28, జులై 2007, శనివారం

Print Directly ఆప్షన్ వల్ల ఉపయోగం



సాధారణంగా మనం డాక్యుమెంట్లని ప్రింట్ చేసుకునే నిమిత్తం File>Print కమాండ్ ద్వారా మనం పంపించే జాబ్‌లు నేరుగా ప్రింటరుకి చేరుకోకుండా తాత్కాలికంగా హార్డ్‌డిస్క్‌లోని C:\Windows\System32\Spool అనే ప్రత్యేకమైన ఫోల్డర్‌లో స్టోర్ చెయ్యబడతాయి. దీనివల్ల మనం ఇచ్చిన ప్రింట్‌జాబ్‌లు ప్రింట్ అవడానికి కొద్దిగా అదనంగా సమయం తీసుకుంటుంది. ప్రింటింగ్ జరిగే సమయంలో అది పూర్తయ్యేటంత వరకూ మనం ఖాళీగా కూర్చోకుండా మరో ప్రక్క వర్క్ చేసుకోవడానికి వీలుగా ఈ ప్రింటర్ స్పూలింగ్ అనే సదుపాయం పొందుపరచబడింది. దాదాపు అన్ని రకాల ప్రింటర్ డ్రైవర్లలోనూ Printer Spooling ఆఫ్ చెయ్యడానికి ఆప్షన్ పొందుపరచబడి ఉంటుంది. దీనిని ఆఫ్ చెయ్యడానికి ControlPanel>Printers అనే ఆప్షన్‌ని డబుల్ క్లిక్ చేసి మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉండి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ప్రింటర్ డ్రైవర్‌ని సెలక్ట్ చేసుకుని మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Properties అనే ఆప్షన్‌ని ఎంచుకోండి. వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే డైలాగ్‌బాక్స్‌లో Details అనే పేజ్‌లో Spool Settings అనే బటన్‌ని క్లిక్ చేసి, అందులో Print Directly to Printer అనే ఆప్షన్‌ని ఎంచుకుంటే సరిపోతుంది. కొన్ని ప్రింటర్ లలో ఈ ఆప్షన్ వేరే పేరుతో గానీ, వేరే ప్రదేశంలో గానీ ఉండవచ్చు.

కామెంట్‌లు లేవు: