8, అక్టోబర్ 2007, సోమవారం

డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేయడంప్రస్తుతం డిజిటల్ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. కాంపాక్ట్ ఫ్లాష్
కార్డ్ లపై ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు
సేవ్ చేయబడతాయి. ఈ నేపధ్యంలో మెమరీ కార్డ్ లోని స్పేస్ నిండి
పోయిన తరవాత అందులోని డేటాని పిసిలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని
ఖాళీ చేస్తుంటారు.అయితే ఒక్కోసారి పిసిలో ఉన్న ఫైళ్ళని పొరబాటున
డిలీట్ చేశామనుకోండి,అటు మెమరీ కార్డ్ ఖాళీగా ఉంటుంది,పిసిలోనూ
డేటా లభించదు. అలాంటప్పుడు డిజిటల్ కెమెరాల మెమరీ కార్డ్ ల
నుండి వీలైనంత వరకూ డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి రప్పించడానికి
ఉపకరించే ప్రోగ్రామే Easy Photo Recovery. ఈ ప్రోగ్రామ్
CompactFlash, IBM Microdrives, Smart Media,
MMC, Secure Digital(SD) వంటి అన్ని రకాల మెమరీ
కార్డుల నుండి డేటాని రికవర్ చేయడానికి పనికొస్తుంది.

కామెంట్‌లు లేవు: