29, అక్టోబర్ 2007, సోమవారం

కీలాగర్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి? (వీడియోసహిత వివరణ)

రిమోట్ కీలాగర్ ప్రోగ్రాములు గనుక మన సిస్టంలోకి ప్రవేశించినట్లయితే కీబోర్డ్ నుండి మనం ప్రెస్ చేసే ప్రతీ కీనీ, వివిధ విండోలలో ఎంటర్ చేసే యూజర్ నేం, పాస్ వర్డ్ లు వంటి వివరాలు, ఛాటింగ్ లో మనం మాట్లాడే మాటలను ఎవరైతే మన కంప్యూటర్లోకి ఆ కీలాగర్ ని పంపిస్తారో వారికి చేరవేస్తుంటాయి. ఈ నేపధ్యంలో మీ సిస్టంలో ఏదైనా కీలాగర్ ఇన్ స్టాల్ అయి ఉందని సందేహం వచ్చినట్లయితే ఏంటీవైరస్, స్ఫైవేర్ రిమూవల్ ప్రోగ్రాములతో సిస్టం ని స్కాన్ చేసి చూడండి. అలాగే Yahoo Messenger, GTalk, ఆన్ లైన్ ఫోరంలు వంటి వాటిలో యూజర్ నేం, పాస్ వర్డ్ లను ప్రతీసారీ టైప్ చేయడం కాకుండా విండోస్ పాస్ వర్డ్ మేనేజర్ ద్వారా సేవ్ చేసుకుని అవసరం అయినప్పుడు Auto Complete చేయడం ద్వారా టైప్ చేయాల్సిన పని ఉండదు. లేదా AI RoboForm వంటి పాస్ వర్డ్ లను గుర్తుంచుకునే సాప్ట్ వేర్లను వాడండి. తద్వారా కీలాగర్ మనం కీబోర్డ్ నుండి నేరుగా ఏ సమాచారాన్నీ టైప్ చేయం కాబట్టి మన లాగిన్ సమాచారాన్ని పొందలేదు. అసలు కీలాగర్లు ఎలా పూర్తి సమాచారాన్ని సేకరిస్తాయో నేను పరిశోధనాత్మకంగా ఇతరుల కంప్యూటర్లలోకి కీలాగర్ ని పంపించి రికార్డ్ చేసిన సమాచారాన్ని మీకు అవగాహన కోసం క్రింది వీడియోలో పొందుపరిచాను, చూడండి.

1 కామెంట్‌:

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

ఈ రోజే చూశానండీ శ్రీధర్ గారూ మీ బ్లాగుని. నా భావం మార్పులు చేసిన బ్లాగుని. అదిరిందనుకోండి. డిజైన్ అయితేనేమీ, Scrolling, యింకా అందులో రాసిన మాలులు. సూపర్. చాలా బాగుంది.