27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఫోన్‌లో మిమ్మల్ని వేధిస్తారు.. కానీ వాళ్ల నెంబర్ పడదు.. వేరే అమాయకుల నెంబర్ పడుతుంది! అదెలా?వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls

మీకో వేధింపు ఫోన్ వస్తుంది.. ఆ నెంబర్ note చేసుకుని మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే ఆ నెంబర్ ఉన్న వ్యక్తి కాదు మిమ్మల్ని వేధించింది...

 మీ ఫోన్ స్క్రీన్ మీద కన్పించే నెంబరే ఫ్రాడ్‌గా మార్చబడింది..

మిమ్మల్ని వేధించే వ్యక్తి వేరే అమాయకుల నెంబర్లు మీకు కన్పించేలా చేసి మీతో ఆడుకుంటూ ఉంటాడు..

ఇలాంటివి మెల్లమెల్లగా వెలుగు చూస్తున్నాయి... ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తరహా మోసాలు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియోలో చూపించాను.

సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, ఇకపై అప్రమత్తంగా ఉండొచ్చు.

గమనిక: ప్రతీ మొబైల్ యూజర్‌కీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifakecalls

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

26, సెప్టెంబర్ 2013, గురువారం

మీ పిసిలో ఉన్న సినిమాలు మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయండి ఇలా... Must Watch & Share

 
వీడియో లింక్ ఇది: http://bit.ly/sripctv

ఈ మధ్య ఎవరింట్లో చూసినా లేటెస్ట్ LED టివిలే కన్పిస్తున్నాయి...

వాటిలో వై-ఫై ఫెసిలిటీ కూడా ఉంటోంది.

కానీ ఇప్పటికీ చాలామంది సినిమాలు, పాటలూ, ఫొటోలూ టివిలో చూడాలంటే ముందు వాటిని కంప్యూటర్లో నుండి పెన్‌డ్రైవ్ ద్వారానో, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కు ద్వారానో కాపీ చేసుకుని టివికి కనెక్ట్ చేసుకుంటూ తంటాలు పడుతున్నారు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే... మీ ఇంట్లోని పిసి, లాప్‌టాప్, సెల్‌ఫోన్లలోని వీడియోలూ, ఫొటోలూ, పాటలూ అన్నీ మీ టివిలో వైర్‌లెస్‌గా చూసేయొచ్చు.

పిసికి, టివికి మధ్య ఎలాంటి వైర్లూ కనెక్ట్ చేయాల్సిన పనిలేదు.

మీ పిసిలో మీరు ఎంచుకున్న వీడియోలు నేరుగా మీ టివి స్క్రీన్‌పై వస్తాయి, కావలసింది సెలెక్ట్ చేసుకుని ప్లే చేయడమే!

గమనిక: టివి ఉన్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sripctv

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా?

అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు.

కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా "రూటింగ్‌"ని పేర్కొనవచ్చు.

ఇప్పటికి అనేక మంది "కంప్యూటర్ ఎరా" మేగజైన్ రీడర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లని రూట్ చేయడం గురించి వీడియో చేయమని అడుగుతూ వచ్చారు..

ఇప్పుడు ఈ వీడియోలో ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి సైతం అర్థమయ్యేలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఫోన్లని రూట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది.

తదుపరి వీడియోల్లో root చేసిన ఫోన్‌ని unroot చేయడం ఎలాగో, అలాగే వాటిలో custom ROM వేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపిస్తాను.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

22, సెప్టెంబర్ 2013, ఆదివారం

విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి..


విండోస్ లోకి ఎంటర్ కావడానికి పాస్ వర్డ్ మర్చిపోయారనుకుందాం..

"ఇంకేముంది.. కంప్యూటర్ ని ఫార్మేట్ చేయాల్సిందే.. లాభం లేదు" అని చాలామంది సలహాలిచ్చేస్తుంటారు.

కేవలం మీరు వాడే విండోస్ పాస్ వర్డ్ ని (అది అడ్మిని స్ట్రేటర్ అకౌంట్ కావచ్చు, సాధారణ యూజర్ అకౌంట్ కావచ్చు) మర్చిపోయిన పాపానికి format చేసేయడమేనా శిక్ష?

ఈ వీడియో చూడండి.. నేను స్వయంగా పాస్ వర్డ్ ని మర్చిపోయి.. అలా మర్చిపోయిన దాన్ని ఎంత ఈజీగా రీసెట్ చేశానో, ప్రాబ్లెం ఎంత ఫాస్ట్ గా సాల్వ్ అయిందో అర్థమవుతుంది.

ఎవరైనా కావచ్చు.. పాస్ వర్డ్ ని మర్చిపోయారు కదా అని విండోస్ ని వదులుకోవలసిన పనిలేదు. దాన్ని చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.

దీనికోసం పలు పద్ధతులు వాడుకలో ఉన్నా నేను చాలా సులభమైన పద్ధతిని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూశారంటే ఇక ఇది చాలా చిన్న సమస్య అన్పించేస్తుంది మీకు!

 - నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

21, సెప్టెంబర్ 2013, శనివారం

ఇక పోయిన ఆండ్రాయిడ్ ఫోన్లని ఈజీగా పట్టుకోవచ్చు.. Must Share

ఇప్పటివరకూ iPhoneలకు ఏపిల్ అందిస్తున్న Find My iPhone తరహాలో గూగుల్ సంస్థ తాజాగా Android Device Manager అనే సదుపాయాన్ని అందిస్తోంది.

ప్రయాణాల్లో ట్రెయిన్ బెర్తుల మధ్యలో, బస్ సీట్ల మధ్యనో, లేదా ఎక్కడోచోట ఫోన్ పెట్టేసి మర్చిపోతుంటారు కొంతమంది!

అలా మర్చిపోయిన ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంటే వెదికి పట్టుకోవడం కష్టం కూడా! ఈ అసౌకర్యాన్ని అధిగమించడాని సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఫోన్‌ని రింగర్‌లోకి మార్చే విధంగా గతంలో నేను ఓ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. అది మిస్ అయిన వారు ఇక్కడ చూడొచ్చు.  
సరిగ్గా ఇదే మాదిరి సదుపాయం గూగుల్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్ ఫోన్లు సైలెంట్ మోడ్‌లో ఉన్నా రింగర్ full volumeలోకి పెంచుకునే అవకాశం రానుంది. అలాగే మన ఫోన్‌ పోతే ఫోన్ ఎక్కడ ఉందో mapతో సహా వెదికి పట్టుకోవడం, దొంగ ఎవరెవరికి ఫోన్లు చేసిందీ, ఏ సిమ్ కార్డులు మార్చిందీ, దొంగ ఫొటోలూ, వీడియో రికార్డ్ చేసే ఓ మంచి టూల్ గురించి ఈ వీడియోలో ఇప్పటికే చూపించడం జరిగింది

తాజాగా గూగుల్ Android Device Manager ద్వారా పోగొట్టుకున్న ఫోన్2ని Map ద్వారా గుర్తించే అవకాశమూ అందుబాటులోకి రానుంది.

Android 2.2 తర్వాతి వెర్షన్లు అన్నింటిపై ఇది పనిచేస్తుంది.

ఇప్పటికే వాడుకలో ఉన్న పైన వీడియో లింకుల్లో చెప్పుకున్న టెక్నిక్‌లు ఫాలో కావచ్చు.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఛాట్ చేస్తూ పనిచేయడం కష్టమవుతోందా? అద్భుతమైన సొల్యూషన్ Must Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/sriworkchat

Facebook, Google Hangouts వంటి అప్లికేషన్లలో ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్‌లు పెట్టారేమో ఛెక్ చేసుకోవడానికే చాలామందికి చాలా time వేస్ట్ అవుతూ ఉంటుంది.

ఆఫీసుల్లో పనిచేసే వారు ఓ వైపు ఛాట్ చేస్తూ మరో వైపు ఆఫీస్ పని చేసుకుందామని అనుకుంటారు గానీ.. చీటికీ మాటికీ ఆన్‌లైన్‌లో ఉన్న ఫ్రెండ్ నుండి కొత్తగా ఏదైనా మెసేజో, రిప్లైనో వచ్చిందో ఛెక్ చేసుకోవడానికి ఓ విండో నుండి మరో విండోకి వెళ్తూ వస్తూ చిరాకు వస్తుంటుంది.

దీంతో చేయాల్సిన పనులూ పెండింగ్ పడుతుంటాయి. అలాగని మనస్ఫూర్తిగా ఛాటింగ్ చెయ్యడమూ కుదరదు.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ ఫాలో అయితే ఓ వైపు మన పని చేసుకుంటూనే మరో వైపు అవతలి వారు రిప్లై ఏమైనా ఇస్తే మనం ఇప్పుడు పని చేస్తున్న విండో నుండే దాన్ని గమనించే అవకాశముంది.

ప్రతీ ఒక్కరి ప్రొడక్టివిటీకీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriworkchat

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

Firefox స్లో అయిందా? ఇలా స్పీడ్ చేసుకోండి!వీడియో లింక్ ఇది: http://bit.ly/srifirefox

మొదట్లో స్పీడ్‌గానే ఉండే Firefox రాను రానూ చాలా స్లో అయిపోయి కొత్త సైట్లు లోడ్ చేస్తుంటే మరింత విసిగిస్తూ మొత్తానికే చిరాకు తెప్పిస్తోందా?

అయితే ఈ ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ Firefox వాడే ప్రతీ ఒక్కరికీ పనికొస్తుంది.

ఇది కొన్ని క్షణాల లోపు మీ బ్రౌజర్‌ని తిరిగి పూర్తి స్పీడ్‌లోకి తీసుకు వస్తుంది.

ఎక్కువ ఇంటర్నెట్ మీదే గడిపే వారికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.

గమనిక: ప్రతీ పిసి యూజర్ కీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifirefox

 ధన్యవాదాలు

 - నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

16, సెప్టెంబర్ 2013, సోమవారం

పనీ, చదువూ disturb అవుతోందా? ఏ సైట్ నైనా ఓ కొద్ది సమయం ఇలా బ్లాక్ చేయొచ్చు Must Watch & Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/sriblocked

10 నిముషాలు స్పెండ్ చేద్దామని వచ్చి.. గంటల తరబడి కంప్యూటర్‌ని వదిలి ఉండలేకపోతున్నారా?

 మీరు చేయాల్సిన అన్ని పనులూ పెండింగ్ పడుతున్నాయా?

మీ పిల్లలు Facebook, Google+, ఆన్ లైన్ గేమ్స్ సైట్లని ఓపెన్ చేసుకుని గంటలు గంటలు వాటితో గడిపేస్తూ స్టడీస్‌ని ఆశ్రద్ధ చేస్తున్నారా?

అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు పనికొస్తుంది.

ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే... మీరు వద్దనుకున్న సైట్లు మీరు వద్దనుకున్న టైమ్‌కీ, వారాల్లోనూ అస్సలు ఓపెన్ కావు.

దీంతో అవ్వాల్సిన అన్ని పనులూ సక్రమంగా పూర్తవుతాయి.

గమనిక: ఇంటర్నెట్‌ని శృతిమించి వాడుతూ ప్రొడక్టవిటీని కోల్పోతున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriblocked

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

మీ టివిలో ఇలాంటి సమస్యలు రావచ్చు.. భయపడకండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair
వేలకు వేలు ఖర్చుపెట్టి కొన్న టివి పాడైపోతే... సర్వీస్ సెంటర్ల వాళ్లు 10 వేలు, 20 వేలు అవుతుంది అని భయపెడితే.. ఏం చేయాలి?

ఇప్పుడు మనం అందరం భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఖరీదైన LCD, LED, 3D టివిలు కొంటున్నాం సరే.... కానీ వాటిలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి..అలా సమస్యలు వచ్చినప్పుడు ఆ టివిలో ఏమేం భాగాలుంటాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు తెలిసుంటే సర్వీస్ సెంటర్ వాళ్లనూ, టెక్నీషియన్‌నీ నిలదీయొచ్చు కదా!

అందుకే ఈ వీడియో మీ కోసం ప్రాక్టికల్ గా షూట్ చేసి పెడుతున్నాను.. అక్షరాలా లక్ష రూపాయల 3D టివిని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు... ఆడియో వస్తుంది కానీ, వీడియో రాదు.... మధ్య మధ్యలో కాసేపు వచ్చి పోతుంటుంది.

శాంసంగ్ సర్వీస్ సెంటర్ వాళ్లు స్క్రీన్ పోయుండొచ్చు రూ. 30 వేలు అవుతుంది అన్నారు... కానీ సమస్య అది కాదు... కెపాసిటర్ల సమస్య అనుకున్నాను అదీ కాదు...

అస్సలు పైసా ఖర్చుపెట్టకుండా ఎంత ఈజీగా సాల్వ్ అయిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

మనకు తెలీపోతే ఎవరైనా మోసం చేయొచ్చు. లక్కీగా ఓ మంచి టెక్నీషియన్ దొరికాడు కాబట్టి ఇంత ఈజీగా నాకు సాల్వ్ అయింది.

ఈ వీడియో చూస్తే మీ టివిల మీదా మీకు అవగాహన వస్తుంది.

గమనిక: టివి వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్ ఎడిటర్
 కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

14, సెప్టెంబర్ 2013, శనివారం

మీ ఫోన్లకి Android లేటెస్ట్ వెర్షన్లు ఎందుకు రావట్లేదు? Must Watch & Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/sriandroid

ఎంతో ఇష్టపడి మీరు కొనుక్కున్న ఫోన్‌కి Android తాజా వెర్షన్ అప్ డేట్ ఎందుకు రావట్లేదో ఎప్పుడైనా ఆలోచించారా?

కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ వాడాలంటే పాత ఫోన్ పారేసి కొత్త ఫోన్ కొనాల్సిందేనా?

 అస్సలు ఫోన్ల కంపెనీలు మన లాంటి యూజర్లని ఎందుకు ఇంతలా చిన్నచూపు చూస్తున్నాయి? కారణాలు తెలుసుకోవాలనుందా?

అయితే ఈ వీడియో తప్పక చూడండి.

కొత్తగా ఫోన్లు కొనబోయే వారికీ ఇది చాలా పనికొస్తుంది.
గమనిక: సెల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చెయ్యగలరు.
 వీడియో లింక్ ఇది: http://bit.ly/sriandroid

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

మీకు ఫుడ్ ఇష్టమైతే... అస్సలు ఈ వీడియో మిస్ అవకండి... :) Must Watch & Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty "

wow.. ఏం టేస్ట్..." అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని మీరు ఎన్నాళ్లవుతోంది.. :)

 నెట్‌లో వెరైటీ వంటలు ప్రయత్నించడం ఈ మధ్య ఎక్కువవుతోంది.. వెజ్, నాన్-వెజ్ కోవలకు చెందిన భారీ మొత్తంలో వెరైటీ వంటకాల్ని నేరుగా ఫోన్‌లోనే తెలుసుకుని... ఫోన్‌ని దగ్గర పెట్టుకుని వంట చేయాలనుకునే వారి కోసం ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది.

మంచి ఐటెమ్ చేద్దామనుకుంటే, ఇంట్లో వాటికి కావలసిన వస్తువులు లేవా.... :) అస్సలు దిగులు చెందకండి..

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయగల వెరైటీల్నీ ఈజీగా వెదికి పట్టుకోవచ్చు.

కేవలం వెరైటీలే కాదు... వాటి ద్వారా ఎన్ని కేలరీలు ఎనర్జీ వస్తుందో కూడా ఇది చూపిస్తుంది... వెరైటీ ఫుడ్ తినేవారికీ, వెరైటీలు చేయడం చాలా ఇష్టం ఉన్న వారికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/srifoodtasty

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu

12, సెప్టెంబర్ 2013, గురువారం

చిన్న Clapతో మీకు మీరే ఫొటోలు దిగేయొచ్చు ఇలా... Must Watch & Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos మీరు చాలా బాగా రెడీ అయిపోయారు..

ఒక ఫొటో దిగితే బాగుణ్ణు అన్పించిదనుకోండి.... చాలామంది కెమెరాని ఫేస్ వైపు తిప్పుకుని చేతులు చాపుకుని ఫొటోలు తీసేసుకుంటారు...

భుజాలు ముందుకు సాగిపోయి అలాంటి ఫొటోలు ఎబ్బెట్టుగా వస్తుంటాయి...

అలా కాకుండా ఫోన్ ని ఓ చోట పెట్టేసి.. మీరు కావలసిన చోటికి వెళ్లి నిలబడి... అంతా ఓకే అనుకున్న తర్వాత చిన్నగా చప్పట్లు కొడితేనో... లేదా Take Photo అని చిన్నగా మాట్లాడితేనో ఫొటో తీసేయబడితే బాగుంటుంది కదా?

 ఇదెంత అద్భుతంగా పనిచేస్తుందో మీ కోసం నేను ప్రాక్టికల్ గా అలా ఫొటో దిగి మరీ చూపించాను, ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా తీసిన ఫొటోలకు క్షణాల్లో అద్భుతమైన స్పెషల్ ఎఫెక్టులు కూడా జత చేసుకోవచ్చు.

 ఎవరితో పనిలేకుండా స్వంతంగా ఫొటోలు తీసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

 వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphotos

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com