5, ఆగస్టు 2007, ఆదివారం

ఫొటోలను ఎడిట్ చేసి సేవ్ చేసేటప్పుడు..


ఫొటోషాప్ వంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాప్ట్ వేర్ల సాయంతో రకరకాల ఇమేజ్ లను వివిధ Layersగా అమర్చుకుని అందంగా డిజైన్ చేసినప్పుడు దానిని BMP వంటి ఫొటో ఫార్మేట్లలోకి సేవ్ చేస్తే అందులోని లేయర్లు అన్నీ గ్రూప్ చేయబడతాయి. దానితో భవిష్యత్ లో ఆ ఇమేజ్ లో పొందుపరిచిన లేయర్లని విడివిడిగా ఎడిట్ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఎంతో కష్టపడి వివిధ లేయర్లని అమర్చుకుని, పలు రకాల ఫిల్టర్లని ఉపయోగించుకుని మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ లను "ఇక అదే ఫైనల్ ఇమేజ్, అంతకు మించి ఎడిట్ చేయడానికి ఇంకా ఏమీ లేదు" అనుకుంటే తప్ప లేయర్లని Flat చేయకండి. భవిష్యత్ లో మళ్లీ ఎడిట్ చేయాలనుకున్న ఇమేజ్ లను ఫొటోషాప్ ఇమేజ్ ఫార్మేట్ అయిన PSD ఫార్మేట్లో సేవ్ చేయండి. లేదా TIFF ఫార్మేట్లో సేవ్ చేయదలుచుకున్నా Layersని include చేయడం మాత్రం మరువకండి. ఇలా ఇమేజ్ తో పాటు లేయర్లనీ సేవ్ చేయడం వల్ల ఫైల్ యొక్క పరిమాణం పెరుగుతుంది. ఎన్ని ఎక్కువ లేయర్లు ఉంటే ఫైల్ సైజ్ అంత ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

కామెంట్‌లు లేవు: