6, డిసెంబర్ 2007, గురువారం

ఫైర్‌ఫాక్స్ లో తెలుగు అక్షరాలు కనిపించడం లేదా?కొన్ని తెలుగు వెబ్ సైట్లని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు పై చిత్రంలో విధంగా అక్షరాలు గజిబిజిగా కనిపిస్తుంటాయి.ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్‌ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్‌పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్‌ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Thanks for the info

శ్రీ చెప్పారు...

అమ్మయ్య...మంచి కిటుకు చెప్పి కాపాడారు!

mvs చెప్పారు...

ఆంధ్రభారతి website లో Padma
పని చేయదం లేదు . కిటుకు ఏదైనా
తెలిస్తే చెప్పండి . Thanks .

Unknown చెప్పారు...

ఎంవిఎస్ గారూ..
ఆంధ్రభారతి యూనీకోడ్ కాక డైనమిక్ ఫాంట్ (ప్రొప్రయిటరీ)ని వాడుతున్నట్లు గమనించాను. ఇలాంటి సైట్లని సందర్శించినప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ ప్రోగ్రాంలో bitstream font downloader అనే ప్రోగ్రామ్ ద్వారా ఆ డైనమిక్ ఫాంట్ ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అయి అక్షరాలు సక్రమంగానే కనిపిస్తాయి. ఫైర్ ఫాక్స్ లో ఎందుకు డౌన్ లోడ్ కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. దీనిపై అవగాహన ఉన్న పెద్దలు ఎవరైనా ఈ సందేహాన్ని క్లారిఫై చేస్తారని ఆశిద్దాం.

- నల్లమోతు శ్రీధర్

Unknown చెప్పారు...

ఫైరుఫాక్స్ అలాంటి డైనమిక్ ఫాంట్సును (*.eot) సపోర్టు చెయ్యదు. అందుకే అలాంటి సైట్లు కేవలం ఐ.ఈలోనే చూసే అవకాశముంది.

mvs చెప్పారు...

నాగార్జున వెన్న గారు ఆంధ్ర భారతి సైటుని కూడా చేర్చారని చూసాను .
( http://padma.mozdev.org/ )

అందుకనే మరేదైనా కిటుకు ఉన్నదేమో అని సందేహం .

sivamani చెప్పారు...

Firefox3 versionlo Padma panicheyadamu ledu.Mee samadanmu koraku.