12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 4


కంప్యూటర్ సందేహాలు

తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అంతవరకు మనకు తెలియని ప్రతీ అంశమూ ఒక సందేహమే ! మన సందేహాలను తీర్చాలంటే వాటిపై ఆవగాహన కలిగిన నిపుణులు ఉండాలి. అయితే అన్ని సందర్భాల్లో వారు అందుబాటులో ఉండరు. అలాగని కనపడిన వారినల్లా అడుగుతూ పోయామంటే మన సందేహాలకు అసంబద్ధమైన సమాధానాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో యూనికోడ్‌తో డిజైన్ చేయబడిన వెబ్‌సైట్లు తమ కంప్యూటర్లో ఓపెన్ కావడం లేదని ఒక పాఠకుడు అడిగిన ప్రశ్నకు పాపం ఆ ప్రశ్నలు జవాబులు శీర్షికను నిర్వహిస్తున్న మహానుభావుడు ఆ సైట్‌లో ఏ ఫాంట్‌నైతే వాడారో ఆ ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్లుగా సలహా ఇచ్చాడు. వాస్తవానికి ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో Encoding అనే విభాగంలో Unicode UTF-8 అని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా వివిధ సమస్యలపై, సందేహాలపై ఏమాత్రం ఆవగాహన లేనివారు ఇచ్చే సలహాలు సరైన పరిష్కారాలు అందించలేవు. ముఖ్యంగా పిసి యూజర్లకి నిపుణుల సలహాలు చాలా అవసరం. రీరైటబుల్ సిడిలు ఎరేజ్ అవడం లేదని కొందరు అడుగుతుంటారు. సిస్టమ్‌లో ఉన్న డూప్లికేట్ ఇమేజ్‌లను, అశ్లీలమైన ఇమేజ్‌లను గుర్తించడం వీలుపడుతుందా అని ఒకరు, మూవీ ప్లే అవుతుండగా స్క్రీన్ షాట్ తీయలేమా అని కొందరు, హార్డ్‌డిస్క్‌లో బేడ్ సెక్టార్లని తొలగించలేమా అని మరికొందరు.. ఇలా ప్రతీ పిసి యూజర్ ఎన్నో సందేహాల చిట్టాని ఎల్లప్పుడూ బుర్రలో మోస్తుంటాడు. అతనికి తగిన పరిష్కారాలు లభిస్తే ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతాడు. అందుకే పిసి యూజర్ల సందేహాలకు చక్కని పరిష్కరాలు, సమాధానాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇందులో పిసిపై పెద్దగా ఆవగాహన లేనివారిని వేధించే ప్రాధమిక స్థాయి సందేహాలతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అనిపించే అనేక రకాల సమస్యలనూ, కంప్యూటర్‌పై పూర్తిస్థాయి ఆవగాహాన కలిపించే సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివారంటే మీకు తరచుగా తలెత్తే ఎన్నో సందేహాలకు చిక్కు ముడులు వీడినట్లే ! పాఠకులకు తలెత్తే సందేహాలకు చాలా విశ్లేషాత్మకంగా సమాధానాలు ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రస్తావించిన ప్రతీ సందేహమూ.. సమాధానమూ నూటికి నూరుశాతం వాస్తవిక దృక్పధంతో ఉంటుంది కాబట్టి ప్రతీ పిసి యూజర్ దీనిని ప్రామాణికంగా స్వీకరించవచ్చు.

కామెంట్‌లు లేవు: