4, ఆగస్టు 2007, శనివారం

సౌండ్ కార్డ్ కొనాలనుకుంటున్నారా?



సిస్టం ద్వారా సౌండ్ అందించడానికి మదర్‌బోర్డ్‌పైనే సౌండ్‌చిప్ ఉన్నప్పటికీ మ్యూజిక్ ఇష్టపడేవారు, సౌండ్ ఎడిటింగ్ రంగంలో పనిచేసేవారు నాణ్యమైన సౌండ్‌కార్డ్‌ని అదనంగా కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. మ్యూజిక్ వినడానికి సౌండ్‌కార్డ్ కొంటున్నట్లయితే 5.1 Surround వంటి మల్టిపుల్ చానెళ్ళని అందించే సౌండ్‌కార్డ్‌ని ఎంచుకోండి. ఒకవేళ గేములు ఆడేవారు గేముల నుండి క్వాలిటీ సౌండ్‌ని కోరుకుంటున్నట్లయితే Direct Sound, EAX, A3D, 13DL2 వంటి స్టాండర్డ్‌లను సపోర్ట్ చేసే సౌండ్‌కార్డ్‌ని ఎంపిక చేసుకోవడం వల్ల త్రీడీ క్వాలిటీ పొందవచ్చు. సౌండ్‌కార్డ్‌లు PCI, USB, ISA ఇంటర్‌ఫేస్ కలిగినవి లభిస్తుంటాయి. PCI, USB కార్డ్‌లను కొనుగోలు చేయండి. అలాగే సౌండ్‌కార్డుతోపాటు అందించబడే డివైజ్‌డ్రైవర్లు Windows అన్ని వెర్షన్లతోపాటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని సపోర్ట్ చేసేవి ఉండేలా జాగ్రత్త వహించండి. లినక్స్‌కి ఆదరణ పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో సౌండ్‌కార్డ్ డ్రైవర్లు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సౌండ్‌కార్డ్ ద్వారా సిగ్నల్స్ నష్టపోకుండా ఉండాలంటే గోల్డ్ ప్లేటేడ్ కనెక్టరులు కలిగిన సౌండ్‌కార్డ్‌ని కొద్దిగా ధర ఎక్కువైనా ఎంపిక చేసుకోండి.

కామెంట్‌లు లేవు: