తెలుసుకుందాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుసుకుందాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2013, బుధవారం

పిసి, మెమరీ కార్డ్, పెన్‌డ్రైవ్‌లో ఫైళ్లు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8

మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs

ఏదో ట్రిప్ కెళ్లి మీరు తీసుకున్న ఫొటోలు memory card నుండి డిలీట్ అయిపోతే ఎంత బాధగా ఉంటుంది?

అలాగే హార్డ్‌డిస్కులోనీ, pen driveలోని ముఖ్యమైన ఫైళ్ల పోయినా అంతే బాధేస్తుంది కదా :(

అలాగని ఫైళ్లు, ఫొటోలూ, వీడియోలూ పోయాయని వర్రీ అవ్వాల్సిన పనిలేదు.

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే పోయిన మీ డేటా తిరిగి వస్తుంది.. చివరకు పార్టీషన్లు పోయినా కూడా డేటా వెనక్కి తెచ్చుకోవచ్చు.

గమనిక:  డేటా నష్టపోయిన  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=eXu_1Ac6Jn8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

24, అక్టోబర్ 2013, గురువారం

అద్భుతమైన ఫొటోలు రావాలంటే ఎలాంటి కెమెరా కొనాలి ? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0

చాలామంది ఎక్కువ మెగాపిక్సెళ్లు ఉంటే చాలు.. దాన్ని గొప్ప కెమెరాగా అనేసుకుంటారూ.. కొనేసుకుంటారూ కూడా

కెమెరాల్లో చాలా రకాలున్నాయి.. కొన్ని కొందరికే సూటబుల్.. జేబులో పట్టేలా ఉంటే చాలని కాంప్రమైజ్ అయితే అద్భుతమైన ఫొటోలు అస్సలు సాధ్యం కావు..

అస్సలు డిజిటల్ కెమెరాల్లో రకాలేంటో ప్రాక్టికల్‌గా చూపిస్తూ.. ఏవి ఎవరికి సూటబుల్ అవుతాయో ఈ వీడియోలో వివరంగా చూపించాను.

గమనిక: డిజిటల్ కెమెరా కొనాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=Wm-bjVO3mJ0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

24, సెప్టెంబర్ 2013, మంగళవారం

మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా.. ప్రాక్టికల్ డెమో Must Watch & Share

 

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా?

అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు.

కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా "రూటింగ్‌"ని పేర్కొనవచ్చు.

ఇప్పటికి అనేక మంది "కంప్యూటర్ ఎరా" మేగజైన్ రీడర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లని రూట్ చేయడం గురించి వీడియో చేయమని అడుగుతూ వచ్చారు..

ఇప్పుడు ఈ వీడియోలో ఏమాత్రం టెక్నికల్ నాలెడ్జ్ లేని వారికి సైతం అర్థమయ్యేలా తెలుగులో మొట్టమొదటిసారిగా ఫోన్లని రూట్ చేయడం ఎలాగో చూపించడం జరిగింది.

తదుపరి వీడియోల్లో root చేసిన ఫోన్‌ని unroot చేయడం ఎలాగో, అలాగే వాటిలో custom ROM వేయడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపిస్తాను.

గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ friendsతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriphoneroot

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

29, నవంబర్ 2008, శనివారం

మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..

ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్‍కి అప్‍లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్‍లో అనేక ఫోటోషేరింగ్ వెబ్‍సైట్లు లభిస్తున్నాయి. flickr అనే సైట్‍ని ఓపెన్ చేయండి. అందులోకి ప్రవేశించగానే Create your account అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి. ఈ వ్యాసం మొదట్లొ చెప్పిన ప్రకారం మీరు ఇప్పటికే యాహూ మెయిల్ అకౌంట్‍ని క్రియేట్ చేసుకున్నారు కదా ! ఆ యాహూ అకౌంట్‍తొ నేరుగా Flickr లో ఉచిత అకౌంట్ సృష్టించుకోవచ్చు. తర్వాత మీ కంఫ్యూటర్లో ఉన్న ఫోటోలను ఆ సైట్‍లోకి అప్‍లోడ్ చేసుకుని Send an invite to Flickr అనే బటన్‍ని ఉపయోగించి మీ ఆత్మీయులకు వారి మెయిల్ అడ్రస్‍కి ఇన్విటేషన్ పంపించవచ్చు. వారు మీ ఫోటోలను Flickr లోకి వచ్చి చూడగలుగుతారు. Flickr మాదిరిగానే Photobucket, Zommr, Phanfare, Snapfish, Webshots, Smugmug, Woophy వంటి అనేక ఫోటొ షేరింగ్ సర్వీసులు లభిస్తున్నాయి.

ఒక ఫార్మేట్‍ నుండి మరో ఫార్మేట్‍కి చాలా ఈజీ

VOB ఫైళ్లని 3GP ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్ వేర్ వాడాలి, MOV to AVI కన్వర్షన్‍కి ఏమి వాడాలి అంటూ అందరికీ సందేహాలు వస్తుంటాయి. మీరు కన్వర్ట్ చేసుకోవలసిన ప్రతీదానికి వేర్వేరు సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చేసుకోవలసిన అవసరం లేకుండా zamzar అనే వెబ్‍సైట్‍లో మీరు ఒక ఫార్మేట్ నుండు మరో ఫార్మేట్‍కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఫైళ్ళని అప్‍లోడ్ చేయాలి. అవి కన్వర్ట్ చేయబడి మన e-మెయిల్ అడ్రస్‍కి పంపబడతాయి. అయితే 100MB ఫైల్ సైజ్ దాటకూడదు. అదే ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని సైతం కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించండి.

చాలా తక్కువ సైజ్ గల వర్డ్ ప్రాసెసర్…


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని Wordpad మాదిరిగా కేవలం 2.59 MB పరిమాణం కలిగి ఉండి Jarte అనే వర్డ్ ప్రాసెసర్ RTF, DOC తో సహా తాజా Word 2007 యొక్క DOCX ఫైళ్ళని సైతం ఓపెన్ చేయగలుగుతుంది. నేరుగా పెన్ డ్రైవ్ నుండే రన్ చేసుకోగలిగే ఈ ప్రోగ్రామ్ శక్తివంతమైన డిక్షనరీతో కూడిన స్పెల్ చెకర్ పొందుపరచబడడంతోపాటు ఈ ప్రోగ్రామ్‌లో రూపొందించుకున్న ఫైళ్ళని HTML, PDF ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవడానికి కూడా వీలుంది. డాక్యుమెంట్లని ఎడిట్ చేసే సమయంలో నచ్చిన విధంగా జూమ్ చేసుకోవచ్చు. టెంప్లేట్లని సపోర్ట్ చేస్తుంది. Firefox, IE మాదిరిగా ఒకేసారి వేర్వేరు టాబ్‌లలొ పలు డాక్యుమెంట్లని ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఓ రకంగా Wordpad కి ఎక్కువ Word కి తక్కువా ఈ ప్రోగ్రామ్!

