8, డిసెంబర్ 2007, శనివారం

శక్తివంతమైన బూటబుల్ సిడి డౌన్‌లోడ్


సహజంగా బూటబుల్ సిడిని క్రియేట్ చేసుకోవలసి వస్తే అధికశాతంమంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని Create Boot Disk వంటి ఆప్షన్‌ని ఉపయోగించి క్రియేట్ చేసుకుంటుంటారు. అదికూడా Win 9x వరకే పరిమితం. XP వంటి వాటిలో సిస్టమ్ ని సిడి నుండి బూట్ చేయడానికి సెటప్ డిస్క్ తప్పనిసరిగా కావలసి వస్తుంది. Win 9xలో ఇలా క్రియేట్ చేసుకున్న బూటబుల్ సిడితో కేవలం కమాండ్ ప్రామ్ట్ వరకు మాత్రమే చేరుకోగలం. కంప్యూటర్‌ని ట్రబుల్ షూట్ చేయడానికి ఏవైనా థర్డ్ పార్టీ టూల్స్ ని రన్ చేయవలసి వస్తే వాటిని మళ్ళీ వేరే సిడి నుండి ఎగ్జిక్యూట్ చేసుకోవలసి వస్తుంది (కొందరు బూట్ సిడిలోనే వాటిని కలిపి రైట్ చేసుకుంటున్నారనుకోండి) అయితే ఈ ఇబ్బందులేమీ లేకుండా Ultimate Boot CD పేరిట ఓ సిడి డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తుంది. దీనిని ఎవరైనా పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్, మదర్‌బోర్డ్, హార్డ్ డిస్క్, మెమరీలను ట్రబుల్‌షూట్ చెయ్యడానికి ఉపకరించే అనేక రకాల డయాగ్నస్టిక్ టూల్స్ లబిస్తున్నాయి. ఇందులో CPU burn-in, Mersenne Prime Test, Stress CPU, Memtest86, WIndows Memory Diagnostic, Parallel port detection and test utilities, Intel processor identification utility వంటి అనేక డయాగ్నస్టిక్, ట్రబుల్ షూటింగ్ టూల్స్ సిడిలోనే అంతర్గతంగా పొందుపరచబడి ఉన్నాయి.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారు చాలా బాగుంది ఈ CD. ఎంతో ఉపయుక్తమైన సాంకేతిక విషయాలు అందిస్తున్న మీకు ఎన్న కృతజ్ఞతలు