29, నవంబర్ 2008, శనివారం

ఫోన్ నీళ్ళలొ తడిచిందా. ఇలా చేయండి !..

జేబులో పెట్టుకున్న ఫోన్ క్రిందికి వంగినప్పుడు నీళ్ళలో పడడం వంటి సంఘటనలు అనేకసార్లు

జరుగుతుంటాయి. మీ విషయంలోనూ ఇలా జరిగినట్లయితే వీలైనంత వరకూ ఒక నిముషం

లోపలే వేగంగా బ్యాటరిని తీసేయండి. బ్యాటరీకి తేమ కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే

ప్రమాదం ఉంది ఆ తర్వాత మీ దగ్గరలొ ఉన్న సెల్‍ఫోన్ టెక్నిషియన్ ఎవరైనా ఉన్నట్లయితే

మీ ఫోన్‍ని అతని వద్దకు తీసుకువెళ్ళి దానిని పూర్తిగా డీ అసెంబుల్ చేయించి లోపలి భాగాలు

ఆరేవరకు వేచి ఉండాలి. ఒకవేళ మీరే డీఅసెంబుల్ చేయగలిగిన నైపుణ్యం ఉన్నట్లయితే అలాగే

డీఅసెంబుల్ చేసి 60W లైట్ కాంతి నేరుగా ఆయా అంతర్గత భాగాలపై ప్రసరించేలా కొద్దిసేపు

ఉంచండి. దీంతో చిప్‍ల క్రిందకు చేరిన తేమ ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని

భాగలను అసెంబుల్ చేసి బ్యాటరీని యధాస్థానంలో ఉంచేయవచ్చు.

ఫోన్ యొక్క డీఫాల్ట్ అత్యవసర నెంబర్ ……..

మీరు ఏదొ మారుమూల ప్రదేశం వెళ్ళారు. అక్కడ మీకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే దాని గురించి

తెలియజేయాలంటే మీ సెల్‍ఫోన్ సిగ్నల్ లభించడం లేదనుకోండి. చింతించవలసిన పనిలేదు. మీ

సెల్ ఫోన్ పై 112 అనే నెంబర్‍ని ప్రెస్ చేయండి. వెంటనే మీ ఫోన్ ఆ ప్రాంతంలో అందుబాటులొ

ఉన్న ఏదైన ఇతర మొబైల్ నెట్‍వర్క్ కి మీ కాల్‍ని కలపడానికి ప్రయత్నిస్తుంది. ఈ నెంబర్

ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. ఫోన్ కీప్యాడ్ లాక్ చేసి ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్

ప్రెస్ చేస్తే కాల్ వెళుతుంది.

ఉచితంగా లభించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్

సిడిలను డివిడిలను రైట్ చేయ్యడానికి మనమందరం ఉపయోగించే Nero Expressవంటి సాఫ్ట్ వేల్లు ఆయా CD/DVD రైటర్లతో పాటు OEM వెర్షన్‍గా ఉచితంగా అందించబడుతున్నాయి. కానీ విడిగా అయితే అవి ఉచితమైనవి కావని మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పూర్తిగా ఉచితంగా లభించే సిడి/డివిడి రైటింగ్ సాఫ్ట్ వేర్ కోసం వెదుకుతున్నట్లయితే Burn Aware Free Edition వాడుకోవచ్చు. దీని ద్వారా CD/DVD లతో పాటు Blu-Ray ( BD-R/BD-RE ) డిస్కులను సైతం (మీ వద్ద ఆ రైటర్ ఉన్నట్లయితే ) రైట్ చేసుకోవచ్చు. డిస్క్ ఇమేజ్‍లను క్రియేట్ చెసుకోవడం, డిస్క్ టు డిస్క్ కాపీయింగ్ వంటి అన్ని సదుపాయాలు అందిస్తుందిది.

వర్డ్ లో రీసెంట్ ఫైల్ లిస్ట్ ని క్లియర్ చెయ్యడానికి

SNAG-0000

Wordలో File మెనూలో ఇంతకముందు మనం ఓపెన్ చేసిన ఫైళ్ల వివరాలు చూపించబడుతుంటాయి. అలా కన్పిస్తున్న రీసెంట్ ఫైళ్ల వివరాలు తొలగించదలుచుకున్నట్లయితే Tools>Options>General అనే విభాగంలో Recently used file list అనే బాక్స్ వద్ద 0 అని సెట్ చేస్తే పాత ఫైళ్ల వివరాలు క్లియర్ అవుతాయి. లేదా మీ వద్ద System Mechanic వంటి సాఫ్ట్ వేర్లు ఉన్నట్లయితే వాటిల్లోనూ Word ఫైల్ హిస్టరీని క్లియర్ చేసే ఆప్షన్ ఉంది.

మే 25 సమావేశ నివేదిక

తేదీ మే 25, 2008, ఆదివారం
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్

హాజరైన సభ్యులు:
1. ఎన్.కె. కిషోర్
2. పి. మౌర్య (నెల్లూరు నుండి వచ్చారు)
3. ఎ. బాలకృష్ణ
4. అడపా రమేష్
5. బి. హనుమాన్ కుమార్
6. పి. శ్రీనివాస్
7. ఎ. ఉదయభాస్కర్
8. కె.జె. సాయిరాం
9. ఎన్.ఎస్. శ్రీనివాస్
10. ఎం. భాస్కర్
11. జి. శ్రీనివాస్
12. ఎ. రహీంఖాన్
13. ఆర్. రమణరాజు
14. జి. శ్రీనివాసరావు
15. నల్లమోతు శ్రీధర్

ఛాధర్ ఘాట్ నుండి శ్రీనివాస్ గారు సన్ స్ట్రోక్ వల్ల రాలేకపోయానని మెసేజ్ పంపారు, అలాగే సాయిచరణ్ గారు కూడా అనారోగ్యం వల్ల మీటింగ్ కి హాజరు కాలేకపోయారు.

నేపధ్యం: అసలు నేను మీటింగ్ కి హాజరుకాగలుగుతానో లేదో అన్న సందేహంతో జరిగిన మీటింగ్ ఇది. గత పదిరోజులుగా ఊపిరి సలపనివ్వని మేగజైన్ వత్తిడిలో.. సరిగ్గా మీటింగ్ జరగడానికి రెండు గంటల ముందు ఒంటి గంట ప్రాంతంలో జూన్ 2008 కంప్యూటర్ ఎరాని ప్రింటింగ్ కి పంపించి హడావుడిగా ఉరుకులు పరుగులతో నల్లకుంట నుండి మీటింగ్ స్పాట్ కి చేరుకోగలిగిగాను. ఇలా పూర్తిగా మేగజైన్ లో నిమగ్నమై ఉండడం వల్ల అసలు ఈ మీటింగ్ గురించి ఈసారి అటు ఫోరంలోనూ, బ్లాగులోనూ, ఛాట్ రూమ్ లోనూ అనౌన్స్ చెయ్యలేదు. ఇలా ఎలాంటి సమాచారం అందక మీటింగ్ మిస్ అయిన వారు దయచేసి మన్నించగలరు. లాస్ట్ మినిట్ వరకూ మీటింగ్ కి నేను టైమ్ కి హాజరుకాగలుగుతానో లేదో అన్న సంశయం.. నేను లేకపోయినా మీటింగ్ ని నిర్వహించడానికి ఏక్టివ్ సభ్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల కావాలనే ఈ మీటింగ్ గురించి ఎక్కడా అనౌన్స్ చేయలేదు.

ఈసారి మీటింగ్ కి అధికశాతం మంది కొత్త సభ్యులే వచ్చారు. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ముందుగా కొత్త సభ్యులకు టెక్నికల్ నాలెడ్జ్ షేరింగ్ విషయమై మనందరం చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించడం జరిగింది. మన లక్ష్యంలో ఒక భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫోరం, ఛాట్ రూమ్ గురించి వివరించడంతోపాటు అందులో వీలైన సమయంలో వీలైన వాళ్లందరూ ఏక్టివ్ గా పార్టిసిపేట్ చెయ్యమని అభ్యర్థించడం జరిగింది. నెట్ అందుబాటు ఉన్నవారందరూ తాము కంట్రిబ్యూట్ చేయడానికి సంసిద్ధత ప్రకటించారు. ఈ సందర్భంగా మీటింగ్ కి హాజరుకాలేకపోయిన వారందరికీ కూడా ఒక విన్నపం. మనం ఓ ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇది రాత్రికి రాత్రి సాకారమయ్యేది కాదు.. మనం చేసే కంట్రిబ్యూషన్ కి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నూటికి నూరుశాతం చిత్తశుద్దితో మన పని మనం చేసుకుంటూ వెళితే అది మరెందరికో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మనం ఎంతమందిమి ఉన్నాం అన్నది ముఖ్యం కాదు. నా దృష్టిలో ఒక్కో వ్యక్తి ఒక్క శక్తి లాంటి వారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవా దృక్ఫధంతో మనం వెచ్చించే ఎంత కొద్ది సమయమైనా నూటికి నూరుశాతం చిత్తశుద్దితో కమిట్ మెంట్ తో స్పెండ్ చేద్దాం. నిన్న మొన్నటి వరకూ ఎవరమూ ఒకరికొకరం తెలియదు. ఇప్పుడు మనమంతా ఓ మంచి టీమ్ లా తయారయ్యాం. రేపు మరికొందరు వచ్చి కలుస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో కొందరు వృత్తి ఉద్యోగాల్లో బిజీ అయి కొంతకాలం క్రియాశీలకంగా ఉండలేకపోవచ్చు. మళ్లీ వచ్చి కలుస్తుంటారు. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. మనం ఆలోచనా విధానం.. మనం ఒక్కళ్లం ఉన్నా, పదిమందిమి ఉన్నా, వందమందిమి ఉన్నా.. మనం చేసే పని అంత కమిట్ మెంట్ తో చేయగలిగేలా ఉండాలి. ఇతరులతో పోల్చుకోవడం, కొత్త సభ్యులు వస్తున్నారు, పోతున్నారు మనమెందుకు కంట్రిబ్యూట్ చేయాలి అన్న తరహా ఆలోచనా విధానం సరైనది కాదు. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేద్దాం. ఫోరంలో ఐదు నెలల్లోనే దాదాపు 4వేల గొప్ప పోస్టులు పోగుపడ్డాయంటే.. ఒక ప్రసాద్ గారు, సాయిచరణ్ గారు, రాము గారు, జాహ్నవి గారు, స్వామి గారు, గిరిచంద్ గారు, వాణి గారు, అశ్విన్ గారు, జ్యోతి గారు, వెంకట్ గారు.. ఇలా అనేకమంది ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడబట్టే కదా.. ఇత విలువైన సమాచారం అందరికీ అందుబాటులో ఒక చోట గేదర్ అయింది. వారికి ప్రేరణ ఎవరు? లీడర్ ఎవరినీ చూసి అనుకరించరు. ఒక వ్యక్తి లీడర్ అయ్యాడంటే తాను చేసే పని తాను ఎంతో చిత్త శుద్దితో చేయబట్టే ఆ స్థాయికి ఎదగలుగుతారు. నిజంగా వీళ్లంతా నిజమైన లీడర్లు. మనమందరి కాన్షస్ లెవల్ కూడా ఇతరులు రాసినది చదివి వెళ్లిపోవడం అని కాకుండా మన వంతు మనం మన స్వంతంగా బాధ్యత తీసుకుని కంట్రిబ్యూట్ చేస్తూ వెళదాం.

మీటింగ్ లో చర్చించబడిన అంశాలు: కంప్యూటర్ నాలెడ్జ్ ని పదిమందికీ షేర్ చెయ్యడం విషయంలో ఇప్పుడు మనం చేస్తున్న కార్యకలాపాలు, భవిష్యత్ లో ఎలాంటి అంశాలు చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని అందరి ముందూ ఉంచడం జరిగింది. అందరూ చాలా చక్కని సలహాలు తెలియజేశారు. ముఖ్యంగా తమ సర్కిల్ లో వీలైనంత ఎక్కువమందికి మన ఫోరం, ఛాట్, మన లక్ష్యాలను పరిచయం చేస్తామని హాజరైన వారందరూ వెల్లడించారు. అలాగే తమకు వీలైన సమయంలో ఫోరం, ఛాట్ లలో వచ్చి స్పెండ్ చేయడానికి సమ్మతం తెలియజేశారు. ఇకపోతే రమణరాజు అనే సభ్యుడు ఓ మంచి సూచన చేశారు. ఏదో ఒక కంప్యూటర్ కోర్స్ చేసి జాబ్ లో సెటిల్ అవుదామని ఊళ్ల నుండి చాలామంది ఇంజనీరింగ్, ఇతర పట్టభద్రులు వస్తుంటారు.. వాళ్లకు అసలు ఏం చెయ్యాలో, ఏం కోర్స్ చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుందో, ఐ.టి. ఫీల్డ్ లో నిలదొక్కుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ పెంపొందించుకోవాలో, ఏ ఇనిస్టిట్యూట్ బాగుంటుందో.. ఇలా ప్రతీదీ సందేహమే ఉంటుంది. అలాంటి అన్ ఎంప్లాయిడ్ యూత్ కి మేగజైన్ తరఫున ఓ చిన్న మీటింగ్ అరేంజ్ చేసి మనలో ఫీల్డ్ పై అవగాహన ఉన్నవారు బేసిక్ గైడ్ లైన్స్ అందిస్తే బాగుంటుంది కదా అనే ప్రపోజల్ చేశారు. చాలా గొప్ప ఆలోచన ఇది. ఒక వ్యక్తి కెరీర్ లో స్థిరపడడానికి ఓ చిన్న సలహా అయినా మనం ఇవ్వగలిగితే అంతకన్నా వారికి మనం ఇవ్వదగ్గ ప్రోత్సాహం ఏదీ ఉండదేమో. జూలై 2008 కంప్యూటర్ ఎరాలో ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాను.. మీటింగ్ డేట్ ఫిక్స్ చేసి! ఐ.టి. ఫీల్డ్ లో ఇప్పటికే స్థిరపడిన ఆత్మీయులు, సన్నిహితులకు నా మనవి ఏమిటంటే.. దయచేసి ఒక్క రోజు ఒక్క గంట పాటైనా మీ సమయం వీలుచేసుకుని ఇటువంటి ఉద్యోగార్థులకు మీకు తెలిసిన పరిశ్రమ పోకడల గురించి గైడెన్స్ ఇవ్వడానికి మీకు మీరు స్వచ్ఛంధంగా ముందుకు వస్తే మన టీమ్ చాలా సంతోషిస్తాం. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్, జాబ్ ఫెయిర్లు జరిగేచోట్ల మన వెబ్ లింకులతో కూడిన చిన్న బ్యానర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే సూచన ఒకటి వచ్చింది. ఎవరైనా ఒకరిద్దరు సభ్యులు నాకు ఫిజికల్ గా సహకారం అందిస్తే ఖచ్చితంగా ఈ సూచనని వెంటనే ఆచరణలో పెడదాం.
ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి, దొరికిన ఒక్క ఆదివారపు సాయంత్రాన్ని సైతం త్యాగం చేసి మీటింగ్ కి హాజరైన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎండవేడిమి అందరినీ ఎంతో ఇబ్బంది పెట్టింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇకపై మీటింగులను 5 గంటలకు ప్రారంభిద్దామని నిర్ణయించడం జరిగింది. జూన్ 2008 కంప్యూటర్ ఎరాలో పొరబాటున 3 గంటలకే తదుపరి మీటింగ్ అని రాయడం జరిగింది. కానీ మీటింగ్ 5 గంటలకు నిర్వహించబడుతుంది. అలాగే జూన్ నెల మీటింగ్ జూన్ 15వ తేదీ ఆదివారం, సాయంత్రం 5 గంటలకు కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర నిర్వహించబడుతుంది. వీలైన వారందరూ గుర్తుంచుకుని హాజరు కాగలరు. మీటింగ్ ఫొటోలను కవర్ చేసిన కిషోర్ గారికి, మౌర్య గారికి ధన్యవాదాలు. మీటింగ్ అయిన తర్వాత రాత్రి 9 గంటల వరకూ కూర్చుని ఎక్కువ రిజల్యూషన్ ఉన్న ఆ ఫొటోలను రీసైజ్ చెయ్యడం విషయంలోనూ, వీడియోని అప్ లోడ్ చేయడం విషయంలోనూ శ్రమించిన కిషోర్ గారికి ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్
26, మే, 2008
11.54AM.

40కి పైగా ఉన్న ఈ మీటింగ్ యొక్క ఫొటోలను ఓ pdf ఫైల్ రూపంలో క్రింది లింకులో పొందుపరచడం జరిగింది. ఈ లింకుని క్లిక్ చేయడం ద్వారా ఆ ఫొటోలన్నింటినీ చూడవచ్చు.

http://www.scribd.com/doc/3103086/MAY252008-th-meeting

సిస్టమ్ వనరులను ప్రాసెస్‍లు హరిస్తున్నాయా?

మీ కంప్యూటర్‍లో ఏవి బడితే అవి భారీ సంఖ్యలొ ప్రాసెస్‍లు రన్ అవుతూ మీ సిస్టమ్ పనితీరుని నెమ్మదింపజేయడంతో పాటు సిస్టమ్ క్రాష్ అవడానికి దారి తీస్తున్నాయా ? అయితే మీరు Process Lasso అనే చిన్న సాఫ్ట్ వేర్ మీ కంప్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్ వేర్ సిస్టమ్ ట్రేలో రన్ అవుతున్న ప్రతీ ప్రాసెస్‍ని నిశ్శబ్దంగా మోనిటర్ చేస్తూ ఏదైనా ప్రాసెస్ 35% కన్నా ఎక్కువ CPU cycle ని హరిస్తుంటే దాన్ని kill చేస్తుంది. అలాగే రన్ అవుతున్న అన్ని ప్రాసెస్‍ల వివరాలూ నమోదు చేస్తుంది.

మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..

ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్‍కి అప్‍లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్‍లో అనేక ఫోటోషేరింగ్ వెబ్‍సైట్లు లభిస్తున్నాయి. flickr అనే సైట్‍ని ఓపెన్ చేయండి. అందులోకి ప్రవేశించగానే Create your account అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి. ఈ వ్యాసం మొదట్లొ చెప్పిన ప్రకారం మీరు ఇప్పటికే యాహూ మెయిల్ అకౌంట్‍ని క్రియేట్ చేసుకున్నారు కదా ! ఆ యాహూ అకౌంట్‍తొ నేరుగా Flickr లో ఉచిత అకౌంట్ సృష్టించుకోవచ్చు. తర్వాత మీ కంఫ్యూటర్లో ఉన్న ఫోటోలను ఆ సైట్‍లోకి అప్‍లోడ్ చేసుకుని Send an invite to Flickr అనే బటన్‍ని ఉపయోగించి మీ ఆత్మీయులకు వారి మెయిల్ అడ్రస్‍కి ఇన్విటేషన్ పంపించవచ్చు. వారు మీ ఫోటోలను Flickr లోకి వచ్చి చూడగలుగుతారు. Flickr మాదిరిగానే Photobucket, Zommr, Phanfare, Snapfish, Webshots, Smugmug, Woophy వంటి అనేక ఫోటొ షేరింగ్ సర్వీసులు లభిస్తున్నాయి.

ఒక ఫార్మేట్‍ నుండి మరో ఫార్మేట్‍కి చాలా ఈజీ

VOB ఫైళ్లని 3GP ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్ వేర్ వాడాలి, MOV to AVI కన్వర్షన్‍కి ఏమి వాడాలి అంటూ అందరికీ సందేహాలు వస్తుంటాయి. మీరు కన్వర్ట్ చేసుకోవలసిన ప్రతీదానికి వేర్వేరు సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చేసుకోవలసిన అవసరం లేకుండా zamzar అనే వెబ్‍సైట్‍లో మీరు ఒక ఫార్మేట్ నుండు మరో ఫార్మేట్‍కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఫైళ్ళని అప్‍లోడ్ చేయాలి. అవి కన్వర్ట్ చేయబడి మన e-మెయిల్ అడ్రస్‍కి పంపబడతాయి. అయితే 100MB ఫైల్ సైజ్ దాటకూడదు. అదే ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని సైతం కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించండి.

ఉచిత సిడి/డివిడి/బ్లూ - రే రైటింగ్ సాఫ్ట్ వేర్

సిడిలను డివిడిలను రైట్ చేయ్యడానికి మనమందరం ఉపయోగించే Nero Expressవంటి సాఫ్ట్ వేర్లు ఆయా CD/DVD రైటర్లతో పాటు OEM వెర్షన్‍గా ఉచితంగా అందించబడుతున్నాయి. కానీ విడిగా అయితే అవి ఉచితమైనవి కావని మీకు తెలిసే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు పూర్తిగా ఉచితంగా లభించే సిడి/డివిడి రైటింగ్ సాఫ్ట్ వేర్ కోసం వెదుకుతున్నట్లయితే Burn Aware Free Edition వాడుకోవచ్చు. దీని ద్వారా CD/DVD లతో పాటు Blu-Ray ( BD-R/BD-RE ) డిస్కులను సైతం (మీ వద్ద ఆ రైటర్ ఉన్నట్లయితే ) రైట్ చేసుకోవచ్చు. డిస్క్ ఇమేజ్‍లను క్రియేట్ చెసుకోవడం, డిస్క్ టు డిస్క్ కాపీయింగ్ వంటి అన్ని సదుపాయాలు అందిస్తుందిది.

డిస్పోజబుల్ చాట్ రూమ్ తయారుచేసుకోండి…

వేర్వేరు దేశాల్లొ, వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్న మీ స్నేహితులంతా ఒకేచోట ముచ్చటించుకోవాలనుకుంటున్నారా? అయితే కొద్దిసేపు మీకంటు ఓ చాట్ రూమ్ సృష్టించుకోవచ్చు కదా! ఆ వెబ్‍సైట్‍లో create a chat room (chat room name) అని కన్పించే బాక్స్ లో మీరు ఆ చాట్ రూమ్‍కి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరుని ఇవ్వండి. వెంటనే ఆ క్రిందనే మీరు పేర్కొన్న పేరుతో ఓ తాత్కాలిక చాట్‍రూమ్ ప్రారంభించబడి దాని లింక్ ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మీరు ఆ లింక్‍ని ఓపెన్ చేస్తే ఓ చాట్ విండో వచ్చేస్తుంది. ఇక మీరు చేయవలసినదల్లా , Gmail, Yahoo Messenger వంటి వాటిలో ప్రస్తుతం ఆన్‍లైన్‍లో మీకు అందుబాటులో ఉన్న మీ స్నేహితులందరికీ ఆ చాట్‍రూమ్ లింక్‍ని పంపించి వెంటనే వచ్చేయమని ఆహ్వానించడమే ! అందరూ వచ్చిన తర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు.

