, సన్నగా చేయబడిన ఫోటో మరో ప్రక్క LCD ప్రివ్యూ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. ఒకవేళ మరింత స్లిమ్‌గా ఫోటోని మార్చాలంటే స్లిమ్మింగ్ లెవల్‌ని పెంచుకోవచ్చు కూడా!

1, సెప్టెంబర్ 2007, శనివారం

డిస్పోజబుల్ మెయిల్ ఐడి కావాలా...స్నేహితులు, సన్నిహితుల నుండి మెయిల్ మెసేజ్‌లు అందుకోవడానికి, పంపుకోవడానికి క్రియేట్ చేసుకున్న మన ప్రధానమైన మెయిల్ ఐడిని కొన్ని వెబ్‌సైట్లు, ఫోరమ్‌ల వంటి వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వచ్చినపుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని వెల్లడించవలసి వస్తోంది. ఇంకేముంది... మన మెయిల్ అడ్రస్ తెలిసిందే తడవుగా ఆయా వెబ్‌సైట్లు స్పాం మెసేజ్‌లతో మన inboxని నింపేస్తుంటాయి. ఈ బాధలన్నీ లేకుండా వాడిపారేసే ఓ డిస్పోజబుల్ మెయిల్ ఐడి ఉంటే బాగుణ్ణు అనుకునేవారు www.2prong.com అనే వెబ్‌సైటులోకి వెళ్ళండి. సైట్ ఓపెన్ అయిన వెంటనే ఓ ఇ-మెయిల్ అడ్రస్ మీ విండోస్ clipboardలోకి కాపీ చేయబడుతుంది. ఇక వివిధ ఫోరమ్‌స్‌లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ మెయిల్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయ్యే ప్రాసెస్‌లో భాగంగా ఆయా ఫోరమ్‌లు activation linkలను పంపిస్తే ఆ లింకులు సైతం ఈ సైట్‌లో లభిస్తాయి ఈ సైట్ ద్వారా మనం క్రియేట్ చేసుకునే అడ్రస్‌లు ban చెయ్యబడకుండా ఉండడం కోసం ప్రతీ 48 గంటలకోసారి ఈ సైట్ తన డొమైన్ నేమ్‌ని మార్చుకుంటుంది సుమా!

కెమెరాలోని ఫోటోల్ని ప్రింట్ చేసేటప్పుడు
డిజిటల్ కెమెరాల్లో వేర్వేరు రిజల్యూషన్ సెట్టింగులు పొందుపరచబడి ఉంటాయి. ప్రత్యేకంగా ప్రింటింగ్ నిమిత్తం ఫోటోలను తీసేటప్పుడు మీ కెమెరాలో లభ్యమయ్యే గరిష్ట రిజల్యూషన్‌ని ఎంచుకుని ఫోటోలను షూట్ చేయండీ. కెమెరా నుండి పిసికి ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత JPG వంటి కంప్రెస్డ్ ఇమేజ్ ఫార్మేట్ళకు కన్వర్ట్ చెయ్యకుండా TIFF ఇమేజ్‌లుగా సేవ్ చేసుకుని ఆ ఇమేజ్‌లను మాత్రమే ప్రింట్ చేయండి. కంప్రెస్డ్ ఫార్మేట్లని ఉపయోగించినప్పుడు కొంతవరకూ ఇమేజ్‌లోని కలర్ పిక్సెళ్ళు తొలగించబడతాయి. అలాగే కెమెరా నుండి సిస్టమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే ఫోటోని నేరుగా ప్రింట్ చేసుకోకుండా ఓసారి ఫోటోని ఆపాదమస్తకం పరిశీలించి ఏవైనా లోపాలు కంపిస్తునట్లయితే Adobe Photoshop వంటీ ఫోటో ఎడిటింగ్ మృదులాంత్రములతో(Software) వాటిలోని లోపాలను సరిచేసిన తర్వాత మాత్రమే ప్రింట్ చేసుకోండి.4x6 అంగుళాల ఫోటోలను ప్రింట్ తీసేటప్పుడు గ్లాసీ ఫోటో పేపర్‌ని ఉపయోగించడం కన్నా matte-finish ఫోటో్‌కార్డ్‌లపై ప్రింట్ తీసుకోవడం వల్ల ఫోటోలు నాణ్యంగా కనిపిస్తుంటాయి. స్పెషల్ ఫోటో ఇంక్‌లను వాడడం వల్ల మరింత కలర్‌ఫుర్‌గా ఫోటోలు వస్తాయి.

అన్ని మీడీయా ఫార్మేట్లని సపోర్ట్ చేసే ప్లేయర్...ఆడియో సిడిలు మొదలుకుని, విసిడిలు MP3, WMA, Real Audio,
Real Video, AVI, MPEG, MOV, QT, MIDI, AIFF వంటి
ప్రముఖ ఆడియో, వీడియో ఫార్మేట్లకు చెందిన అన్ని రకాల ఫైళ్ళనీ ప్లే చేయగల
శక్తివంతమైన మీడియా ప్లేయింగ్ మౄదులాంత్రము (Software)
CDH Media Wizard. కేవలం ఆయా ఫైళ్ళని ప్లే చెయ్యడమే కాకుండా,
WAV to MP3, MP3 to WAV ఆడియో సిడిలను WAV లేదా నేరుగా
MP3 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చెయ్యగలుగుతుంది.