18, జులై 2007, బుధవారం

ఏ కాంపొనెంట్‌కి ఎంత విద్యుత్ కావాలి?

కొత్తగా కంప్యూటర్ కొనుగోలు చేసేవారు SMPS సామర్ధ్యం విషయంలో తమ సిస్టంలోని ఇతర కాంపొనెంట్‌ల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని SMPS Wattageని ఎంచుకోవాలి. సాధారణంగా వివిధ కాంపొనెంట్‌లు ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో ఇక్కడ చూద్దాం.

Processor:
AMD Athlon 64/64FX - 90-110 watts
AMD Thunderbird - 50-60 watts
AMD Athlon XP - 50-80 watts
AMD Duron - 40-60 watts
Intel P4 - 60-100 watts
Intel PIII - 25-40 watts
Intel Celeron - 30-60 watts

Graphics Card

Basic - 25 watts
High-performance - 35-100 watts

MotherBoard - 18-28 watts
CD ram/writer - 25-35 watts
Hard Disk - 25 watts
Memory module - 7-12 watts
USB/Fireware - 5-10 watts
PCI Soundcard - 5-10 watts
extra PCI cards - 5 watts
Floppy drive - 5 watts
CPU fan - 3 watts
Keyboard and mouse - 6 watts


ఇలా మీరు కొనుగోలు చేసుకోబోయే అన్ని పరికరాల పవర్ సప్లై అవసరాలను లెక్కించుకున్న మీదట మొత్తం ఎంత విలువ వస్తుందో దానికి 30% అదనంగా కలుపుకుని SMPS కెపాసిటీని నిర్ణయించుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.

1 కామెంట్‌:

leo చెప్పారు...

ప్రతి సారి 350W కొనటమే కానీ అసలు ఎంత అవసరము అనే దాని మీద అవగాహన లేదు. అమూల్యమైన సమాచారమునకు ధన్యవాదములు.