ఫైర్‍ఫాక్స్ టాబ్‍ల క్రమాన్ని మార్చుకోవడం …….

Internet Explorer కన్నా స్థిరంగా పనిచేస్తుండడం మూలంగా చాలామంది పిసి యూజర్లు ఇటీవలి కాలంలో firefox బ్రౌజర్‍ని ఉపయోగిస్తున్నారు. ఫైర్‍ఫాక్స్ ని మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే బ్రౌజర్ ద్వారానే అన్ని పనులూ నెరవేర్చుకోగలిగేలా ఫైర్‍ఫాక్స్ విషయంలో అనేక ధర్డ్ పార్టీ ఉచిత add-on లూ లభిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే మీరు ఫైర్‍ఫాక్స్ బ్రౌజర్‍ని ఉపయోగిస్తూ, ఒకే విండోలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఓ పదో పన్నెండో వెబ్‍సైట్లని ఓపెన్ చేశారనుకుందాం. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనం కొత్తగా వేరే టాబ్‍లో ఓపెన్ చేసే వెబ్‍సైట్ ప్రస్తుతం ఉన్న టాబ్‍కి ప్రక్కనే కొత్త టాబ్‍లొ ఓపెనవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ చేయబడి ఉన్న టాబ్‍లు మీకు నచ్చిన క్రమంలో అమర్చబడి లేకపోతే వాటిని ముందుకూ వెనుకకూ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. అదెలాగంటే ఏ టాబ్‍నైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కావలసిన దిశలో డ్రాగ్ చేయండి.

చాలా తక్కువ సైజ్ గల వర్డ్ ప్రాసెసర్…


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని Wordpad మాదిరిగా కేవలం 2.59 MB పరిమాణం కలిగి ఉండి Jarte అనే వర్డ్ ప్రాసెసర్ RTF, DOC తో సహా తాజా Word 2007 యొక్క DOCX ఫైళ్ళని సైతం ఓపెన్ చేయగలుగుతుంది. నేరుగా పెన్ డ్రైవ్ నుండే రన్ చేసుకోగలిగే ఈ ప్రోగ్రామ్ శక్తివంతమైన డిక్షనరీతో కూడిన స్పెల్ చెకర్ పొందుపరచబడడంతోపాటు ఈ ప్రోగ్రామ్‌లో రూపొందించుకున్న ఫైళ్ళని HTML, PDF ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవడానికి కూడా వీలుంది. డాక్యుమెంట్లని ఎడిట్ చేసే సమయంలో నచ్చిన విధంగా జూమ్ చేసుకోవచ్చు. టెంప్లేట్లని సపోర్ట్ చేస్తుంది. Firefox, IE మాదిరిగా ఒకేసారి వేర్వేరు టాబ్‌లలొ పలు డాక్యుమెంట్లని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఓ రకంగా Wordpad కి ఎక్కువ Word కి తక్కువా ఈ ప్రోగ్రామ్!

నెట్ ద్వారా టివి చానెళ్ళని ఉచితంగా చూడొచ్చు…

ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతున్న అనేక ఉచిత టెలివిజన్ చానెళ్ళని మన కంప్యూటర్ స్క్రీన్ మీదే వీక్షించడానికి “JLC Internet TV” అనే ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. చాలా తక్కువ పరిమాణం గల ఈ ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అది నెట్‌కి కనెక్ట్ అయి ప్రస్తుతం లభిస్తున్న చానెళ్ళ వివరాలను అప్‌డేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత దేశాల వారీగా కావల్సిన చానెళ్ళని ఎంచుకుని వీక్షించవచ్చు. కొన్ని చానెళ్ళు Windows Media Player లోనూ, మరికొన్ని Real Player లోనూ ప్లే అవుతుంటాయి. కాబట్టి ఈ రెండు ప్రోగ్రాములు ఉండాలి. దీనిలో DD News, Sun TV వంటి కొన్ని భారతీయ చానెళ్ళూ లభిస్తున్నాయి.

పేజింగ్ ఫైల్‍ని కూడా డీఫ్రాగ్ చేసుకోవచ్చు…


మనం భారీ మొత్తంలో అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగిస్తున్నప్పుడు అవన్నీ ఫిజికల్ మెమరీ (RAM) లో పట్టకపోయినట్లయితే విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ మీద కొంత ఖాళీ ప్రదేశాన్ని తాత్కాలికంగా RAM మాదిరిగా ఉపయోగించుకుంటుంది. అలా మెమరీ మాదిరిగా ఉపయోగించబడే హార్డ్ డిస్క్ ప్రదేశాన్ని Page File అంటారని మీకు తెలిసే ఉంటుంది.కంప్యూటర్ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమని తెలిసిందే కదా! అయితే సాధారణ పద్ధతుల ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేసేటప్పుడు కేవలం హార్డ్ డిస్క్‌లోని ఫైళ్ళు, ఫోల్డర్లు, బూట్ సెక్టార్ వంటివి మాత్రమే ప్రభావితం చేయబడతాయి. అసలు డీఫ్రాగ్ చేయకపోవడం కన్నా ఇలా విండోస్ లోని సాధారణ Defrag ప్రోగ్రామ్ ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమే అనుకోండి. కానీ NortonUtilities, O&O Defragmenter వంటి కొన్ని శక్తివంతమైన థర్డ్ పార్టీ డీఫ్రాగ్మెంటేషన్ ప్రోగ్రాములను ఉపయోగించి సిస్టమ్‌ని డీఫ్రాగ్ చేసుకోవడం అన్నింటి కన్నా ఉత్తమం.దీని వల్ల కేవలం హార్డ్ డిస్క్‌లోని సాధారణ భాగాలేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్‌చే page file గా ఉపయోగించబడుతున్న భాగం కూడా డీఫ్రాగ్ చేయబడుతుంది.

సీక్రెట్‌గా టేబుల్ వద్ద మాటలు వినాలా?


మన్మధుడు సినిమాలో టేబుల్ క్రింద ఓ పరికరం అమర్చి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారన్నది నాగార్జున వింటుంటాడు కదా. ఇప్పుడు చెప్పుకోబోయే టెక్నిక్‌ని ఫాలో అయి దాదాపు అదే మాదిరి ఫలితాన్ని మీరూ పొందవచ్చు.ముందు మీ ఫోన్‌లో కాల్ వచ్చిన కొన్ని సెకండ్లకు ఫోన్ ఆటోమేటిక్‌గా ఆన్సర్ చేయబడేలా Auto Answer సదుపాయాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే రింగ్ వాల్యూమ్‌ని mute చేయండి. మీ ఇయర్ ఫోన్‌ని మీ ఫోన్‌కి గుచ్చితే దానంతట అదే headset ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఫోన్‌ని ఏ టేబుల్ వద్ద మాటలు వినాలనుకున్నారో ఆ టేబుల్ క్రింద కనిపించకుండా అమర్చండి. ఇప్పుడు బయటకు వచ్చి వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి కాల్ చేయండి. కొద్ది క్షణాలు రింగ్ అయిన తర్వాత (రింగ్ సౌండ్ బయటకు రాదు) టేబుల్ క్రింద ఫోన్ ఆన్ అయి.. అక్కడ మాట్లాడుకునే మాటలు మీకు వినిపిస్తుంటాయి. సరదాగా ప్రయత్నించి చూడండి. :)

ఫంక్షన్ కీ ప్రెస్ చేయకుండా లోపలికి…

మన కంప్యూటర్ యొక్క మదర్‌బోర్డ్‌పై CMOS బ్యాటరీ అని ఒక బ్యాటరీ పొందుపరచబడి ఉంటుంది. అది BIOS ప్రోగ్రామ్‌లో మనం చేసే సెట్టింగులను సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే CMOS బ్యాటరీ వీక్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న హార్డ్‌వేర్ సెట్టింగులు సేవ్ చేయబడక.. డీ్‌ఫాల్ట్ సెట్టింగులకూ, ప్రస్తుతం సిస్టమ్‌లో కనిపించే సెట్టింగులకు (RAM, హార్డ్ డిస్క్, సిడిరామ్ డ్రైవ్‌ల వివరాలు వంటివి) మధ్య వౄత్యాసం కన్పించి కంప్యూటర్‌ని బూట్ చేసే సమయంలో Press F1 to continue మాదిరిగా మెసేజ్ చూపించబడుతుంటుంది. అలాంటప్పుడు ఓ సారి కేబినెట్‌ని విప్పదీసి మదర్‌బోర్డ్‌పై mount చేయబడి ఉండే బ్యాటరీని తొలగించి బయట ఎలక్ట్రానిక్ షాపుల్లో అదే తరహా బ్యాటరీని కొనుక్కొచ్చి మదర్‌బోర్డ్‌పై అమర్చితే సరిపోతుంది. ఒకవేళ బ్యాటరీని మార్చడం ఎలాగో మీకు అవగాహన లేక అలాగే కొనసాగదలుచుకున్నట్లయితే…సిస్టమ్ బూట్ అయ్యే సమయంలో ఓసారి Del కీని ప్రెస్ చేయడం ద్వారా BIOS లోకి వెళ్ళి అందులో కనిపించే వేర్వేరు విభాగాల్లో Wait for Error పేరిట ఏదైనా ఆప్షన్ మీ BIOS వెర్షన్‌లో లభిస్తోందేమో గమనించండి. కనిపిస్తే దానిని డిసేబుల్ చేయండి. దీంతో ఇకపై ఎర్రర్ మెసేజ్ చూపించబడకుండానే నేరుగా హార్డ్‌డిస్క్ నుండి ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ చేయబడుతుంది.

DivX ఫార్మేట్ అత్యుత్తమైనది

భారీ పరిమాణం గల వీడియో ఫైళ్ళని సైతం సాధ్యమైనంత వరకూ నాణ్యత లోపించకుండా తక్కువ పరిమాణంలోకి కంప్రెస్ చెయ్యడానికి DivX అనే వీడియో కోడెక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. AVI, MPEG, WMV వంటి అన్ని రకాల ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళని ఈ DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఫైళ్ళని DivX ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయ్యడానికి అనేక సాఫ్ట్‌వేర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా DivX Converter 6.5 వెర్షన్ అన్నింటికన్నా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. MPG, VOB, TS, SVCD ఫైళ్ళని DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ కన్వర్టర్ సాఫ్ట్‌వేర్‌కి అదనంగా MPEG-2/DVD ప్లగ్ ఇన్ కూడా అవసరం అవుతుంది. వేర్వేరు వీడియో ఫైళ్ళని ఒకే DivX ఫైల్‌గా మెర్జ్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది.

పిసి నుండే ఫోన్‍ని నియంత్రించడానికి..

Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer, FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు, Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్ నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్ కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.

Archive for May, 2008 అడోబ్ రీడర్ 8 సిపియుని ఎక్కువగా వాడుకుంటుంది


PDF ఫైళ్ళని ఓపెన్ చేయడానికి ఉద్దేశించబడిన Adobe Reader8 వెర్షన్‌తో ఓ ఇబ్బంది ఉంది.వాస్తవానికి Adobe Reader 7 వరకూ అప్‌డేట్లు అవసరం లేకపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే సదుపాయాన్ని డిసేబుల్ చేసుకునే అవకాశముంది. అయితే Adobe Reader 8 లో మనం కోరకుండానే adobeupdater.exe అనే అప్‌డేట్ ప్రోగ్రామ్ మనం ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు Adobe సైట్‌కి వెళ్ళి తాజా అప్‌డేట్లని డౌన్‌లోడ్ చేస్తుంటుంది. అది సక్రమంగా పనిచేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ adobeupdater.exe ప్రోగ్రామ్ 98% సిపియుని వినియోగించుకుంటూ సిస్టమ్‌ని పూర్తిగా స్లో చేస్తుంది. సో.. ఇలాంటి ఇబ్బందిని మీరు అధిగమించాలంటే Foxit Reader వంటి ప్రత్యామ్నాయ PDF రీడింగ్ సాఫ్ట్‌వేర్లని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఫైర్‌ఫాక్స్ వేగంగా పనిచేయడానికి ఓ Add-on


ఇంటర్నెట్ బ్రౌజింగ్‍కి IE బదులుగా ఫైర్‌ఫాక్స్ వాడేవారు Network Pipelining వంటి కొన్ని సెట్టింగులను మార్చడం ద్వారా వేగంగా పనిచేస్తుంది. అయితే వాటిని మేన్యు‍వల్‌గా కాన్ఫిగర్ చేయడం ఇబ్బంది అనుకున్నట్లయితే Fasterfox అనే add-on మీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో Prefetching, Cache, Rendering ,కనెక్షన్ స్పీడ్, పైప్ లైనింగులకు సంబంధించిన రెడీమేడ్ సెట్టింగులు లభిస్తుంటాయి. వాటిని మీరు కోరుకున్న విధంగా సెట్ చేసుకోవచ్చు.