31, మార్చి 2014, సోమవారం

మీకు తెలీకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్‌లో ఏమేం చూశారో ఇలా తెలుసుకోండి? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

కొన్నిసార్లు మనం ఫోన్‌ని అలా వదిలేసి పక్కకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మనకు తెలీకుండా మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు మన ఫోన్‌లోని అప్లికేషన్లు, గేమ్స్ ఓపెన్ చేసి చూడొచ్చు.

మనం అభిమానించే వ్యక్తులు అయితే ఫర్లేదు గానీ వేరే ఎవరో మన ఫోన్‌లోని calls, sms, whatsapp మెసేజ్‌ల వంటివి ఓపెన్ చేసి చూస్తే మనస్సుకి కష్టంగా అన్పిస్తుంది కదా...

ఈ నేపధ్యంలో మీరు లేనప్పుడు ఎవరైనా మీ ఫోన్‌లో ఏయే అప్లికేషన్లు, గేమ్‌లూ ఓపెన్ చేశారో ఓ రిపోర్ట్ రూపంలో తెలుసుకునే ఓ అద్భుతమైన అప్లికేషన్‌ని ఈ వీడియోలో పరిచయం చేశాను. ఇది iOS ఆధారిత ఫోన్లు, టాబ్లెట్లలో పనిచేస్తుంది.

గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

‪#‎computerera‬ ‪#‎telugu‬

30, మార్చి 2014, ఆదివారం

మీ Airtel Prepaid నెంబర్‌ని ఆన్‌లైన్‌లో ఇలా మేనేజ్ చేసుకోండి Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=qou8urZiyzA

మీరు Airtel Prepaid సర్వీస్‌ని వాడుతుంటే.. బ్యాలెన్స్ ఎంక్వరీ మొదలుకుని వివిధ value added సర్వీసుల వరకూ ప్రతీ దానికీ SMSనో, కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఏక్టివేట్, డీఏక్టివేట్ చేసుకోవడమో చేస్తుంటారు కదా.. కస్టమర్ కేర్‌లో IVRS మాటలు వింటూ వెయిట్ చేయడం పెద్ద చిరాకు.

ఇంత శ్రమ లేకుండా మీ నెంబర్‌కి సంబంధించి బ్యాలెన్స్, వేలిడిటీ, మీకు కొత్తగా కావలసిన సర్వీసులు, తొలగించుకోదలుచుకున్న సర్వీసులూ, అలాగే మీ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి అకౌంట్‌ సెట్టింగులు అన్నీ ఈ వీడియోలో నేను చూపించినట్లు ఆన్‌లైన్‌లోనే ఈజీగా నిర్వహించుకోవచ్చు. సో ట్రై చేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=qou8urZiyzA

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.co­m

#computerera #telugu

29, మార్చి 2014, శనివారం

నెట్ నుండి ZIP, RAR ఫైళ్లు డౌన్‌లోడ్ చేసే ముందే వాటిలో ఏమేం ఉన్నాయో ఇలా ఛెక్ చేసుకోవచ్చు.. Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TYzgZWs-Ng0

ఇంటర్నెట్‌లో తెలిసీ తెలియని వెబ్‌సైట్ల నుండి చాలామంది గుడ్డిగా ZIP, RAR ఫైళ్లని డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఈ కంప్రెస్డ్ ఫైళ్లలో వైరస్‌లూ, కీలాగర్లు, ట్రోజాన్ల వంటివి నిక్షిప్తం చేయబడే అవకాశం ఉంది. సో గుడ్డిగా ఫైళ్లని డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ వీడియోలో నేను చూపించినట్లు మీరు డౌన్‌లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి.. ఆ తర్వాతే సేఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=TYzgZWs-Ng0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

28, మార్చి 2014, శుక్రవారం

పాటలు పాడాలనుకుంటున్నారా? Songsలో వాయిస్ తీసేసి మ్యూజిక్ మాత్రమే పొందండి ఇలా...Must Watch & Share


వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KGcqrcTQKNU


మ్యూజిక్‌పై ఆసక్తి కొద్దీ పాటలు ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి నచ్చిన సాంగ్స్‌లో గాయకుల వాయిస్ అడ్డుగా ఉంటుంది. సింగర్స్ vocals తొలగించి కేవలం music సపరేట్ చేసుకోగలిగితే ప్రాక్టీస్‌కి అనువుగా ఉంటుంది.

