26, జులై 2007, గురువారం

బ్రౌజింగ్ హిస్టరీని తొలగించడానికి షార్ట్ కట్ లు


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ ప్రోగ్రాం ద్వారా వెబ్ సైట్లని బ్రౌజ్ చేసేటప్పుడు ఆయా వెబ్ పేజీల్లోని సమాచారం కంప్యూటర్ లో Temporary Internet Files అనే ఫోల్డర్లో సేవ్ చెయ్యబడుతుంటుంది. అలాగే మనం ఏయే వెబ్ పేజీల్ని ఓపెన్ చేశామన్నది History అనే ఫోల్డర్లో వివరాలు నమోదు చేయబడుతుంటాయి. కొంతవరకూ ఇది ప్రయోజనకరమే గానీ, కొన్ని సందర్భాల్లో మనం ఓపెన్ చేసిన వెబ్ సైట్ల వివరాలు ఇతరులు తెలుసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో Temporary Internet Files, History ఫోల్డర్లని క్లీన్ చేయడానికి నేరుగా డెస్క్ టాప్ పై షార్ట్ కట్ లను స్ళష్టించుకునే మార్గం ఉంది. అదెలాగంటే డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఏ అంశానికి సంభంధించి షార్ట్ కట్ కావాలో దానికి తగ్గట్లుగా క్రింది చెప్పిన కమాండ్లని టైప్ చేయండి.

టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు క్లీన్ చేయడానికి:
RunDll32.exe InetCpl.cpl,ClearMyTracksByProcess 8

హిస్టరీ ఫోల్డర్ ని క్లీన్ చేయడానికి:
RunDll32.exe InetCpl.cpl,ClearMyTracksByProcess 1

కుకీలను శుభ్రపరచడానికి:
RunDll32.exe InetCpl.cpl,ClearMyTracksByProcess 2

ఇలా కమాండ్లని టైప్ చేసిన తర్వాత ఏదో ఒక పేరుతో ఆ షార్ట్ కట్ లను సేవ్ చేసుకుని అవసరం అయినప్పుడు వాటిని క్లిక్ చేస్తే సరిపోతుంది.

కామెంట్‌లు లేవు: