12, డిసెంబర్ 2007, బుధవారం

కంఫ్యూటర్ ఎరా స్పెషల్ - 8


సెల్ ఫోన్ చిట్కాలు


ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళారు.. అక్కడ కంప్యూటర్ అనేదే అందుబాటులో లేదు. మీ వర్డ్ ఫైళ్ళని అర్జెంటుగా చదవవలసి వచ్చింది.. ఏం చేస్తారు? కంప్యూటర్ ఎటూ అందుబాటులో లేదు కదా అని ఊరకుండిపోతారు. కానీ మీ వద్ద ఉన్న అత్యాధునికమైన నోకియా 6600, N72, N75, Sony Erricson P910i వంటి ఫోన్లు మీ అవసరాలను చిటికెలో తీర్చగలుగుతాయి. ఇలాంటి PDA ఫోన్ల ఆవిర్భావంతో. కంప్యూటర్‌కీ సెల్‌ఫోన్‌కీ మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కొద్దిగా ఖరీదు ఎక్కవగా ఉండే ప్రతీ అత్యాధునిక ఫోనూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంటున్నాయి. మనం కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలాగైతే వివిధ సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసుకుని వేర్వేరు పనుల్ని చక్కదిద్దుకోగలుగుతున్నామో అదే విధంగా సెల్‌ఫోన్లలోనూ వేర్వేరు అవసరాలకు వేర్వేరు సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎంచక్కా వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాటి ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం పొందినప్పుడే మీ శక్తివంతమైన ఫోన్‌కి అర్ధం, పరమార్ధం లభిస్తాయి. అయితే చాలామంది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లో అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా ఏమాత్రం ఆవగాహన లేకుండా ఉంటున్నారు. దాంతో శక్తివంతమైన ఫోన్లు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అలాగే బ్లూటూత్ ద్వారా వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి ఏదో వాల్‌పేపర్ ట్రాన్స్‌ఫర్ చేసుకోగానే మీ ఫోన్‌లోకి వైరస్ వచ్చి కూర్చుంటుంది. దాంతో ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటారు. ఫోన్లకి సైతం ఏంటీవైరస్ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయని తెలిసినవారు చాలా తక్కువమందే ఉన్నారు . సెల్‌ఫోన్ యూజర్లకి పనికొచ్చే చిట్కాలను అందించడానికి మేము ప్రత్యేకంగా ప్రచురిస్తున్న ఈ పుస్తకంలో వివిధ రకాల సెల్‌ఫోన్ మోడళ్ళు, వాటిలో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల వివరాలు, ఆయా సెల్‌ఫోన్ల వినియోగంలో ఎంతో ఉపయుక్తంగా ఉండే చిట్కాలు, అన్‌లాక్ కోడ్‌లు, ఫోన్ రివ్యూలు, ఆసక్తికరమైన సాఫ్ట్‌వేర్లు, ఫోన్ రేడియేషన్, మీ ఫోన్‌ని ఇతరులు దొంగిలించకుండా ఏం చేయాలి. ఇలా అనేక అంశాల గురించి చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. తెలుగులో ఈ తరహా పుస్తకం ప్రచురించబడడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకంలో చర్చించిన పలు చిట్కాలను ప్రాక్టికల్‌గా పాటించి మీ ఫోన్ ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందండి.

కామెంట్‌లు లేవు: