26, డిసెంబర్ 2007, బుధవారం

పాత వెర్షన్ సాఫ్ట్ వేర్లు దొరికే ప్రదేశం ఇదిగోండి2000వ సంవత్సరంలో టివి ట్యూనర్ కార్డ్ కొన్నప్పుడు అందరూ పిసిలో టివి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు. అప్పట్లో టివిలో ప్రసారం అయ్యే ప్రోగ్రాములను ఎలాగైనా రికార్డ్ చేసుకోవాలని మహా కోరికగా ఉండేది. కార్డ్ తోపాటు ఇచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆ వెసులుబాటు ఉన్నా భారీ సైజ్ గల AVI ఫైళ్లుగా సేవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఎలాగైనా తక్కువ సైజ్ తీసుకునే MPEG ఫార్మేట్ లోకి రికార్డ్ చేసుకునే మార్గం దొరకకపోతుందా అని అన్వేషించడం ప్రారంభించాను. ఆ అన్వేషణలో WinVCR అనే సాఫ్ట్ వేర్ నన్నెంతో ఆకర్షించింది. ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ తయారీ కంపెనీ దుకాణం మూసేసుకున్నా ఇప్పటికీ ఆ సాఫ్ట్ వేర్ పేరు తలుచుకుంటే ఎంతో హాపీ అనిపిస్తుంది. ఇదంతా ఎందకు చెప్పుకుంటూ వస్తున్నానంటే... సంవత్సరాల తరబడి పిసిలను వాడిన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సాఫ్ట్ వేర్, ఏదో ఒక వెర్షన్ పై మోజు పెంచుకుంటారు. అలా మీరూ ఏదైనా పాత సాఫ్ట్ వేర్ ని లైక్ చేసినట్లయితే http://www.old-versions.net/ అనే వెబ్ సైట్లోకి వెళ్లి మీరు అప్పట్లో మెచ్చిన సాఫ్ట్ వేర్ ని వెదికి పట్టుకుని తిరిగి తనివితీరా మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కేవలం పాత వెర్షన్ సాఫ్ట్ వేర్ల కోసం ఉద్దేశించబడిన చక్కని సైట్ ఇది.

కామెంట్‌లు లేవు: