27, జులై 2007, శుక్రవారం

సగం బ్లాక్ అండ్ వైట్, సగం కలర్ ఎలా?


ఇటీవల టెలివిజన్ ఛానెళ్లలో కనిపిస్తున్న కొన్ని ప్రకటనల్లో మనిషి బ్లాక్ అండ్ వైట్ లోనూ, కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు కలర్ లోనూ స్పెషల్ ఎఫెక్ట్ మాదిరిగా కనిపిస్తున్నాయి. ఫొటోషాప్ సాప్ట్ వేర్ ద్వారా మనమైనా ఇలాంటి ఎఫెక్ట్లులు చాలా సులభంగా సాధించవచ్చు. పొటోషాప్ లో ఏదైనా కలర్ ఇమేజ్ ని ఓపెన్ చేసి Image>Adjustments>Desaturate అనే అప్షన్ ని క్లిక్ చేస్తే ఇమేజ్ లోని అన్ని కలర్స్ తొలగించబడతాయి. ఇప్పుడు Tool Palette నుండి History Brush టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇమేజ్ లోని ఏ ప్రదేశం వరకైతే కలర్ కనిపించాలనుకుంటున్నామో ఆ ప్రదేశం వరకూ ఆ టూల్ తో పెయింట్ చేసుకుంటూ పోతే కేవలం ఆ భాగం వరకూ మాత్రమే కలర్ వస్తుంది. ఆడియో వివరణ తో కూడిన పై వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా బావుంది. మరి వీడియోలో ఈ ఎఫ్ఫెక్టు రావాలంటే చాలా ఫ్రేములు మార్చాలి కదా! దీనికీదయినా solution వుందా?


-- శ్రవణ్

రవి వైజాసత్య చెప్పారు...

నాకీ చిట్కా చాలా నచ్చింది. ఉపయోగించి కూడా చూశా..కృతజ్ఞతలు