22, అక్టోబర్ 2007, సోమవారం

మీడియా ప్లేయర్ 10 లో ప్రైవసీ సెట్టింగులుమీ సిస్టమ్‌లో Windows Media Player 10 వెర్షన్ ఉన్నట్లయితే అందులోని కొన్ని ఆప్షన్లని సెట్ చేయడం ద్వారా మీరు ఏయే ఫైళ్ళని ప్లే చేసారు... వంటి వివరాలు ఇతరుల కంట బడకుండా జాగ్రత్త వహించవచ్చు. Tools>Options అనే ఆప్షన్ ఎంచుకుని వెంటనే ప్రత్యక్షమయ్యే బాక్స్‌లో Privacy విభాగంలో Save file and URL history in the player అనే ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ఫైళ్ళ వివరాలు ఇతరులు గుర్తించలేరు. మనం Media Playerని ఎలా ఉపయోగిస్తున్నామన్న సమాచారం ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థకు చేరవేయబడేలా ప్లేయర్‌లో డీఫాల్ట్‌గా సెట్ చేయబడి ఉంటుంది. దీనిని డిసేబుల్ చేయడానికి Tools>Options>Privacy అనే విభాగంలో Customer Experience Improvement Program అనే ఆప్షన్ వద్ద టిక్ తీసేయండి. మనం ప్లే చేసిన సిడిలు, డివిడిల సమాచారం కనిపించకుండా ఉండాలంటే... Tools>Options>Privacy>History అనే విభాగంలో Clear Caches అనే ఆప్షన్‌ని టిక్ చేయండి. దీనితో అప్పటివరకూ, సిస్టమ్‌లో స్టోర్ అయిన మీరు ప్లే చేసిన సిడి/డివిడి ఫైళ్ళ వివరాలు చెరిపి వేయబడతాయి. ఈ చిట్కాలతో మీ ప్రైవసీ కాపాడుకోండి.

కామెంట్‌లు లేవు: