17, జులై 2007, మంగళవారం
వీడియో షేర్ చేయాలా?
మీ పుట్టిన రోజుని వైభవంగా సెలబ్రేట్ చేసుకుని వీడియో తీశారనుకుందాం. దాన్ని విదేశాల్లో ఉన్న సన్నిహితులతో షేర్ చేసుకోవాలనుకుంటే You Tube, Google Video, Jumpcut వంటి Video Hosting సర్వీసులను మించిన మార్గం లేదు . మీవద్ద ఆసక్తికరంగా అనిపించే ఎటువంటి వీడియో క్లిప్‌లు ఉన్నా, వాటిని ఇతరులతో షేర్ చేసుకోవాలన్నా హోస్టింగ్ సర్వీసులే సరైన వేదిక . అందుబాటులో ఉన్న ప్రముఖ వీడియో హోస్టింగ్ సైట్ల గురించి తెలుసుకుందాం.
YouTube అత్యంత ప్రజాదరణ కలిగినది...
http://www.youtube.com/ అనే వెబ్‌సైట్‌లోకి వెళితే తాజాగా అప్‌లోడ్ చేయబడిన పాపులర్ వీడియోల ధంబ్‌నెయిల్ ఇమేజ్‌లు కనిపిస్తుంటాయి. Search అనే బాక్స్‌లో ఎదైనా కీవర్డ్ టైప్ చేసి మనకు కావల్సిన వీడియో YouTubeలో ఉందేమో వెదకవచ్చు. అయితే YouTube వీడియోని IE, FireFox వంటి బ్రౌజర్‌లోనే (అదీ ఫ్లాష్ ప్లగ్-ఇన్ ఇన్ స్టాల్ చేయబడి ఉంటేనే) ప్లే చేస్తుంది. మీరు ఏదైనా వీడియోని అప్‌లోడ్ చేయాలంటే ముందుగా ఓ ఉచిత ఎకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. వీడియోని అప్‌లోడ్ చేసేటప్పుడు Public, Private అనే ఆప్షన్లు వస్తాయి.మీరు అప్‌లోడ్ చేస్తున్న వీడియో ప్రపంచంలోని అందరికీ షేర్ చేయాలంటే Public అని ఎంచుకొండి ఒక వేల సన్నిహితులకి మాత్రమే షేర్ చేయాలంటే Private అనే ఆప్షన్ ఎంచుకుని మీ కాంటాక్ట్ లిస్టులోని Family, Friends అనే గ్రూపులలో ఎవరికి ఆ వీడియో యొక్క లింక్ మెయిల్ చేయబడాలో టిక్ చేయాలి. గరిష్టంగా 110MB లేదా 10 నిమిషాల నిడివి గల వీడియోని మాత్రమే అప్‌లోడ్ చేసుకోగలం. అప్‌లోడ్ పూర్తయిన తర్వాత Public URl పేరిట మన వీడియో యొక్క లింక్ అందించబడుతుంది. దానిని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. YouTube ద్వారా నిత్యం 100 మిలియన్ల వీడియో చూడబడుతున్నాయంటే ఎంత పాపులరో చూడండి. YouTube లో వీడియోలన్ని వేర్వేరు కేటగిరీలు, చానెళ్ళు, కమ్యూనిటీల క్రింద క్రమపద్దతిలో అమర్చబడి లభిస్తుంటాయి.
ఫైల్ సైజ్ ఎక్కువుంటే Google video ఉపయోగం
http://video.google.com అనే అడ్రస్ ద్వారా Google Video లోకి ప్రవేశించవచ్చు. మీకు Gmail ఎకౌంట్ ఉన్నట్టైతే అదే ID ఇక్కడా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైట్‌లో Upload your Videos అనే ఆప్షన్ ద్వారా 100 MB సైజ్ వరకూ గల AVI, MPEG, Windows Media, Real, QuickTime ఫార్మేట్లకు చెందిన క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ సైజ్ క్లిప్‌లను అప్‌లోడ్ చేయాలనుకుంటే మాత్రం
https://upload.video.google.com/ అనే సైట్ నుండి Google Video Uploader అనే ప్రోగ్రాం ని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుని దానిద్వారా మన పిసిలోని క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.
వీడియోని ఎడిట్ చేయనిచ్చే హోస్టింగ్ సర్వీస్
http://www.jumpcut.com/ అనే మరో వెబ్‌సైట్ లో కేవలం వీడియోని అప్‌లోడ్ చేయడమే కాకుండా మన వీడియోని గానీ, లేదా ఆల్రెడీ ఇతరులచే పోస్ట్ చేయబడిన పబ్లిక్ వీడియోని గానీ ఈ వెబ్‌సైట్‌లో ఎడిట్ చేయవచ్చు. రెండు వీడియోలని కలిపి సరి కొత్త వీడియోని సృష్టించవచ్చు. వీడియో హోస్టింగ్ సర్వీసులకి అప్‌లోడ్ చేసేటప్పుడు వ్యక్తిగతమైన వీడియోలు దుర్వినియోగం కాకుండా తగినంత జాగ్రత్త వహించవలసిన బాధ్యత మీదే సుమా.
1 కామెంట్:
thanks.mamci samaacaaram.
కామెంట్‌ను పోస్ట్ చేయండి