24, డిసెంబర్ 2007, సోమవారం

USB మెమరీ కార్డ్‌లు ఎలా పనిచేస్తాయి?
కంప్యూటర్లో అమర్చే 2GB హార్డ్ డిస్క్ లోని సమాచారం చిన్ని పట్టీలాంటి USB మెమరీ స్టిక్‌లో ఎలా పడుతుందో తెలుసా..USB మెమరీ కార్డ్ లలొ ప్రధానంగా ఫ్లాష్ మెమరీని వాడుతుంటారు. దానికి రెండువైపులా రెండు చిప్‌లు దీనికోసం కేటాయించబడి ఉంటాయి. అలాగే కార్డ్ యొక్క ప్రొసెసర్‌గా పిలవబడే ASIC (Application Specific Integrated Circuit) 50 MHz Strong ARM 7 RISC Processor ని కలిగి ఉంటుంది. ఇకపోతే "క్రిస్టల్ ఆస్కిలేటర్" ప్రొసెసర్‌కి కావలసిన క్లాక్ సిగ్నల్‌ని ఉత్పత్తి చేస్తుంది. సర్క్యూట్ బోర్డుపై ఉండే అన్ని విడిభాగాలూ ఈ క్లాక్ స్పీడ్‌కి తగ్గట్టుగా సింక్రనైజ్ అవుతాయి. ఇక మెమరీ కార్డ్ లోని అంతర్గత భాగాలకు రక్షణగా మందమైన కేసింగ్ పైన అమర్చబడుతుంది. మెమరీ కార్డ్ నుండి డేటా రీడ్/రైట్ చేయబడేటప్పుడు LED వెలుగుతుంటుంది.

కామెంట్‌లు లేవు: