30, జులై 2007, సోమవారం
LAN కార్డ్ MAC అడ్రస్ ని మార్చడం ఇలా!
మనం కొనుగోలు చేసే ప్రతీ LAN కార్డ్ కీ లేదా మన మదర్ బోర్డ్ పై అంతర్గతంగా పొందుపరచబడి ఉండే LAN చిప్ కీ ప్రత్యేకంగా ఫిజికల్, పర్మినెంట్ అడ్రస్ అంటూ ఒకటి ఉంటుంది. దానినే MAC అడ్రస్ అంటుంటారు. ఈ MAC అడ్రస్ మరియు సిస్టం యొక్క IP అడ్రస్ ల ఆధారంగా నెట్ వర్క్ లో ఏమి జరుగుతోందన్నది (నెట్ వర్క్ ట్రాఫిక్, పాకెట్లను విశ్లేషించడం ద్వారా) నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్లు పర్యవేక్షించగలుగుతారు. వాస్తవానికి ఈ పర్మినెంట్ అడ్రస్ ని మార్చడానికి వీలుపడదు. అయితే http://www.codeproject.com/tools/MacIdChanger/MACAddressChanger_Exe.zip అనే వెబ్ సైట్లో లభించే MAC Address Changer వంటి సాప్ట్ వేర్ని ఉపయోగించడం ద్వారా ప్రస్తుతపు మన లాన్ కార్డ్ యొక్క MAC అడ్రస్ ని తాత్కాలికంగా మనం పేర్కొనే వేరొక MAC అడ్రస్ గా పరిగణనలోకి తీసుకోబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు. సాధారణంగా MAC అడ్రస్ 12 ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏ అడ్రస్ గా మార్చదలుచుకున్నామో ఆ అడ్రస్ కూడా తప్పనిసరిగా 12 అక్షరాలను మాత్రమే ఇవ్వాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి