29, జులై 2007, ఆదివారం

ఇన్‌స్టెంట్ మెసెంజర్‌లను బ్లాక్ చేయడానికి


Yahoo, GTalk, MSN, AIM, Jabber వంటి అనేక ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడడం మాట అటుంచితే విలువైన పని గంటలు వృధా అవడం, తెలిసీతెలియక యువత పెడదారి పట్టడం, వ్యక్తిగత సమాచారం ఎవరికి బడితే వారికి చెప్పడం వంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మీ కంప్యూటర్‌లో Yahoo,Google Talk, MSN, AIM,Odigo, PalTalk, QQ Messenger, Jabber, IMessenger.Net, AOL, IRC, ICQ, GAIM వంటి ఏ రకమైన ఇన్‌స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాం పనిచేయకుండా లాక్ చెయ్యడానికి http://www.comvigo.com/downloadIMLock/IMLSetup.exe అనే వెబ్ సైట్లో లభించే Im Lock Home Edition అనే ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం సహాయంతో అవసరం అనుకుంటే iTunes, Internet Explorer, Skype ప్రోగ్రాములు సైతం పనిచెయ్యకుండా లాక్ చేసుకోవచ్చు. ప్రైవసీ,సెక్యూరిటీ కోరుకునేవారికి పనికొచ్చే సాప్ట్ వేర్ ఇది.

4 కామెంట్‌లు:

రానారె చెప్పారు...

అయ్యబాబోయ్, ఒక్కనెలలో ఇన్నిటపాలా? కానివ్వండి కానివ్వండి. రోజూ తప్పకుండా రాసేవాళ్లు మనలో ఎవ్వరూ ఇంతవరకూ లేరు. నా గూగుల్ రీడర్లో మీపేరు చేరుస్తున్నా.

అజ్ఞాత చెప్పారు...

రానారె గారూ ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్

అజ్ఞాత చెప్పారు...

There is no link for the software you mentioned above. Please do provide links for all the software you mention.

Thanks

జ్యోతి చెప్పారు...

తెలుగు బ్లాగ్ప్రపంచంలో మహారాణిలా ఉన్నా నాకు పోటీనా!! నేనొప్పుకోను. నాకు నేనే పోటీ. నా దారికి అడ్డు రావద్దంతే>>