19, అక్టోబర్ 2007, శుక్రవారం

నవంబర్ 2007 "కంప్యూటర్ ఎరా" కవర్ పేజీ ఇది..ప్రతీ లైనూ ఎంతో ఉపయుక్తమైన సమాచారంతో 'ది బెస్ట్' పాఠకులకు అందించాలన్న తపనతో 'కంప్యూటర్ ఎరా' నవంబర్ 2007 సంచికను అత్యుత్తమంగా రూపొందించడం జరిగింది. ఈ సంచికని చదివి మీరే చెప్పండి. మీ అంచనాలకు మించిన స్థాయిలో తయారైన సంచిక ఇది. అక్టోబర్ 27 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలో ఈ సంచిక లభ్యమవుతుంది. దాని ముఖచిత్రమిది.

4 కామెంట్‌లు:

బ్లాగాగ్ని చెప్పారు...

నవంబర్ 27నా? అక్టోబర్ 27నా?

అజ్ఞాత చెప్పారు...

బ్లాగాగ్నిగారూ, అక్టోబర్ 27న విడుదల అవుతుంది అండీ, నవంబర్ 2007 సంచిక! 1వ తేదీకి ముందే విడుదల కావడం కంప్యూటర్ ఎరా సంప్రదాయం, అనివార్య సందర్భాల్లో తప్ప!
-నల్లమోతు శ్రీధర్

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారికి మీ బ్లాగు,వెబ్,ఎరా లని రెగ్యులర్ గా చూస్తాను . మీ సలహా కోసం రాస్తున్నాను. నాఈ మేయిల్ కి,UK online winners info@ insight .rr.com నుండి వచ్చిన మెయిల్ లో ఆన్ లైన్ ఈమెయిల్ లాటరీ లో big cash prize వచ్చిందని, full details తో claim చేసుకో మని అడిగారు. ఇది నమ్మ దగ్గదేన? నేను respond కావాలా వద్దా .మీసలహా నాకు చాలా అవసరము. దయచేసి reply ఇవ్వగలరు.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

రాధాకృష్ణగారు,

మీరు మా అభిమాన పాఠకులని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మెయిల్స్ అస్సలు నమ్మొద్దు. ఈ మధ్య కాలంలో అలాంటివి చాలా మందికి వస్తున్నాయి. రాగానే స్పాం లో వేసేయండి.ఐనా ఎవరైనా ఊరికే డబ్బు ఎందుకు ఇస్తారు. తెలియనివారికి మీ వివరాలు అస్సలు ఇవ్వొద్దు.జాగ్రత్త.