పేజింగ్ ఫైల్‍ని కూడా డీఫ్రాగ్ చేసుకోవచ్చు…


మనం భారీ మొత్తంలో అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగిస్తున్నప్పుడు అవన్నీ ఫిజికల్ మెమరీ (RAM) లో పట్టకపోయినట్లయితే విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ మీద కొంత ఖాళీ ప్రదేశాన్ని తాత్కాలికంగా RAM మాదిరిగా ఉపయోగించుకుంటుంది. అలా మెమరీ మాదిరిగా ఉపయోగించబడే హార్డ్ డిస్క్ ప్రదేశాన్ని Page File అంటారని మీకు తెలిసే ఉంటుంది.కంప్యూటర్ యొక్క పనితీరు మెరుగుపరుచుకోవాలంటే ఎప్పటికప్పుడు హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమని తెలిసిందే కదా! అయితే సాధారణ పద్ధతుల ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేసేటప్పుడు కేవలం హార్డ్ డిస్క్‌లోని ఫైళ్ళు, ఫోల్డర్లు, బూట్ సెక్టార్ వంటివి మాత్రమే ప్రభావితం చేయబడతాయి. అసలు డీఫ్రాగ్ చేయకపోవడం కన్నా ఇలా విండోస్ లోని సాధారణ Defrag ప్రోగ్రామ్ ద్వారా హార్డ్ డిస్క్‌ని డీఫ్రాగ్ చేయడం ఉత్తమమే అనుకోండి. కానీ NortonUtilities, O&O Defragmenter వంటి కొన్ని శక్తివంతమైన థర్డ్ పార్టీ డీఫ్రాగ్మెంటేషన్ ప్రోగ్రాములను ఉపయోగించి సిస్టమ్‌ని డీఫ్రాగ్ చేసుకోవడం అన్నింటి కన్నా ఉత్తమం.దీని వల్ల కేవలం హార్డ్ డిస్క్‌లోని సాధారణ భాగాలేకాకుండా ఆపరేటింగ్ సిస్టమ్‌చే page file గా ఉపయోగించబడుతున్న భాగం కూడా డీఫ్రాగ్ చేయబడుతుంది.

DivX ఫార్మేట్ అత్యుత్తమైనది

భారీ పరిమాణం గల వీడియో ఫైళ్ళని సైతం సాధ్యమైనంత వరకూ నాణ్యత లోపించకుండా తక్కువ పరిమాణంలోకి కంప్రెస్ చెయ్యడానికి DivX అనే వీడియో కోడెక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. AVI, MPEG, WMV వంటి అన్ని రకాల ఫైల్ ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళని ఈ DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఫైళ్ళని DivX ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయ్యడానికి అనేక సాఫ్ట్‌వేర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా DivX Converter 6.5 వెర్షన్ అన్నింటికన్నా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. MPG, VOB, TS, SVCD ఫైళ్ళని DivX ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ కన్వర్టర్ సాఫ్ట్‌వేర్‌కి అదనంగా MPEG-2/DVD ప్లగ్ ఇన్ కూడా అవసరం అవుతుంది. వేర్వేరు వీడియో ఫైళ్ళని ఒకే DivX ఫైల్‌గా మెర్జ్ చేయడానికి కూడా ఇది పనికొస్తుంది.

పిసి నుండే ఫోన్‍ని నియంత్రించడానికి..

Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer, FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు, Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్ నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్ కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.

2, ఏప్రిల్ 2008, బుధవారం

డ్రైవ్ లను దాచి పెట్టడానికి సులువైన మార్గం


విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం. మీకంప్యూటర్లో Start మెనూలో Run కమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి. వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద DISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది. D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే కమాండ్‍ని టైప్ చేసి , వెంటనే remove letter D అని టైప్ చేయండి. దాంతో డ్రైవ్ లెటర్ తొలగిపోతుంది. మళ్ళీ ఆ డ్రైవ్ రావాలంటే పై క్రమంలోనే కమాండ్లని టైప్ చేసి remove letter D వద్ద assign letter D అనే కమాండ్‍ని ఉపయోగించుకోవలసి ఉంటుంది.

30, మార్చి 2008, ఆదివారం

USB కీచైన్ డ్రైవ్‌లు

ఇప్పుడు చాలామంది జేబుల్లో GB ల కొద్ది మెమరీ తిరుగుతూ ఉంటోంది. ప్రతీ ఒక్కరూ 1, 2,4, 8 GB వంటి వేర్వేరు సామర్ధ్యాల్లోని USB మెమరీ స్టిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లాపీ డిస్క్‌లు, జిప్ డిస్క్‌లు, సిడిలు, డివిడిలు వంటి ఇతర పద్ధతుల కన్నా డేటాని సులభంగా ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కి తీసుకువెళ్ళడానికి ఈ USB మెమరి స్టిక్‌లు అనువుగా ఉంటున్నాయి. ఇతర అన్ని రకాల ఫ్లాష్ మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి రీడ్ చేయాలంటె Card Reader అనే ప్రత్యేకమైన పరికరం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. అయితే USB మెమరీ స్టిక్‌లకు ఈ ఇబ్బంది లేదు.