సో ఇలా మీకు నచ్చిన పాటల్లో మాటలు తొలగించి కేవలం మ్యూజిక్ మాత్రమే పొందాలనుకుంటే ఈ వీడియోలో 2 పద్ధతులు చూపించడం జరిగింది, ప్రయత్నించండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=KGcqrcTQKNU

ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

27, మార్చి 2014, గురువారం

ఇటీవలే విడుదలైన Samsung Galaxy Grand Neo రివ్యూ...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s0VTYplZXyc

5.01 అంగుళాల డిస్‌ప్లేతో ఆండ్రాయిడ్ 4.2.2 KitKat ఆపరేటింగ్ సిస్టమ్‌తో QuadCore 1.2 GHz ప్రాసెసర్‌తో శాంసంగ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన Samsung Galaxy Grand Neo రూ. 15,900కి మార్కెట్లో లభిస్తోంది.

ఈ మోడల్‌ ఎలా ఉందో చూడాలనుకునే వారి కోసం ఈ వీడియో.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s0VTYplZXyc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

హెడ్‌ఫోన్‌తో Full Volumeలో పాటలు వింటూ కూడా ముఖ్యమైన బయటి మాటలు వినేయొచ్చు ఇలా...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BFL4cbJvHvs

చెవిలో హెడ్‌ఫోన్లు తగిలించుకుని పాటలు వింటుంటే ఎవరో వచ్చి పెద్దగా ఏదో చెప్తుంటారు మనకు ఏమీ అర్థం కాక హెడ్‌ఫోన్లు తీసేసి వాళ్లేం చెప్తున్నారో వినాల్సి వస్తుంది.

అలాగే వెహికిల్‌పై డ్రైవ్ చేసేటప్పుడూ ఇలా హెడ్‌ఫోన్లు తగిలించుకుని పాటలు వింటూ వెళ్లడం వల్ల దగ్గరగా వచ్చిన వెహికిల్స్ హారన్లు కూడా విన్పించక చాలామంది ప్రమాదాల బారిన పడుతూ ఉంటుంటారు.

ఈ తరహా సమస్యలకు ఈ వీడియోతో మీరు ఛెక్ పెట్టేయొచ్చు.

ఓ పక్క పాటలు ఎంజాయ్ చేస్తూనే మధ్యలో ఎవరైనా మనల్ని ఉద్దేశించి మాట్లాడితే పాటలు కొన్ని క్షణాలు ఆగిపోయి వారి మాటలు మనకు హెడ్‌ఫోన్ ద్వారా మన చెవిలోకి విన్పించబడితే అద్భుతంగా ఉంటుంది కదూ.. చెవిలో నుండి హెడ్‌సెట్ తీసేయాల్సిన పనిలేదు.

సో ఈ వండ్రఫుల్ ఐడియా ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.

గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BFL4cbJvHvs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

26, మార్చి 2014, బుధవారం

హైద్రాబాద్ వంటి నగరాల Street View కూడా చూడొచ్చు ఇలా... Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=fd_uXeCdVjs

Google Maps కేవలం శాటిలైట్ view ద్వారా ప్రతీ ప్రాంతం గురించి ఓ రఫ్ ఐడియాని ఇస్తుంది. దానికన్నా మెరుగ్గా ప్రతీ భారతీయ నగరంలోనూ ముఖ్యమైన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో నిజంగా మనం అక్కడే ఉన్నామన్న అనుభూతిని కలిగించేలా చూడాలనుకుంటున్నారా? అయితే అదెలాగో చూసేయండి.

ఈ పద్ధతి ద్వారా వివిధ ప్రదేశాలకు సహజంగానే Directions వంటి ఇతర సదుపాయాలనూ పొందొచ్చు. సో ఓ లుక్ వేయండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=fd_uXeCdVjs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

25, మార్చి 2014, మంగళవారం

మీ ఫోన్‌కి మీకు నచ్చిన వీడియో వాల్‌పేపర్‌గా ఇలా సెట్ చేసుకోండి Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kezldh3IKJc

ఎప్పుడూ మామూలు ఫొటోల్ని ఫోన్ వాల్‌పేపర్‌గా ఏం పెట్టుకుంటారు... కాస్త వెరైటీగా వీడియో పెట్టుకోగలిగితే బాగుంటుంది కదా...

మీకు ఇష్టమైన, మీకు నచ్చిన వీడియోని దేన్నయినా స్క్రీన్‌ వెనుక కదులుతూ ఉండేలా background wallpaperగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోని తప్పనిసరిగా చూడాల్సిందే. ఇందులో ఈ ప్రొసీజర్ ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kezldh3IKJc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫ్రెండ్స్‌కి WhatsApp ద్వారా ముందే షెడ్యూల్డ్ మెసేజ్‌లు పంపించడం ఎలా? Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZWN03TiCZJI

మీ WhatAppలో మీ బెస్ట్ ఫ్రెండ్‌కి రోజూ ఉదయాన్నే మెసేజ్ పెడితే బాగుంటుంది అనుకుందాం. ఆ ఫ్రెండ్ ఆఫీస్‌కెళ్లే సమయానికి మీరు నిద్రలేవరనుకుందాం :)

అలాంటప్పుడు ప్రతీరోజూ ఉదయాన్నే ఓ పర్టిక్యులర్ టైమ్‌కి ఆటోమేటిక్‌గా విషెస్ వెళ్లేలా సెట్ చేయగలిగితే బాగుంటుంది కదా..

అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం.. మీ ఫ్రెండ్స్ బర్త్‌డే రోజు పనివత్తిడి వల్ల మీరు రాత్రి 12 గంటల వరకూ మెలకువగా ఉండే ఓపిక లేదనుకుందాం. అలాంటప్పుడు సరిగ్గా 12 గంటలకు వారికి మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోగలిగితే?

ప్రతీ రోజూ, లేదా ప్రతీ అరగంటకూ, ప్రతీ గంటకూ, ప్రతీ వారం, ప్రతీ నెలా, ప్రతీ సంవత్సరం మనం సెట్ చేసిన టైమ్‌లో మనం సెట్ చేసిన కాంటాక్టులకు ఆటోమేటిక్‌గా మనం కోరుకున్న మెసేజ్‌లు వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZWN03TiCZJI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

24, మార్చి 2014, సోమవారం

పాటలు వింటూ నిద్రలోకి పోతున్నారా? Music ఆటోమేటిక్‌గా ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QDMoGlpia6A

చాలామందికి నిద్రపోయేటప్పుడూ, ప్రయాణాల్లోనూ ఇయర్‌ఫోన్లు తగిలించుకుని పాటలు వినడం అలవాటు. అలా పాటలు వింటూ నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. దీంతో ఆ పాటలు అలా ప్లే అయిపోతూ మధ్యలో నిద్రాభంగం కలగడం గానీ, మెలకువ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంటుంది.

కేవలం నిద్ర పాడవడమే కాకుండా ఇలా పాటలు ప్లే అయిపోతూ ఉండడం వల్ల బ్యాటరీ కూడా వేస్ట్ అయిపోతుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓ అద్భుతమైన సొల్యూషన్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరు నిద్రలోకి జారుకున్న తక్షణం ఇది గుర్తించి మీ ఫోన్‌లో Music  Playerని ఆఫ్ చేస్తుంది. లేదా ముందే ఓ టైమ్ సెట్ చేసుకుని మీరు వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. ఆ టైమ్ పూర్తయ్యాక Music దానంతట అదే ఆఫ్ చేయబడుతుంది. సో మిస్ అవకుండా దీన్ని ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QDMoGlpia6A

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

23, మార్చి 2014, ఆదివారం

సినిమాలూ, రెస్టారెంట్లు, ఎలక్ట్రీషియన్ వంటి ఏ కాంటాక్ట్ డీటైల్స్ కావాలన్నా! Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=noWgGk8668Q

మీ ఇంట్లో అర్జెంటుగా ఎలక్ట్రీషియన్ అవసరం అయితే.. ఎవరి నెంబరూ మీ దగ్గర లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వంటి రెగ్యులర్‌గా మనకు అవసరం అయ్యే వ్యక్తులు మనకు దగ్గర్లో ఎవరున్నారో తెలుసుకోవడంతో పాటు....

ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతోందీ, ఏ థియేటర్ మనకు ఎంత దూరంలో ఉందీ, అలాగే మనకు నచ్చిన వెరైటీ ఫుడ్ దొరికే రెస్టారెంట్ల వివరాలూ, ఇంకా రోజూ మనకు అవసరం అయ్యే పలు రకాల సమాచారం పొందడానికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది.

సో ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ తప్పనిసరిగా ఈ సమాచారాన్ని మీకు అందుబాటులో ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=noWgGk8668Q

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

22, మార్చి 2014, శనివారం

మీ Gmail స్పేస్ తగ్గిపోతోందా? ఈజీగా ఇలా పెంచేసుకోండి...Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s3c1xyH-3rw

Gmail, ఇతర గూగుల్ ప్రోడక్టులకు కలిపి Google కొంత ఉచిత స్పేస్ అందిస్తుంటుంది కదా.. అయితే ఏళ్ల తరబడి Gmail వాడుతున్న వారికి వారి Free Space తగ్గిపోవడం సహజం. కొన్నిసార్లు Space పూర్తిగా నిండిపోతుంది కూడా!

సో మీకూ అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మీ inboxకి వచ్చిన మెయిల్స్, అటాచ్‌మెంట్లలో ఎక్కువ స్పేస్ ఆక్రమించిన మెయిల్స్‌ని సులభంగా గుర్తించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: Gmail వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=s3c1xyH-3rw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

21, మార్చి 2014, శుక్రవారం

మీ పిల్లలు ఫోన్‌లో అశ్లీల సమాచారం యాక్సెస్ చేయకుండా, గేమ్స్ ఎక్కువ ఆడకుండా ఇలా Restrict చేయొచ్చు Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yeahRv3B9Gw

పిల్లలు గొడవ చేస్తున్నారని ఫోన్లు, టాబ్లెట్లు కొనిపెడుతూ ఉన్నారు పేరెంట్స్. తీరా కొన్నాక పేరెంట్ గమనించనప్పుడు వాళ్లు పొరబాటున అశ్లీల వెబ్‌సైట్లు వంటి వాటి బారిన పడితే కష్టం కదా?

అలాగే చాలామంది పిల్లలు గంటల తరబడి గేమ్స్‌కి అతుక్కుపోతున్నారు. దీంతో స్టడీస్ దెబ్బతింటున్నాయి. ఈ నేపధ్యంలో గేమ్స్ మీరు సెట్ చేసిన టైమ్‌లోనే ఆడేలా, మిగతా సమయంలో అవి రన్ అవకుండా ఉండేలా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా?

అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో చూపించినట్లు మీరు మీకు నచ్చిన సెట్టింగులు చేసుకోవచ్చు.

గమనిక: భావి తరాల భవిష్యత్ ముఖ్యం అనుకునేవారు తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yeahRv3B9Gw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

20, మార్చి 2014, గురువారం

VLC Playerలో వీడియో డల్‌గా ఉంటుంది కదా.. ఇలా సరిచేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vzivjWhI-Nk

ఒకటే వీడియోని అటు VLC Playerలోనూ, ఇటు Windows Media Playerలోనూ ప్లే చేస్తే VLC Playerలో కలర్స్ తేలిపోయినట్లుగా ఎబ్బెట్టుగా అన్పిస్తాయి. Windows Media Playerలో మాత్రం వీడియో బ్రహ్మాంఢంగా ఉంటుంది. ఈ కారణం చేత చాలామంది వీడియోల్ని ప్లే చెయ్యడానికి Windows Media Player వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఒకవేళ మీకు VLC ఇష్టం ఉండి ఉంటే ఈ వీడియోలో నేను ప్రాక్టికల్‌గా చూపించినట్లు ఓ చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా  VLCలో కలర్స్ ఎంత పర్‌ఫెక్ట్‌గా వస్తాయో మీరే గమనించవచ్చు. సో వెంటనే మీ VLC Playerలో నేను ఈ వీడియోలో చూపించినట్లు మార్పులు చేసుకోండి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vzivjWhI-Nk

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్ Wi-Fiని ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ చేస్తూ బ్యాటరీ ఇలా ఆదా చేసుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Yzlh5In4tWs

మీ ఇల్లు, ఆఫీస్ దాటికే WiFi ఉండదు.. అలాంటప్పుడు ఫోన్ దగ్గర్లో WiFi నెట్‌వర్క్‌లు ఏం ఉన్నాయా అని వెదుకుతూ ఉంటుంది. దీనివల్ల చాలా బ్యాటరీ వేస్ట్ అయిపోతుంది. అలాగని WiFiని చీటికీ మాటికీ ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవాలన్నా అది పెద్ద చిరాకు.

ఈ నేపధ్యంలో మీరు రెగ్యులర్‌గా కనెక్ట్ అయ్యే WiFi నెట్‌వర్క్‌ పరిధి దాటి ఎక్కడకు బయటకు వెళ్లినా మీరేం కష్టపడాల్సిన పనిలేకుండా WiFi ఆటోమేటిక్‌గా డిసేబుల్ చేయబడాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే సరి.

ఖచ్చితంగా ఈ టెక్నిక్ ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్‌కీ భారీ మొత్తంలో బ్యాటరీ ఆదా చేస్తుంది, చాలా శ్రమ తగ్గిస్తుంది కూడా!

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Yzlh5In4tWs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

19, మార్చి 2014, బుధవారం

రైలు ప్రయాణాల్లో మంచి రెస్టారెంట్ల నుండి ఫుడ్ కావాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gLyf50EKSQ0

దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు ట్రైన్‌లో వచ్చే మీల్స్ చూస్తే విరక్తి పుట్టక తప్పదు. అంత ఘోరంగా ఉంటుంది. ఈ బాధ భరించలేక చాలామంది ఏదో ఒకటి తినడానికి వెంట తీసుకెళుతూ ఉంటారు. దీంతో అదనపు లగేజ్ భారం అవుతుంది.

ఈ బాధలేమీ లేకుండా మీరు జర్నీ చేసే రూట్‌లో ఏ ఊళ్లో కావాలంటే ఆ ఊళ్లో ఉన్న మంచి రెస్టారెంట్ నుండి మీరు కోరుకున్న బిర్యానీలూ, మీల్స్, ఇతర వెరైటీలు వేడివేడిగా మీరు ఆ స్టేషన్ చేరుకునే సమయానికి తెప్పించుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.

కొద్దిగా పేరున్న ఊళ్లల్లో మీకు ఖచ్చితంగా కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది. అమౌంట్ మీరు ఆన్‌లైన్‌లోనే చెల్లించొచ్చు, లేదా మీకు మీ బెర్త్ దగ్గరకు ఫుడ్ తీసుకు వచ్చాకా చెల్లించొచ్చు.

గమనిక:  తరచూ ప్రయాణాలు చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=gLyf50EKSQ0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ పిసిలోని అన్ని సాఫ్ట్‌వేర్ల సీరియల్ నెంబర్లు ఇలా పొందండి Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac

అనుకోకుండా సిస్టమ్ ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా విండోస్ ఇన్‌స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు వరకూ మీ పిసిలో ఉన్న అన్ని రకాల సాఫ్ట్‌వేర్లు తిరిగి పొందాలంటే వాటి సీరియల్ నెంబర్లు మీ దగ్గర క్షేమంగా ఉండాలి కదా?

చాలామంది ఈ విషయం గురించి అస్సలు ఆలోచించరు, తీరా అవసరం వచ్చినప్పుడు బాధపడిపోతుంటారు. ఈ నేపధ్యంలో మన కంప్యూటర్లో ఉన్న అన్ని applications యొక్క సీరియల్ నెంబర్లు ఒకేచోట ఓ రిపోర్ట్‌గా పొందే ఓ అద్భుతమైన మార్గాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరూ ట్రై చేయండి.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=zICEoqXs0Ac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

18, మార్చి 2014, మంగళవారం

మీ ఫోన్‌లో Night Mode సెట్ చేసుకుని కళ్లపై వత్తిడి ఇలా తగ్గించుకోవచ్చు? Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ప్రయాణాల్లో ఉన్నప్పుడో,  ఫ్యామిలీ మెంబర్స్ నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయాల్లో గేమ్స్, బుక్స్ వంటివి ఫోన్‌లో చదువుతుంటేనో వాళ్లకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గానీ దీని ద్వారా బ్రైట్‌నెస్ తగ్గించినా కళ్లపై వత్తిడి పడుతూనే ఉంటుంది, ఇతరులకు లైటింగ్ వస్తుంటుంది కూడా!

దీనికి భిన్నంగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌పై ఓ ఫిల్టర్‌ని అప్లై చేసే ఓ అద్భుతమైన అప్లికేష‌న్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, దీన్ని వాడారంటే గనుక మీ ఫోన్‌ని Night Modeలోకి మార్చుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలగదు, మీ కళ్లూ ఎంతసేపు ఫోన్ వాడినా రాత్రి సమయాల్లో వత్తిడికి గురి కావు. సో ట్రై చేయండి.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=xUCqr7XnoXU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

17, మార్చి 2014, సోమవారం

మీ మెయిల్ అవతలి వారు ఎప్పుడు ఓపెన్ చేశారో ఇలా తెలుసుకోండి.. Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n0NnA4Fx4Oo

ఏదో పని మీద మీ ఫ్రెండ్‌కి మీరు మెయిల్ పంపారనుకుందాం. లేదా ఏదో ఆఫీస్‌కి మీ రెజ్యూమ్ పంపారనుకుందాం. అవతలి వాళ్లు మెయిల్ చదివారా లేదా అన్న డౌట్ మనకు వస్తుంటుంది... అలా డౌట్‌తో ఉండే బదులు క్లారిఫై చేసుకోగలిగితే బాగుంటుంది కదా? అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి..

అవతలి వారు మీరు పంపిన మెయిల్ ఏ క్షణాన ఓపెన్ చేశారన్నది టైమ్‌తో సహా మీరు చూడగలుగుతారు. అలాగే ఆ మెయిల్‌ని వాళ్లు ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసిందీ కూడా మీరు ఇట్టే తెలుసుకోగలుగుతారు. సో ఈ అద్భుతమైన టెక్నిక్ ఫాలో అయిపొండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=n0NnA4Fx4Oo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌లో Applications ఇతరులు ఓపెన్ చేయకుండా ఇలా లాక్ చేసుకోండి? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Whatsapp, Gmail, Messages వంటి ఏ అప్లికేషన్లని మీ అనుమతి లేకుండా ఇతరులు ఓపెన్ చేయకుండా వాటిని passwordతో లాక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

కేవలం అప్లికేషన్లు మాత్రమే కాకుండా ఫోన్‌లోని ప్రతీ ముఖ్యమైన సెట్టింగ్ ఇతరులు మార్చకుండా ఈ పద్ధతి ద్వారా లాక్ చేసుకోవచ్చు.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kg4dCEHhDRE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

16, మార్చి 2014, ఆదివారం

మీకు తెలీకుండా మీ ఫ్రెండ్స్ మీ ఫోన్‌లో ఏమేం చూశారో ఇలా తెలుసుకోండి? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

కొన్నిసార్లు మనం ఫోన్‌ని అలా వదిలేసి పక్కకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మనకు తెలీకుండా మన ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులు మన ఫోన్‌లోని అప్లికేషన్లు, గేమ్స్ ఓపెన్ చేసి చూడొచ్చు.

మనం అభిమానించే వ్యక్తులు అయితే ఫర్లేదు గానీ వేరే ఎవరో మన ఫోన్‌లోని calls, sms, whatsapp మెసేజ్‌ల వంటివి ఓపెన్ చేసి చూస్తే మనస్సుకి కష్టంగా అన్పిస్తుంది కదా...

ఈ నేపధ్యంలో మీరు లేనప్పుడు ఎవరైనా మీ ఫోన్‌లో ఏయే అప్లికేషన్లు, గేమ్‌లూ ఓపెన్ చేశారో ఓ రిపోర్ట్ రూపంలో తెలుసుకునే ఓ అద్భుతమైన అప్లికేషన్‌ని ఈ వీడియోలో పరిచయం చేశాను. ఇది iOS ఆధారిత ఫోన్లు, టాబ్లెట్లలో పనిచేస్తుంది.

గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Ywm_yKzJ3Ac

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ విండోస్‌లో టైమ్ పక్కనే వారం కూడా చూపించబడాలా? Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QVQ8-swG0Ls

కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు తరచూ system tray వైపు చూస్తూ టైమ్ గమనించుకోవడం చాలామందికి అలవాటు.

చాలాసార్లు కేవలం సమయం మాత్రమే కాకుండా ఆరోజు ఏ వారమో కూడా చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా మన భారతీయులకు ఒక్కో వారం ఒక్కో సెంటిమెంటో, మరో లింకో ముడిపడి ఉంటుంది కాబట్టి. కానీ డీఫాల్ట్‌గా system trayలో వారం మాత్రం కన్పించదు కదా!

సో వర్రీ అవ్వాల్సిన పనిలేదు. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవడం ద్వారా ఇకపై మీకు వారం పేరు కూడా ఎల్లప్పుడూ system trayలో కన్పించే విధంగా సెట్ చేసుకోవచ్చు.

గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=QVQ8-swG0Ls

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

15, మార్చి 2014, శనివారం

మెయిల్ ఐడి Validనా కాదా ఇలా ఛెక్ చేయండి? Must Watch & Share

 

మన దగ్గర మన ఫ్రెండ్స్‌వి చాలా మెయిల్ ఐడిలు ఉండొచ్చు, అవి పనిచేస్తుంటాయన్న అపోహలో ఉంటుంటాం, కానీ తీరా ఏదో అర్జెంట్ అవసరం కొద్దీ అవతలి వారికి మెయిల్ చేస్తే అది bounce అయి వస్తుంది.

అలాగని మన దగ్గర ఉన్న ప్రతీ మెయిల్ ఐడినీ ఇలా టెస్ట్  మెయిల్ పంపించి చూడలేం కదా..

ఈ నేపధ్యంలో అసలు మన దగ్గర ఉన్న మెయిల్ ఐడిలు పనిచేస్తున్నాయా లేదా అన్నది వెరిఫై చేసుకోవడానికి ఓ అతి సులభమైన పద్ధతిని ఈ వీడియోలో చూపించాను.

గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu