1, అక్టోబర్ 2007, సోమవారం

ఫైళ్లు డిలీట్ అవడం లేదా?


ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ నుండి అనేక వైరస్ లు, స్ఫైవేర్లు, డయలర్ ప్రోగ్రాములు, బ్రౌజర్ హైజాకర్లు మన సిస్టంలోకి ప్రవేశించి మనకు తెలియకుండానే కొన్ని ఫైళ్లని Windows\System32 వంటి కీలకమైన ఫోల్డర్లలో దాచిపెడుతున్నాయి. సహజంగా ఆయా సిస్టం ఫోల్డర్లలో ఆపరేటింగ్ సిస్టంకి అతి ముఖ్యమైన ఫైళ్లు భధ్రపరచబడి ఉండడం వల్ల ఎవరూ ఆ ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేయడానికి సాహసించరు అని వైరస్ రూపకర్తల అభిప్రాయం. అయితే కొండొకచో ఎవరైనా ఫలానా ఫోల్డర్లో ఉన్న ఫలానా ఫైల్ వైరస్ కి సంబంధించినది అని తెలుసుకోగలిగినా తీరా ఆ ఫైల్ ని డిలీట్ చేయడానికి ప్రయత్నించినా Cannot delete file: It is being used by another person or program అని మెసేజ్ చూపించబడి డిలీట్ అవకుండా మొరాయిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో http://ccollomb.free.fr/unlocker/unlocker1.8.5.exe అనే వెబ్ పేజీలో లభించే Unlocker అనే ప్రోగ్రాం ఏ ఫైల్ అయితే డిలీట్ అవకుండా వేధిస్తోందో దానికి రక్షణగా నిలుస్తున్న ప్రాసెస్ లను గుర్తించి ఆ ఫైల్ ని డిలీట్ చేయగలిగేలా మార్గం సుగమం చేస్తుంది.

4 కామెంట్‌లు:

, చెప్పారు...

శ్రీధర్ గారు! నమస్తే. మీకు ఎప్పటినిండో రాయాలని వుంది. ఇన్నాల్టికి కుదిరింది.మీ క.ఎరా రాకముందు నేను ఇతర ఇంగ్లీష్ పత్రికలపై ఆధారపడేవాన్ని. వందలు పెట్టి కొన్నా 70% ఆడ్స్ తో నాకు అసలు నాకు ఉపయోగపడేది కాదు. పది రూపాయలు పెట్టి కొనే మీ కం.ఎరా ఒక విజ్ఙాన ఖనిలా, ఎన్సైక్లోపీడియా లా నాకు (ఆ రోజుల్లో నేను ఎక్కడో చింతపల్లి అడవుల్లో ఉద్యోగ రీత్యా వుండేవాన్ని) ప్రపంచం కంప్యూటర్ రంగంలో ఎంత పురోగమిస్తుందో నేను ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండేవాన్ని. వృత్తిరీత్యా ఇంజనీర్ నవటం వల్ల నాకు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ విషయంలో అప్ డేట్ కావలసిన అవసరం ఎంతైనా వుండేది. ఆ లోటు మీ పత్రిక తీర్చింది (బహుశా అది మీరు ఎడిటర్ గా వుండటం వల్లనే సాధ్యం అయ్యిందని అంటే అది అతిశయోక్తి అసలు కానే కాదు) . ఇంకా మిమ్మల్ని పొగిడితే ముఖస్తుతి అనిపించుకుంటుదేమోనని అందరికీ ఎంతో బాగా తెలిసిన మిమ్మల్ని గురించి నేను మాట్లాడనఖ్ఖర్లేదు. (ముఖ్యంగా మీ ఆత్మ కథ వచ్చింతర్వాత).ప్రతీదాన్నీ కమర్షియలైజ్ చేసే ఈ రోజుల్లో మీరు ఎంతో విలువైన సమయాన్ని భారీగా ఖర్చుపెడుతున్నారు రిటర్న్స్ కోసం చూసుకోకుండా. తల్చుకుంటే( మీ ప్రవ్రుత్తి ప్రస్తుతం నాకు తెలీదు కాని) ఒక బడా కార్పొరెట్ సంస్థకి కన్సల్టెంట్ గా వుండగలరు. మీ పత్రికలో టిప్స్ కాని , ఆర్టికల్స్ గాని ఎంతో విలువైనవి.అవి ఎన్నొసార్లు మా సమయాన్ని మా సిస్టంస్ ని కాపాడాయి. అందరూ కొత్త సాఫ్ట్ వేర్స్ ని ట్రై చేయటానికి గూగిల్ని వాడితే నేను మీ పత్రికని వాడతాను.అసలు మీకు 24గంటలు ఎలా సరిపోతున్నాయోనని నేను ఆశ్చర్యపోతాను. ముఖ్యంగా రిజిస్ట్రీ గురించి ఇంత లోతుగా అధ్యనం చేసినంత బహుశా మైక్రోసాఫ్ట్ వాళ్లు తప్ప ఇంకెవరైనా వేళ్ల మీద లెఖ్ఖపెట్టగలిగేంత వాళ్లు మాత్రమే వుంటారు.
ఈసారి మీ బ్లాగులో బ్లాగుని ఎలా ఉపయోగకరంగా (WinHTTrack, సైట్ ఫీడ్స్ , సైట్ మీటర్, గూగిల్ సెర్చ్) ఇలాంటి వాటితో బ్లాగుని ఎలా తయారుచేసుకోవచ్చో వివరంగా రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. నా ఫ్రెండ్స్ కొందరు బ్లాగు ఓపెన్ చేయాలన్నా అది చాలా కాంప్లెక్స్ గా వుంటుందని వూరకుండిపోయారు. ఈమధ్యనే సైట్ మీటర్ ని (లేదా No.Hits) లాంటివి ట్రై చేశాను కాని ఫేయిల్ అయ్యాను. శ్రమ అనుకోకుండా కొద్దిగా వివరంగా చెప్పగలరా ఎల ఇన్ స్టాల్ చేసుకోవాలో!లేదా నా బ్లాగుని ఎందరు సందర్శిస్తున్నారో ఎలా తెలుసుకోవాలి.

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారూ, ఏదో మీ అభిమానానికి ధన్యవాదాలు. http://teluguguruvu.blogspot.com సైట్ లోని వీడియోలు చూడండి, మీరు కోరిన మరిన్ని వివరాలు సమయం వీలుపడినప్పుడు అందిస్తాను.
-నల్లమోతు శ్రీధర్

, చెప్పారు...

శ్రీధర్ గారు! వీడియోలు వున్న బ్లాగు చూశాను. కాని డైయల్ అప్ కనెక్షన్ వున్న మాలాంటి వారి పరిస్థితి ఏంటి? సులువుగా తెలుసుకోలేమా! వీడియో కి చాలా సమయం పడుతుంది. లేకపోతే ఒక్కోసారి హేంగ్ అయిపోతుంది. దీని గురించి పరిష్కారం ఆలోచించండి.

బ్లాగేశ్వరుడు చెప్పారు...

పని జరగలేదు శ్రీధర గారు. నా కంప్యూటర్ లొ చాలా అక్కరేని ఫైళ్ళు ఉన్నాయి వాటిని తొలగించడం అవడం లేదు. మీరు చెప్పిన మృదులాయంత్రం కుడా ప్రయత్నించాను దానితో పని జరగలేదు. ముఖ్యంగా ఆఫైళ్ళ C:\Documents and Settings\user\Local Settings లో ఉన్నాయి.