మన కంప్యూటర్ క్యాబినెట్‌పై ఉండే ఏ USB పోర్ట్ కైనా ఈ మెమరీ స్టిక్‌లను సులభంగా కనెక్ట్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా USB కీచైన్ డ్రైవ్‌ని మన కంప్యూటర్ యొక్క USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే మన హార్డ్ డిస్క్‌లోని వివిధ డ్రైవ్‌లు, సిడిరామ్, డివిడి డ్రైవ్‌లకు అదనంగా ప్రస్తుతం మనం కనెక్ట్ చేసిన USB డ్రైవ్‌కి కూడా ఓ డ్రైవ్ లెటర్ My Computer లో ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతుంది. ఆ డ్రైవ్ లెటర్‌ని క్లిక్ చేయడం ద్వారా ఆ USB మెమరీ స్టిక్‌లో ఉన్న సమాచారాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు. ఈ తరహా మెమరీ స్టిక్‌ల డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ సెకనుకు 1MB ఉంటుంది. హార్డ్ డిస్క్‌లోని ఇతర డ్రైవ్‌లలో మాదిరిగానే ఈ USB మెమరీ స్టిక్‌లను కూడా ఫార్మేట్ చేయవచ్చు. ప్రస్తుతం 20GB వరకు వేర్వేరు స్టోరేజ్ కెపాసిటీ కలిగిన USB కీచైన్ డ్రైవ్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి.

ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి

మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipic అనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం కదా! దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వెబ్‌సైట్ ప్రతీ టాపిక్‌ని ఫోటోలను చూపించడం ద్వారా సులభంగా అర్ధమయ్యేలా నేర్పిస్తోంది. Access, Excel, Publisher, Word, PowerPoint, Impress, Dreamweaver, HTML & CSS, Photoshop Elements, Fireworks, MySQL, PHP Basics, Perl Basic వంటి అనేక సబ్జెక్టులను నేర్పిస్తోంది.

29, మార్చి 2008, శనివారం

Welcome స్క్రీన్ చూపించబడకుండా ఉండాలంటే !


Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి Computer Configuration>Administrative Templates>System>Logon అనే విభాగంలోకి వెళ్ళి కుడిచేతి వైపు Dont display the Getting Started welcome screen at logon అనే ఆప్షన్‌ని మౌస్‌తో డబుల్ క్లిక్ చేసి Enabled గా సెట్ చేయండి. ఇకపై వెల్‌కమ్ స్క్రీన్ చూపించబడదు.

24, మార్చి 2008, సోమవారం

ముచ్చటైన తెలుగు వెబ్ సైట్


మాగంటి అనే వెబ్ సైట్ ని మాగంటి వంశీ మోహన్ అని ప్రవాస భారతీయుడు ప్రారంభించి అందులో సాహిత్యం, సంగీతం, జానపద గీతాలు, శతకాలు, చాటువులు, పిల్లల గీతాలు, స్తోత్రాలు, తెలుగు ప్రశస్తి, వ్యాసాలూ, ఆలయాల సమాచారం, కళలు, మొదలైన ఎన్నో విభాగాలలో అచ్చ తెలుగులో చక్కని ఉపయోగకరమైన సమాచారం మనకు అందిస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత అభిలాషతో లాభాపేక్ష లేకుండా నడుపుతున్న వెబ్ సైట్ ఇది.

23, మార్చి 2008, ఆదివారం

విండోస్ XP టిప్స్….


Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏవైనా కొత్త సాఫ్ట్ వేర్లని సరిగ్గా పని చెస్తాయో లేదో తెలియని డివైజ్ డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకునే ముందు Accessories>System Tools ప్రోగ్రామ్ ఫోల్డర్‌లో ఉండే System Restore అనే ఆప్షన్‌ని ఉపయోగించి ఒక Restore Point ని క్రియేట్ చేసుకోవడం మంచిది.

మీవద్ద Bootable WinXP సిడి లేదా? అయితే మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో లభించే ఓ టూల్‌ని ఉపయోగించి XP బూటబుల్ ఫ్లాపీలను క్రియేట్ చేసుకోవచ్చు. XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్న సమయంలో Setup ముందుకు సాగకుండా ఫ్రీజ్ అయిపోయినట్లయితే మీ సిస్టమ్‌లో PCI స్లాట్లపై అమర్చబడి ఉన్న మోడెమ్, టివి ట్యూనర్ కార్డ్, నెట్‌వర్క్ అడాప్టర్ వంటి కార్డులను తొలగించి Setup రన్ చేసి చూడండి. ఇన్‌స్టలేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆ కార్డ్ లను తిరిగి అమర్చుకుని ఫ్రెష్‌గా వాటి డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.


Windows XP Professional తో పాటు డీఫాల్ట్ గా Backup యుటిలిటీ ఇన్‌స్టాల్ అయిపోతుంది. అయితే XP Home ఎడిషన్ యూజర్లు మాత్రం Windows Backup టూల్ కావాలనుకుంటే.. XP ఇన్‌స్టలేషన్ సిడిలో valudeadd\msft\ntbackup\ntbackup.msiఅనే ఫైల్‌ని వెదికిపట్టుకుని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్యాకప్ యుటిలిటీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడుతుంది. XP ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైళ్ళు, సెట్టింగులను యధాతధంగా Win98, Me వంటి పూర్వపు వెర్షన్లకు గానీ, లేదా 2003. Server వంటి తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్‌కి గానీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

దీనికి గాను..Start.Programs>Accessories>System Tools విభాగంలో ఉండే Files and Settings Transfer Wizard అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో ఏ ప్రదేశంలో ఈ సెట్టింగులు సేవ్ చేయబడాలన్నది స్పెసిఫై చేయవలసి ఉంటుంది.

ఏదైనా మీ సిస్టంలో ఉన్న ఫోల్డర్‌ని నెట్‌వర్క్ లో ఇతర యూజర్లు కూడా వినియోగించుకునే విధంగా షేర్ చెయ్యదలుచుకుంటే, ఆ ఫోల్డర్‌పై మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి Properties Sharing విభాగాన్ని ఎంచుకోండి. అందులో Share this folder on the network అనే ఆప్షన్‌ని టిక్ చేస్తే సరిపోతుంది.

డీఫాల్ట్ గా విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే Internet Connection Firewal (ICF) ని ఎనేబుల్ చెయ్యదలుచుకుంటే.. Control Panel లో Network Connections అనే విభాగంలో మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకుని అందులో Advanced అనే విభాగంలోకి వెళ్ళండి. అక్కడ Protect my computer and network by limiting preventing access to this computer from the internet అనే చెక్ బాక్స్ టిక్ చేయండి.


ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్ కనెక్షన్లు మీ సిస్టంలో ఉన్నట్లయితే ప్రతీ కనెక్షన్‌కూ వేర్వేరుగా ' ఫైర్‌వాల్ ' ని ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ నెట్ కనెక్షన్ నాలుగైదు సిస్టంలకు షేర్ చెయ్యబడి ఉన్నట్లయితే సర్వర్‌గా వ్యవహరిస్తూ నేరుగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి ఉన్న సిస్టంలో మాత్రమే ఫైర్‌వాల్‌ని ఎనేబుల్ చేయండి.

మీ నెట్ వర్క్ కనెక్షన్ గురించి వివరంగా రిపోర్ట్ కావాలనుకుంటే Programs.Accessories>System Tools>System Information డైలాగ్ బాక్స్‌లో మళ్ళీ Tools>Net Diagnostics అనే విభాగంలోకి వెళ్ళి.. Scan అనే బటన్‌ని క్లిక్ చెయ్యండి. దీనితో మీ విండోస్ ఇన్‌స్టలేషన్‌కి సంబంధించి, నెట్‌వర్క్ కనెక్షన్ యొక్క వివరాలు లభిస్తాయి.

Welcome స్క్రీన్‌లో కనిపించే ఇమేజ్‌ని మార్చదలుచుకుంటే... Control Panel>User Account లో మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని అందులో Change my Picture అనే బటన్‌ని క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్‌నైతే సెట్ చెయ్యదలుచుకున్నారో దాన్ని స్పెసిఫై చేయండి.

ఏదైనా ప్రోగ్రామ్ యొక్క షార్ట్‌కట్ Start మెనూలో అన్నింటికన్నా పై భాగాన కనిపించే విధంగా సెట్ చెయ్యదలుచుకుంటే Start మెనూ నుండి ఆ ప్రోగ్రామ్ షార్ట్ కట్‌పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Pin to Start Menu అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది.


మీ Recent Documents ఫోల్డర్‌లో ఏయే అంశాలున్నాయో చూడాలనుకుంటే Start>Run కమాండ్ బాక్స్ లో %UserProfile%Recent అని టైప్ చేయండి. సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగులు వేటినైనా మోడిఫై చెయ్యదలుచుకున్నట్లయితే...Administratorగా లాగిన్ అయి చేయవలసి ఉంటుంది.

ఒక యూజర్ ఫోఫైల్‌ని కాపీ చెయ్యదలుచుకుంటే.. Control Panel/System/Advanced అనే విభాగంలోకి వెళ్ళి User Profiles>Settings అనే ఆప్షన్ ఎంచుకుని ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకుని Copy to ఎంచుకోవాలి.

22, మార్చి 2008, శనివారం

లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే...


రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ ‍టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.


21, మార్చి 2008, శుక్రవారం

ఫోటో బకెట్


మీ డిజిటల్ కెమేరా ద్వారా తీసుకున్న ఫోటోలను అప్ లోడ్ చేసుకోవడానికి ఎన్నో ఇమేజ్ హోస్టింగ్ సర్వీసులు ఉన్నప్పటికీ http://photobucket.com/about అనే సర్వీసు ఎంతోకాలంగా చక్కని సర్వీసును అందిస్తోంది. ఈ వెబ్ సైట్ లోకి ఫోటోలను, వీడియొలను అప్ లోడ్ చేసుకోవడమే కాకుండా మీ ఫోటోల ఆధారంగా ఉచితంగా ఆకర్షణీయమైన ఆల్బం లను రూపొందించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే విధంగా స్లైడ్ షోల రూపంలో పొండుపరుచుకోవచ్చు. వీడియోలు, మ్యూజిక్ ఫైల్లని సైతం స్లైడ్ షోలో పొందుపరుచుకునే అవకాశం లభిస్తోంది. ఫోటో బకెట్ ద్వారా హోస్ట్ చేసుకున్న మీ మీడియా ఫైల్లని మెయిల్, యాహూ మెసెంజర్ వంటి ఇన్ స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు, సెల్ ఫోన్ల ద్వారా మీ స్నేహితులతో పంచుకుని వారి యొక్క స్పందనను కూడా పొందవచ్చు.

19, మార్చి 2008, బుధవారం

ఫైర్‍ఫాక్స్ కీబోర్డ్ షార్ట్ కట్‍లు


ఫైర్ ఫాక్స్ కొన్ని విషయాల్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కన్నా వెనుకబడి ఉంది. యూనికోడ్ తెలుగు డిస్‍ప్లే అవాలంటే "పద్మ" వంటి ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లను ఇన్ ‍స్టాల్ చేసుకోవాలి. ఐతే IE లో ఉన్న సెక్యూరిటీ లోపాల గురించి, వాటి తీవ్రత గురించి చాలామందికి తెలియదు. మైక్రోసాఫ్ట్ నిపుణులు నిరంతరం ఆయా లోపాలను సరిచేయడానికే పని చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఫైర్ ఫాక్స్ చాలా ఉత్తమమైనదే , IE కన్నా!. IE లో మాదిరిగానే Firefox లోనూ కీబోర్డ్ షార్డ్ కట్‍లను ఉపయోగించి పలు పనులను చేసుకోవచ్చు. Ctrl + T అనే కీబోర్డ్ షార్ట్ కట్ ఉపయోగిస్తే ఒక ఖాళీ టాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావలసిన వెబ్‍సైట్‍ని ఓపెన్ చేసుకోవచ్చు.

Ctrl + R షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్‍లోని వెబ్‍సైట్ రిఫ్రెష్ చేయబడుతుంది. Alt + Home ద్వారా హోమ్ పేజికి, Ctrl + Tab షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్ నుండి తర్వాతి టాబ్‍కి, Ctrl + Shift + Tab ద్వారా ముందరి టాబ్‍కి, Esc కీని ప్రెస్ చేయడం ద్వారా లోడ్ అవుతున్న పేజిని నిలుపుదల చేయడానికి, Ctrl + Shift +T ద్వారా క్లోజ్ చేసిన టాబ్‍ని తిరిగి పొందడానికి వీలవుతుంది.

15, మార్చి 2008, శనివారం

అన్ని ఫైలు షేరింగ్ నెట్ వర్క్ లను వెదకడానికి


ఇంటర్నెట్‌పై రేపిడ్ షేర్, మెగా అప్‌లోడ్, టోరెంట్స్ వంటి వివిధ రూపాల్లో మన కంప్యూటర్లో ఉన్న ఫైళ్ళని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలోని లక్షలాది మంది కూడా ఇలా తమ వద్ద ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులతో ఆయా ఫైల్ షేరింగ్ నెట్‌వర్క్ ల ద్వారా షేర్ చెసుకుంటుంటారు కదా! ఈ నేపధ్యంలో మీకు ఏదైనా ఇంగ్లీష్ సినిమా కావాలనుకోండి. దానిని ఎవరైనా ఏ ఫైల్ షేరింగ్ సర్వీసులో అయినా అప్‌లోడ్ చేసి ఉంటే సింపుల్‌గా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కదా, అయితే మీకు కావలసిన ఆ ఫైల్ ఏ లింక్ రూపంలో ఉందో వెదికి పట్టుకోవడం మామూలుగా అయితే మీ వల్ల కాదు. దీనికి గాను sharingengines అనే వెబ్‌సైట్ యొక్క సాయం తీసుకోండి. ఇది Rapidshare, Bandango, Filefront, Sendspace, Multiply,Megashare, Megaupload, Turboupload వంటి అనేక రకాల ఫైల్ షేరింగ్ సర్వీసులతో పాటు టొరెంట్ ఫైళ్ళ వివరాలను సైతం వెదికి పెడుతుంది. Search బాక్స్ లో కీవర్డ్ ని టైప్ చేసి వేటిలో వెదకాలో ఆ అంశాలను టిక్ చేసుకుంటే సరిపోటుంది.

14, మార్చి 2008, శుక్రవారం

చదివిన తర్వాత మెసెజ్ కనిపించకుండా చెయలా?




మనం క్లయింట్లకు పంపించే మెయిల్ మెసేజ్‌లు ఒకసారి వారు చదివిన తర్వాత రెండవసారి చదవడానికి వీల్లేకుండా చెయవచ్చు. Gmail,Yahoo, Rediff వంటి మెయిల్ సర్వర్లలో నేరుగా ఇలా ఎక్స్ పైర్ అయిపోయే మెసేజ్‌లను పంపించడానికి అవకాశం లేదు. అయితే దీనికి దొడ్డిదారి ఉంది. సహజంగా ఒకసారి ఎవరైనా చూసిన తర్వాత ఇకపై ఆ పేజి కనిపించని విధంగా HTML పేజీలను రూపొంచించే మార్గముంది. ఈ టెక్నిక్‌ని ఆసరాగా చేసుకుని Kicknotes వంటి వెబ్ సైట్లో మనం టైప్ చేసే మెసేజ్‌ని, మనం పేర్కొన్న విధంగా ఎక్స్ పైర్ అయ్యే HTML లింక్‌గా మార్పిడి చేసి ఎవరికైతే మెయిల్ చేయదలుచుకున్నామో వారికి చేరవేయగలుగుతాయి.దాంతో మన మెసేజ్ అవతలి వారికి ఒక లింక్ రూపంలో పంపించడుతుంది. అయితే వారు ఆ లింక్‌ని మొదటిసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే అందులో మనం పంపిన మెసేజ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే .. మెసెజ్ తొలగించబడింది అని మొండి చేయి చూపిస్తుంది.