16, జులై 2007, సోమవారం

సేవ్ అయిన పాస్ వర్డ్ లను తొలగించడం


వెబ్ సైట్లని బ్రౌజ్ చేసేటప్పుడు,నెట్ వర్క్ వనరులను యాక్సెస్ చేసేటప్పుడు మనం ఉపయోగించే పాస్ వర్డ్ లను మళ్లీ మళ్లీ ఎంటర్ చేసే శ్రమలేకుండా auto save చేసే సదుపాయాన్ని Windows XP కల్పిస్తోంది. అయితే ఇలా సేవ్ చేసిన పాస్ వర్డ్ లు ఒక్కోసారి ఇతరులకు దొడ్డి దోవన తెలిసిపోయి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో విండోస్ లో ఇప్పటికే సేవ్ అయి ఉన్న పాస్ వర్డ్ ల నుండి రిస్క్ ఎక్కువ ఉన్న వాటిని తొలగించుకోవడానికి ఓ మార్గముంది. Start>Run కమాండ్ బాక్స్ లో..


rundll32.exe keymgr.dll, KRShowKeyMgr అని టైప్ చేసి OK బటన్ ప్రెస్ చేయండి. వెంటనే ఇప్పటివరకూ కంప్యూటర్ లో సేవ్ చేయబడి ఉన్న పాస్ వర్డ్ల్ ల సమాచారం స్ర్కీన్ పై ఓ జాబితా రూపంలో ప్రత్యక్షమవుతుంది. ప్రతీ ఎంట్రీని సెలెక్ట్ చేసుకుని Properties ని చూడడం ద్వారా ఆ ఎంట్రీలో సేవ్ అయి ఉన్న పాస్ వర్డ్ సమాచారం కనిపిస్తుంది. సేవ్ అయి ఉన్న ఏదైనా పాస్ వర్డ్ ని తీసేయాలంటే ఆ ఎంట్రీని ఎంపిక చేసుకుని Remove ఆప్షన్ ని ఎంచుకోవాలి. వెంటనే కన్ ఫర్మేషన్ అడగబడుతుంది. OK ప్రెస్ చేయండి.

కామెంట్‌లు లేవు: