30, ఆగస్టు 2007, గురువారం

గూగుల్ ఎర్త్….GOOGLE EARTH





’తాతా కంప్యూటర్లో మన ఇల్లు, పురులు, సూర్యలంకలు సముద్రపు ఒడ్డు కనిపిస్తున్నాయే’! అంటూ ఓ మనవడు చెబుతుంటే ఆ తాత మొహంలో సంభ్రమం కొట్టొచ్చినట్లు కనిపించింది. Google Earth, Wikipedia ల పుణ్యమా అని ప్రపంచంలోని ఏ మారుమూల ప్రదేశం గురించైనా క్షణాల్లో ఉపగ్రహ చిత్రాల ద్వాఅరా తెలుసుకోవడం సాధ్యపడుతోంది.

ఎక్కడ లభిస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది?

Google Earth అనేది ఓ ఉచిత మృదులాంత్రము (Software). 11 MB సైజుగల ఈ ప్రోగ్రామ్‍ని http://earth.google.com అనే సైట్ నుండి పొందవచ్చు. ఫ్రీవర్షన్‍ని డౌన్‍లోడ్ చేసుకునేటప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫారంని నింఫి యూజర్‍నేమ్, లైసెన్స్ కీలను పొందాలి. Google Earth ని నెట్‍కి కనెక్ట్ చేసే సమయంలో వీటిని తెలియజేస్తేనే లాగిన్ అవుతుంది.

ఎలా ఎక్స్ ప్లోర్ చేయాలి?

Google Earth ప్రోగ్రామ్‍ని రన్ చేసిన వెంటనే ఓ globe గుండ్రంగా తిరుగుతూ మన ముందుకు వస్తుంది. ఆ గ్లోబ్‍లో ఏ ప్రదేశం వద్ద అయినా మౌస్‍ని ప్రెస్ చేసి పట్టుకుని మీకు కావల్సిన దేశం వచ్చేటంతవరకూ కుడి, ఎడమ వైపులకు మౌస్‍ని డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మీకు కావలసిన దేశం వచ్చిన తర్వాత Mapsకి క్రింది భాగంలో కన్పించే కంట్రోళ్ళని ఉపయోగించి ఆ దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలని వెతుకుతూ వెళ్ళాలి. ఉదా.కు New Delhi, Mumbai, Hyderabad వంటి నగరాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా నగరాన్ని సెంటర్ పొజిషన్‍లోకి తెచ్చుకుని.. ఆ నగరాన్ని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ నగరంలోని వివిధ ప్రాంతాల పేర్లు కన్పిస్తుంటాయి. హైదరాబాదుని జూమ్ చేసుకుంటూ వెళితే హుస్సేన్‍సాగర్, అమీర్‍పేట్, ఎల్.బి. స్టేడియం, వంటి వివిధ ప్రదేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకుని జూమ్ చేసుకుంటూ వెళితే ఆ ప్రదేశం పరిసర ప్రాంతాలు, భవనాలు, రోడ్లు ఉపగ్రహచిత్రం రూపంలో చూపించబడతాయి. మన రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాల రూపురేఖలని సైతం Google Earth ప్రోగ్రామ్ ద్వారాఎక్స్ ప్లోర్ చేసుకోవచ్చు.




చిటికెలో కావలసిన ప్రదేశాన్ని చూడాలా?

Globe బొమ్మని జూమ్ చేస్తూ కావలసిన ప్రదేశానికి చేరుకోవడం కష్టంగా ఉందా … అయితే Google Earth ప్రోగ్రామ్‍లోని Fly to అనే బాక్సులో మీరు ఏ నగరాన్ని చూడాలనుకుంటున్నారో దాని పేరుని టైప్ చేయండి. ప్రముఖ ప్రాంతాలని సందర్శించడానికి ఇది సులభంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని సైతం Google Earth ద్వారా పొందవచ్చు. ఏదైనా ప్రముఖ ప్రదేశానికి బ్రౌజ్ చేసేటప్పుడు అక్కడికి దగ్గరలో హైవేలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, బ్యాంకులు, రిటైల్‍షాపులు, ఫార్మసీలు, వంటి ఎలాంటీ వనరులైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అవకాశముంది. దీనికి గాను Google Earth ప్రోగ్రాములో Layers అనే ప్రదేశం వద్ద కావలసిన అంశాలని ఎంచుకుంటే సరిపోతుంది. వివిధ ప్రదేశాలని బ్రౌజ్ చేసేటప్పుడు పలురకాల సింబల్స్ రూపంలో ఇవి చూపించబడతాయి.


ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లు సైతం లభిస్తున్నాయి…


Google Earth ప్రోగ్రాములో ఉన్న సదుపాయాలు సరిపోవడం లేదా… అయితే www.googleearthhacks.com అనే వెబ్‍సైట్‍లో అదనపు మ్యాపులు, ఫోటోలు లభించడంతో పాటు ఈ ప్రోగ్రామ్‍ని ఉపయోగిస్తున్న ఇతర యూజర్ల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తెలుసుకోవడానికి Google News స్టోరీలు, Earth చిత్రాలు చూసి చూసి విసిగిపోయి కొద్ది భిన్నంగా వేరే గ్రహం చిత్రాలు చూడాలనుకుంటే Jupiter గ్రహం యొక్క చిత్రాలు చూపించే ప్లగ్‍ఇన్‍లు వంటివి ఎన్నో ఈ సైట్‍లో డౌన్‍లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి.ది

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

పది అత్యుత్తమ బ్లాగుల్లో ఈ బ్లాగు "ఖచ్చితంగా" ఉంటుంది. మీ ప్రతి టపా నలుగురికీ ఉపయోగపడేదే. ఇటువంటి బ్లాగు తెలుగులో ఉండటం అదృష్టం.