29, ఆగస్టు 2007, బుధవారం

మౌస్ ఇష్టమొచ్చినట్టు మూవ్ అవుతుందా...
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవడానికి, దాదాపు అన్నిరకాల
ఇతర పనులకూ మౌస్ లేనిదే కష్టం. అయితే ఒక్కోసారి మౌస్ పాయింటర్ మన
చేతితో మూవ్ చేస్తున్న పద్ధతికి అనుగుణంగా కాకుండా, మరీ స్లోగా కానీ,జెర్కీగా
గానీ మూవ్ అవుతుంటుంది. సాధారణంగా మౌస్ రోలర్‍లకు మురికి చేరినపుడు
ఈ పరిస్థితి తలెత్తుతుంది. అలాంటప్పుడు మౌస్ వెనుకభాగంలొ ఉండే మౌస్
కవర్‍ని తొలగించి అందులోని మౌస్ బాల్‍ని బయటకు తీయండి. ఇప్పుడు మౌస్
లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీప్రదేశం ద్వారా మౌస్ రోలర్లకు పట్టిన
మురికిని గుర్తించవచ్చు. నీటిలో ముంచిన ఒక గుడ్డను తీసుకుని ఆ రోలర్లకు
పట్టుకున్న మురికిని మెల్లగా గీరివేయండి. మురికి ప్యాచ్‍లుగా ఊడిపోతుంది..
అలాగే మౌస్‍బాల్‍ని కూడా శుభ్రంగా డిటర్జెంట్ నీళ్ళలో కడిగి శుభ్రంగా తుడిచి మౌస్
లోపల అమర్చండి. మౌస్ ప్యాడ్ ద్వారా ఎక్కువగా మురికి మౌస్ లోపలికి చేరుతుంది.
కాబట్టి ప్రతీరోజూ మౌస్ ప్యాడ్‍పై చేరుకున్న దుమ్ముని శుభ్రపరచడం శ్రేయస్కరం.

కామెంట్‌లు లేవు: