చిట్కాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిట్కాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2013, బుధవారం

పిసి, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లో ఫైళ్లు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8

మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs

ఏదో ట్రిప్ కెళ్లి మీరు తీసుకున్న ఫొటోలు memory card నుండి డిలీట్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది?

అలాగే హార్డ్‌డిస్కులోనీ, pen driveలోని ముఖ్యమైన ఫైళ్ల పోయినా అంతే బాధేస్తుంది కదా :(

అలాగని ఫైళ్లు, ఫొటోలూ, వీడియోలూ పోయాయని వర్రీ అవ్వాల్సిన పనిలేదు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే పోయిన మీ డేటా తిరిగి వస్తుంది.. చివరకు పార్టీషన్లు పోయినా కూడా డేటా వెనక్కి తెచ్చుకోవచ్చు.

గమనిక:  డేటా నష్టపోయిన  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

4, నవంబర్ 2013, సోమవారం

మీ విండోస్ సీరియల్ నెంబర్ మర్చిపోయారా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=g6dCT0r98tE

మీరు వెచ్చించవలసిన సమయం: 2.42 Secs

అనుకోకుండా ఫార్మేట్ చేసి Windows ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తే.. మీ పిసిలో అప్పటివరకూ ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ తెలీకపోతే ఎలా?

ఈ సమస్య కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు వాడే చాలామందికి తరచూ వస్తుంటుంది. అందుకే Serial Number చాలా జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలంటారు.

సరే.. ఇంతకీ ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న విండోస్ సీరియల్ నెంబర్ అయినా మీరు రాసి పెట్టుకున్నారా?

లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా దాన్ని తెలుసుకుని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. విండోస్ మళ్లీ మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది చాలా అవసరం.

గమనిక:  పిసి వాడే  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=g6dCT0r98tE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

#computerera #telugu

31, అక్టోబర్ 2013, గురువారం

Firefox Addons పిసిలో సేవ్ చేసుకోవడం ఇలా... Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

మీకు కేటాయించవలసిన సమయం: కేవలం 55 Secs..

మీరు రెగ్యులర్‌గా వాడే Firefox addonsని మీ పిసిలో డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకోవచ్చని తెలుసా?

నెట్ కనెక్షన్ లేనప్పుడు వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

గమనిక: పిసి ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=QHVgGmNA8SE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

27, అక్టోబర్ 2013, ఆదివారం

C డ్రైవ్ నిండిపోతోందా? ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని వేరే డ్రైవ్‌లకు మూవ్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share



వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

చాలామంది తెలిసీ తెలియక C డ్రైవ్‌కి తక్కువ స్పేస్ కేటాయిస్తుంటారు. కొన్నాళ్లకు Drive Full అని వార్నింగులు వస్తుంటాయి.

అలాంటప్పుడు ఇప్పటికే ఇన్‌స్టాల్ అయిన ప్రోగ్రాముల్ని Uninstall చెయ్యాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా ఈజీగా వేరే డ్రైవ్‌లోకి ఉన్నవి ఉన్నట్లు మూవ్ చేసుకోవచ్చు.

అలా మూవ్ చేసిన అప్లికేషన్లు ఇంతకుముందు లానే నిక్షేపంగా పనిచేస్తాయి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=YzNZ76x5bvw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

11, అక్టోబర్ 2013, శుక్రవారం

మీ పేరు మీద వెబ్‌సైట్ రిజిస్టర్ చేసుకోవాలా? అయితే ఇది తప్పక చూడాల్సిందే! Must Watch & Share


మీ పేరు మీద వెబ్‌సైట్ రిజిస్టర్ చేసుకోవాలా? అయితే ఇది తప్పక చూడాల్సిందే! Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4

స్వంతంగా వెబ్‌సైట్ కలిగి ఉండాలని చాలామందికి ఉంటుంది. అయితే తమకు కావలసిన పేరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలీక కొందరు ఆగిపోతుంటారు, మరికొందరు ఇతరులపై ఆధారపడుతుంటారు.

అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిందీ వీడియో. ఇది చూస్తే 2-3 నిముషాల్లో మీరు కోరుకున్న వెబ్‌సైట్‌ని మీకు కావలసినన్ని ఏళ్లపాటు రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికీ సులభంగా అర్థమయ్యే విధంగా దీన్ని ప్రిపేర్ చెయ్యడం జరిగింది. సో చూసేయండి మరి!

గమనిక: స్వంత వెబ్‌సైట్ కలిగి ఉండాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=W-SV0pMxnj4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
http://n9telugu.com/

5, అక్టోబర్ 2013, శనివారం

సరుకులు కొనడానికి కిరాణా స్టోర్‌కి వెళ్లే టైమ్ కూడా లేదా? అయితే ఇది బెస్ట్ సొల్యూషన్




వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM

ఇంటి, ఆఫీస్ పనులతో బిజీ బిజీగా ఉండే వాళ్లు పనిగట్టుకుని మరీ కిరాణా షాప్‌కి వెళ్లి సరుకులు కొనుక్కోవడం కష్టంగా ఉంటుంది.

కొన్ని కిరాణా షాపుల వాళ్లు ఫోన్‌లో ఆర్డర్ తీసుకుని హోమ్ డెలివరీ ఇస్తున్నా ఆయా సరుకుల క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలీదు. తీరా ఆర్డర్ ఇచ్చి వస్తువులు వచ్చాక చీప్ క్వాలిటీతో ఉన్నాయని బాధపడుతుంటాం.

ఇలాంటి సమస్యలు అన్నింటికీ ఓ మంచి పరిష్కారాన్ని ఈ వీడియోలో చూపించాను. ఇందులో చూపించిన ఆన్‌లైన్ సూపర్ మార్కెట్లో బియ్యం దగ్గర్నుండీ, కూరగాయలూ, పళ్లూ, పేస్ట్‌, షాంపూల వంటి అన్ని వస్తువుల క్వాలిటీని ఫొటోల్లో చూసి ఆర్డర్ చేసి నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు.

బయట షాపుల్లో ఉన్న ధరల కన్నా కొద్దిగా చవక ధరలు కూడా పొందొచ్చు.

గమనిక: టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=bNrA_xWC8NM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu

29, నవంబర్ 2008, శనివారం

వర్డ్ లో రీసెంట్ ఫైల్ లిస్ట్ ని క్లియర్ చెయ్యడానికి

SNAG-0000

Wordలో File మెనూలో ఇంతకముందు మనం ఓపెన్ చేసిన ఫైళ్ల వివరాలు చూపించబడుతుంటాయి. అలా కన్పిస్తున్న రీసెంట్ ఫైళ్ల వివరాలు తొలగించదలుచుకున్నట్లయితే Tools>Options>General అనే విభాగంలో Recently used file list అనే బాక్స్ వద్ద 0 అని సెట్ చేస్తే పాత ఫైళ్ల వివరాలు క్లియర్ అవుతాయి. లేదా మీ వద్ద System Mechanic వంటి సాఫ్ట్ వేర్లు ఉన్నట్లయితే వాటిల్లోనూ Word ఫైల్ హిస్టరీని క్లియర్ చేసే ఆప్షన్ ఉంది.

ఫంక్షన్ కీ ప్రెస్ చేయకుండా లోపలికి…

మన కంప్యూటర్ యొక్క మదర్‌బోర్డ్‌పై CMOS బ్యాటరీ అని ఒక బ్యాటరీ పొందుపరచబడి ఉంటుంది. అది BIOS ప్రోగ్రామ్‌లో మనం చేసే సెట్టింగులను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే CMOS బ్యాటరీ వీక్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న హార్డ్‌వేర్ సెట్టింగులు సేవ్ చేయబడక.. డీ్‌ఫాల్ట్ సెట్టింగులకూ, ప్రస్తుతం సిస్టమ్‌లో కనిపించే సెట్టింగులకు (RAM, హార్డ్ డిస్క్, సిడిరామ్ డ్రైవ్‌ల వివరాలు వంటివి) మధ్య వౄత్యాసం కన్పించి కంప్యూటర్‌ని బూట్ చేసే సమయంలో Press F1 to continue మాదిరిగా మెసేజ్ చూపించబడుతుంటుంది. అలాంటప్పుడు ఓ సారి కేబినెట్‌ని విప్పదీసి మదర్‌బోర్డ్‌పై mount చేయబడి ఉండే బ్యాటరీని తొలగించి బయట ఎలక్ట్రానిక్ షాపుల్లో అదే తరహా బ్యాటరీని కొనుక్కొచ్చి మదర్‌బోర్డ్‌పై అమర్చితే సరిపోతుంది. ఒకవేళ బ్యాటరీని మార్చడం ఎలాగో మీకు అవగాహన లేక అలాగే కొనసాగదలుచుకున్నట్లయితే…సిస్టమ్ బూట్ అయ్యే సమయంలో ఓసారి Del కీని ప్రెస్ చేయడం ద్వారా BIOS లోకి వెళ్ళి అందులో కనిపించే వేర్వేరు విభాగాల్లో Wait for Error పేరిట ఏదైనా ఆప్షన్ మీ BIOS వెర్షన్‌లో లభిస్తోందేమో గమనించండి. కనిపిస్తే దానిని డిసేబుల్ చేయండి. దీంతో ఇకపై ఎర్రర్ మెసేజ్ చూపించబడకుండానే నేరుగా హార్డ్‌డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ చేయబడుతుంది.

13, ఏప్రిల్ 2008, ఆదివారం

విండోస్ స్పీడ్ కి ఇవి అవరోధం

ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్ యొక్క డ్రైవర్లని తొలగించడం ఉత్తమం. డీఫాల్ట్‌గా విండోస్‌లోని Device Manager ప్రస్తుతం మన కంప్యుటర్‌కి కనెక్ట్ చేయబడని డివైజ్ డ్రైవర్ల వివరాలు చూపించదు. అవి కూడా Device Manager లో చూపించబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లోకి వెళ్ళి cmd అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్దకు వెళ్ళండి. ఇప్పుడు ఈ క్రింది కమాండ్ ఇవ్వండి. devmgr_show_nonpresent_devices=1 అని ఇచ్చి Enter కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు My Computer పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Properties>Device Manager అనే విభాగంలోకి వెళ్ళి View>Show Hidden Devices అనే ఆప్షన్‌ని క్లిక్ చెస్తే హిడెన్ డివైజ్‌లు చూపించబడతాయి. ఇప్పుడు అవసరం లేని డివైజ్‌లను తొలగించుకుంటే బూటింగ్ వేగవంతమవుతుంది.


4, ఏప్రిల్ 2008, శుక్రవారం

మీ ఆఫీసులో జిమెయిల్ బ్లాక్ చేయబడిందా



తమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి. వాస్తవానికి మీకు వేలాది రూపాయలు జీతం ఇస్తున్న కంపెనీ నియమాలకు కట్టుబడి ఉండడం మీ కర్తవ్యమ్. అయితె ఒక్కోసారి అర్జెంట్ గా మెయిల్ తనిఖీ చేసుకోవలసి వచ్చింది. ఒక ప్రక్క చూస్తేనేమో.. జిమెయిల్ మీ ఆఫీసులో నిషేదించబడింది. అలాంటప్పుడు http://mail.google.com/ అనే వెబ్ సైట్ అడ్రస్ ఉపయోగించడానికి బదులుగా https://mail.google.com అనే అడ్రస్ ని వాడి చూడండి. చాలావరకూ జిమెయిల్ ఒపెనవుతుంది. ఒకవేళ అప్పటికీ ఫలితం లేకపొతే ఈ క్రింది అడ్రస్ లూ ప్రయత్నించండి.

http://www.gmail.com
https://www.gmail.com
http://gmail.com
https://gmail.com
http:///m.gmail.com
https://m.gmail.com
http://googlemail.com
https://googlemail.co
http://mail.google.com/mail/x
https://mail.google.com/mail/x/


పై అడ్రస్ లను ఒకదాని తర్వాత ఒకటిగా మీ బ్రౌజర్ లో టైప్ చేస్తూ ప్రయత్నించండి తప్పకుండా ఏదో ఒక వెబ్ అడ్రస్ ద్వారా మీ జిమెయిల్ అకౌండ్ ఓపెన్ చేయబడుతుంది.

7, జనవరి 2008, సోమవారం

స్పీడ్‌ని ప్రభావితం చేసే అంశాలు





సిడి డ్రైవ్ ఎంత వేగంగా డేటాని రీడ్ చెయ్యగలుగుతుందన్నది దాని రోటేషనల్ స్పీడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రోటేషనల్ స్పీడ్ 48x, 52x వంటి ప్రమాణంలో వ్యవహరించబడుతుంది. పిసి పెర్‌ఫార్మెన్స్ స్లోగా ఉన్నా సిడి-డ్రైవ్ నుండి డేటాని యాక్సెస్ చెయ్యడం నెమ్మదిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిస్టమ్‌ని టాప్ కండీషన్‌లో ఉంచుకోవడం మంచిది. అలగే సిడి-డ్రైవ్ క్యాచే కూడా సిడి డ్రైవ్ పెర్‌ఫార్మెన్స్ ని ప్రభావితం చేస్తుంది. ControlPanel>System>Performance>CD-ROM అనే విభాగంలో Supplemental Cache Size అనే స్లైడర్ బార్‌ని Large దిశగా డ్రాగ్ చెయ్యడం ద్వారా సిడి డ్రైవ్ యొక్క క్యాచే గరిష్టంగా ఉండేటట్లు సెట్ చేసుకోవచ్చు. అలాగే System>Device Manager>CD-ROM అనే విభాగంలోకి వెళ్ళి Properties>Settings అనే పేజీలో DMA మోడ్‌ని ఎంచుకోవడం వల్ల సిడి-రాం డ్రైవ్ ప్రాసెసర్‌పై ఎక్కువ ఆధారపడకుండా నేరుగా మెమరీని వినియోగించుకునేటట్లు, తద్వారా పెర్‌ఫార్మెన్స్ పెరిగేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సాధ్యమైననత వరకూ, సిడి-రామ్ డ్రైవ్‌ని ప్రత్యేకంగా ఒక IDE కేబుల్‌కి కనెక్ట్ చేస్త్తే డేటా ట్రాన్శ్ ఫర్ రేట్ మెరుగుపడుతుంది. అలగే మదర్ బోర్డ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ డ్రైవర్లని అప్‌డేట్ చేసుకోవడం వల్ల సిడి-డ్రైవ్‌కి, పిసిలోని ఇతర హార్డ్ వేర్ కాంపొనెంట్లకు మధ్య బాండ్‌విడ్త్ మెరుగుపడుతుంది.

5, జనవరి 2008, శనివారం

ఎక్సెల్ వర్క్ షీట్లని షేర్ చేయదలుచుకుంటే..

SNAG-0000

మీ ఆఫీసులో ఒకే ఎక్సెల్ వర్క్ షీట్ ని వేర్వేరు విభాగాల్లోని వేర్వేరు ఉద్యోగులు ఎడిట్ చేయగలిగేలా అవకాశం కల్పించాలనుకోండి. Excelలోని Tools మెనూలో ఉండే Share Workbook అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే స్ర్కీన్ పై ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Editing టాబ్ ని క్లిక్ చేసి "Allow changes by more than one user at the same time" అనే ఆప్షన్ ని టిక్ చేసి OK బటన్ ని క్లిక్ చేయండి. వెంటనే ఆ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. పాత్ ని పేర్కొనండి. సేవ్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏయే యూజర్లకైతే ఆ వర్క్ బుక్ ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్లకి అందుబాటులో ఉండే నెట్ వర్క్ లొకేషన్లలో మాత్రమే వర్క్ బుక్ ని సేవ్ చేయాలి. Shared Network ఫోల్డర్ ని ఉపయోగించుకోండి. అలాగే Excel ఫైళ్లకు కూడా Comments జత చేసుకోవచ్చు. ఒక Cellలో కామెంట్ జతచేయదలుచుకుంటే ఆ సెల్ పై రైట్ క్లిక్ చేసి Insert Comment అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

2, జనవరి 2008, బుధవారం

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.

31, డిసెంబర్ 2007, సోమవారం

XP ఇన్ స్టలేషన్ సమయంలో మనం లేకుండానే?


Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసే సమయంలో రీజినల్ సెట్టింగ్స్, టైమ్ జోన్, అడ్మినిస్ర్టేటర్ పాస్ వర్డ్ వంటి కొన్ని ఆప్షన్లని ఎంచుకోవడానికి మనం కంప్యూటర్ దగ్గరే ఉండవలసి వస్తుంది. అలా కాకుండా Setup ప్రారంభమైనది మొదలుకుని పూర్తయ్యేటంత వరకూ XP తనంతట తాను కొనసాగేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి గాను XP సెటప్ సిడిలో \Support\Tools\Deploy.cab ఫైల్ లో ఉండే Setup Managerని రన్ చేయండి. ఇది Setupmgr.exe పేరుతో ఉంటుంది. దీన్ని రన్ చేయండి. ఇప్పుడు XP Setup సమయంలో వేర్వేరు దశల్లో మనం ఇవ్వాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ప్రశ్నలు అడగబడతాయి. వాటికి మనం ఇచ్చే సమాధానాలు ఫైళ్లుగా సేవ్ అవుతాయి. ఇప్పుడు NEWXP పేరిట డెస్క్ టాప్ పై గానీ, వేరే ఎక్కడైనా ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసి ఒరిజినల్ XP సిడిలో ఉన్న ఫైళ్లు, ఫోల్డర్లని యధాతధంగా ఆ ఫోల్డర్ లోకి కాపీ చేయండి. అదే విధంగా ఇంతకుముందు మనం ఇచ్చిన సమాధానాల ఆధారంగా Setup Manager క్రియేట్ చేసిన ఆన్సర్ ఫైళ్లని కూడా అదే ఫోల్డర్ లోకి కాపీ చేయండి. ఇప్పుడు ఆ కొత్త ఫోల్డర్ లోని Setup ప్రోగ్రామ్ రన్ చేయబడేలా autorun.inf ఫైల్ ని మోడిఫై చేసి సిడిని Nero వంటి సిడి రికార్డింగ్ సాఫ్ట్ వేర్ తో రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై ఆ కొత్త సిడితో Windows XP సెటప్ చేస్తుంటే ఎలాంటి మనం ప్రత్యేకంగా ఆప్షన్లు ఎంచుకోవలసిన పనిలేకుండానే దానికదే ఆప్షన్లు ఎంచుకోబడతాయి, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది... చివరకు Windows XP సెటప్ పూర్తవుతుంది.

16, డిసెంబర్ 2007, ఆదివారం

మునుపటి కన్నా వేగంగా ప్రింట్ అయ్యేలా...


Windows 2000/XP ఆపరేటింగ్ సిస్టం లలో ఒక డాక్యుమెంట్ ని మొదటిసారి ప్రింట్ చేసినప్పుడు తీసుకునే టైమ్ కన్నా అదే డాక్యుమెంట్ ని రెండవ సారి ప్రింట్ చేసినప్పుడు తక్కువ సమయంలో ప్రింట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. Start మెనూలో Settings>Printers అనే విభాగంలో మీరు ఉపయోగిస్తున్న ప్రింటర్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి Properties ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని Advanced అనే విభాగంలో Keep printed documents అనే ఆప్షన్ ఎనేబుల్ చేయండి. దీంతో మనం ప్రింటింగ్ ఇచ్చిన ప్రతీ డాక్యుమెంట్ స్ఫూలింగ్ నుండి డిలీట్ చేయబడకుండా.. C:\Windows\System32\spool\printers లేదా C:\WINNT\System32\spool\printers\ అనే ఫోల్డర్ లో సేవ్ చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ ని మరోమారు ప్రింట్ చేయవలసి వచ్చినట్లయితే ఈ ఫోల్డర్ లోకి వెళ్లి మనం రెండవసారి ప్రింట్ చేయదలుచుకున్న డాక్యుమెంట్ ని వెదికి పట్టుకుని ఆ ఫైల్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి restart అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మునుపటి కన్నా వేగంగా ఆ డాక్యుమెంట్ ప్రింట్ చేయబడుతుంది. అయితే ఈ సెట్టింగ్ వల్ల కొద్దిగా హార్డ్ డిస్క్ స్పేస్ వృధా అవుతుంది. ఈ తతంగం అంతా ఎందుకు, కొద్ది సమయం అధికమైనా మామూలుగానే ప్రింటింగ్ జరుపుకుంటామంటే అది మీ ఇష్టం, ఓ చిట్కా మాత్రమే ఇది.

22, నవంబర్ 2007, గురువారం

ఫాంట్లు ఇన్ స్టాల్ చేయకుండానే వాడుకోవచ్చు ఇలా..


సిస్టమ్ లో ఎక్కువ ఫాంట్లు ఇన్ స్టాల్ చేయబడి ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ నెమ్మదించడంతో పాటు ఫాంట్ల ఆధారంగా పనిచేసే వర్డ్ వంటి అప్లికేషన్ ప్రోగ్రాములూ స్లోగా రన్ అవుతాయి. ఈ నేపధ్యంలో సిస్టమ్ లోకి ఫాంట్లు ఇన్ స్టాల్ చేయకుండానే అవసరం అయినప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకునే మార్గమొకటి ఉంది. అదేమిటంటే మొట్టమొదటిగా C:\Windows\Fonts ఫోల్డర్లో భద్రపరచబడి ఉన్న మామూలు ఫాంట్లని (Times New Roman వంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటే డీఫాల్ట్ గా ఇన్ స్టాల్ అయిన ఫాంట్లని మినహాయించి) సెలెక్ట్ చేసి.. C డ్రైవ్ లోనే కొత్తగా Font పేరిట ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లోకి మూవ్ చేయండి. సిస్టమ్ ఫాంట్లని మాత్రం C:\Windows\Fonts ఫోల్డర్ లోనే ఉంచండి. ఏ ట్రూ టైప్ ఫాంట్ అయినా C:\Windows\Fonts ఫోల్డర్లో ఉన్నంతవరకే అది ఇన్ స్టాల్ చేయబడిన ఫాంట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ పరిగణిస్తుంది. సో.. ఇప్పుడు మనం చేసిన పనివల్ల, ఆ ఫాంట్లు సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేయబడి లేవన్నమాట. అంతే పరోక్షంగా సిస్టమ్ పై భారం తగ్గుతుంది. ఒకవేళ భవిష్యత్ లో ఎప్పుడైనా ఇలా మూవ్ చేసిన ఫాంట్ లలో దేనినైనా వర్డ్, పేజ్ మేకర్ వంటి డాక్యుమెంట్లలో ఉపయోగించవలసి వస్తే.. ముందుగా ఆ ఫాంట్ ని మౌస్ తో డబుల్ క్లిక్ చేసి, ఆ వెంటనే వర్డ్ ప్రాసెసర్ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసి ఆ ఫాంట్ ని ఉపయోగించుకోవచ్చు.

21, నవంబర్ 2007, బుధవారం

ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే...


వైరస్‌లు, ముఖ్యమైన సిస్టమ్ ఫైళ్ళు కరప్ట్ అవడం వంటి వివిధ కారణాల వల్ల C డ్రైవ్‌ని ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా Windows ఇన్‌స్టాల్ చేసి, డివైజ్ డ్రైవర్లని కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొట్టమొదటగా Control Panel>System>System Properties>Device Managerకి వెళ్ళి హార్డ్ డిస్క్, సిడిరామ్, డివిడిరామ్ వంటి వివిధ డిస్క్ డ్రైవ్‌ల DMA ఆప్షన్‌ని ఎనేబుల్ చేయండి. విండోస్ ఎక్స్ పీ, విస్టా వంటి ఆపరేటింగ్ సిస్టం లలో డీఫాల్ట్ గా ఇది ఎనేబుల్ చేయబడుతుంది కాబట్టి ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. అలాగే 9x ఆపరేటింగ్ సిస్టమ్ లలో Performance>virtual Memory అనే విభాగంలోకి వెళ్ళి Let me Specify my own Virtual Memory settings అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న మెమరీకి రెండున్నర రెట్లు ఎంత అవుతుందో లెక్కించి (512MB అయితే 1280MB అవుతుంది) ఆ మొత్తాన్ని Virtual Memoryగా కేటాయించండి. దీనికిగాను ఎక్కువ ఖాళీగా ఉన్న పార్టీషన్‌ని ఎంచుకోవడం మంచిది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ లలో వర్చ్యువల్ మెమరీ బాగానే మేనేజ్ చేయబడుతుంది కాబట్టి ప్రత్యేకంగా దీనిని మీరు మార్చవలసిన అవసరం లేదు. ఇకపోతే ఇతర సాఫ్ట్ వేర్లని సైతం ఇన్‌స్టాల్ చేయడం పూర్తయిన తర్వాత కేవలం Start Menuలో మాత్రమే ఆయా ప్రోగ్రాముల షార్ట్ ‌కట్‌లను ఉంచి డెస్క్ టాప్‌పై, Quick Launch Barపై ఉండే అదనంగా అనవసరంగా ఉండే షార్ట్ ‌కట్‌లన్నింటినీ తొలగించడం ద్వారా డెస్క్ టాప్ శుభ్రంగా ఉంటుంది.

కంప్యూటర్ బ్రౌజర్ సర్వీస్ డిసేబుల్ చేసుకోండి..


Windows 2000/XP/Server2003/Vista ఆపరేటింగ్ సిస్టమ్ లలో Computer Browser అనే సర్వీస్ ఒకటి రన్ అవుతుంటుంది. మనం నెట్ వర్క్ ఎన్విరాన్ మెంట్ లో పనిచేస్తున్నప్పుడు LANలో మనకు లభ్యమయ్యే అన్ని వనరుల జాబితాను ఎప్పటికప్పుడు ఈ సర్వీస్ అప్ డేట్ చేస్తుంటుంది. అయితే ఎలాంటి నెట్ వర్క్ కీ కనెక్ట్ అయి ఉండని సాధారణ హోమ్ యూజర్లు ఈ సర్వీస్ ని డిసేబుల్ చేసుకోవడం ద్వారా కొంతవరకూ సిస్టమ్ పై భారాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సర్వీస్ ని డిసేబుల్ చేయడం ద్వారా RAMలోని స్ధలం, విలువైన CPU Cycles ఆదా చేయబడడమే కాకుండా ఒకవేళ మీరు నెట్ వర్క్ లో పనిచేస్తూ ఉన్నప్పటికీ అవసరం లేదనుకుంటే ఈ సర్వీస్ ని డిసేబుల్ చేసినట్లయితే నెట్ వర్క్ ట్రాఫిక్ మెరుగుపడుతుంది. ఈ Computer Browser సర్వీస్ ని డిసేబుల్ చేయడానికి Start>Run కమాండ్ బాక్స్ లో Services.msc అని టైప్ చేస్తే వెంటనే Services అనే విండో ప్రత్యక్షమవుతుంది. అందులో "Computer Browser" అనే సర్వీస్ ని వెదికి పట్టుకుని మౌస్ తో డబుల్ క్లిక్ చేయండి. వెంటనే ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Stop అనే బటన్ ని క్లిక్ చేసి, Startup Type అనే డ్రాప్ డౌన్ లిస్ట్ వద్ద Automatic నుండి Manualగా సెట్ చేయండి సరిపోతుంది. ఈ సర్వీస్ ని ఎవరికి వారు తాము పనిచేసే ఎన్విరాన్ మెంట్ కి లోబడి డిసేబుల్ చేసుకోండి. Browser Service అవసరం అయిన కంప్యూటర్లలో డిసేబుల్ చేస్తే ఇబ్బందులు పడవలసి వస్తుంది.

11, నవంబర్ 2007, ఆదివారం

200. మీడియా ప్లేయర్‌లో సిడి రికార్డింగ్




Windows Media Player 11 వెర్షన్‌లో సిడిలను డివిడిలను రికార్డ్ చేసుకోవడానికి అద్భుతమైన ఆప్షన్లు పొందుపరచబడ్డాయి. కేవలం కొన్ని సింపుల్ స్టెప్సులతో సిడి/డివిడి లను రైట్ చేసుకోవచ్చు. Burn అనే బటన్‌పై క్లిక్ చేసి ప్రస్తుతం ప్లేయింగ్ లిస్ట్‌లో ఉన్న అంశాల్ని రైట్ చేయాలా, ఆడియో, డేటా సిడిలలొ దేనిగా రైట్ చేయాలన్నది ఎంచుకోవాలి.ఇప్పుడు ఖాళీ సిడిని రైటర్‌లో ఇన్‌సర్ట్ చేయండి. మీ పిసిలో ఒకటి కంటే ఎక్కువ రైటర్లు ఉన్నట్లయితే playlist కి పైభాగంలో కనిపించే Next Drive అనే బటన్‌ని క్లిక్ చేసి కావలసిన డ్రైవ్‌ని ఎంచుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కొంత డేటా ఉన్న రీరైటబుల్ సిడిని డ్రైవ్‌లో ఇన్‌సర్ట్ చేసినట్లయితే.. Navigation విభాగంలొ డ్రైవ్ లెటర్‌పై మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Erase అనే ఆప్షన్ ద్వారా ప్రస్తుతం ఆ డ్రైవ్‌లో ఉన్న డేటాని చెరిపి వేయవలసి ఉంటుంది. "ప్లేయర్ లైబ్రరీ" నుండి ఫైళ్ళని సిడి పైకి రైట్ చేసుకోవడానికి సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం List విభాగంలో ఉన్న అంశాలని తొలగించి తాజాగా రైట్ చెయ్యవలసిన మీడియా ఫైళ్ళ లిస్ట్‌ని సృష్టించదలుచుకుంటే Clear list pane అనే బటన్‌ని క్లిక్ చేయండి. Burn List కి మీరు పాటలు Add చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇంకా ఎన్ని నిముషాల ఆడియో జత చేయవచ్చో status నిముషాలు, సెకన్ల రూపంలో చూపించబడుతుంది. లైబ్రరీలో లేకుండా హార్డ్‌డిస్క్‌పై ఉన్న ఫైల్‌ని Burn chEyaalanTE ఆ ఫైల్‌పై రైట్ క్లిక్ చేసి Add to Burn List అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆడియో సిడిని ఎంచుకున్నప్పుడు సిడిలో పట్టేదానికన్నా ఎక్కువ ఫైళ్ళని Burning కి ఎంచుకున్నట్లయితే ఒక దాని తర్వాత మరొకటి పలు సిడిలుగా అవి రైట్ చేయబడుతాయి. ఒక వేళ అన్ని పాటలూ ఒకే సిడిలో కావాలంటే Data CD మోడ్‌ని ఎంపిక చేసుకోండి.

7, నవంబర్ 2007, బుధవారం

Tasks ఆటోమేటిక్‌గా క్లోజ్ చెయ్యబడేలా..



Ctrl+Alt+Del కీల సముదాయాన్ని ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే Task Manager ద్వారా రెస్పాండ్ అవని టాస్క్‌లను క్లోజ్ చేస్తుంటాము. టాస్క్‌ని సెలెక్ట్ చేసుకుని End Task డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమై పూర్తిగా ఆ టాస్క్‌ని క్లోజ్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. ఈ నేపధ్యంలో End Task బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎలాంటి డైలాగ్‌బాక్స్ చూపించబడకుండానే ఆ టాస్క్ క్లోజ్ చెయ్యబడడానికి... HKEY_CURRENT_USER\Control Panel\Desktop అనే విభాగంలో AutoEndTasks పేరిట ఒక DWORD ఎంట్రీ క్రియేట్ చేసి దానికి 1 అనే విలువను ఇవ్వండి. సరిపోతుంది.