27, జులై 2007, శుక్రవారం
Auto Reponse సెట్ చేసే ముందు జాగ్రత్త!
మనం ఊళ్లో లేనప్పుడు వచ్చే మెయిల్స్ కి ఆటోమేటిక్ గా రిప్లై ఇవ్వబడేలా Yahoo Mail వంటి వాటిలో Vacation Response సెట్ చేస్తుంటారు చాలామంది! చాలా సందర్భాల్లో ఇది ఉపయుక్తంగా ఉన్నా కొన్నిసార్లు ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది ఇది. ఉదాహరణకు మీరు ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసి అందులో మీ మెయిల్ అడ్రస్ ని పేర్కొన్నారనుకుందాం. మీరు అలా ఊరు వెళ్లీ వెళ్లగానే ఆ కంపెనీ నుండి మీకు మెయిల్ పంపించబడింది. అలాంటప్పుడు ఆ మెయిల్ కి మీ మెయిల్ సర్వర్ నుండి 'నేను ఊరు వెళ్లానహో' అని Auto Response పంపించబడితే బాగుండదు కదా! ఇలాంటి పరిస్థితుల్ని కూడా ద్ళష్టిలోకి తీసుకున్న తర్వాతే Auto Response సెట్ చేసుకోండి. అలాగే ఊరి నుండి రాగానే దానిని డిసేబుల్ చేయడం మరువకండి. ఇకపోతే మన లాగానే Auto Response సెట్ చేయబడి ఉన్న ఇతర మెయిల్ ID నుండి మెయిల్ వచ్చినప్పుడు మీ ID కూడా Auto Response సెట్ చేయబడి ఉంది కాబట్టి ఇక ఆ రెండు IDలూ దేనిదో దానిది Auto Response డిసేబుల్ చేసేటంత వరకూ నిరంతరం వ్ళధాగా మెయిల్స్ పంపుకుంటూనే ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి