13, ఆగస్టు 2007, సోమవారం

భారతీయ ఐటి నిపుణులకు ఓ కమ్యూనిటీ



ఐ.టి నిపుణుల పరంగా మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మన దేశంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు,సాంకేతిక నిపుణులు, కాలేజీ విద్యార్థుల కోసం www.techtribe.com పేరిట ఓ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ప్రారంభించబడింది. సాధారణ వ్యక్తుల కోసం ఉద్ధేశించబడి Orkut వంటి ఇతర ఆన్‌లైన్ కమ్యూనిటీలు అనేకం ఉన్నాయిగాని ఈ Tech Tribe మాత్రం ఖచ్చితంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇందులో మీ పేరు, హాబీలు, ఫోటో వంటి సాధారణ వివరాలతో పాటు వృత్తి పరంగా మీరు సాధించిన విజయాలు, మీరు అభివృద్ధిపరిచిన సాఫ్ట్‌వేర్ల వివరాలు, మీరు పనిచేసిన ప్రాజెక్టు వివరాలు, కన్సల్ట్ చేసిన కంపెనీలు వంటి అనేక వివరాలను మీ ప్రొఫైల్‌తో పాటు ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేయవచ్చు. అలాగే మీరు పనిచేస్తున్న కంపెనీలో ఏవైనా అంశాలు మీకు నచ్చకపోతే ఇక్కడ తెలియజేస్తే అవి మీ కంపెని పరిశీలనకు తీసుకువెళ్ళబడి పరిష్కరించబడతాయి.

కామెంట్‌లు లేవు: