22, జులై 2007, ఆదివారం

సిస్టమ్ ఆన్‍లో ఉన్న సమయం



కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ప్రస్తుతం వరకూ ఎంత సమయం సిస్టం ఆన్‌లో ఉందో తెలుసుకోవడానికి 44KB సైజ్ గల uptime.exe anE అనే చిన్న ప్రోగ్రాం లబిస్తోంది. దీన్ని http://support.microsoft.com/kb/232243 అనే మైక్రో‍సాప్ట్ వెబ్‍సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత Start>Run కమాండ్ బాక్స్‌లో command అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్ద నుండి uptime ప్రోగ్రాంని రన్ చేస్తే ఎంతసేపటి నుండి రన్నింగ్‌లో ఉందన్న సమాచారాన్ని తెలియ చేస్తుంది. అలాగే ఇందులోని advanced ఆప్షన్‌ని గనుక సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ ఎప్పుడు షట్‌డౌన్, రీస్టార్ట్ చెయ్యబడింది, ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్‌లకు సంబంధించిన సమాచారం, మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న సర్వీస్‌ప్యాక్ వివరాలు లభిస్తాయి. WinXPలో మాత్రమే ఇది పనిచేస్తుంది.

కామెంట్‌లు లేవు: