12, ఆగస్టు 2007, ఆదివారం

ఔట్‌లుక్నే మీ వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోండి



మీ ఇ-మెయిల్ మెసేజ్‌లు, అపాయింట్‌మెంట్లు, వివిధ అంశాల గురించి నోట్స్, చేయవలసిన పనుల జాబితా వంటివన్నీ Microsoft Outlookలో స్టోర్ చేసుకుంటున్నారా? అయితే ఔట్‌లుక్ అందుబాటులో లేకపోతే మీకు ఒక్క క్షణం గడవదు అన్నమాట. అలాంటప్పుడు దాన్ని ప్రతీసారీ ఓపెన్ చేసుకోవడం ఎందుకు? సింపుల్‌గా Outlook on the desktop అనే సాప్ట్ వేర్ సాయంతో Outlook ప్రోగ్రాంని ఏకంగా మీ డెస్క్‌టాప్‌కి వాల్‌పేపర్‌గా సెట్ చేసుకుంటే బాగుంటుంది. దీనితో ఔట్‌లుక్‌లోని మీ కాంటాక్టులు,అపాయింట్‌మెంట్లు, ఈవెంట్లు,ఇ-మెయిల్సు అన్నీ డెస్క్‌టాప్ పైనే పరుచుకుంటాయి. ఔట్‌లుక్ డెస్క్ టాప్ పై ఉన్నప్పటికీ అది ట్రాన్స్పరెంటుగా అమర్చబడడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్‌పేపర్ నిక్షేపంగా కనిపిస్తుంటుంది. డెస్క్‌టాప్‌పైనే మెయిల్ మెసేజ్‌లకు రిప్లై కంపోజ్ చేయవచ్చు. కొత్త అపాయింట్‌మెంట్లని క్రియేట్ చేసుకోవచ్చు.అన్నీ డెస్క్‌టాప్‌పై నుండే సాధ్యపడతాయన్నమాట.

కామెంట్‌లు లేవు: