22, జులై 2007, ఆదివారం

మెయిల్ బౌన్స్



ఎప్పుడెప్పుడు మెయిల్స్ బౌన్స్ అవుతాయంటే

స్నేహితుల మెయిల్ ఐడిలకు మెసేజ్‌ని కంపోజ్ చేసి send బటన్ క్లిక్ చేశామో లేదో కొద్ది క్షణాలకే మనం పంపించిన మెసేజ్ అవతలి వ్యక్తికి చేరుకోలేదని bounced మెసేజ్ మన ఇన్‌బాక్స్ లోకి వచ్చి చేరుతుందంటే అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా మనం పంపించిన వ్యక్తి యొక్క inbox పూర్తిగా నిండిపోయినప్పుడు మెసేజ్ బౌన్స్ అవుతుంది. ప్రస్తుతం అధిక శాతం మెయిల్ సర్వర్లు కనీసం 2GB, Unlimited ఫ్రీ స్పేస్‌ని అందిస్తున్న నేపధ్యంలో Inbox నిండిపోవడం వల్ల మెయిల్ బౌన్స్ అయ్యే అవకాశాలు తక్కువ! మెయిల్ సర్వర్లు మెసేజ్‌లకు "సైజ్‌ లిమిట్"ని విధిస్తుంటాయి. మనం పంపించిన మెసేజ్ ఆ లిమిట్‌ని దాటినా, లేదా అడ్రస్‌బార్‌లో మనం టైప్ చేసిన ఇ-మెయిల్ అడ్రస్ తప్పుగా ఉన్నా, మనం ఎవరికైతే మెసేజ్ పంపిస్తున్నారో వారి POP3 Server బిజీగా ఉండడం లేదా సర్వర్‌లో తాత్కాలికంగా లోపాలు ఉండడం వల్ల మెసేజ్ బౌన్స్ కావచ్చు. అలాంటప్పుడు కొద్ది సమయం తర్వాత మళ్ళీ పంపిస్తే ఫలితం ఉంటుంది. అలాగే Bulk Mail సాప్ట్ వేర్ల ద్వారా పంపేటప్పుడు SMTP సర్వర్ అడ్రస్ నిర్ధిష్టంగా ఉండకపోవడం వల్ల కూడా మెసేజ్ బౌన్స్ అవుతుంది.

కామెంట్‌లు లేవు: