28, డిసెంబర్ 2007, శుక్రవారం

ఫోటో సిడిలను తయారుచెయ్యడం ఇలా...



హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్న ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే చెయ్యబడే ఒక సినిమా మాదిరిగా (మూవీ క్లిప్‌గా) సిడిపై రికార్డ్ చేసుకోవడానికి Roxio Easy CD Creator, Win on CD వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్లలో PhotoCD అనే ఆప్షన్ పొందుపరచబడింది. ఈ ఆప్షన్‌ని ఉపయోగించి మనం క్రియేట్ చేస్తున్న సిడికి ఒక ఆల్బం పేరుని ఇచ్చి అందులో పొందుపరచవలసిన ఫోటోల లోకేషన్‌ని స్పెసిపై చేస్తే అవన్నీ ఒక వీడియో ఫైల్‌గా కన్వర్ట్ చెయ్యబడి సిడిలోకి రికార్డ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫోటో సిడిగా రూపొందించుకోవాలనుకున్న్ ఐమేజ్‌లకు రకరకాల Transition ఎఫెక్టులు ఇచ్చి చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చెయ్యాలంటే Photo2VCD అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఫోటోలను ఇన్‌పుట్‌గా ఇస్తే వాటిని VCD ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చెయ్యడానికి ఈ సాఫ్ట్ వేర్ ఎక్కువ సమయం తీసుకుంటూంది.

కామెంట్‌లు లేవు: