28, డిసెంబర్ 2007, శుక్రవారం

ఆడియో క్యాసెట్లలోని పాటలు ఆడియోసిడిగా...


మీవద్ద ఆణిముత్యాల్లాంటి పాత పాటల కలెక్షన్ ఉందనుకుందాం. క్యాసెట్లలో ఉన్న ఆ పాటలన్నింటినీ డిజిటల్ ఫార్మేట్‌లోకి మార్చుకుని సిడిల్లోకి ఎక్కించుకునే మార్గాలనేకం ఉన్నాయి. సింపుల్‌గా క్యాసెట్లను స్టీరియో లేదా టేప్ రికార్డర్‌లో ఉంచి, ఆ స్టీరియోని కంప్యూటర్ యొక్క సౌండ్ కార్డ్ కి కనెక్ట్ చేసి Jet Audio, Total Recorder వంటి సాఫ్ట్ వేర్లలొ టేప్‌రికార్డర్/స్టీరియోలో ప్లే అయ్యే పాటలను WAV లేదా MP3 ఫార్మేట్‌లో రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాసెట్లలోని పాటలన్నీ మీ హార్డ్ డిస్క్ లోకి వచ్చేశాయి. వాటిని Nero, NTI CD Maker, WinonCD, Prassi వంటి ఆడియో సిడి ఆప్షన్‌ని అందించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి ఖాళీ సిడిల్లోకి డిజిటల్ ఫార్మేట్‌లోకి రికార్డ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సాఫ్ట్ వేర్లు WAV, MP3< WMA, వంటి విభిన్న ఆడియో ఫార్మేట్లకు చెందిన ఆడియో ఫైళ్ళని ఇన్‌పుట్‌గా తీసుకుని మామూలు ఆడియో సిడి ప్లేయర్లు ప్లే చెయ్యగల CD-DA ఫార్మేట్‌లోకి వాటిని రికార్డ్ చెయ్యగలుగుతాయి.

కామెంట్‌లు లేవు: